తెలంగాణ అసెంబ్లీలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించాలని అధికారపక్షం యోచిస్తోంది. దీనిపై స్పీకర్ మధుసూదనాచారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వం శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది.