రబీ సీజన్‌లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
బషీరాబాద్: రబీ సీజన్‌లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూ ములను దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. చెరువులు నీటితో కళకళలాడుతుండటంతో వేరుశనగ పంట కోసం విత్తనాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా మారారు.
అక్టోబర్ మొద టి వారం నుంచి రైతులు వేరుశనగ విత్తుకునేందుకు అనుకూలమని బషీరాబాద్ మండల వ్యవసాయాధికారి కృష్ణమోహన్ తెలిపా రు. నాలుగు నుంచి ఆరు నెలల క్రితం పండిన వేరుశనగ విత్తనాలను రైతులు విత్తుకోవాలని సూచించారు. ఏడాది క్రితం పండించిన విత్తనా లు వేస్తే దిగుబడి ఎక్కువగా రాదని తెలి పారు. నాణ్యత కలిగిన వేరుశనగను విత్తుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా అనుమానాలుం టే తమను సంప్రదించాలని ఆయన తెలిపారు.