
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో అల్లాడుతన్న కేరళకు రూ.25 కోట్లను తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వెంటనే ఈ మొత్తాన్ని కేరళకు అందించాలని ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మెషీన్లను పంపాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేరళలో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి కేరళ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేరళకు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.