2002లో సల్మాన్‌కు డ్రైవింగ్ లెసైన్స్ లేదు | salman has not having driving licence in 2002 | Sakshi
Sakshi News home page

2002లో సల్మాన్‌కు డ్రైవింగ్ లెసైన్స్ లేదు

Published Tue, Feb 17 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

2002లో సల్మాన్‌కు డ్రైవింగ్ లెసైన్స్ లేదు

2002లో సల్మాన్‌కు డ్రైవింగ్ లెసైన్స్ లేదు

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న 2002 నాటి ‘హిట్ అండ్ రన్’ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

 ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న 2002 నాటి ‘హిట్ అండ్ రన్’ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండానే సల్మాన్ కారు నడిపి ప్రమాదానికి కారకుడైనట్లు బయటపడింది. సోమవారం ముంబైలోని సెషన్స్ కోర్టులో జరిగిన ఈ కేసులోని సాక్షుల విచారణ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారి ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. సల్మాన్ 2004లో లెసైన్స్ పొందారని పేర్కొంటూ అందుకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. కాగా, సల్మాన్ మద్యం సేవించి వాహనం నడిపాడేమో తెలుసుకునేందుకు ఆయనకు రక్త పరీక్ష నిర్వహించేందుకు జేజే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న ఓ ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement