‘ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం’ | TRS Election Campaign In Huzurnagar Eetela Rajendar | Sakshi
Sakshi News home page

‘ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం’

Published Sat, Dec 1 2018 2:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

TRS Election Campaign In Huzurnagar Eetela Rajendar - Sakshi

హుజూరాబాద్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు 

సాక్షి,హుజూరాబాద్‌: నిరుపేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమునారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు..గ్రామీణ ప్రాంతాలు, పట్టణాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజ సమస్యలను పరిష్కరిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మంద ఉమాదేవి, వైస్‌ చైర్మన్‌ తాళ్లపల్లి రజిత శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ విజయారెడ్డి, కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, గందె రాధిక, కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మొలుగూరి రాజేశ్వరి, ముక్క రమేశ్, బర్మావత్‌ యాదగిరినాయక్, నాయకులు గందె శ్రీనివాస్, ఎంపటి సుధీర్, ఆర్‌కే రమేశ్, పంజాల రాంశంకర్‌గౌడ్, పోతుల సంజీవ్, చంద గాంధీ, రాపర్తి శివ, ధనవర్ష రాజు, మాడ సందీప్, వీడెపు అనురాగ్, ఒంటెల రాజిరెడ్డి, సువర్ణ, పంజాల శ్రీధర్‌గౌడ్, బుర్ర కుమార్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. 

అభివృద్ధిని చూసి ఓటు వేయండి
హుజూరాబాద్‌రూరల్‌: నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయాలని జెడ్పీటీసీ మొలుగూరి సరోజన అన్నారు. శుక్రవారం మండలంలోని చెల్పూర్‌ గ్రామంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈటలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో రైతు సమన్వయ సమితి మండల కో కన్వీనర్‌ మండల సాయిబాబా, మాజీ సర్పంచ్‌ పొలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సంపంగి రాజేందర్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement