
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తుస్సుమన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మోదీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు.
గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని,చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు.