‘అర్జున’కు ప్రణయ్‌ నామినేట్‌  | Pullela Gopichand Nominated HS Prannoy For Arjuna Award | Sakshi
Sakshi News home page

‘అర్జున’కు ప్రణయ్‌ నామినేట్‌ 

Published Mon, Jun 22 2020 12:22 AM | Last Updated on Mon, Jun 22 2020 12:22 AM

Pullela Gopichand Nominated HS Prannoy For Arjuna Award - Sakshi

చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ని నామినేట్‌ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సమీర్‌ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్‌ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్‌ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్‌ ఈ సిఫార్సు చేశారని, చీఫ్‌ కోచ్‌ హోదాలో కాదని ‘బాయ్‌’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్‌’ ప్రణయ్‌కి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement