ఆన్లైన్లో అప్పు తీసుకున్న ఉగ్రవాదులు
కాలిఫోర్నియా: అమెరికాలో కాల్పులకు పాల్పడి 14 మందిని కాల్చిచంపిన ఉగ్రవాద దంపతులు దాడులకు రెండు వారాల ముందుగా ఆన్లైన్లో అప్పు తీసుకున్నారు. ఆన్లైన్ రుణాలు మంజూరు చేసే ఓ సంస్థ ద్వారా సుమారు 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది.
అయితే ఈ డబ్బును ఉగ్రవాద చర్యల కోసం వినియోగించినట్లు సమాచారం లేదు. డబ్బు తీసుకుని ఉగ్రవాది రిజ్వాన్ ఫరూక్ తన బ్యాంకు ఖాతాలో జమచేసుకున్న తరువాత దంపతులు ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు. అయితే భవిష్యత్తు అవసరాలకోసం ఈ మొత్తాన్ని తీసుకున్నారా లేక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికే తీసుకున్నారా అనే విషయంపై విచారణ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.