ప్రభుత్వాలు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్న గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు.
ఆదిలాబాద్ : ప్రభుత్వాలు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్న గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మూడు బాల్య వివాహాలను శనివారం అధికారులు అడ్డుకున్నారు.
భిమిని మండలం రిగాం గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను చూసి అవాక్కయ్యారు. ఒకే రోజు ముగ్గురు మైనర్ బాలికలకు వివాహాలు జరుపుతుండటంతో.. పోలీసులు బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను రద్దు చేశారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఈ నెలలో మూడో సారి అని రెవెన్యూ అధికారులు తెలిపారు. బాల్య వివాహాలకు పాల్పడుతున్న వారందరు ఒకే వర్గానికి చెందిన వారిగా గుర్తించిన రెవెన్యూ అధికారులు వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు.