
టాలీవుడ్ నటి అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 16న ఈ వేడుక ఘనంగా జరిగింది.

మార్చి 9న నిశ్చితార్థం చేసుకున్న అభినయ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.

తాజాగా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.

ఈ రిసెప్షన్ వేడుకలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.



