Arrangement
-
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది పోలీస్ సిబ్బందిని నిమజ్జన బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోనే 25వేల మంది విధుల్లో ఉంటారని తెలిపా రు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో .. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా 1,06,145 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసి, మే 13న ఓటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆయన శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల కోసం వినియోగిస్తే ఈ ఎన్నికల్లో 295 కంపెనీలకు చెందిన 26,550 మంది సాయుధుల్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పురుషులు, మహిళలు, వృద్ధులు/దివ్యాంగులకు మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులతో నియంత్రించనున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 82 నుంచి 83 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీస్థాయిలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు తొలగించడంతో పాటు కొత్తగా తొలిసారి ఓటువేస్తున్న వారు పదిలక్షల మందికిపైగా ఉండటంతో పోలింగ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల వరకు ఓటరుకు తప్ప మిగిలిన వారికి ప్రవేశంఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడానికి సహకరించడానికి ఒక సహాయకుడిని ఒకసారి మాత్రమే అనుమతిస్తామన్నారు. 11 గంటల పాటు పోలింగ్ రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో.. ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అంటే 11 గంటలపాటు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు తెలిపారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నక్సలైట్ల ప్రభావం ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగుగంటల వరకు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించారు. పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రానికే పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని చెప్పారు. సోమవారం ఉదయం ఐదుగంటల నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు చేసి ఏడుగంటలకు ఓటింగ్ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో 90 నిమిషాలు మాక్ పోలింగ్ నిర్వహించి సీల్‌వేసిన అనంతరం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ముగ్గురు ఏజెంట్లకు అనుమతి ఇస్తామని, కానీ పోలింగ్ స్టేషన్లోకి ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పోలింగ్ స్టేషన్లోకి సెల్ఫోన్లు, మారణాయుధాలు అనుమతించరని తెలిపారు. సెల్ఫోన్లు తీసుకొస్తే వాటిని బయటే వదిలి లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.269 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్‌చేసినట్లు తెలిపారు. దీన్లో నగదు రూ.71 కోట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అమల్లోకి 144వ సెక్షన్శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ కొనసాగుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అయిదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదని, ఎటువంటి రాజకీయ ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. కానీ రాజకీయ పార్టీ లు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిన ప్రకటనలు పత్రికల్లో ఇవ్వడానికి అనుమతిస్తామన్నారు. ఇకనుంచి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న చివరిదశ ఎన్నికలు ముగిసేవరకు ప్రచారం చేయకూడదని చెప్పారు -
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
-
ఏలూరులో యువభేరికి అన్ని ఏర్పాట్లు పూర్తి
-
ఎనీ టైం మనీ..
అమరావతి (పట్నంబజారు) : పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆయా బ్యాంకుల అధికారులు మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల్లో జనరేటర్ సహాయంతో వీటిని నడిపిస్తున్నారు. పుష్కర ఘాట్లకు అతి సమీపంలోనే మొబైల్ ఏటీఎంలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 12 రోజుల పాటు సేవలందిస్తామని అధికారులు తెలిపారు. -
శివోహం..
దాచేపల్లి మండలంలోని కాట్రపాడు పుష్కర ఘాట్‌లో శివుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మండలానికి చెందిన డాక్టర్ కనుమూరి విక్రాంత్, గురజాలకు చెందిన డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ సుమారు రూ.4 లక్షల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. తొమ్మిది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ విగ్రహాన్ని రాజమండ్రికి చెందిన శిల్పులు వనమాటి సురేష్‌కుమార్, వనమాటి రాజు నేతత్వంలో రూపొందిస్తున్నారు. ఘాట్ వద్ద ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారింది. – దాచేపల్లి -
పుష్కరాలకు సర్వం సిద్ధం
మేజర్ ఘాట్లు 14 14 పుష్కర నగర్ల ఏర్పాటు భక్తుల భద్రతకు ప్రాధాన్యం కలెక్టర్ కాంతిలాల్ దండే వెల్లడి విజయపురిసౌత్ : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలో 72 ఘాట్లను సిద్ధంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. మంగళవారం అనుపు, కృష్ణవేణి, దేశాలమ్మ పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 14 మేజరు ఘాట్లు ఉన్నట్టు చెప్పారు. వాటిలో పల్నాడు ప్రాంతంలోని కృష్ణవేణి, సత్రశాల, దైద, పొందుగల ఘాట్లు ఉన్నాయన్నారు. మొత్తం 14 పుష్కర్నగర్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలో రోజుకు 9 నుంచి 10 లక్షల మంది పుష్కర భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రావచ్చన్నారు. అన్ని ఘాట్ల వద్ద భక్తుల భద్రతే ప్రధానంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పుష్కర భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీవో మురళి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, ఏసుబాబు తదితరులు ఉన్నారు. -
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
మహానంది: పుష్కరాల సందర్భంగా సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని సంగమేశ్వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కమలాకర్ తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహానంది క్షేత్రం నుంచి ప్రసాదాల నిమిత్తం అందించాల్సిన చెక్కు కోసం ఆయన సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సంగమేశ్వరంలో పిండప్రదానాలు, ఇతర పూజాధికాలకు 97 మంది అర్చకులు ఉంటారన్నారు. కపిలేశ్వరం వద్ద వాహనాలను పార్కింగ్ ఉంటుందని, అక్కడి నుంచి ఘాట్ల వరకు 60 సెట్విన్ బస్సులను ఉచితంగా నడుపుతారన్నారు. సంగమేశ్వరంలో రెండు ఫుడ్‌కోర్టులు, ఆత్మకూరులో ఒక ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్నారన్నారు. భక్తులకు సేవలందించేందుకు 500 మంది వలంటీర్లు ఉంటారని, దేవాదాయశాఖ నుంచి వివిధ కేడర్లలో ఉన్న 51 మంది సిబ్బంది వస్తారన్నారు. ఆలయం ఆధ్వర్యంలో పది వీల్చెయిర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. -
మార్గసూచికలు ఏర్పాటు
తాడేపల్లి రూరల్ : సీతానగరం పుష్కర ఘాట్లకు విచ్చేసే భక్తుల సమాచారం కోసం తాడేపల్లి మునిసిపల్ అధికారులు సోమవారం వివిధ ప్రాంతాల్లో మార్గ సూచికలను ఏర్పాటు చేశారు. పుష్కర నగర్ల నుంచి సీతానగరం ఘాట్లకు వచ్చే మార్గాలను సూచిస్తూ వంద బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే పుష్కర ఘాట్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సూచిక బోర్డులను కూడా రహదార్ల వెంట, ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. -
ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లి రూరల్) : పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కృష్ణానది రిటైనింగ్ వాల్‌కు సమాంతరంగా ఆదివారం బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు 800 మీటర్ల పొడవున్న ఈ ప్రహరీకి ఆనుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కొండ వైపు, పుష్కర ఘాట్ల వరకు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో కూడా లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. -
వాచ్టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లిరూరల్): మండలంలోని సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో నిరంతర పర్యవేక్షణ కోసం మంగళవారం నిఘాకు టవర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ మాట్లాడుతూ సీతానగరంలో 450 మీటర్ల పొడవు ఉన్న పుష్కర ‡ఘాట్లను బైనాక్యులర్ ద్వారా పర్యవేక్షించేందుకు అయ్యప్పస్వామి దేవాలయంపై భాగంలో, గాంధీ బొమ్మ వెనుక ఉన్న భవనంపై, పాత రైల్వే బ్రిడ్జి టవర్‌పై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్‌ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్ల వల్ల పోలీసు శాఖకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరనగర్లలో, పోలీసు స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్స్‌కు సిగ్నల్స్ అందడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. -
సీఎం నివాసంలో వైఫై ఏర్పాటు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): కృష్ణాతీరంలోని ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సోమవారం అధికారులు ప్రసార సాధనాలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ ఫోన్, ఇంటర్ నెట్, వైఫై ప్యాకేజీకి సంబంధించిన సేవలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు సుమారు కిలోమీటరు మేర ఫైబర్ కేబుల్ సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం కేబుల్‌తోపాటు అవసరమైన కమ్యూనికేషన్ యంత్రాలు అమర్చేందుకు పది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. -
బస్ డిపో ఏర్పాటయ్యేనా?
భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు హామీలకే పరి మితమైంది. డివిజన్‌కు పొరుగునే రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. డివిజన్ మొత్తంలో ఒక యాదగిరిగుట్టలోనే బస్‌డిపో ఉంది. ఇక్కడా సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేటికీ బ స్సులు వెళ్లని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలకు ఉదయం, సాయంత్రం వేళ ల్లో మాత్రమే బస్ సౌకర్యం ఉండటంతో ప్రజలకు ఎదురుచూ పు తప్పడం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ విఫలం కావడంతో అధిక శాతం ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. యాదగిరిగుట్ట డిపోలో 101 బస్సులు భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. అమలుకు నోచని గత ప్రభుత్వ హామీ భువనగిరి డివిజన్ కేంద్రం హెచ్ఎండీఏ పరిధిలోకి రావడంతో సబర్బన్ బస్సులను భువనగిరి వరకు పొడిగిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు జరుగలేదు. భువనగిరిలో ఎప్పటినుంచో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఆమోదం పొందని నివేదిక ప్రయాణికుల, ప్రాంత పరిస్థితిని బట్టి భువనగిరిలో పట్టణ డిపో ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కానీ ఇంతవరకు నివేదిక ఆమోదం పొందలేకపోయింది. భువనగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే హైదరాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మో త్కూరు, వలిగొండ సెక్టార్లకు బస్సులను పూర్తి స్థాయిలో నడపవచ్చు. బస్ డిపో ఏర్పాటు కాకపోవడానికి ఆ శాఖ అధికారులు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవ చూపక పోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలైనా భువనగిరిలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పోచంపల్లి, మోత్కూరులో బస్ డిపోల ఏర్పాటుకు చర్యలేవీ? హైదరాబాద్ నగర శివారులో ఉన్న భూదాన్‌పోచంపల్లి, రూరల్ మండలం మోత్కూరులో ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పాటు చేస్తామని తయారు చేసిన ప్ర తిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ రెండు ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయడానికి అధికారులు భూమి సర్వే కూడా చేశారు. పోచంపల్లిలో స్థల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించగా ఒక దా త రెండెకరాల స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అయినా అధికారులు డిపో ఏర్పాటుకు చర్యలు ప్రా రంభించలేదు. మోత్కురులో బస్ డిపో ఏర్పాటుకు దాత ఐదెకరాల స్థలం ఇచ్చారు. డిపో ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. నరకం చూస్తున్నాం డివిజన్ కేంద్రమైన భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలి. బస్‌ల సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో నిలబడి ప్రయాణిస్తున్నాం. ఇక్కడ డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌కు వెళ్లి రావాలంటే నరకం చూస్తున్నాం. - బాల్‌రాజ్, భువనగిరి -
ఆకులో ఆకునై...
పచ్చదనం నుంచి పసుపు వర్ణం పులుముకున్న ఆకులు కొన్ని... సింధూరం రంగు నింపుకున్న పత్రరాజాలు మరికొన్ని. నారింజలా నయనాలకు కనువిందుచేసే దళాలు ఇంకొన్ని. పచ్చగా ఉన్నప్పుడే కాదు, వాడిపోయి, వడలిపోయి, ఎండిపోయిన విభిన్న రకాల ఆకులను సేకరించి ఇంటి అలంకరణలో ఉపయోగించడమంటే ప్రకృతికి మనసులో పెద్ద పీట వేసినట్టే! తక్కువ ఖర్చుతో అద్భుతమైన పర్యావరణ సౌందర్యాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలంటే ఆకులను మించిన అలంకరణ మరేదీ లేదని ఈ కింది చిత్తరువులను చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ఉడెన్ ఫ్రేమ్ ఉన్న పాత అద్దాల కిటికీ తలుపును తీసుకొని, ఆకులను అతికించే వైపు బూడిదరంగు పెయింట్‌ను పై భాగాన, ఆకుపచ్చని పెయింట్‌ను కింది భాగాన స్ప్రే చేయాలి. ఫ్రేమ్ భాగంలో ఆకుల కాడలను టేపుతో అతికించాలి. ఆకులు అద్దంలో నుంచి వేలాడుతున్నట్టుగా కనిపించేలా అమర్చితే చూడముచ్చటైన వాల్ ఫ్రేమ్ రెడీ అయినట్టే! (ఫొటోలో చూపిన విధంగా) రాలి, వాడిపోయిన కాడలున్న ఆకులను తీసి, బరువైన పెద్ద పుస్తకం మధ్యలో ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఆ ఆకులను తీయాలి. ఎండిన ఆకులకు నచ్చిన పెయింట్ వేసి, శాటిన్ రిబ్బన్‌కు (తోరణంలా) అతికించాలి. ఆకుల తోరణాన్ని డోర్, విండో భాగాన అమర్చితే అందంగా కనిపిస్తుంది. రెండు సన్నని పొడవైన కర్రపుల్లలను ప్లస్ (+) ఆకారంలో పెట్టి, మధ్యలో దారంతో కట్టాలి. రంగురంగుల ఎండిన ఆకులను గుచ్చి, కిందిభాగంలో పూసలు లేదా గంటలు కట్టి, వేలాడదీయాలి. ఈ హ్యాంగర్‌ని కిటికీ దగ్గర వేలాడదీస్తే గాలికి కదులుతూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకు డిజైన్ల కోసం ఓ కొత్త ఆలోచన. పాత మ్యాగజీన్ గ్లాసీ పేపర్‌పైన లేదా అందమైన మందపు వస్త్రం పైన ఆకును పెట్టి ఆ షేప్ వచ్చేలా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత నచ్చిన రీతిలో ఆ కృత్రిమ ఆకును మరికొన్ని ఆకులతో కలిపి అలంకరించుకోవచ్చు. పార్టిషన్ కోసం ఈ రోజుల్లో పెద్ద మిర్రర్స్‌ని వాడుతున్నారు. ప్లెయిన్‌గా ఉండే అద్దాలు అలంకరణప్రాయంగా ఉండవు. అందుకని ఎండిన రకరకాల ఆకులను పార్టిషన్ మిర్రర్‌కు (ఫొటోలో చూపిన విధంగా) అతికిస్తే ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. -
గ్రంథాలయం ఏర్పాటుకు నిధులిస్తాం
రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: పైడిభీమవరం పంచాయతీలో గ్రంథాలయం ఏర్పాటుకు శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సం ఘం ముందుకొచ్చింది. గ్రామంలో గురువారం సాక్షి జనసభ జరిగింది. ఇందులో బావిశెట్టి మధుసూదనరావుతో పాటు మరి కొంతమంది యువకులు గ్రామంలో గ్రంథాల యం లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయూరు. దీనిపై స్థానిక శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పందించారు. పంచాయతీ తరఫున స్థలం మంజూరు చేస్తే గ్రంథాలయం ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని సంఘ ప్రతినిధి కె.కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ మేరకు లేఖను సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్‌కు అందించారు. గ్రంథాలయంతోపాటు నిరుద్యోగ యువకులకు శిక్షణకేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిప్పళ్ల వెంకటరమణతో పాటు ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ఠాణేలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు
ముంబై: ఠాణే ప్రాంతంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో పెరిగిన నేరాలు, ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం శాంతిభద్రతలు, న్యాయ వ్యవస్థలను పటిష్ట పర్చడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు అనుమతి కోరింది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కోర్టు పనిచేసే విధంగా అనుమతి మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో కోరింది. పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలకు హైకోర్టు తన ఆమోదం తెలిపింది. ఈ ప్రత్యేక కోర్టులో 13 మంది సిబ్బంది నియామకానికి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కోర్టుకు అదనపు జిల్లా జడ్జి హోదా గల న్యాయాధికారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జడ్జికి నివాసం ఏర్పాటు చేయాల్సిందిగా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌కు సూచిం చింది. ఇలాంటి ప్రత్యేక కోర్టులు మరిన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సచివాలయ అధికారులు తెలిపారు. ఠాణే పట్టణం చుట్టుపట్ల వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, ఫలితంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. -
తెలంగాణ ఏర్పాటు మైలురాయి : విద్యాసాగర్
జగిత్యాల, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని, ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా.. మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. 60 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్షంగా తాము పూర్తి స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి మాటమార్చుతున్న పార్టీలతో వచ్చే ఇబ్బందులేమీ లేవన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టంగా చెబుతున్నా.. అడ్డుకునేందుకు ప్రయత్నించడం అవివేకమన్నారు. అసెంబ్లీ తీర్మానంతో లింక్ పెట్టకుండా ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీఫ్ కుమార్, మోరపల్లి సత్యనారాయణ, బైరినేని అజిత్ కుమార్‌లు ఇతర నాయకులు