సాగు కలసి రాక, చేసిన అప్పులు తీర్చలేక.. ఓ రైతు పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.
దిలావర్‌పూర్‌పూర్ (ఆదిలాబాద్) : సాగు కలసి రాక, చేసిన అప్పులు తీర్చలేక.. ఓ రైతు పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కుస్లి పంచాయతీ పరిధిలోని అంజనితండాకు చెందిన రైతు రాథోడ్ దేవిదాస్ (45) రెండేళ్లుగా సాగులో నష్టాలను చూస్తున్నాడు.
సాగు కోసం, కుమార్తె కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో మంగళవారం పొలంలోనే పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.