Private dairies
-
పాడి రైతుకు దగా
సాక్షి, అమరావతి/నెట్వర్క్ పాడి రైతు చితికిపోతున్నాడు. ఓ వైపు దాణా ధరలు చుక్కలనంటుతుంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి. పశు పోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డెయిరీలు తగ్గించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర.. చెల్లించిందే రొక్కం.. అన్నట్టుగా తయారైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డెయిరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరకొరగా సేకరించడంతోపాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకు ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. నాడు అమూల్‌తో పాల విప్లవం.. వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో 2020 అక్టోబర్‌లో జగనన్న పాల వెల్లువ (అమూల్) కేంద్రాలను ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాలసేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేసేది. ప్రారంభంలో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్‌కు రూ.71.47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ధర పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లించేది. 40 నెలల్లో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ (జగనన్న పాల వెల్లువ) ప్రాజెక్టు కింద అమూల్‌కు పాలుపోసే రైతులకు రూ.97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్‌తో పోటీని తట్టుకోలేక పాల సేకరణ ధరలు పెంచడం వల్ల ప్రెవేటు డెయిరీలకు పాలుపోసే రైతులకు రూ.4,911 కోట్ల మేర అదనంగా లబ్ధి కలిగింది. మరో వైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి అణాపైసలతో సహా లెక్కగట్టి పది రోజులకోసారి నేరుగా వారి ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్టంగా ధర లభించింది. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనమనే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. అయినప్పటికీ ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10–20 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది. నేడు పాడి రైతుల నిలువు దోపిడీ ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాలసేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాలసేకరణ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో కేవలం ఐదారు వందల గ్రామాల్లో నామమాత్రంగా పాలసేకరణ చేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రోజుకు 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా, ఈ ఏడాది కేవలం 50–60 వేల లీటర్లకు మించి సేకరించలేని దుస్థితి ఏర్పడింది. గతంలో మంచి ధర లభించడంతో అమూల్‌కు పాలు పోసే ప్రతి ముగ్గురిలో ఒక పాడి రైతు 2–3 ఆవులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పాల సేకరణ ధరలు పడిపోవడంతో రైతులు ఆవులను అమ్ముకుంటున్నారు. ఇదేసాకుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు లీటర్‌కు రూ.15–40 మేర తగ్గించేయడంతో పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–300 వరకు నష్టపోతున్నాడు. రాయలసీమ, ఇటీవల ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వారు రోజు10 లీటర్లు పాలు పొసే రైతు నుంచి ఒక లీటర్, ఐదు లీటర్లు పాలు పొసే రైతుకు అరలీటర్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు. రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. మరొక వైపు రిటైల్ మార్కెట్లో పాల విక్రయ ధరలు ప్రైవేటు డెయిరీలు ఇష్టమొచ్చినట్టుగా పెంచేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. అర లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్‌తో రూ.32–37, రిచ్ గోల్డ్ పాలు రూ.30–32, గోల్డ్ పాలు రూ.28–30 చొప్పున విక్రయిస్తూ దోపిడీకి గురిచేస్తున్నాయి. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు తయారైంది పాల ధర. దీనివల్ల అటు పాడి రైతూ లాభ పడటం లేదు. ఇటు ప్రజలకూ మేలు జరగడం లేదు. మధ్యలో ప్రైవేట్ డెయిరీలు మాత్రం ఇష్టానుసారం దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పైగా రైతులకు అండగా నిలిచిన అమూల్ డెయిరీని తరిమేస్తూ ప్రైవేట్ డెయిరీ దందాను ప్రోత్సహిస్తోంది. పాలకు ధర లేదు అమూల్ డెయిరీ పాల సేకరణను ఆపేయించడంతో ధరలు లేకుండా పోయాయి. దీంతో మాకున్న ఆవుల్లో సగానికిపైగా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పాల ధర లీటర్‌పై రూ.15 నుంచి 20 వరకు తగ్గించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయండి.. లేదంటే మానుకోండి.. అంటున్నారు. చేసేదీ ఏమీ లేకు ఆవులను అమ్ముకుంటున్నాం. – విమల, కురవపల్లి, చిత్తూరు జిల్లారైతుల పొట్ట కొడుతున్నారు అమూల్ డెయిరీ ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలన్నీ గిట్టుబాటు ధర చెల్లించేవి. కూటమి ప్రభుత్వం రావడంతో కక్ష కట్టి అమూల్ కేంద్రాలను సాగనంపుతోంది. సహాయ నిరాకరణ చేస్తోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పోటీ లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమూల్ డెయిరీకి పాలు పోసేటప్పుడు లీటర్ ఆవు పాలకు రూ.40–45 వచ్చింది. కానీ విధి లేని పరిస్థితిలో ప్రైవేటు డెయిరీలకు తక్కువ ధరకు పాలు పోయాల్సి వస్తోంది. – అచ్చమ్మ, అంగళ్లు,, అన్నమయ్య జిల్లా ఇష్టానుసారం కొనుగోలుప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ పాలు కొనుగోలు చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ వరకు లీటరు ధర రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.70–75తో కొనుగోలు చేస్తున్నారు. హెరిటేజ్, శ్రీనివాస డెయిరీలు వారి ఇష్టం కొద్దీ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ధర నిర్ణయించి అమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. – శ్రీనివాసులు, రైతు నగరం, నంద్యాల బయటి వాళ్లకు విక్రయిస్తున్నా నాకు మూడు పాడి గేదెలున్నాయి. రెండు పూటలా 16 లీటర్ల పాలిస్తాయి. పాలలో వెన్నశాతం తక్కువగా వస్తోందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలకు 5 లీటర్లు, బయటి వారికి 10 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. బయటి వారు లీటర్‌కు రూ.50 ఇస్తుంటే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.32–34 ఇస్తున్నారు. – వావిలపల్లి హరిబాబు, ధవుమంతపురం, మన్యం జిల్లా గతంలో లీటర్‌కు రూ.69..ఆవు పాల ధర తగ్గించారు. గతంలో లీటర్‌కు రూ.69 వరకు ఇచ్చేవారు. విశాఖ డెయిరీ లీటర్‌కు రూ.3–5 తగ్గించేసింది. పాడి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక బయటి వాళ్లకు అమ్ముకుంటున్నాం. – పి.వెంకటరావు, యలమంచలి, అనకాపల్లి జిల్లా -
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్'!
రోజుకు రూ.326 నష్టంఅనంతపురం జిల్లా రోటరీపురానికి చెందిన ఎర్రి స్వామి రోజూ 14 లీటర్ల పాలు అమూల్ కేంద్రానికి పోసేవారు. లీటర్ ఆవు పాలకు రూ.43 చొప్పున ఆరు లీటర్లకు రూ.258, గేదె పాలకు లీటర్ రూ.83 చొప్పున ఎనిమిది లీటర్లకు రూ.664 కలిపి.. మొత్తం రూ.922 ఆదాయం లభించేది. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు ధర తగ్గించడంతో ఆవు పాలు లీటర్ రూ.30, గేదె పాలు రూ.52కి అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే ఆవు పాలు లీటర్‌కు రూ.13 నష్టం, గేదె పాలు లీటర్‌కు రూ.31 నష్టం. ఫలితంగా రోజూ రూ.326 చొప్పున నష్టపోతున్నట్లు స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఒక్క గ్రామంలోనే రూ.1.34 లక్షలు నష్టం..