triathlon
-
ట్రయాథ్లాన్ దిగ్గజం అలిస్టర్ బ్రౌన్లీ వీడ్కోలు
లండన్: మూడు క్రీడాంశాల సమాహారమైన ట్రయాథ్లాన్లో (1500 మీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్నింగ్) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బ్రిటన్ స్టార్, రెండు వరుస ఒలింపిక్స్ చాంపియన్ అలిస్టర్ బ్రౌన్లీ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతను లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుపొందాడు.అంతకుముందు ఈ స్టార్ 2009, 2011లలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. మరో నాలుగుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా ఘనత వహించాడు. తన విజయవంతమైన కెరీర్‌కు బైబై చెప్పేందుకు ఇదే సరైన సమయమన్నాడు. ‘ఎక్స్’లో తన రిటైర్మెంట్ను ప్రకటించిన అతను ‘ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రొఫెషనల్ కెరీర్లో ఎన్నో విజయాలు చవిచూసిన నాకు ఇప్పుడీ క్షణాలు ఓ వైపు ఉత్సాహాన్ని.. మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి’ అని ట్వీట్ చేశాడు.ఇప్పుడు సరికొత్త సవాళ్లపై దృష్టి పెడతానని చెప్పాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ స్టార్ట్ లైన్ వద్ద నిల్చొలేనని, ఇందుకోసం శ్రమించలేనని అన్నాడు. 2012, 2016... ఈ రెండు సార్లు అతని సోదరుడు జొనాథన్ (జానీ) బ్రౌన్లీ కూడా పతకాలు నెగ్గడం మరో విశేషం! లండన్‌లో కాంస్యం నెగ్గిన జానీ... రియోలో రజతం గెలిచాడు. ‘బిల్లీ జీన్ కింగ్ కప్’ చాంపియన్ ఇటలీ మలాగా (స్పెయిన్): మహిళల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’లో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇటలీ 2–0తో స్లొవేకియా జట్టును ఓడించింది. తొలి మ్యాచ్‌లో లూసియా బ్రాంజెట్టి 6–2, 6–4తో విక్టోరియా రుంకకోవాను ఓడించగా... రెండో మ్యాచ్‌లో జాస్మిన్ పావోలిని 6–2, 6–1తో రెబెకా స్రామ్కోవాపై నెగ్గడంతో ఇటలీ విజయం ఖరారైంది.ఓవరాల్‌గా ఇటలీకిది ఐదో బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్. ఆ జట్టు చివరి సారి 2013లో ఈ టైటిల్‌ను సాధించింది. 2013లో విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్న సారా ఎరాని ఈసారీ జట్టులో ఉండటం విశేషం. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జాస్మిన్ ప్రదర్శన ఇటలీ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ ఏడాది జాస్మిన్ అద్భుతంగా రాణించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో... వింబుల్డన్ టోర్నీలో సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
సాహసానికి సై యామి... భయమా... డోంట్ ఖేర్
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన చిరకాల స్వప్నం ‘ఐరన్ మ్యాన్ 70.3’ గురించి చెప్పినప్పుడు అభినందించిన వాళ్ల కంటే అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. ‘సినిమాల్లోలాగా అక్కడ డూప్‌లు ఉండరు’ అని నవ్వారు కొందరు. అయితే ఇవేమీ తన సాహసానికి అడ్డుగోడలు కాలేకపోయాయి.ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా ‘ట్రయథ్లాన్: ఐరన్‌మ్యాన్’ రేస్ గురించి చెబుతారు. 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల బైసికిల్ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగుతో ‘ఐరన్ మ్యాన్’ రేసు పూర్తి చేసిన తొలి బాలీవుడ్ నటిగా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఫ్రెండ్స్‌కు తన కల గురించి సయామీ ఖేర్ చెప్పినప్పుడు ‘నీలాగే చాలామంది కలలు కంటారు. రేస్ పూర్తి చేయని ఫస్ట్ టైమర్లు ఎందరో ఉన్నారు’ అన్నారు వాళ్లు. వెనక్కి తగ్గిన వారిలో తాను ఒకరు కాకూడదు అనుకుంది ఖేర్. ఫిబ్రవరిలో ‘ఐరన్ మ్యాన్’ రేస్ కోసం ట్రైనింగ్ మొదలైంది. మొదట్లో 3 కిలోమీటర్లు పరుగెత్తడం, ఈత ‘అయ్య బాబోయ్’ అనిపించేది. త్వరగా అలిసి పోయేది. సాధన చేయగా... చేయగా... కొన్ని నెలల తరువాత పరిస్థితి తన అదుపులోకి వచ్చింది. అప్పుడిక కష్టం అనిపించలేదు. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటైంది.రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి శిక్షణ కోసం సిద్ధం అయ్యేది. ట్రైనింగ్‌లో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి లోతుగా ఆలోచించేది. ‘శిక్షణ బాగా తీసుకుంటే వాటిని అధిగమించడం కష్టం కాదు’ అని కోచ్ చెప్పిన మాటను అనుసరించింది.‘ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మారథాన్లలోపాల్గొంటున్నాను. అయితే నా దృష్టి మాత్రం ఐరన్ మ్యాన్ రేస్ పైనే ఉండేది. నా కలను నెరవేర్చుకోడానికి సన్నద్ధం అవుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. దీంతో నా కల తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికైనా నా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటుంది సయామీ ఖేర్.ఖేర్ మాటల్లో చెప్పాలంటే ‘ఐరన్ మ్యాన్ రేస్ అనేది శారీరక సామర్థ్యం, సహనానికి పరీక్ష.‘ఆటలు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతం చేస్తాయి. ఐరన్ మ్యాన్ రేస్ పూర్తి చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం నా నట జీవితానికి ఉపయోగపడుతుంది’ అంటుంది 32 సంవత్సరాల సయామీ ఖేర్.ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‘ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్’ అనేది వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటిసి) నిర్వహించే రేసులలో ఒకటి. దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పోర్ట్ ఈవెంట్‌గా చెబుతారు. ఈ రేసు సాధారణంగా ఉదయం ఏడుగంటలకు మొదలై అర్ధరాత్రి ముగుస్తుంది. ఓర్పు, బలం, వేగానికి సంబంధించి ట్రయథ్లెట్లు రేసుకు కొన్ని నెలల ముందు కఠిన శిక్షణ తీసుకుంటారు.అయిననూ ఛేదించవలె...గత సంవత్సరం బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డాను. కొన్ని నెలల రెస్ట్. మరోవైపు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు అవసరమా!’ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు సరి కదా ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. ‘ఏదైనా చేయాలి అని మనసు బలంగా అనుకుంటే దానికి అనుగుణంగా శరీరం కూడా సన్నద్ధం అవుతుంది’ అంటారు. ఇది నా విషయంలో అక్షరాలా నిజం అయింది.అయితే ప్రతికూల పరిస్థితులు మళ్లీ ముందుకు వచ్చాయి. రేసుకు వారం ముందు కెనడాకు నా ప్రయాణం (వర్క్ ట్రిప్) పీడకలగా మారింది. విమానాలు ఆలస్యం కావడం నుంచి కాంటాక్ట్స్ కోల్పోవడం వరకు ఎన్నో జరిగాయి. నా బ్యాగ్‌లు మిస్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం సహకారంతో ఆ సమస్య నుంచి ఎలాగో బయటపడ్డాను. ఇక ‘ఐరన్ మ్యాన్ రేస్’లో నా గేర్ మొదలైనప్పుడు గాలులు తీవ్రంగా వీచడం మొదలైంది. అయినప్పటికీ ఈత కొట్టడానికి, రైడ్ చేయడానికి వెళ్లాను. నా మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఆస్వాదించాలని గట్టిగా అనుకున్నాను. నీరు గడ్డకట్టినప్పటికీ రేసును ఒక వేడుకలా భావించాను. కోల్డ్వాటర్లో 42 నిమిషాలు ఈదాను. – సయామీ ఖేర్ -
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
కల్యాణ్... ఐరన్‌మ్యాన్
ఆయనో మాజీ ఎస్సై... తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, ఏదైనా సాధించాలనే తపనతో ఉద్యోగాన్ని వదిలేశారు. మారథాన్లు, 10కె రన్లు ఎన్ని గెలిచినా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జరిగే ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జులై 29న జర్మనీలోని హ్యాంబర్గ్లోజరిగిన ఈవెంట్లో ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌లో జయకేతనం ఎగరేశారు. ఇది సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సాక్షి, సిటీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎం.కల్యాణ్‌కృష్ణ ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం సిటీలో స్థిరపడిన ఈయనకు... చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. స్నేహితుల ద్వారా స్ఫూర్తి పొందిన కల్యాణ్ 2002లో ఎస్సై కొలువు కొట్టారు. కర్నూలు జిల్లాలో పోస్టింగ్ వచ్చింది. బండి ఆత్మకూరు సహా మరికొన్ని చోట్ల పని చేశారు. అయితే ఆయనకు ఏదో అసంతృప్తి... ఏదైనా సాధించాలనే తపన ఉండేది. తాను కోరుకున్న శిఖరాలను అధిరోహించాలంటే పోలీస్ ఉద్యోగంతో ఉండి సమయం వెచ్చించలేమని భావించారు. దీంతో 2009లో ఉద్యోగాన్ని వదిలేసినా డిపార్ట్మెంట్ నేర్పిన క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ను కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏపీ, తెలంగాణ హెచ్ఆర్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌పై మక్కువతో వాటిని నిత్యం ప్రాక్టీస్ చేసే కల్యాణ్... ఓవైపు ఉద్యోగం చేస్తూనే, వారంలో ఒక్కో దానికి మూడు రోజులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలోనే నగరంతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూర్లలో జరిగిన అనేక మారథాన్లు, 10కె రన్లలో పతకాలు సొంతం చేసుకున్నారు. వాటితో సంతృప్తి పడని కల్యాణ్ ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్ లక్ష్యంగా ఏడాది శ్రమించి విజయం సాధించారు. నా సతీమణి సహకారం మరువలేను... నేను ప్రాక్టీస్ కోసం కుటుంబానికి దూరమవుతుంటాను. సెలవు దినాల్లో ఉదయం 6గంటలకు సైక్లింగ్ మొదలుపెట్టి దాదాపు 50–70 కి.మీ వెళ్లొస్తాను. తిరిగి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో నిత్యం నాకు మద్దతు తెలుపుతూ ఈ విజయాలకు కారణమైన నా భార్య సహకారం మరువలేను. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇస్తుంది. ఈ ఫీట్స్‌లో కొన్ని రిస్కీ అయినప్పటికీ గెలిచిన తర్వాత ఎంతో సంతృప్తి ఉంటుంది. గెలుపోటములు పక్కన ఉంచితే ఇలాంటి చాంపియన్‌షిప్స్ జీవితంలో ఏదైనా సాధించగలమనే మనోధైర్యాన్నిస్తాయి. – కల్యాణ్‌కృష్ణ సంస్థ స్పాన్సర్షిప్.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన లక్ష్యం సాధించేందుకు కల్యాణ్ ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు నిత్యం ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రత్యేక డైట్ తీసుకుంటారు. ఇక ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన సైకిల్‌ను రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేశారు. కేవలం ఇదొక్కటేనా అవసరమైన ప్రతిదీ సొంత డబ్బుతోనే కొంటుంటారు. అంతేకాకుండా ఆయా దేశాలకు వెళ్లిరావడానికీ కల్యాణ్ భారీ మొత్తం వెచ్చిస్తుంటారు. ఏళ్లుగా మారథాన్లు, రన్లలో పాల్గొంటున్న ఈయనకు... ‘ఐరన్‌మ్యాన్’కు తొలిసారి ఫ్లిప్‌కార్ట్ స్పాన్సర్షిప్ లభించింది. తాను పని చేస్తున్న సంస్థ రూ.3లక్షల ఆర్థిక సాయం చేయడం విశేషం. కల్యాణ్ విమానంలో జర్మనీకి తన సైకిల్ కూడా తీసుకెళ్లారు. ఇదీ ‘ఐరన్‌మ్యాన్’.. ప్రొఫెషనల్స్ కాకుండా నిరంతరం ప్రాక్టీస్ చేసే, సాధారణ వ్యక్తులు పాల్గొనే చాంపియన్‌షిప్ ఐరన్‌మ్యాన్. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఈవెంట్లో దాదాపు అన్ని దేశాల అభ్యర్థులు పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ట్రైథ్లాన్ అసోసియేషన్ రెండు రకాలుగా ఈ పోటీలు నిర్వహిస్తుంది. హాఫ్ ఐరన్‌మ్యాన్ పోటీలో 1.9 కి.మీ ఈత, 90 కి.మీ సైక్లింగ్, 21 కి.మీ పరుగును 8గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐరన్మ్యాన్లో 3.8 కి.మీ ఈత, 180 కి.మీ సైక్లింగ్, 42 కి.మీ పరుగును 16గంటల్లో పూర్తి చేయాలి. ప్రతి పోటీలో మూడు ఈవెంట్స్‌కు మధ్యలో ఆగేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. రేస్‌లో ఉన్నంతసేపూ కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటారు. అదీ సైక్లింగ్ చేస్తూనో, పరుగెడుతూనో సహాయకులు అందించేవి మాత్రమే తాగే అవకాశం ఉంటుంది. గతేడాది మలేసియాలోని లంకావి దీవిలో జరిగిన హాఫ్ ఐరన్మ్యాన్ను, ఈ ఏడాది హ్యంబర్గ్లో జరిగిన ఐరన్‌మ్యాన్ చాంపియన్‌షిప్‌ను కల్యాణ్ కృష్ణ గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 1600 మంది పాల్గొన్నారు. -
జకార్తా జిగేల్...
ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ చిత్రగీతాలు వేదికపై హైలైట్ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్ హిట్టయ్యాయి. జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్డ్ ట్రయాథ్లాన్ ఈవెంట్ జరిగింది. జపాన్ బృందం ఈ గేమ్స్ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఆటలేమో చూడలేదు కానీ! ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్. అందుకేనేమో సిద్ధార్థ్ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్ గయా’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్ స్టంట్తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చీఫ్ అహ్మద్ అల్ ఫహాద్ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి. ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. -
ప్రమాదవశాత్తూ ఎన్నారై టెకీ మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ వాసి మృతి చెందారు. భరత్‌రెడ్డి నరహరి (37) అనే టెకీ బాప్తిస్ట్ హెల్త్ సౌత్ ఫ్లొరిడాలో విధులు నిర్వహిస్తుండేవారు. సైక్లిస్ట్ అయిన భరత్‌రెడ్డి డాల్ఫిన్స్ క్యాన్సన్ ఛాలెంజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేయనున్న పోటీలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం నైరుతి మియామి డేడ్‌లో జరిగిన ట్రయథ్లాన్ (సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్) పోటీలో పాల్గొన్నారు. 236 స్ట్రీట్ 87 ఎవెన్యూకు మరికాసేపట్లో చేరుకుంటారనగా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్‌రెడ్డితో పాటు మరో సైక్లిస్ట్ గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందారని బాప్తిస్ట్ ఐటీ విభాగం వెల్లడించింది. ఇప్పటివరకూ ఆయన పలు 5కే రన్, సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఎంతో మందిలో స్ఫూర్తినింపారని టీమ్ హామర్ హెడ్స్ మేనేజ్మెంట్ తెలిపింది. భరత్‌రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భరత్‌రెడ్డి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టీమ్ హామర్ హెడ్స్‌లో భరత్‌రెడ్డి యాక్టీవ్ సభ్యుడు. మియామి గో రన్ రన్నింగ్ క్లబ్లో ట్రయాథ్లాన్లో శిక్షణ తీసుకున్న ఆయన వచ్చే నెల 10న నిర్వహించనున్న డాల్ఫిన్స్ క్యాన్సర్ ఛాలెంజ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. 2010లో మొదలుపెట్టిన ఆ ఛారిటీ ఈవెంట్లో ఈ ఏడాదికిగానూ 22.5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం నిర్వహించిన ఓ సన్నాహక ఈవెంట్లో పాల్గొని భరత్‌రెడ్డి మృతిచెందడం ఇతర సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. భరత్‌రెడ్డి పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు. భరత్‌రెడ్డి మరణవార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
డ్రగ్స్ వదిలేసి రికార్డులు సృష్టించాడు
ఒహియో: అతడు పదేళ్లకు పైగా మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. పక్కనే కొకైన్ లేకుంటే పిచ్చి లేసినవాడిలా ప్రవర్తించేవాడు. వ్యక్తిగతంగా సామర్థ్యంకలిగిన వాడైనప్పటికీ డ్రగ్స్ బారిన పడి మొత్తానికే గుర్తింపు పోగొట్టుకుని అందరితో చీకొట్టించుకున్నాడు. కానీ, పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే చందంగా తిరిగి తన గతంపై తానే తిరగబడ్డాడు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించుకొని విజేతగా మారడాడు. ఏకంగా ట్రయ్థ్లాన్ పూర్తి చేశాడు. అంటే వరుసగా మూడురోజుల్లో నీటిలో ఈదడం, సైక్లింగ్ చేయడం, పరుగెత్తడంలాంటివి పూర్తి చేశాడు. అతడే టాడ్ క్రాండెల్. మత్తుపదార్థాల బారిన పడిన ఇతడు తిరిగి తన సామర్థ్యాన్ని తాను తెలుసుకొని అసలైన ప్రయత్నం ప్రారంభించాడు. ఆరు మైళ్లు ఈదడం, 261 మైళ్లు సైకిల్ తొక్కడం, 52 మైళ్లు పరుగెత్తడం ద్వారా ట్రయ్థ్లాన్ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మొత్తం హవాయి ప్రాంతంలోనే ఈ తరహా రికార్డు సృష్టించడం ఒక్క టాడ్కే సొంతమైంది. పూర్తిగా డ్రగ్స్‌కు బానిస అయిన అతడిని పోలీసులు మూడోసారి అరెస్టు చేసిన తర్వాత తన జీవితాన్ని మార్చుకోవాలన్ని నిర్ణయించుకొని ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. -
కనుమరుగవుతున్న వెయిట్ లిప్టింగ్
-
స్టింప్సన్‌కు తొలి స్వర్ణం
గ్లాస్గో: బ్రిటిష్ రాణిగారి ఆటలుగా పరిగణించే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాల బోణీ ఇంగ్లండ్‌కే దక్కింది. గురువారం తొలిరోజు జరిగిన మహిళల ట్రయథ్లాన్‌లో జోడీ స్టింప్సన్ విజేతగా నిలిచి ఇంగ్లండ్‌కు పసిడి పతకాన్నందించింది. 1500 మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్‌తో కూడిన ఈ మల్టీ స్పోర్ట్ ఈవెంట్‌ను స్టింప్సన్ గం.1:58:56 ని. సమయంలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన కిర్‌స్టెన్ స్వీట్లాండ్ గం.1:59:01ని. సమయం నమోదు చేసి రజతం సాధించగా... ఇంగ్లండ్‌కే చెందిన విక్కీ హాలండ్ గం. 1:59:11ని.తో కాంస్యం దక్కించుకుంది.