వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు, వేరుశనగకాయకు బుధవారం రికార్డు ధర పలికింది.
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు, వేరుశనగకాయకు బుధవారం రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు సుమారు 145 క్వింటాళ్ల పసుపు రాగా.. 22 క్వింటాళ్లు తెచ్చిన వంగ రాజు అనే రైతుకు క్వింటాకు రూ.7,601 రికార్డు ధర పలికింది. రెండేళ్లుగా పసుపు మార్కెట్‌లో క్వింటా ధర రూ.4,500 దాటలేదు. 2012లో మాత్రం క్వింటా పసుపు రూ.9 వేల వరకు ధర పలికింది. కాగా, మార్కెట్‌కు 128 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. రుణావత్ కోటి అనే రైతు తెచ్చిన 16 క్వింటాళ్ల కాయకు క్వింటాకు గరిష్టంగా రూ.5,230 రికార్డు ధర పలికింది. మూడేళ్లుగా వేరుశనగ ధర ఏ రోజు కూడా క్వింటాకు రూ.4,300 దాటలేదు. మొత్తంగా పసుపు, పల్లికాయకు ఈ సీజన్‌లోనే అత్యధిక రికార్డు ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారుు. ఈ ధరలు మరో వారంలో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.