Death Claims
-
పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు. -
కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా & పెట్టుబడి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల పేర్కొంది. పాలసీదారులకు వారి మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎల్ఐసీ కార్యాలయంలో జమ చేయడానికి అనుమతించింది. అయితే చాలామంది కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. గతంలోనే దీనిపై లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇతర మరణాలతో పాటు కోవిడ్ 19తో చనిపోయినా ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుంది అని ప్రకటించింది. అంటే మృతుల కుటుంబ సభ్యులలోని నామినీ ఎల్ఐసీ పాలసీ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అని గతంలోనే ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఇలాంటి విపత్కర సమయంలో మీకు, మీ ప్రీయమైనవారికి అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే విధానంలో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్ 19 కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు అదే పద్ధతిలో పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. గత ఏడాది కూడా, వైరస్ వ్యాప్తి కారణంగా ఎల్ఐసీ పెద్ద సంఖ్యలో డెత్ క్లెయిమ్స్ ను విజయవంతంగా పరిష్కరించింది. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా మరణిస్తే, ఎల్ఐసీ పాలసీలో మరణించిన వ్యక్తి పేర్కొన్న నామినీ డెత్ క్లెయిమ్ సమాచారం, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ కాపీని మీ సమీప బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలి. కరోనా కారణంగా మీ దగ్గరలోని సమీప శాఖ పనిచేయకపోతే నామినీలు డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ యొక్క కాపీని ఎల్ఐసీ నోడల్ వ్యక్తికి ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే, మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని సంప్రదించొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో మీకు సహకరిస్తారు. "కరోనా వైరస్ మహమ్మారి నిబందనల ప్రకారం ఎల్ఐసీ బ్రాంచ్‌లు, ప్రీమియం పాయింట్స్, కాల్ సెంటర్లు పాక్షికంగా సేవలు అందిస్తాయి. ఆన్లైన్ సేవలు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి" అని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని యాప్ -
ఇపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వాడుకలో లేని పీఎఫ్ ఖాతాల నిధులకు సైతం వడ్డీ చెల్లించేందుకు యోచిస్తున్నామని ప్రకటించిన సంస్థ తాజాగా ఉద్యోగుల సంక్షేమం కోసం మరో కీలక అడుగు వేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు చనిపోయిన వారం రోజుల్లోపు వారి క్లెయిములను పూర్తి చేసేందుకు, అలాగే ఒక కార్మికుడు ఉద్యోగం నుంచి వైదొలగే ముందే పీఎఫ్ సమస్యల్ని పరిష్కరించేలా కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసినట్టు చెప్పారు. సత్వరమే చర్యలు తీసుకునేలా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ 64 వ వ్యవస్థాపక ఉత్సవాలను జరుపుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దత్తాత్రేయ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. అలాగే సంస్థ చేపట్టిన సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన మంత్రి అక్టోబర్ 25, 2016 న కామన్ సేవా కేంద్రాల (సీఎస్ సీ) ఇ-గవర్నెన్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే ఈపీఎఫ్ చందాదారులకు కోసం ఒక గృహ పథకం ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసిన 50 లక్షలమంది పెన్షనర్లను జీవన్ ప్రమాణ పత్రాలతో గౌరవించనున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు.