
స్టింప్సన్‌కు తొలి స్వర్ణం
బ్రిటిష్ రాణిగారి ఆటలుగా పరిగణించే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాల బోణీ ఇంగ్లండ్‌కే దక్కింది. గురువారం తొలిరోజు జరిగిన మహిళల ట్రయథ్లాన్‌లో జోడీ స్టింప్సన్ విజేతగా నిలిచి ఇంగ్లండ్‌కు పసిడి పతకాన్నందించింది.
గ్లాస్గో: బ్రిటిష్ రాణిగారి ఆటలుగా పరిగణించే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాల బోణీ ఇంగ్లండ్‌కే దక్కింది. గురువారం తొలిరోజు జరిగిన మహిళల ట్రయథ్లాన్‌లో జోడీ స్టింప్సన్ విజేతగా నిలిచి ఇంగ్లండ్‌కు పసిడి పతకాన్నందించింది.
1500 మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్‌తో కూడిన ఈ మల్టీ స్పోర్ట్ ఈవెంట్‌ను స్టింప్సన్ గం.1:58:56 ని. సమయంలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన కిర్‌స్టెన్ స్వీట్‌లాండ్ గం.1:59:01ని. సమయం నమోదు చేసి రజతం సాధించగా... ఇంగ్లండ్‌కే చెందిన విక్కీ హాలండ్ గం. 1:59:11ని.తో కాంస్యం దక్కించుకుంది.