కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు | IT raid at MP CM Kamal Nath OSD Praveen Kakkar home | Sakshi

సీఎం కమల్‌నాథ్‌ ఓఎస్డీ నివాసంలో ఐటీ దాడులు

Published Sun, Apr 7 2019 9:12 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

ఇండోర్‌లోని ఓఎస్డీ ప్రవీణ్‌ కక్కర్‌ నివాసం - Sakshi

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే  సీఎం అడ్వైజర్‌ రాజేంద్ర కుమార్‌ ఇంట్లో (ఢిల్లీ) కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.9కోట్లు నగదు లభించినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు అధికారులు ...తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు హవాలా రూపంలో నగదును తరలిస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో ఐటీ దాడులు జరిపినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement