
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్‌ను అక్కడి నుంచి ఎందుకు బరిలోకి దింపలేదని సినీ హీరో మంచు విష్ణువర్థన్‌బాబు ప్రశ్నించారు. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారని ఆయన అడిగారు. చంద్రగిరిని అభివృద్ధి చేస్తే.. అక్కడి నుంచే లోకేశ్‌ను పోటీకి పెట్టచ్చు కదా! అని ఆయన అన్నారు.
చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున మంచు విష్ణు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెలకు 10 రోజులు ఇక్కడ ఉండే తమను చంద్రబాబు వలస పక్షులు అంటున్నారని, సంవత్సరానికి ఒకరోజే నారావారిపల్లెకు వచ్చే ఆయనను ఏమంటారని అడిగారు. వైఎస్ జగన్ తమ బంధువు అని, విలువలతో కూడిన రాజకీయం ఆయన చేస్తున్నారని మంచు విష్ణు పేర్కొన్నారు.