
బస్ డిపో ఏర్పాటయ్యేనా?
భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు హామీలకే పరి మితమైంది. డివిజన్‌కు పొరుగునే రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. డివిజన్ మొత్తంలో ఒక యాదగిరిగుట్టలోనే బస్‌డిపో ఉంది.
భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు హామీలకే పరి మితమైంది. డివిజన్‌కు పొరుగునే రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. డివిజన్ మొత్తంలో ఒక యాదగిరిగుట్టలోనే బస్‌డిపో ఉంది. ఇక్కడా సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేటికీ బ స్సులు వెళ్లని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలకు ఉదయం, సాయంత్రం వేళ ల్లో మాత్రమే బస్ సౌకర్యం ఉండటంతో ప్రజలకు ఎదురుచూ పు తప్పడం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ విఫలం కావడంతో అధిక శాతం ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
యాదగిరిగుట్ట డిపోలో 101 బస్సులు
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
అమలుకు నోచని గత ప్రభుత్వ హామీ
భువనగిరి డివిజన్ కేంద్రం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావడంతో సబర్బన్ బస్సులను భువనగిరి వరకు పొడిగిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు జరుగలేదు. భువనగిరిలో ఎప్పటినుంచో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి.
ఆమోదం పొందని నివేదిక
ప్రయాణికుల, ప్రాంత పరిస్థితిని బట్టి భువనగిరిలో పట్టణ డిపో ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కానీ ఇంతవరకు నివేదిక ఆమోదం పొందలేకపోయింది. భువనగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే హైదరాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మో త్కూరు, వలిగొండ సెక్టార్లకు బస్సులను పూర్తి స్థాయిలో నడపవచ్చు. బస్ డిపో ఏర్పాటు కాకపోవడానికి ఆ శాఖ అధికారులు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవ చూపక పోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలైనా భువనగిరిలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పోచంపల్లి, మోత్కూరులో
బస్ డిపోల ఏర్పాటుకు చర్యలేవీ?
హైదరాబాద్ నగర శివారులో ఉన్న భూదాన్‌పోచంపల్లి, రూరల్ మండలం మోత్కూరులో ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పాటు చేస్తామని తయారు చేసిన ప్ర తిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ రెండు ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయడానికి అధికారులు భూమి సర్వే కూడా చేశారు. పోచంపల్లిలో స్థల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించగా ఒక దా త రెండెకరాల స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అయినా అధికారులు డిపో ఏర్పాటుకు చర్యలు ప్రా రంభించలేదు. మోత్కురులో బస్ డిపో ఏర్పాటుకు దాత ఐదెకరాల స్థలం ఇచ్చారు. డిపో ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
నరకం చూస్తున్నాం
డివిజన్ కేంద్రమైన భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలి. బస్‌ల సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో నిలబడి ప్రయాణిస్తున్నాం. ఇక్కడ డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌కు వెళ్లి రావాలంటే నరకం చూస్తున్నాం.
- బాల్‌రాజ్, భువనగిరి