residential housing
-
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్‌అండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఇదీ చదవండి 👉 ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జేఎల్ఎల్ ఇండియా (రెసిడెన్షియల్ సర్వీసెస్) ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టార్డియో ప్రాంతంలో ఉన్న కమ్లా భవనంలోని 18వ అంతస్తులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది వరకు గాయపడ్డారని బృహన్ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారికి సమీపంలోని భాటియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ముంబై మేయర్ కిషోర్ ఫడ్నేకర్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. చదవండి: (స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు ఊరట.. 18 కేసులు రద్దు) -
హెచ్డీఎఫ్సీ లాభం 10 శాతం వృద్ధి
ముంబై: దేశీ బ్లూచిప్ కంపెనీల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ... ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో రూ.1,266 కోట్ల నికర లాభాన్ని(స్టాండెలోన్) ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,151 కోట్ల లాభంతో పోలిస్తే 10.27 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా 12.8 శాతం వృద్ధితో రూ. 5,269 కోట్ల నుంచి రూ.5,946 కోట్లకు పెరిగింది. ఇక క్యూ2లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ.1,814 కోట్లకు చేరింది. తమ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి డివిడెండ్ రాబడి రెండో త్రైమాసికానికి బదులు తొలి త్రైమాసికంలోనే వస్తుండటంతో సెప్టెంబర్ క్వార్టర్లో లాభాల వృద్ధి తగ్గుముఖం పట్టడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ కేకీ మిస్త్రీ వెల్లడించారు. కంపెనీ మొత్తం రుణాల విలువ సెప్టెంబర్ చివరినాటికి రూ. 2,12,071 కోట్లకు ఎగబాకింది. క్రితం క్యూ2తో పోలిస్తే 19 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18-20 శాతం రుణ వృద్ధిని సాధించగలమని మిస్త్రీ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఈ క్యూ2లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) స్వల్పంగా తగ్గి 4.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్ఐఎం 4.2%. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు(మొండిబకాయిలు) క్యూ2లో 0.77 శాతం నుంచి 0.79 శాతానికి పెరిగాయి. కాగా, సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కేశుబ్ మహీంద్రా, స్వతంత్ర డెరైక్టర్ శిరీష్ బి.పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారని, తక్షణం ఇవి అమల్లోకి వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. వీరిద్దరూ సంస్థ ఆరంభం నుంచీ డెరైక్టర్ల బోర్డులో కొనసాగుతూ వస్తున్నారు.