మా నాన్న సీఎం అయితే.. | Kunduru Raghuveer Reddy Comments On Congress Tickets Issue In Nalgonda | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 10:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kunduru Raghuveer Reddy Comments On Congress Tickets Issue In Nalgonda - Sakshi

జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..

సాక్షి, నల్గొండ: కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎప్పుడూ చెప్పలేదని మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్‌ రెడ్డి అన్నారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. 2004 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నానని, ఈసారి తనకు టికెట్‌ కచ్చితంగా దక్కుతుందన్న నమ్మకం ఉందన్నారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు.

కాగా, మిర్యాలగూడలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి జానారెడ్డి, పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement