Scenic City
-
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
సీఎం హామీల్లో కదలిక
సుందర నగరంగా ఓరుగల్లు రోడ్ల వెంట పచ్చదనం.. కాలనీలకు లే అవుట్లు సిద్ధం పక్కా ఇళ్లకు ప్రమాదం లేదు వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాగ్దానానికి అనుగుణంగా చర్యలు మొదలయ్యాయి. వాతావరణ కాలుష్యం నుంచి నగర జీవి ఉపశమనం పొందడానికి.. పచ్చదనం పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల లే అవుట్లు సిద్ధమయ్యాయి. హన్మకొండ : హైదరాబాద్ తరహాలో నగరంలోని ముఖ్యమైన రోడ్లు, జంక్షన్లు పచ్చదనం సంతరించుకోనున్నాయి. నగర పరిధిలో పచ్చదనం పెంచే చర్యల్లో భాగంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) కార్యాలయం లో బుధవారం సమావేశం జరిగింది.జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నగరాల్లో పచ్చద నం పెం చే పనుల్లో అనుభవం ఉన్న పది కంపెనీల ప్రతి నిధులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న రోడ్ల నిడి వి ఎంత? ఎన్ని ప్రధాన కూడళ్లు ఉన్నారుు? అనే అంశాలపై చర్చించారు. తొలివిడతలో కాజీపేట నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ఉన్న రోడ్డుతోపాటు 17 జంక్షన్ల(ట్రాఫిక్ ఐలాండ్)లో పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన రహదారుల్ల్లో డివైడర్ల ఎత్తు పెంపు, డివైడర్ల మధ్యలో గ్రాస్‌మ్యాట్ ఏర్పాటు, ప్రచార హోర్డింగులు బిగింపు పనులు చేపడతారు. జంక్షన్లలో రంగురంగుల పూలమొక్కలు పెంచుతారు. సిద్ధమైన లే అవుట్లు వరంగల్ నగరాన్ని స్లమ్ లెస్ సిటీగా తీర్చిదిద్దేక్రమంలో భాగంగా మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక లే అవుట్‌ను కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. లే అవుట్ల రూపకల్పనలో మురికివాడల్లో ఉన్న పక్కా నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా ఇళ్ల స్థలాన్ని లే అవుట్ రూపకల్పనలో పూర్తిగా మినహాయించారు. దీనివల్ల కొత్తగా నిర్మించబోయే ఇళ్లు ఒకే వరుసలో, ఒకే చోట క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ స్థలం అనుగుణంగా నిర్మాణం చేస్తారు. వీటికోసం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలోపాటు ప్రస్తుతం ఉన్న గుడిసెలు, పెంకుటిళ్లు(సెమీ పక్కా)లను తొలగిస్తారు. ఇలా ఏర్పడిన ఖాళీ స్థలాల్లో కొత్తగా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తారు. కనీసం 20 అడుగుల వెడల్పు ఉండే కొత్త అంతర్గత రోడ్లు, మంచినీటి ట్యాం కులు, పార్కులు ఉండేలా ఈ లే అవుట్లు రూపొందించారు. ఎంపిక చేసిన తొమ్మిది మురి కివాడలు ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ పోరంబోకు, చెరువు శిఖం, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి. లే అవుట్లు సిద్ధమైనందున గృహ నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లే అవుట్ రూపకల్పన సర్వేకు స్థానికులు నిరాకరించడంతో గాంధీనగర్ లే అవుట్ సిద్ధం కాలేదు. సర్వే నంబరు 93లో లక్ష్మీపురం ఉంది. రెవె న్యూ రికార్డుల ప్రకారం పోరంబోకు భూమి. ఆరెకరాల స్థలంలో లేఅవుట్‌ను సిద్ధం చేశారు.ఖిలావరంగల్ పరిధిలోని సర్వే నంబర్లు 1714, 1716, 1707లో శాకరాసికుంట ఉంది. 13.12 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేశారు. రికార్డుల మేరకు పట్టా ఉన్న ప్రైవేటు శిఖం భూమి. ఖిలావరంగ్ పరిధిలోని సర్వేనంబరు 107లో గిరిప్రసాద్‌నగర్ కాలనీ ఉంది. ఈ ప్రాంతంలో 12.44 ఎకరాల స్థలంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి లే అవుట్ రూపొందించాలి. అంతకుముందు పురావస్తుశాఖ నుంచి అనుమతి రావాలి. హన్మకొండ పరిధిలో సర్వేనంబరు 1066 పరిధిలో అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్ ఉ న్నాయి. రికార్డుల ప్రకారం కార్పొరేషన్ పార్కు కోసం కేటాయించిన స్థలం. ఇక్కడ 5.11 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను రూపొందించారు. దర్గా కాజీపేట పరిధిలో సర్వే నంబరు 977లో దీన్‌దయాళ్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం ఇది సర్కారు పోరంబోకు భూమి. వరంగల్ కార్పొరేషన్ ఈ స్థలాన్ని చెరువు శిఖం భూమిగా గుర్తించింది. ఇక్కడ 20.22 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను సిద్ధం చేశారు. దర్గాకాజీపేట సర్వే నంబరు 37లో ప్రగతినగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువశిఖం. 3.79 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలో ఉన్న గరీబ్‌నగర్ సర్వేనంబరు 95 ఉంది. ఇటీవల ఇది గ్రేటర్లో విలీనమైంది. రికార్డుల ప్రకారం ఈ స్థలం మల్లికుంట శిఖం. ఇక్కడ 28 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. సర్వేనంబరు 195లో ఎస్సార్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువు శిఖం. 18.15 ఎకరాల్లో లే అవుట్ చేశారు.