అనంతపురం జిల్లా రోటరీపురంలో నిత్యం 16 మంది రైతులు 160 లీటర్ల ఆవు పాలు, 80 లీటర్ల గేదె పాలు జగనన్న పాలవెల్లువ కేంద్రానికి పోసేవారు. గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.84, ఆవు పాలకు రూ.43 చొప్పున దక్కేది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ కేంద్రం మూతపడింది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు పాలు పోస్తుండటంతో లీటర్ ఆవు పాలకు రూ.30, గేదె పాలకు రూ.54 చొప్పున ఇస్తున్నారు. ఫలితంగా లీటర్‌పై ఆవుపాలకు రూ.13 చొప్పున రూ.2,080, గేదె పాలకు రూ.30 చొప్పున రూ.2,400లను ఈ గ్రామ పాడిరైతులు రోజూ నష్టపోతున్నారు. ఒక్క ఈ గ్రామంలోనే రోజుకు రూ.4,480 చొప్పున నెలకు రూ.1.34 లక్షలకు పైగా ఆదాయాన్ని పాడి రైతులు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అమూల్ పాల కేంద్రాలతో ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. పాలసేకరణ ధరలు దారుణంగా తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలుపోసేవారు మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్నారు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీల దోపిడీ మళ్లీ మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పాల సేకరణ ధరలు గణనీయంగా తగ్గిపోయి పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒకపక్క పాడి పశువుల ధర రూ.లక్షల్లో ఉంది. మరోపక్క పెరుగుతున్న దాణా ఖర్చులతో పోషణ భారంగా మారింది. ఇలాంటి సమయంలో పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలు వారి పొట్టగొడుతున్నారు. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో గతంలో ఆవు పాలకు లీటర్‌కు రూ.30 నుంచి రూ.38 మధ్య చెల్లించిన హెరిటేజ్ డెయిరీ ప్రస్తుతం రూ.23 నుంచి రూ.31కి మించి చెల్లించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక గేదె పాలకు గతంలో రూ.40–రూ.50 వరకు చెల్లించిన హెరిటేజ్... తాజాగా రూ.35 నుంచి రూ.40కి మించి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లాలో సోమవారం అమూల్‌కు పాలుపోసిన రైతులకు గేదెపాలకు లీటరుకు గరిష్టంగా రూ.92–93, ఆవు పాలకు రూ.39–40 చెల్లించింది. ఇలా జగనన్న పాలవెల్లువ కేంద్రాల (అమూల్) ద్వారా దాదాపు నాలుగేళ్లపాటు లాభాలతో పొంగిపోయిన రాష్ట్రంలోని పాడి రైతులు కూటమి సర్కారు కక్షపూరిత చర్యలతో ఇప్పుడు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 11 జిల్లాల్లో ఈ కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సేకరణ అంతంత మాత్రంగానే పాక్షికంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకు రుణాలు తీర్చే దారి కానరాక రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల పాడి రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయాయి. గతంలో చంద్రబాబు హయాంలో పులివెందుల, చిత్తూరుతో సహా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర, ప్రైవేట్ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం సహకార రంగంలో దేశంలోనే నెం.1గా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులను ఆదుకుంది.అమూల్ రాకతో పాల విప్లవం.. ఎనిమిది సార్లు సేకరణ ధర పెంపుఅమూల్ తొలుత మూడు జిల్లాల్లో ప్రారంభమై 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాల నుంచి 4,798 పల్లెలకు చేరుకుంది. 2020 అక్టోబర్‌లో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే 11 శాతం వెన్న, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్)తో గేదె పాలకు లీటర్ రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 సార్లు పాలసేకరణ ధరలను పెంచి గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లించింది. ఇలా 40 నెలల్లో గేదెపాలకు లీటర్‌పై రూ.18.29, ఆవుపాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూరుస్తామన్న హామీ కంటే మిన్నగా గేదె పాలపై రూ.15–20, ఆవు పాలపై రూ.10–15 వరకు అదనంగా లబ్ధి చేకూర్చింది.రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర..గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వెన్న శాతాన్ని బట్టి కాకినాడ జిల్లాలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున అమూల్‌కు పాలుపోసిన రైతులకు దక్కిన దాఖలాలున్నాయి. వెన్న శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా ప్రతి 10 రోజులకోసారి రైతుల ఖాతాలో జమ చేసేవారు. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనంగా ఉండే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.80 శాతం కేంద్రాలు మూతగతంలో 19 జిల్లాలకు విస్తరించిన అమూల్ పాలసేకరణ కూటమి సర్కారు సహాయ నిరాకరణతో ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకే అది కూడా పాక్షిక సేకరణకు పరిమితమైంది. 4,798 కేంద్రాల్లో జరిగిన పాల సేకరణ వెయ్యి కేంద్రాలకు తగ్గిపోయింది. ఐదు నెలల క్రితం అమూల్‌కు పాలు పోసే వారి సంఖ్య రోజుకు సగటున 1.25 లక్షలు ఉండగా నేడు 20 వేలకు క్షీణించింది. ఇదే సమయంలో పాల సేకరణ 3.95 లక్షల లీటర్ల నుంచి 1.30 లక్షల లీటర్లకు తగ్గిపోయింది.కుటుంబ సంస్థకు మేలు చేసేందుకే..సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సొంత డెయిరీకి మేలు చేస్తూ అమూల్‌ను నీరుగార్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం సహకార సమాఖ్యగా ఏర్పడిన విజయ డెయిరీ నిలదొక్కుకునేందుకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) దాదాపు దశాబ్దం పాటు చేయూతనిచ్చింది. పాలసేకరణ, రైతుకు మద్దతు ధర, పాల ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చారు. అదే రీతిలో అమూల్‌కు చేయూత నిచ్చేందుకు నియమించిన సిబ్బందిని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజే వెనక్కి రప్పించింది. అంగన్వాడీ కేంద్రాలకు రోజూ 50 వేల లీటర్ల పాల సరఫరా బాధ్యతల నుంచి సైతం అమూల్‌ను తప్పించింది. దీంతో సేకరణ కేంద్రాలను మూసివేసే దిశగా అమూల్ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేంద్రాలను నిలిపి వేసిన అమూల్ అనంతరం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల సహా 11 జిల్లాల్లో పాలసేకరణను నిలిపి వేసింది. మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా సేకరణ జరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలను తగ్గించేయడంతో గ్రామీణ మహిళా పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. హెరిటేజ్ సహా ప్రధాన ప్రైవేటు డెయిరీలన్నీ పాల సేకరణ ధరలను లీటర్‌పై సగటున ఆవు పాలకు రూ.10–20, గేదె పాలకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గించేశాయి. తాము చెప్పిందే ధర, ఇచ్చిందే తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నాయి. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–500 వరకు నష్టపోతున్నారు.గత ప్రభుత్వం పాడి రైతులను ఆదుకుందిలా..180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేల చొప్పున, కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున ఆర్ధిక చేయూతనిచ్చారు. ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనా వ్యయంతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ), ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూతపడిన మదనపల్లి డెయిరీని అమూల్ సహకారంతో పునరుద్ధరించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకిచ్చారు. రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.ప్రతి నెలా బోనస్ వచ్చేదిఅమూల్ కేంద్రానికి రోజూ 9 లీటర్లు పాలు పోశాం. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి గరిష్టంగా లీటర్‌కు రూ.85–95 వరకు ఇచ్చేవారు. ప్రతి నెలా బోనస్ వచ్చేది. పది రోజులకోసారి బ్యాంక్ ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. అమూల్ కేంద్రం మూతపడడంతో ప్రెవేట్ డెయిరీకి పోయాల్సి వస్తోంది. ఎస్ఎన్ఎఫ్ శాతం ఎంత ఉన్నా లీటరుకి రూ.75కి మించి రావడం లేదు. సగటున రోజుకి రూ.100కిపైగా నష్టపోతున్నా. – ఎనుముల పవనకుమారి, పోతవరం, ప్రకాశం జిల్లా.పట్టించుకోకపోవడం దారుణంఅమూల్ కేంద్రానికి పూటకు 4 లీటర్లు పాలు పోసేవాళ్లం. గేదె పాలు లీటర్‌కు రూ.70కు పైగా వచ్చేది. ఇప్పుడు అమూల్ కేంద్రం మూతపడటంతో ప్రైవేట్ డెయిరీలు రూ.30కి మించి ఇవ్వడం లేదు. బ్యాంక్ రుణాలు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. అమూల్ కేంద్రాలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. – ఎం.భారతి, సముదాయం, తిరుపతి జిల్లామళ్లీ బెంగళూరు వలస వెళ్లాల్సిందే...రోజూ 32 లీటర్ల పాలు అమూల్‌కు పోసేవాళ్లం. లీటరుకు రూ.42 చొప్పున రోజుకు రూ.1,300కిపైగా వచ్చేవి. రెండు రోజులుగా శ్రీజ డెయిరీకి పోస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.900 కూడా రావడం లేదు. అమూల్ ద్వారా మహిళా సహకార సంఘంలో నాలుగు ఆవులను రూ.2 లక్షల లోన్‌పై తీసుకున్నా. రుణ వాయిదాలు ఎలా చెల్లించాలో దిక్కు తోచడం లేదు. ఇలాగైతే పాడిని అమ్ముకోవడం మినహా గత్యంతరం లేదు. పాడి రైతులంతా గతంలో మాదిరిగా బెంగళూరు వలస వెళ్లాల్సిందే. – శశికళ, కౌలేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాజగన్పై కోపాన్ని మాపై చూపిస్తున్నారు..రోజూ 20 లీటర్ల వరకు పాలు పోస్తాం. ఈ ఏడాది ఏప్రిల్, మే వరకు ఆవు పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.44, గేదె పాలకు గరిష్టంగా రూ.67 వరకు లభించింది. అత్తమీద కోపం దుత్తపై చూపినట్లు జగన్‌పై కోపాన్ని పాడి రైతులపై చూపిస్తున్నారు. ఇలాగైతే పాడి పశువులను అమ్ముకోవాల్సిందే. – పి.ఉమా, కురబాలకోట, అన్నమయ్య జిల్లాఇదే పరిస్థితి ఉంటే పాడిని వదిలేస్తాంవెన్న శాతాన్ని బట్టి గతంలో లీటరుకి రూ.82 వచ్చేది. ప్రస్తుతం వెన్న శాతం ఎంత ఉన్నా రూ.72కు మించి ఇవ్వడం లేదు. గతంలో రూ.80–100 ఉండే ఒక బొద్దు ఎండు గడ్డి ప్రస్తుతం రూ.120 చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. గేదెలకు ఎండు గడ్డి వేయకపోతే వెన్న శాతం పెరగదు. తవుడు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. జగన్ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలను దారుణంగా తగ్గించేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడిని వదిలేస్తాం. – ఎం.బ్రహ్మయ్య, రాళ్లపాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లామేం రోడ్డున పడ్డాం..అమూల్ కోసం మహిళా పాల సహకార సంఘం ద్వారా రోజూ 480 లీటర్ల వరకు సేకరించేవాడ్ని. లీటర్‌కు రూ.1.25 చొప్పున నెలకు రూ.18 వేలు కమిషన్ వచ్చేది. ఆ డెయిరీ మూత పడడంతో రోడ్డున పడ్డాం. ఆవులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అమూల్ కేంద్రాలు మూతపడకుండా చూడాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. – చంద్రమోహన్, కొండకమర్ల, శ్రీసత్యసాయి జిల్లా -
పాలలో వెన్న శాతం పెంచుకునేదెలా?
పాలసేకరణ సాధారణంగా గ్రామ స్థాయిలో సంఘాల ద్వారా, ప్రైవేటు డెయిరీల ద్వారా, పాడి సమాఖ్యల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇలాకాక బయట వెండర్లకు కూడా రైతులు పాలను విక్రయిస్తూ ఉంటారు. పాల కేంద్రాల్లో పాలలోని వెన్న శాతాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ కాబట్టి 6–7% ఉంటే లీటరుకు రూ. 35–40 వస్తాయి. అదే ఆవు పాలలో 4–4.5 శాతం ఉంటే లీటరుకు రూ. 25–30 వస్తాయి. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలు.. ► ఎక్కువ వెన్న శాతం గల పాలు ఇచ్చే జాతుల పశువులను ఎన్నుకోవాలి. ఆవు పాలలో కంటే గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ. హెచ్.ఎఫ్. ఆవు పాలలో కన్నా జెర్సీ ఆవు పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ► తొలి ఈత పశువుల్లో కంటే, 2–3 ఈతల పశువుల్లో వెన్న ఎక్కువగా ఉంటుంది. పశువు ఈనిన తర్వాత 4–6 వారాలకు పాలలో వెన్న శాతం అత్యధిక స్థాయికి చేరుతుంది. రైతులు పాడి పశువులను కొనేటప్పుడు వరుసగా 3 పూటలు గమనించాలి. పాడి చివరి దశలో పాల దిగుబడి తగ్గి, వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. ► పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను పిండి కేంద్రానికి పోయాలి. మలి ధారల్లో సుమారు 10 శాతం వెన్న ఉంటుంది. వీటిని డూదకు తాగించడం మంచిది కాదు. ► పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలున్నాయి. ► పాలను త్వరగా పిండేయాలి. ఎందుచేతనంటే, పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ లోపే పాలు పించేయాలి. ఇలా చేస్తే ఆఖరి ధారల వరకు పూర్తి వెన్న శాతం పొందవచ్చు. ► పాలు తీసే సమయంలో పశువుకు బెదురు, చిరాకు చేయకూడదు. ► పశువులకు పీచు పదార్థాలున్న మేతను మేపాలి. వీటి వినియోగానికి పశువు పెద్ద పొట్టలోని సూక్ష్మక్రిములు సహకరిస్తూ, కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. వీటి నిష్పత్తిని బట్టి వెన్న శాతం ఉంటుంది. ► పశువుకు తప్పనిసరిగా రోజుకు 3–4 కిలోమీటర్ల నడక వ్యాయామం అవసరం. ► వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించుకోవాలి. ► పాల కేంద్రంలో పరీక్ష కోసం పాల నమూనా తీస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. దీనిపై రైతు దృష్టి పెట్టాలి. ► దాణా పదార్థాలయిన పత్తి గింజల చెక్క, సోయా చెక్క మొదలగు వాటి వల్ల పాల నాణ్యతా నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది. ► గర్భకోశ వ్యాధుల వలన పాల వెన్న శాతం తగ్గుతుంది. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవస్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
పాల ప్రోత్సాహకం నిలుపుదల
♦ రెండు నెలలుగా రైతులకు రూ.7 కోట్ల బకాయిలు ♦ నిధులు లేక తాత్కాలికంగా నిలిపేసిన విజయ డెయిరీ? ♦ ‘ప్రోత్సాహక’ నిధులపై స్పష్టతనివ్వని ప్రభుత్వం ♦ రాష్ట్ర బడ్జెట్లో ఆ ఊసే లేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: కరువులో రైతును అన్ని విధాలా ఆదుకుంటున్నామని... పాడి రైతుకు ప్రోత్సాహకం ఇస్తున్నామని ఇంటా బయట ఊదరగొడుతోన్న ప్రభుత్వం... ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకంపై నీళ్లు చల్లుతోంది. ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం ప్రోత్సాహక బకాయిలు చెల్లించిందని... ఆ తర్వాత ఇప్పటివరకు రెండు నెలలపాటు రైతులకు చెల్లించాల్సిన రూ. 7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రోత్సాహక పథకాన్ని విజయ డెయిరీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో కరువులో పాడిపై ఆధారపడిన రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సర్కారు మద్దతేదీ? విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. ఆ ప్రకారం 2014 నవంబర్ నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ రూ. 4 లీటరుకు అదనంగా ఇస్తున్నారు. ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా.. ఉత్తర్వు తరువాత పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి రైతుల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ప్రారంభించింది. అలా ఫిబ్రవరి 10 వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో విజయ డెయిరీ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల డిపాజిట్లను రైతులకు చెల్లిస్తూ వస్తోంది. ఆ తర్వాత ఇవ్వని పరిస్థితిలోకి డెయిరీ వెళ్లిపోయింది. ఏంచేయాలో అర్థంకాక బకాయిలు వచ్చే వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వలేమని రైతులకు చెబుతున్నట్లు తెలిసింది. బడ్జెట్లో నిధులపై అస్పష్టత... 2015-16 బడ్జెట్లో పాల ప్రోత్సాహకానికి రూ. 12 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... 2016-17 బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఇతర పద్దుల్లో కేటాయించామని చెబుతున్నా అది కూడా రూ. 16 కోట్లకు మించి లేదని అంటున్నారు. దీనిపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే కాకుండా కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ సహా పలు ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ దీనిపై ఉప సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ విజయ డెయిరీతోపాటు పైన పేర్కొన్న ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహకం ఇచ్చేట్లయితే రూ. 110 కోట్ల మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రస్తుతం కొద్దిపాటి నిధులే ఇవ్వని సర్కారు ఇంత పెద్ద మొత్తం నిధులు కేటాయిస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. కరువులో పాడి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉపసంఘం పేరుతో ప్రోత్సాహకపు సొమ్ము విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాల ప్యాకెట్లో ధరల పోరు!
రూ. 36కే లీటరంటూ హైదరాబాద్‌లోకి ‘నందిని’ ⇒ ఇది... కర్ణాటక పాల రైతుల సమాఖ్య సొంత బ్రాండ్ ⇒ రెండేళ్లలో రూ.2,000 కోట్లతో విస్తరించడానికి సన్నాహాలు ⇒ ఇటీవలే అమూల్ దెబ్బకు ధరలు తగ్గించిన ప్రైవేటు డెయిరీలు ⇒ తాజా పరిణామంతో మరింత తగ్గడానికీ చాన్స్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరల యుద్ధం పదునెక్కుతోంది. గుజరాత్ సహకార దిగ్గజం అమూల్ ప్రవేశంతో ప్రైవేటు డెయిరీలు ధరలు తగ్గించి రెండుమూడు నెలలు కూడా గడవకముందే కర్ణాటక సహకార దిగ్గజం ‘నందిని’ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. లీటరు పాలు రూ.36కే విక్రయిస్తున్నట్లు ప్రకటించి... ధరల యుద్ధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. హైదరాబాద్ తమకు ఆరంభమేనని, తెలుగు రాష్ట్రాలు రెండింటా పూర్తి స్థాయిలో విస్తరిస్తామని చెప్పిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) ఎండీ ఎస్.ఎన్.జయరామన్... గురువారమిక్కడ కంపెనీ ఉత్పత్తుల్ని ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఎంఎఫ్ చైర్మన్ పి.నాగరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు. లక్ష లీటర్లు లక్ష్యంగా...: ప్రస్తుతం తాము హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లో రోజుకు 35 వేల లీటర్ల తాజా పాలు సరఫరా చేయగలుగుతామని జయరామ్ చెప్పారు. ‘కొద్ది రోజుల్లో దీన్ని లక్ష లీటర్లకు పెంచుతాం. కర్నాటకలోని బెల్గాం, బీజాపూర్ నుంచి పాలు సేకరించి హైదరాబాద్ సమీపంలోని థర్డ్ పార్టీకి చెందిన ప్రాసెసింగ్ కేంద్రానికి తరలిస్తున్నాం. డిమాండ్ పెరిగితే స్థానికంగా పాల సేకరణ చేపట్టడంతో పాటు సొంత ప్రాసెసింగ్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు విస్తరిస్తాం’ అని తెలిపారు. సేకరణ వ్యవస్థ వైఫల్యంతోనే...: వ్యవస్థీకృత విధానంలో పాల సేకరణ జరుగుతున్నది కేవలం గుజరాత్, కర్ణాటకలోనేనని కేఎంఎఫ్ ఎండీ చెప్పారు. పాడి రైతుకు దేశంలో ఎక్కడా లేనంతగా తమ సంస్థ లీటరుకు రూ.27 చెల్లిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లీటరుకు రూ.19 చెల్లిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. దళారీ వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారని, కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని వివరించారు. క్లిక్ చేస్తే ఇంటికే పాలు.. ఈ-కామర్స్ కంపెనీ బిగ్ బాస్కెట్ ఇప్పటికే నందిని ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ‘‘మేం ఈ వారంలో మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ నుంచి కస్టమర్లు తాజా పాలను కూడా ఆర్డరు చేయొచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు వాసులకు మాత్రమే ఈ సౌకర్యం. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరిస్తాం. కేఎంఎఫ్ 20% వృద్ధితో 2015-16లో రూ.12,720 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తోంది. పాల సేకరణ సామర్థ్యం జూన్ నాటికి రోజుకు 64 లక్షల నుంచి 70 లక్షల లీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని జయరామ్ తెలియజేశారు. మౌలిక వసతుల కోసం వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. అమూల్ రాకతో... రెండుమూడు నెలల కిందట అమూల్ ప్రవేశించేంత వరకూ రాష్ట్రంలో ఒక్క ‘విజయ’ బ్రాండ్ తప్ప మిగిలిన పాల ధరలు ఎక్కువగానే ఉండేవి. విజయ కూడా సహకార సమాఖ్యే కనక దాన్ని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని, అందుకే తాము కూడా విజయ మాదిరే రూ.38 ధరనే నిర్ణయించామని అప్పట్లో అమూల్ ఎండీ ఆర్.ఎస్.సోధి చెప్పారు కూడా. అయితే అమూల్ రాకతో హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీ పాలను అధిక ధర పెట్టి కొంటున్న వారు అటువైపు మళ్లారు. ఇంతలో నల్గొండ జిల్లా సహకార సమాఖ్య నార్ముక్ కూడా నార్ముక్ బ్రాండ్‌తో లీటరు రూ.38కే ఇస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. చివరికి విధి లేక హెరిటేజ్ కూడా తన పాల ధరను రూ.40కి తగ్గించింది. తాజాగా ‘నందిని’ రాకతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారిం ది. నందిని ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.50, డబుల్ టోన్డ్ పాలు 300 మిల్లీలీటర్లు రూ.10, పెరుగు 200 గ్రాముల ప్యాక్ రూ.10 చొప్పున విక్రయిస్తోంది.