borrowed
-
ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్‌తో జంప్..!
మొబైల్ ఇస్తారా ఒకసారి ఫోన్ చేసుకుంటామని కొందరు, మరికొందరు తమ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.. అర్జంటుగా బంధువులకు కాల్ చేసుకోవాలని చాలామంది మొబైల్ తీసుకుంటారు కదా. పాపం అని మనం కూడా చాలాసార్లు సాయం చేస్తుంటాం కూడా అయితే ఈ స్టోరీ చదివాక మరోసారి అలా ఇవ్వడానికి భయపడతారు. విషయం ఏమిటంటే..!దారిన వెళ్లే ఓ వ్యక్తిని ఆపి ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నరేష్ రసైలి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–9లోని నెట్వర్కింగ్ బిల్డింగ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు 13వ తేదీన తెల్లవారుజామున 5.20 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటిబాట పట్టాడు. వెంకటగిరి నుంచి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై అతని వద్దకు వచ్చి తమ మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసిందని, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తే చేసుకుని ఇస్తామని నమ్మబలికారు. దీంతో నరేష్ తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న ఆగంతకులు ఫోన్ చేసినట్లుగా నటించి బైక్‌పై ఉడాయించారు. ఈ సమయంలోనే బైక్‌పై వెనుక కూర్చొన్న ఆగంతకుడు నరేష్ జట్టు పట్టుకొని 5 మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన నరేష్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నోట్ : నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ అనామకులు, కేటుగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.! ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! వివాహిత అదృశ్యం వెంగళరావునగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... బీదర్‌కు చెందిన ప్రకాశ్, రేష్మ దంపతులు ఎస్పీఆర్హిల్స్లో ఉంటారు. రేష్మ దుర్గంచెరువు ప్రాంతంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంది. ఈ నెల 10న ప్రకాశ్ కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లగా భార్య విధులకు వెళ్లున్నట్టుగా చెప్పి బట్టలు సర్దుకుని వెళ్లింది. దాంతో ప్రకాశ్‌కు తన పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి దుస్తులు సర్దుకుని వెళ్లినట్టు తెలియజేసింది. అతను వచ్చి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ప్రయోజనం లేదు. ఇదిలా ఉండగా తన భార్య తరచూ భాస్కర్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ సోమవారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కింగ్ లాంటి మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది!
Elon Musk Borrowed: ప్రపంచ కుబేరుడు, అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పరిచయం అక్కరలేదు. పలు బిజినెస్‌లతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగాడు. ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎప్పుడూ ఇబ్బందులు ఎదర్కోలేదు. వాటిని విజయవంతంగా నిర్వహించాడు. కానీ ట్విటర్ (Twitter) (ఇప్పుడు ‘ఎక్స్’) మాత్రం మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది! (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పేందుకు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ కొనుగోలు సమయంలో తనకు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ (SpaceX) నుంచి 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం వెలువరించింది. ట్విటర్ కోసమేనా.. స్పేస్ఎక్స్ గత అక్టోబర్‌లో ఎలాన్ మస్క్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించగా ఆ మొత్తాన్ని మస్క్ అదే నెలలో డ్రా చేశారని కొన్ని పత్రాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా అదే అక్టోబర్ నెలలో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ కొనుగోలు మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని తెలిపింది. కాగా స్పేస్ఎక్స్లో మస్క్‌కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, దాదాపు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌లో దాఖలు చేసిన నివేదికను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. -
ఆన్లైన్లో అప్పు తీసుకున్న ఉగ్రవాదులు
కాలిఫోర్నియా: అమెరికాలో కాల్పులకు పాల్పడి 14 మందిని కాల్చిచంపిన ఉగ్రవాద దంపతులు దాడులకు రెండు వారాల ముందుగా ఆన్లైన్లో అప్పు తీసుకున్నారు. ఆన్లైన్ రుణాలు మంజూరు చేసే ఓ సంస్థ ద్వారా సుమారు 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. అయితే ఈ డబ్బును ఉగ్రవాద చర్యల కోసం వినియోగించినట్లు సమాచారం లేదు. డబ్బు తీసుకుని ఉగ్రవాది రిజ్వాన్ ఫరూక్ తన బ్యాంకు ఖాతాలో జమచేసుకున్న తరువాత దంపతులు ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు. అయితే భవిష్యత్తు అవసరాలకోసం ఈ మొత్తాన్ని తీసుకున్నారా లేక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికే తీసుకున్నారా అనే విషయంపై విచారణ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.