Top Stories
ప్రధాన వార్తలు

ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో 'సుందర్ పిచాయ్' ఒకరు. ఈయన నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక సలహా అని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య 'అంజలి పిచాయ్' అని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో అంజలి పిచాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.రాజస్థాన్‌లో జన్మించిన అంజలి, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలో సుందర్ పిచాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.ఆ తరువాత సుందర్ పిచాయ్, అంజలి పెళ్లి చేసుకున్నారు. మొదట అంజలి తన కెరీర్‌ను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా ప్రారంభించింది. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్న తరువాత.. ప్రముఖ ఆర్థిక సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్‌కు మారింది, ప్రస్తుతం ఆమె అక్కడ కీలక నిర్వహణ పాత్రను పోషిస్తోంది. అంజలి పిచాయ్.. ఇంట్యూట్‌లో కెమికల్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారు. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా మంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది.మైక్రోసాఫ్ట్, ట్విటర్ కంపెనీలలో జాబ్ ఆఫర్ రావడంతో.. సుందర్ పిచాయ్ గూగుల్ జాబ్ వదిలేయాలకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య అంజలికి చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరిగా ఎదగడానికి అంజలి మద్దతుగా నిలిచారు. సుందర్ తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు చాలా కాలం విడిపోయిన తర్వాత కూడా.. అంజలికి అతనిపై ఉన్న దృఢమైన నమ్మకం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: రతన్ టాటా వీలునామా.. ఎవరికి ఎంత కేటాయించారంటే?సుందర్ పిచాయ్, అంజలి.. ఇప్పుడు కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్‌లో వారి ఇద్దరు పిల్లలు కావ్య, కిరణ్‌లతో నివసిస్తున్నారు. 2023లో ఆమె వృత్తిపరమైన విజయాలు.. సహకారాలకు గాను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆమెను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అంజలి మొత్తం సంపద రూ.830 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. పేరుకే జట్టులో ‘విధ్వంసకర బ్యాటర్లు’ ఉన్నారని.. కానీ వారి వల్ల ప్రేక్షకులకు ఎలాంటి వినోదం లభించడం లేదని పేర్కొన్నాడు. బౌలర్లకు అంతగా సహకరించని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై కూడా పరుగులు చేయలేక.. చేతులెత్తేయడం వారి పేలవ ప్రదర్శనకు నిదర్శనమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో అద్భుత బ్యాటింగ్‌తో ఫైనల్ వరకు చేరుకున్న సన్‌రైజర్స్.. టైటిల్ పోరులో మాత్రం 113 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బౌలింగ్‌లోనూ విఫలమై.. తద్వారా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)ని ఘనంగా ఆరంభించినప్పటికీ హ్యాట్రిక్ పరాజయాలతో చతికిల పడింది.ఒక్కరూ నిలబడలేదుతాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో ఫోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ ట్రవిస్ హెడ్ (Travis Head) మరుసటి బంతికే అవుట్ కాగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 2, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు.ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (19) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడనుకున్న అనికేత్ వర్మ (6) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫలితంగా 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.80 పరుగుల తేడాతో ఓటమిఅంతకు ముందు ఇదే పిచ్‌పై చక్కటి షాట్లు ఆడుతూ కేకేఆర్ బ్యాటర్లు 200 పరుగులు స్కోరు చేశారు. అయితే, ఈ టార్గెట్‌ను ఎస్ఆర్హెచ్ సులువుగానే ఛేజ్ చేస్తుందనుకుంటే.. 120 పరుగులకే కుప్పకూలి.. 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రైజర్స్ బ్యాటర్లలో మెజారిటీ మంది సులువైన క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ చేరడం గమనార్హం.ఈ నేపథ్యంలో కేకేఆర్- సన్‌రైజర్స్ ఫలితంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ హైదరాబాద్ జట్టు తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఇలాంటి పేరుండేది. ముందు నుంచి రాణించడం ఆఖర్లో చేతులెత్తేయడం.. ఇప్పుడు సన్‌రైజర్స్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. కానీవాళ్లు 190 పరుగులు చేసి ఓడిపోయారు.. 160 రన్స్ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో 200 పరుగులు ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నిజానికి కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. బంతి కూడా టర్న్ కావడం లేదు. ఇదే పిచ్‌పై వాళ్ల బ్యాటర్లు 200 పరుగులు సాధించారు.అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు పిచ్ నుంచి అంతగా సహకారం కూడా అందలేదు. వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే వాళ్లు ఎక్కువగా స్లో బాల్స్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త ఓపికగా ఎదురుచూడాలి. పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత పరుగుల వేట మొదలుపెట్టాలి.కానీ ఈరోజు వాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. జట్టులో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నారు. కానీ ఏం లాభం అవసరమైనపుడు ఒక్కరూ పరుగులు చేయలేకపోయారు. 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జనాలు డబ్బు ఇచ్చి మరీ మీ ఆటను చూడటానికి వస్తారు.ఈసారి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగినా చాలా మంది సన్‌రైజర్స్ బ్యాటింగ్ చూసేందుకు వచ్చారనడం అతిశయోక్తి కాదు. కానీ మీరు వారందరినీ నిరాశకు గురిచేశారు’’ అని సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్ గెలుపు.చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?

Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు.

మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట.

‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం.

కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

Neet Row: డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/చెన్నై, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్‌ను ఉప సంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడంతో ఇదొక తీవ్ర అంశంగా మారిందక్కడ. కోచింగ్‌లకు వెళ్లే స్తోమత లేని విద్యార్థుల పాలిట ఇదొక శాపంగా మారిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది. అందుకే నీట్ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే.. 2021-22 నుంచే అది పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్‌లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్‌ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అంశం పరిశీలిస్తాం అని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం.

రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)మూడోవాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రూ. 27 కోట్లు ఖర్చు చేస్తే.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.రూ. 23.75 కోట్లుఅయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్య రీతిలో వెంకటేశ్ అయ్యర్‌ను దక్కించుకునేందుకు రూ. 23.75 కోట్లు కుమ్మరించింది. నిజానికి గతేడాది అతడు అంత గొప్పగా ఏమీ ఆడలేదు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు సాధించాడు.అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలకమైన ఫైనల్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ అతడిని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.ఆరంభ మ్యాచ్‌లో ఆరు.. ముంబైపై మూడుఅయితే, ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తేలిపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు.మెరుపు బ్యాటింగ్ఈ క్రమంలో వెంకటేశ్‌కు కేకేఆర్ భారీ మొత్తం చెల్లించడం వృథా అయిందని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా విమర్శకులందరికీ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు వెంకటేశ్. ఇన్నింగ్స్ ఆరంభంలో టెస్టు మ్యాచ్ మాదిరి ఆడిన అతడు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 కేవలం 29 బంతుల్లోనే వెంకటేశ్ అయ్యర్ 60 పరుగులు చేసి కేకేఆర్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రైజర్స్పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెంకటేశ్ అయ్యర్ తన ‘ప్రైస్ ట్యాగ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే‘‘ఒక్కసారి ఐపీఎల్ మొదలైందంటే.. ఓ ఆటగాడు రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడా? లేదంటే రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడా? అన్న విషయంతో సంబంధం ఉండదు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదు. మా జట్టులో అంగ్క్రిష్ రఘువన్షీ అనే కుర్రాడు ఉన్నాడు.అతడు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని నాకు తెలుసు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా నేను ఈరోజు బ్యాటింగ్ చేశాను.ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?అంతేగానీ.. నేను అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రైస్ ట్యాగ్ వల్ల ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.ఈ విషయంలో నాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదు.. జట్టుకు నేను ఉపయోగపడుతున్నానా? లేదా? అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సత్తా చాటిన అంగ్‌క్రిష్‌ను కేకేఆర్ తిరిగి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటికే అతడు ఈ సీజన్లో ఓ హాఫ్ సెంచరీ బాదేశాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 128 రన్స్ చేశాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్👉కోల్‌కతా స్కోరు: 200/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్ విజయం.చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
రూ.9.97 లక్షల డుకాటీ బైక్ లాంచ్: వివరాలు
రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
‘మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో’
ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్
గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
స్మార్ట్‌గా చెడగొడుతున్నాయ్..!
డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం: సన్‌రైజర్స్ యాజమాన్యం
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఆమోదం
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే..
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్
ఈ ఉగాది పచ్చడి నీ కోసం ‘ప్రత్యేకంగా’ చేసినది!
పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తులు కొనుగోలు చేస్తారు
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్.. కొట్టివేసిన కోర్టు
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే..
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
అమ్మా.. నాన్నా.. సారీ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి
మన సిద్ధ వైద్య రహస్యాలు చెప్పిన సినిమా
ప్రవీణ్ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
డెన్మార్క్‌ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
నేను చెడ్డ నటుడిని కాదు, కాంతారలో ఛాన్స్ ఇవ్వండి: మోహన్‌లాల్
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
‘ప్రయాగ్‌రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పులు?
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
ఆర్సీబీ ఇక కోహ్లిపై ఆధారపడదు: భారత మాజీ క్రికెటర్
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
పుష్ప2 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..?
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్’
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: బాలీవుడ్ నటుడు
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
భర్త సంపాదన ప్రియుడిపాలు!
పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
రూ. 1,460 కోట్ల షేర్లను అమ్మేసిన కేకేఆర్
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
రెవెన్యూ ‘మాసం’
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఫోన్‌పే రూ.696 క్యాష్ బ్యాక్.. నిజమేనా?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
సాక్షి కార్టూన్ 04-04-2025
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆలయం..
వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి ఎమ్మెల్యే అయ్యా..
ఎర్రబుక్కు తెల్లమొహం!
ఈవీఎంలు లేకపోతే ఇదే పరిస్థితి.. లాభం లేదు వచ్చే ఎన్నికలను ఉపగ్రహం నుండి మేనేజ్ చేద్దాం సార్
సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?
కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య
బ్యాంకులకు వరుస సెలవులు..
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
వాట్సప్ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు
నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
అదానీతో పోటీకి వేదాంతా సై!
లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
రూ.9.97 లక్షల డుకాటీ బైక్ లాంచ్: వివరాలు
రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
‘మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో’
ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్
గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
స్మార్ట్‌గా చెడగొడుతున్నాయ్..!
డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం: సన్‌రైజర్స్ యాజమాన్యం
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఆమోదం
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే..
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్
ఈ ఉగాది పచ్చడి నీ కోసం ‘ప్రత్యేకంగా’ చేసినది!
పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తులు కొనుగోలు చేస్తారు
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్.. కొట్టివేసిన కోర్టు
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే..
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
అమ్మా.. నాన్నా.. సారీ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి
మన సిద్ధ వైద్య రహస్యాలు చెప్పిన సినిమా
ప్రవీణ్ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
డెన్మార్క్‌ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
నేను చెడ్డ నటుడిని కాదు, కాంతారలో ఛాన్స్ ఇవ్వండి: మోహన్‌లాల్
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
‘ప్రయాగ్‌రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పులు?
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
ఆర్సీబీ ఇక కోహ్లిపై ఆధారపడదు: భారత మాజీ క్రికెటర్
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
పుష్ప2 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..?
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్’
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: బాలీవుడ్ నటుడు
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
భర్త సంపాదన ప్రియుడిపాలు!
పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
రూ. 1,460 కోట్ల షేర్లను అమ్మేసిన కేకేఆర్
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
రెవెన్యూ ‘మాసం’
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఫోన్‌పే రూ.696 క్యాష్ బ్యాక్.. నిజమేనా?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
సాక్షి కార్టూన్ 04-04-2025
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆలయం..
వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి ఎమ్మెల్యే అయ్యా..
ఎర్రబుక్కు తెల్లమొహం!
ఈవీఎంలు లేకపోతే ఇదే పరిస్థితి.. లాభం లేదు వచ్చే ఎన్నికలను ఉపగ్రహం నుండి మేనేజ్ చేద్దాం సార్
సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?
కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య
బ్యాంకులకు వరుస సెలవులు..
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
వాట్సప్ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు
నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
అదానీతో పోటీకి వేదాంతా సై!
లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
సినిమా

'లూసిఫర్2' నిర్మాత ఆఫీస్లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో
మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోకి మాత్రం దాదాపు 18 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, టెస్ట్, ఇంటి నం.13, లవ్ యాపా సినిమాలతో పాటు హౌమ్ టౌన్ అనే సిరీస్ ఉన్నంతలో తెలుగు ప్రేక్షకుల కోసం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏయే మూవీ వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (ఏప్రిల్ 04)అమెజాన్ ప్రైమ్14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో - తెలుగు సినిమాఇంటి నం.13 - తెలుగు చిత్రం (రెంట్)ముర్ ముర్ - తమిళ మూవీమచంటే మలక - మలయాళ సినిమాద బాండ్స్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీఅబౌట్ డ్రై గ్రాసెస్ - టర్కిష్ సినిమాముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ - మరాఠీ మూవీపరు పార్వతి -కన్నడ సినిమా నెట్ ఫ్లిక్స్టెస్ట్ - తెలుగు డబ్బింగ్ మూవీకర్మ - కొరియన్ సిరీస్పల్స్ - ఇంగ్లీష్ సిరీస్హాట్ స్టార్లవ్ యాపా - హిందీ సినిమాటచ్ మీ నాట్ - తెలుగు సిరీస్ఆహాహోమ్ టౌన్ - తెలుగు సిరీస్సోనీ లివ్ఛమక్ - తెలుగు సిరీస్మనోరమ మ్యాక్స్జైలర్ - మలయాళ సినిమాబుక్ మై షోపెర్సోనా నాన్ గ్రాటా - జర్మన్ మూవీయూనివర్సల్ లాంగ్వేజ్ - ఫ్రెంచ్ సినిమా(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన 'రామ్ చరణ్- ఉపాసన'
మార్చి 27న రామ్‌చరణ్ 40వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ఒక గిఫ్ట్ పంపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. చరణ్ పంపిన ఆ కానుక చాలా ప్రత్యేకమైనదని అందులో బుచ్చిబాబు పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పెద్ది సినిమా తెరకెక్కుతుండటం వల్ల వారిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగిన విషయం తెలిసిందే.చరణ్- ఉపాసన గిఫ్ట్‌గా దర్శకుడు బుచ్చిబాబుకు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని పంపారు. అందులోనే హనుమంతుడి ప్రతిమ, శ్రీరాముని పాదుకలను కూడా ఆయనకు పంపారు. ఆపై బుచ్చిబాబు గురించి చరణ్ ఒక నోట్ ఇలా రాశారు.'కష్టకాలంలో హనుమాన్ నా వెంటే ఉన్నాడు. జీవితంలో నన్ను ఆయనే గైడ్ చేశాడు. ఇప్పుడు నేను 40వ దశకంలో అడుగుపెడుతున్నాను. ఇన్నేళ్లు నాకు శక్తిని ఇచ్చిన హనుమాను ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసులో నీవు (బుచ్చిబాబు) ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటావు.' అని చరణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బుచ్చిబాబు కూడా చరణ్ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాడు. హనుమంతుని ఆశీస్సులు మీకు మరింత బలాన్ని, శక్తిని ప్రసాదించుగాక అని బుచ్చిబాబు ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు షేర్ చేశారు.Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍 Indebted to ur love nd support 🙏🏼May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir...Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025

సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో ప్రతివారం ఏదో ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పేరున్న నటీనటులు ఉంటే మోస్తరు కలెక్షన్స్ సాధిస్తుంది. లేదంటే వచ్చివెళ్లిన సంగతి తెలియనంత వేగంగా మాయమైపోతుంది. అలాంటి ఓ తెలుగు మూవీ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)అంకిత్, శ్రియ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో'. టైటిల్ చూస్తేనే కథేంటో అర్థమైపోతుంది కదా. ఒంటరిగా ఉన్న ప్రియురాలిని కలవడానికి ఓ కుర్రాడు.. ఆమె ఇంటికి వెళ్తాడు. అదే టైంకి అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో అక్కడే ఉండిపోతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.మార్చి 7న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. కానీ ఈ విషయం కూడా చాలామందకి తెలియదు. అలాంటిది ఈ రొమాంటిక్ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. దీనితో పాటు ఈ వారం పలు తెలుగు, డబ్బింగ్ మూవీస్ కూడా పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)
న్యూస్ పాడ్‌కాస్ట్

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
క్రీడలు

జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ.. దేశవాళీ క్రికెట్లో తమ సొంత జట్టును వీడేందుకు సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబై జట్టును వీడి.. గోవాకు ఆడటం అధికారికంగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధ్రువీకరించాయని జాతీయ మీడియా పేర్కొంది.ఖండించిన ఎంసీఏమరోవైపు.. జైస్వాల్ బాటలో సూర్య కూడా టీమ్ మారుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, సూర్యకుమార్ (Suryakuar Yadav) విషయంలో వస్తున్న వదంతులను ఎంసీఏ ఖండించింది.‘సూర్యకుమార్ యాదవ్ గురించి మీడియాలో వస్తున్న వదంతుల గురించి మాకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంపై మేం ఇప్పటికే సూర్యతో మాట్లాడాం. అతను తాను ముంబైకే ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు.ఆ వార్తలన్నీ నిరాధారం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించకుండా ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని అందరినీ కోరుతున్నాం’ అని ఎంసీఏ కార్యదర్శి అభయ్ హడప్ పేర్కొన్నారు. సూర్య కూడా సోషల్ మీడియా ద్వారా నేరుగా ఈ వార్తలను కొట్టిపారేశాడు. ‘ఈ వార్త రాసింది జర్నలిస్టా, స్క్రిప్ట్ రైటరా. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఈ కథనాలు చదువుకుంటే చాలు. అర్థంపర్థం లేని విషయమిది’ అని సూర్య వ్యాఖ్యానించాడు. HCA స్పందన ఇదేమరోవైపు.. జైస్వాల్‌కు సంబంధించిన కథనంలో మరో భారత ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) కూడా హైదరాబాద్‌ను వీడి గోవాకు ఆడబోతున్నట్లుగా వచ్చింది. ఈ విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్పష్టతనిచ్చింది. తిలక్ వర్మతో వ్యక్తిగతంగా మాట్లాడానని, అతడు హైదరాబాద్‌కే ఆడతానని చెప్పినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవరాజ్ తెలిపారు.ఇదీ చదవండి: రబడ ఇంటి బాట న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐపీఎల్ నుంచి స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సఫారీ పేసర్... వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన్నట్లు టీమ్ మేనేజ్మెంట్ గురువారం వెల్లడించింది. తాజా సీజన్లో గుజరాత్ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడగా... అందులో రెండింట్లో బరిలోకి దిగిన రబడ 2 వికెట్లు పడగొట్టాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.‘ముఖ్యమైన వ్యక్తిగత కారణాలతో రబడ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు’ అని గుజరాత్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడు తిరిగి వస్తాడా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. రబడ సేవలు దూరమైనా... మహ్మ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకే చెందిన గెరాల్డ్ కోట్జీ, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్లో ఒకరిని విదేశీ పేసర్ కోటాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు

IPL 2025: మా ఓటమికి ప్రధాన కారణం అదే: ప్యాట్ కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో మురిపించిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓడి హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది.ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్.. ఐపీఎల్-2024 రన్నరప్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆరంభంలో బాగానే రాణించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ కేకేఆర్ క్రమంగా పుంజుకుంది.దుమ్ములేపిన కేకేఆర్ బ్యాటర్లుకెప్టెన్ అజింక్య రహానే (38), అంగ్క్రిష్ రఘువన్షీ(32 బంతుల్లో 50), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్).. ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 మూకుమ్మడిగా విఫలంఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2).. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్(2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. నితీశ్ కుమార్ రెడ్డి (19), కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు.ఫలితంగా కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘‘వికెట్ బాగానే ఉంది. కానీ మేమే సరిగ్గా ఆడలేకపోయాం.తొలుత క్యాచ్‌లు వదిలేశాం. ఆఖర్లో పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలి. సమీక్ష నిర్వహించి .. మరింత మెరుగైన ఆప్షన్ల కోసం ప్రయత్నించాలి.ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓటమిమా బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు విజయాలు సాధించారు. కానీ ఈసారి మాత్రం అలా జరుగలేదు. అయితే, ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము భారీ మూల్యం చెల్లించాం. ఓవరాల్‌గా చూస్తే బౌలింగ్ మాత్రం ఫర్వాలేదు.ఆరంభంలో క్యాచ్‌లు వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది. మేము కేవలం మూడు ఓవర్లే స్పిన్ వేశాం. బంతిపై మాకు అంతగా గ్రిప్ దొరకలేదు. అందుకే ఆడం జంపాను ఆడించలేదు. వరుస ఓటములు నిరాశపరిచాయి.అయితే, ఈ విషయాన్ని తలచుకుని కుంగిపోవాల్సిన పనిలేదు. తదుపరి సొంత మైదానంలో ఆడబోతున్నాం. అది మాకు సానుకూలాంశం’’ అని కమిన్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా సీజన్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత లక్నో చేతిలో ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: సన్‌రైజర్స్‌పై 80 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వైభవ్ అరోరా (3/29).చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ

చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన రహానే సేన.. తాజాగా సొంత మైదానంలో మాత్రం అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఆరంభంలోనే షాక్ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, హైదరాబాద్ పేసర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునిల్ నరైన్(7)ల వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38).. అంగ్క్రిష్ రఘువన్షీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.రఘువన్షీ హాఫ్ సెంచరీరహానే అవుటైన తర్వాత రఘువన్షీకి జతైన వెంకటేశ్ అయ్యర్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. అయితే, రఘువన్షీ మాత్రం చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగుల వద్ద ఉన్న వేళ కమిందు మెండిస్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఆఖర్లో సీన్ రివర్స్ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. రింకూతో పాటు వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన వెంకటేశ్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.మరో ఎండ్‌లో రింకూ సింగ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేకేఆర్ 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పెవిలియన్‌కు వరుస కట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. కేకేఆర్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2) వచ్చీరాగానే అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ (2) కూడా మరోసారి విఫలమయ్యాడు.నితీశ్ కుమార్ రెడ్డి (19) సైతం కాసేపే క్రీజులో ఉండగా.. కమిందు మెండిస్ (20 బంతుల్లో 27), హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో పేసర్ వైభవ్ అరోరా ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చి రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో వరుణ్ చక్రవర్తి మూడు, ఆండ్రీ రసెల్ రెండు, సునిల్ నరైన్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలాఇక ఈ విజయం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రైజర్స్పై కోల్‌కతాకు ఇది ఏకంగా 20వ గెలుపు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆర్సీబీపై కూడా ఇప్పటి వరకు 20 విజయాలు సాధించిన కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా 21 సార్లు గెలుపొందింది.ఈ క్రమంలో కోల్‌కతా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్-2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలవడం కేకేఆర్‌కు ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. ఈ గెలుపు ద్వారా కేకేఆర్ ఖాతాలో మూడో టైటిల్ చేరింది.ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్లు👉ముంబై ఇండియన్స్- కేకేఆర్‌పై 24 విజయాలు👉చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీపై 21 విజయాలు👉కేకేఆర్- పంజాబ్ కింగ్స్‌పై 21 విజయాలు👉ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 విజయాలు👉కేకేఆర్- ఆర్సీబీపై 20 విజయాలు👉కేకేఆర్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 విజయాలు.After impressing with the bat and in the field, #KKR 𝙬𝙖𝙡𝙩𝙯𝙚𝙙 their way to a handsome 80-run victory at home 😌💜Scorecard ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Ne4LJhXNP4— IndianPremierLeague (@IPL) April 3, 2025 చదవండి: Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...

MI vs LSG: రోహిత్, పంత్‌కు పరీక్ష!
లక్నో: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. తాజా సీజన్లో చెరో 3 మ్యాచ్‌లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) దక్కించుకున్న లక్నో సారథి పంత్... ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు. గత మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా... ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ‘హిట్‌మ్యాన్’ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి. మరోవైపు ఐపీఎల్లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట లక్నో గెలుపొందింది. మరి స్పిన్‌కు సహకరిస్తున్న లక్నో పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! బుమ్రా లేకపోయినా బలంగానే... ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికి ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడా జాబితాలో మరో రెండు కొత్త పేర్లు చేరేలా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కావడంతో... జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది అనుకుంటే... మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుథుర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా... హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌తో సూర్యకుమార్ కూడా లయ అందుకోగా... రోహిత్ శర్మ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెపె్టన్ హార్దిక్‌తో పాటు బౌల్ట్, అశ్వని, దీపక్ చాహర్, సాంట్నర్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఫుల్ ఫామ్‌లో పూరన్, మార్ష్... కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా... లక్నో జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టి20 స్పెషలిస్ట్, విండీస్ స్టార్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకు పడుతుంటే... ఆ్రస్టేలియా బ్యాటర్ మిషెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు రెండేసి హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం... లక్నోకు కలిసి రానుంది. ఆయుశ్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీమ్ రూపంలో ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం. ఎటొచ్చి పంత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.చాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితమైన రిషబ్... ఈ మ్యాచ్‌లోనైనా దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే... బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో... శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి కీలకం కానున్నారు. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోని, మిల్లర్, సమద్, శార్దుల్, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుథుర్, ముజీబ్. 6 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఐదింటిలో లక్నో గెలుపొందగా... ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
బిజినెస్

దోస రైతులపై సుంకాల పిడుగు
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.99 శాతం ఎగుమతులే..భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?అమెరికా మార్కెట్లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు.

ప్రతీకార సుంకాల ప్రభావంపై అధ్యయనం
అమెరికా ప్రతీకార సుంకాలతో భారత్‌పై ప్రడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖతోపాటు, ఆర్థిక శాఖ ప్రకటించాయి. దేశీ పరిశ్రమ, ఎగుమతిదారులు సహా భాగస్వాములు అందరితో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా కొత్త వాణిజ్య విధానం ఫలితంగా ఏర్పడే కొత్త అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించింది.పరస్పర ప్రయోజనకరమైన, బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) త్వరగా అంగీకారానికి వచ్చేందుకు భారత్–అమెరికా వాణిజ్య బృందాలు చర్చిస్తున్నట్టు తెలిపింది. అమెరికాతో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని.. రెండు దేశాల ప్రయోజనాల విషయంలో అమెరికాతో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ట్రంప్‌నకు అమెరికాయే ప్రథమం. మోదీకి భారతే ప్రథమం. అమెరికా మోపిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. భారత్ నుంచి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్, ఇంధన ఉత్పత్తుల దిగుమతులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించగా, మిగిలిన దిగుమతులపై 10 శాతం బేసిక్ డ్యూటీకి అదనంగా 26 శాతం సుంకాలు మోపింది.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.

రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
భారతీయ రైల్వే వివిధ తరగతుల్లోని ప్రయాణీకులకు లగేజీ నిబంధనలను సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులను నియంత్రించడం, భద్రతను మెరుగుపరచడం, రైలులో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చూడటం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లాలి..ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలో కింద తెలుసుకుందాం.ఎంత లగేజీని తీసుకెళ్లాలి?కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు అదనపు ఛార్జీలు లేకుండా 70 కిలోల లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్‌లో భాగంగా 40 కిలోలను అనుమతిస్తారు.సెకండ్ క్లాస్ నాన్ ఏసీకి ఉచిత లగేజీ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.ప్రయాణికులు రైల్వే అనుమతించిన బరువు కంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. లగేజీ బరువుగా లేదా భారీగా ఉంటే దానిని కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. బదులుగా ప్రత్యేక లగేజీ వ్యాన్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమాణానికి సంబంధించి కూడా రైల్వే స్పష్టమైన వివరాలు వెల్లడించింది.లగేజీ కొలతలు ఇలా..లగేజీకి గరిష్టంగా అనుమతించిన కొలత (పొడవు + వెడల్పు +ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) మించకూడదు. కెమెరాలు, గొడుగులు లేదా బ్రీఫ్‌కేస్ వంటి వ్యక్తిగత వస్తువులకు 185 సెం.మీ (72 అంగుళాలు) వరకు పరిమితి విధించారు. అలా ఉంటేనే లగేజీని సీట్ల కింద లేదా ఓవర్ హెడ్ ర్యాక్‌ల్లో సరిగ్గా స్టోర్ చేయవచ్చని రైల్వే తెలిపింది. రైలు దిగిన తర్వాత కూడా నిర్దిష్ట పరిమాణంలో లగేజీ ఉంటే నడక మార్గాల్లో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశంనిషేధిత వస్తువులురైలు బోగీల్లో తీసుకెళ్లలేని నిషేధిత వస్తువులపై కూడా ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, తుపాకులు, లీకైన ద్రవాలు, ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా రైలు నుంచి వెంటనే తొలగించవచ్చు. లగేజీ ప్యాకింగ్ చేయడానికి ముందు ప్రయాణికులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా స్టేషన్ అధికారులను సంప్రదించాలని భారతీయ రైల్వే సూచించింది.

మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్
జిబ్లీ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సమయంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. యానిమే స్టైల్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.శామ్ ఆల్ట్మాన్ యానిమే స్టైల్ ఫోటో గమనించినట్లయితే.. ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకుని, చేతిలో బ్యాట్ పట్టుకుని.. కళ్ళు బంతిని చూస్తున్నట్లు ఉండటం చూడవచ్చు. మొత్తానికి శామ్ ఆల్ట్మాన్ క్రికెటర్ అవతారమెత్తాడు. ఫోటో షేర్ చేస్తూ.. ''ప్రాంప్ట్: యానిమే స్టైల్లో క్రికెట్ ఆటగాడిగా శామ్ ఆల్ట్మాన్'' అని పేర్కొన్నాడు.శామ్ ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలామందిని ఆకర్శించింది. మీరు ఇండియా తరపున ఆడుతున్నావా?, అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు భారతీయ వినియోగదారులను ఆకర్శించడానికి శామ్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.ఇదీ చదవండి: మారిన రూల్స్.. ఆ టికెట్‌తో ట్రైన్ జర్నీ కుదరదు!భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ప్రపంచాన్ని అధిగమిస్తోందని చెప్పిన కొన్ని గంటల తరువాత ఆల్ట్మాన్ ఈ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా కూడా ఏఐ రంగంలో ఇండియా ప్రాముఖ్యతను శామ్ హైలెట్ చేశారు.Are you playing for India?— RB - The Peace Coach (@rajeshbmore) April 2, 2025
ఫ్యామిలీ

Summer Camps నటన నుంచి నాట్యం వరకు సై అంటున్న యువత
మనిషన్నాక కాస్తంత కళాపోషణుండాలోయ్..లేదంటే మనిషికీ.. గొడ్డుకీ తేడా ఏంటి? అని అలనాటి నటుడు.. రావు గోపాలరావు అన్న మాటలను ఈ తరం యువత చెవికెక్కించుకుందో ఏమోగానీ.. చదువులతో పాటు ఏదో ఓ వృత్తిలోనో, కళలోనో ప్రావీణ్యం పొందుతున్నారు. దీనికి అనుగుణంగానే నగర వాసులు తమ ఆసక్తిని వివిధ రంగాలపై కనబరుస్తున్నారు. ఏదో ఒక కళను నేర్చుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఔత్సాహికులకు విభిన్న కళల్లో శిక్షణ ఇచ్చేందుకు పలు వేదికలు ఏర్పడుతున్నాయి. హస్తకళలు మొదలు, పెయింటింగ్, సంగీతం, నేచురల్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్, డ్యాన్సింగ్ (కూచిపూడి, భరత నాట్యం, వెస్ట్రన్), వివిధ రకాల క్రీడలు, కళల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో చిన్నారులకు, విద్యార్థులకు, యువతకు విభిన్న కళలపై శిక్షణ అందించేందుకు వివిధ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి. పలు ఆర్ట్ స్టూడియోలు ఆర్ట్ క్యాంపెయిన్స్ ప్రారంభించాయి. – సాక్షి, సిటీబ్యూరో కళ ఒక వినూత్న వ్యక్తిత్వానికి నిదర్శనం. కళ సంతృప్తి, సాంత్వనకు ప్రతిబింబం.. కళ ఒత్తిడికి ఒక ఉపశమన మార్గం. కళ అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. ఒకప్పుడు కళలంటే 64 కళలని నిర్వచించే వారు. కానీ ప్రస్తుతం కళకు కాదేదీ అనర్హం అనేలా మారింది. పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్సింగ్, మొదలు పేపర్ క్రాఫ్టింగ్, పాటరీ మేకింగ్, మ్యూజిక్, మ్యాజిక్, ఆర్కిటెక్చర్, రెసిన్ వర్క్స్, సాహిత్యం, ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే వందల కళలు యువతను ఆహ్వానిస్తున్నాయి. సాంస్కృతిక కళలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అధునాతన కళలు, కళాత్మక పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ కళలను కొందరు ట్రెండ్‌గా నేర్చుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్తును కళారంగం వైపు మలచుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కళలను ఆదరించడంలో, ఆస్వాదించడంలో సాంస్కృతిక కళలు, మోడ్రన్ ఆర్ట్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కళా విలాసం.. మొదటి నుంచీ కళలంటే సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక నృతకళలపైనే ఎక్కువ ఆసక్తి చూపించే వారు. అయితే ప్రస్తుతం అవి విలాసవంతమైన కళలుగా మారిపోయాయి. ఈ కళలు నేరి్పంచే వారు, సంస్థలు తక్కువగా ఉండటం.. అదే సమయంలో ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో సంప్రదాయ కళల విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ కళలలో శిక్షణను అందించడానికి నగరం నలుమూలలా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. ఇంటికొచ్చి మరీ నేరి్పంచే వారు కూడా ఉన్నారు. నగర వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనూ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు నెల నుంచి రెండేళ్ల వరకూ శిక్షణను అందించే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలోని రవీంద్రభారతి, శిల్పారామం, శిల్పకళావేదిక, త్యాగరాయ గాన సభ వంటి వేదికలు వీరందరికీ కళా ప్రదర్శనకు వేదికలుగా నిలుస్తున్నాయి. వినూత్న ఆవిష్కరణలు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళల్లోనూ వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా రెసిన్ ఆర్ట్ వర్క్, పాటరీ మేకింగ్, అక్రిలిక్ పెయింటింగ్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, సాల్సా డ్యాన్సింగ్ వంటి కళలకు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఈ తరం యువతకు హస్తకళల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రధానంగా గ్రామీణ, గిరిజన హస్తకళల్లో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం నగరంలోని పలు ఆర్ట్ స్టూడియోలు వారాంతాల్లో, రెండు నెలల కోర్సులుగా వీటిపై శిక్షణ అందిస్తున్నారు. స్టోన్కార్వింగ్, పేపర్ క్రాఫ్ట్, లీఫ్ ఆర్ట్ వంటి వినూత్న కళలకు జై కొడుతున్నారు. మరికొందరు థియేటర్ ఆర్ట్స్ అంటూ సినిమాల వరకూ వెళుతున్నారు. కొందరైతే ఇల్యూజన్ పేరిట విభిన్న కళలకు శ్రీకారం చుడుతున్నారు. ట్రెండ్‌గా ఇంటీరియర్ ఆర్ట్.. ఇంటీరియర్ కళ అన్నా, ఇంటీరియర్ కళాకృతులన్నా ఈ తరానికి ఇష్టం పెరిగింది. ఇందులో భాగంగా కళాకృతులను తయారు చేయడం నేర్చుకోడానికి అమితంగా ఇష్టపడుతున్నారు. ఇంటిని అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేయడంలో మేము శిక్షణ ఇస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాం. అవసరమైన మెటీరియల్ మేమే అందిస్తాం. – ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో కళాకారులదే భవిష్యత్తు.. జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలనుకునే వారు కనీసం ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదిస్తారు. కళాత్మకత అనేది ఒక జీవన విధానం. ఇందులో భాగంగా నేను చెక్కపై కళాకృతులను సృష్టించే ఆర్ట్‌లో ప్రావీణ్యం సాధించాను. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. కాబట్టి అందమైన గ్రామీణ ఇతివృత్తాలను చెక్కుతుంటాను. వీటికి నగరంలో మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో కళతో ప్రయాణం చేసే వారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తుంది. – సాయికుమార్, ప్రముఖ వుడ్ ఆర్టిస్ట్ డిజైనింగ్‌పై ఆసక్తి.. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ట్స్ సైతం ట్రెండ్‌గా మారాయి. మిగతా కళలు ఎలా ఉన్నా ఈ ఫ్యాషన్ సంబంధింత కళలు సంతృప్తితో పాటు వృత్తిపరమైన ఆర్థిక సౌలభ్యాన్ని సైతం అందిస్తుండటం విశేషం. నగరంలోని పలు బొటిక్‌లు, జ్యువెలరీ మేకింగ్ సంస్థలు ఈ ఫ్యాషన్ డిజైనర్లకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. దీంతో డిజైనర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..!
వేసవిలో చర్మ సంరక్షణ, మేకప్ గురించి కొంత ఆందోళన సహజం. ఎండకు చర్మం కమిలిపోవడం, మేకప్ చెదిరిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే ఎస్పిఎఫ్ ఉన్న మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.బయటకు వెళ్లినప్పుడు పట్టిన చెమటను తుడవడానికి టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. చెమట పట్టిన చోట టిష్యూ పేపర్‌ను అద్దితే, త్వరగా పీల్చుకుంటుంది. దీని వల్ల మేకప్ చెదిరి΄ోకుండా ఉంటుంది.మేకప్ తొలగించిన తర్వాత చర్మం విశ్రాంతి పొందడానికి హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. జిడ్డు పోవడానికి కీర, దోస రసం, అలొవెరా జెల్ మాస్క్‌లా వాడి, ఐదు నిమిషాల్లో చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం తాజాగా మారుతుంది.చెమట వల్ల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. సబ్బులకు బదులు బాడీ, ఫేస్ వాష్‌లతో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మంపై గల సూక్ష్మ రంధ్రాలు సహజ నూనెలు కోల్పోవు.ఈ కాలం త్వరగా అలసట వచ్చేస్తుంటుంది. అందుకని, రోజూ పడుకునేముందు కళ్ల కింద అవకాడో లేదా అలొవెరా క్రీమ్ లేదా ఫిష్ ఆయిల్‌తో మృదువుగా వేలి కొనలతో అప్లై చేయాలి. లేదంటే ఐ క్రీమ్ వాడచ్చు. వారంలో రెండు సార్లు పాదాలను స్క్రబ్ చేసి, ఫుట్ క్రీమ్‌ను ఉపయోగించాలి. సంతోషి సౌందర్య నిపుణురాలు(చదవండి: సమ్మర్ ఫ్యాషన్: ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..)

ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..
సరైన ఫిటింగ్‌తో డ్రెస్సింగ్ ఉంటేనే బాగుంటుంది అనేది చాలామందిలో ఉండే ఆలోచన. ప్రస్తుత రోజుల్లో ఎంత వదులైన డ్రెస్ వేసుకుంటే అంత స్టైలిష్‌గా ఉంటాం అనేది అసాధారణ ఆలోచనగా మారింది. ట్యునిక్స్, కుర్తీస్, షర్ట్స్, టాప్స్, ప్రాక్స్.. ఏ మోడల్ డ్రెస్ అయినా వదులుగా ఉండటం వల్ల ఈ వేసవికి తగినట్టు సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. ప్లస్ సైజ్ డ్రెస్సుల్లో ప్లస్ స్టైల్ మార్కులూ కొట్టేయవచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ల డ్రెస్సులు వేసుకొని, వాటిలో మునిగినొతున్నట్టు కనిపించినా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి ఆనందాన్ని ఈ సీజన్లో ఓవర్సైజ్డ్ డ్రెస్సులు ధరించి పొందవచ్చు. చూపరుల నుంచి ‘ఎంత స్టైలిష్‌గా ఉన్నారు...’ అనే కితాబులూ దవచ్చు. పూర్తిగా శరీరం అంతా కప్పేసినట్టుగా ఉన్నా ఈవెంట్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. స్లిమ్‌గా ఉన్నవారు కూడా ఈ సీజన్లో ప్లస్ సైజ్ డ్రెస్సులు వేసుకొని హాయిగా తిరిగేయవచ్చు. ఈ స్టైల్‌ని ఎవరికి వారు వినూత్నంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. వదులైన ట్యునిక్స్ ధరించినప్పుడు నడుము దగ్గర బెల్ట్‌తో ఓ స్టైల్‌ని, ముడి వేసి మరో స్టైల్‌ని సృష్టించవచ్చు. జీన్స్‌కి టాప్‌గా ఉపయోగించే వదులైన షర్ట్స్ ధరించినప్పుడు పూర్తిగా టక్ చేసి లేదా సగం టక్ చేసి స్టైలిష్‌గా కనిపించవచ్చు. స్ట్రీట్ స్టైల్‌ను పోలి ఉండే ఈ డ్రెస్సింగ్‌లో లేయర్డ్ ఔట్‌ఫిట్స్‌ను కూడా ధరించవచ్చు. ఒక ప్రింటెడ్ ట్యునిక్ వేస్తే, దాని మీదకు ట్రాన్స్పరెంట్ ప్లెయిన్ మరో ట్యునిక్ను వేసుకోవచ్చు. లేయర్డ్ లోనూ లూజ్ టాప్స్నే ఎంచుకోవాలి. ఈ తరహా ఔట్ఫిట్స్తోనే స్టైల్‌ను క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఇతరత్రా హంగులేవీ అక్కర్లేదు. సింపుల్ వెస్ట్రన్ జ్యువెలరీ, లూజ్ అండ్ బన్ కేశాలంకరణ్, పాదరక్షల విషయంలో ఫ్లాట్స్ ధరిస్తే చాలు. సీజన్‌కి తగిన సౌకర్యవంతమైన స్టైల్లో మెరిసిపోవచ్చు. వదులుగా ఉంటాయి కాబట్టి సిల్క్, కాటన్, షిఫాన్, ఆర్గంజా... ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. టాప్ టు బాటమ్ ప్లెయిన్, ప్రింట్స్ కూడా బాగుంటాయి. (చదవండి:

న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్‌తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్‌గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ఫొటోలు


చైత్ర నవర్రాతి : పోచమ్మతల్లిని దర్శించుకున్న సమంత బెస్ట్ ఫ్రెండ్ (ఫోటోలు)


సిల్క్ చీరలో బెంగాలీ బ్యూటీలా అనసూయ (ఫొటోలు)


బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సురేఖావాణి కూతురు సుప్రీత..నెక్స్ట్ లెవల్ ఫోటోస్


కుమారుడితో సానియా మీర్జా.. కొత్త భార్యతో షోయబ్ మాలిక్ సెలబ్రేషన్స్ చూశారా? (ఫొటోలు)


రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? పంత్‌కు గోయెంకా క్లాస్? (ఫోటోలు)


బ్లూ శారీలో మెరిసిపోతున్న అనసూయ (ఫోటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే (ఫోటోలు)


Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి


అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు.

పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025

ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

పండగ పూట విషాదం.. బావిలోకి దిగి ఎనిమిది మంది మృతి
భోపాల్: శివపార్వతుల్ని స్మరించుకుంటూ జరుపుకునే సంప్రదాయ పండుగ పర్వదినాన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లాలో చారుగావ్ మఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండావత్ గ్రామంలో 150ఏళ్ల పురాతన బావిని శుభ్రం చేస్తున్న 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు.. రాష్ట్రంలో ప్రతిఏడాది హిందూ సంప్రదాయ పద్దతిలో శివపార్వతులను (Lord Shiva Parvati) స్మరించుకుంటూ గంగోర్ (Gangaur festival) అనే పండుగను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో భక్తులు గంగోర్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పండుగ సంప్రదాయంలో భాగంగా దేవుళ్ల విగ్రహాల్ని గంగాజలంలో నిమజ్జనం చేయాల్సి ఉంది. ఇందుకోసం గ్రామానికి చెందిన అతి పురాతన బావిలో విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరుగా బావిలోకి దిగి ముందుగా బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు గురువారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందులోకి దిగాడు. బావి నుంచి విషవాయివులు వెలువడడంతో ఊపిరాడక బావిలోనే మరణించారు. బావిలోకి దిగిన ఎంత సేపటికీ అతని జాడ తెలియకపోవడంతో అతన్ని రక్షించేందుకు ఒక్కొక్కరుగా బావిలో దిగారు. అలా ఒక్కరి ప్రాణాల్ని రక్షించేందుకు వెళ్లిన మొత్తం ఎనిమిది మంది గ్రామస్తులు మరణించినట్లు ఖాండ్వా కలెక్టర్ రిషవ్ గుప్తా, ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ ప్రకటించారు. నాలుగు గంటల పాటు శ్రమించిబావిలోకి దిగిన గ్రామస్తుల ఆచూకీ గల్లంతు కావడంతో వారిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, ఎసీఆర్ఎఫ్ బృందాలు తరలివచ్చాయి. నాలుగు గంటల పాటు శ్రమించి బావిలోనే ప్రాణాల్ని కోల్పోయిన గ్రామస్తుల్ని ఒక్కొక్కరిగా మొత్తం ఎనిమిదిమంది మృతదేహాల్ని వెలికి తీశాయి. సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతిఈ విషాదంపై సమాచారం అందుకున్న సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. खंडवा जिले अंतर्गत छैगांवमाखन क्षेत्र के कोंडावत गांव में एक दुर्भाग्यपूर्ण घटना में गणगौर विसर्जन के लिए कुएं की सफाई हेतु उतरे एक व्यक्ति के दलदल में फंसने पर बचाने के प्रयास में एक के बाद एक कुएं में उतरे अन्य सात व्यक्ति भी अंदर फंस गए, कुएं में जहरीली गैस से दम घुटने के कारण…— Dr Mohan Yadav (@DrMohanYadav51) April 3, 2025 బాధితుల గుర్తింపుబావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది మృతుల వివరాల్ని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35),మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.మరణానికి గల కారణంవిషాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బావి లోపల కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి వాయువులు పేరుకుపోవడం వల్ల విషపూరిత పొగలు వచ్చి ఉండవచ్చని వైద్యులు అంచనా వేశారు. సరైన భద్రతా చర్యలు లేకుండా బావులు, సెప్టిక్ ట్యాంకులు వంటి ప్రదేశాల్లో దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాంజిల్లా యంత్రాంగం ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. మరణాలకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తూనే, మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.

వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్‌సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్‌లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు. విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్‌సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు.

25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు. ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకు నేందుకు డబ్ల్యూబీఎస్ఎస్సీ చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన, ధ్రువీకరణ అసాధ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవకత వకల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా మారిందని నమ్ముతున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఈ తీర్పును అంగీకరించబోనంటూనే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానంటూ ప్రకటించారు.

ఆన్లైన్లో సుప్రీం జడ్జీల ఆస్తుల వివరాలు
న్యూఢిల్లీ: పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర, చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. గురువారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని 30 మంది జడ్జీలు ఆస్తులను ప్రకటించనున్నారు. అయితే, ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్సైట్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ, ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సముపార్జన జరిగినప్పుడు గానీ ఆ వివరాలను బహిర్గతం తెలియజేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించిందని వెబ్సైట్ తెలిపింది.
ఎన్ఆర్ఐ

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు.

ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి

బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే. వివరాల్లోకి వెళితే.. 10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు. నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్ నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు.

100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు.
వీడియోలు


ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్నిప్రమాదం


ప్రపంచం నెత్తిన ట్రంప్ బాంబు ఇక కోలుకోలేమా..!


L2: ఎంపురన్ చిత్ర నిర్మాత ఆఫీసుల్లో ఈడీ సోదాలు


వక్ఫ్ సవరణ బిల్లుపై న్యాయ పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్


రౌడీ మూకలతో మంత్రి నిమ్మల ఫ్యాక్షన్ పాలిటిక్స్


ఫార్మా స్టూడెంట్ నాగాంజలి మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు


మహమ్మద్ యూనస్ తో ప్రధాని మోదీ భేటీ


జై వర్మ.. జై జై వర్మ.. నాగబాబుకు నిరసన సెగ


జాక్ ట్రైలర్ బీభత్సం..


అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రియాంక చోప్రా