సీఎం హామీల్లో కదలిక | Greenery along the roads of the picturesque city of Warangal | Sakshi
Sakshi News home page

సీఎం హామీల్లో కదలిక

Published Thu, Feb 5 2015 1:14 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

సీఎం హామీల్లో కదలిక - Sakshi

సీఎం హామీల్లో కదలిక

సుందర నగరంగా ఓరుగల్లు  రోడ్ల వెంట పచ్చదనం..
కాలనీలకు లే అవుట్లు సిద్ధం  పక్కా ఇళ్లకు ప్రమాదం లేదు
 

వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాగ్దానానికి అనుగుణంగా చర్యలు మొదలయ్యాయి. వాతావరణ కాలుష్యం నుంచి నగర జీవి ఉపశమనం పొందడానికి.. పచ్చదనం పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల లే అవుట్లు సిద్ధమయ్యాయి.
 
హన్మకొండ :  హైదరాబాద్ తరహాలో నగరంలోని ముఖ్యమైన రోడ్లు, జంక్షన్లు పచ్చదనం సంతరించుకోనున్నాయి. నగర పరిధిలో పచ్చదనం పెంచే చర్యల్లో భాగంగా  కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) కార్యాలయం లో బుధవారం సమావేశం జరిగింది.జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నగరాల్లో పచ్చద నం పెం చే పనుల్లో అనుభవం ఉన్న పది కంపెనీల ప్రతి నిధులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న రోడ్ల నిడి వి ఎంత? ఎన్ని ప్రధాన కూడళ్లు ఉన్నారుు? అనే అంశాలపై చర్చించారు. తొలివిడతలో కాజీపేట నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ఉన్న రోడ్డుతోపాటు 17 జంక్షన్ల(ట్రాఫిక్ ఐలాండ్)లో పచ్చదనం పెంచాలని  నిర్ణయించారు. ఎంపిక చేసిన రహదారుల్ల్లో డివైడర్ల ఎత్తు పెంపు, డివైడర్ల మధ్యలో గ్రాస్‌మ్యాట్ ఏర్పాటు, ప్రచార హోర్డింగులు బిగింపు పనులు చేపడతారు. జంక్షన్లలో రంగురంగుల పూలమొక్కలు పెంచుతారు.

సిద్ధమైన లే అవుట్లు

వరంగల్ నగరాన్ని స్లమ్ లెస్ సిటీగా తీర్చిదిద్దేక్రమంలో భాగంగా మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక లే అవుట్‌ను కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. లే అవుట్ల రూపకల్పనలో మురికివాడల్లో ఉన్న పక్కా నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా ఇళ్ల స్థలాన్ని లే అవుట్ రూపకల్పనలో పూర్తిగా మినహాయించారు. దీనివల్ల కొత్తగా నిర్మించబోయే ఇళ్లు ఒకే వరుసలో, ఒకే చోట క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ స్థలం అనుగుణంగా నిర్మాణం చేస్తారు. వీటికోసం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలోపాటు ప్రస్తుతం ఉన్న గుడిసెలు, పెంకుటిళ్లు(సెమీ పక్కా)లను తొలగిస్తారు. ఇలా ఏర్పడిన ఖాళీ స్థలాల్లో కొత్తగా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తారు. కనీసం 20 అడుగుల వెడల్పు ఉండే కొత్త అంతర్గత రోడ్లు, మంచినీటి ట్యాం కులు, పార్కులు ఉండేలా ఈ లే అవుట్లు రూపొందించారు. ఎంపిక చేసిన తొమ్మిది మురి కివాడలు ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ పోరంబోకు, చెరువు శిఖం, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి. లే అవుట్లు సిద్ధమైనందున గృహ నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లే అవుట్ రూపకల్పన సర్వేకు స్థానికులు నిరాకరించడంతో గాంధీనగర్ లే అవుట్ సిద్ధం కాలేదు.

 సర్వే నంబరు 93లో లక్ష్మీపురం ఉంది. రెవె న్యూ రికార్డుల ప్రకారం పోరంబోకు భూమి. ఆరెకరాల స్థలంలో లేఅవుట్‌ను సిద్ధం చేశారు.ఖిలావరంగల్ పరిధిలోని సర్వే నంబర్లు 1714, 1716, 1707లో శాకరాసికుంట ఉంది.  13.12 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేశారు.

రికార్డుల మేరకు పట్టా ఉన్న ప్రైవేటు శిఖం భూమి.

ఖిలావరంగ్ పరిధిలోని సర్వేనంబరు 107లో గిరిప్రసాద్‌నగర్ కాలనీ ఉంది. ఈ ప్రాంతంలో 12.44 ఎకరాల స్థలంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి లే అవుట్ రూపొందించాలి. అంతకుముందు పురావస్తుశాఖ నుంచి అనుమతి రావాలి.
 
హన్మకొండ పరిధిలో సర్వేనంబరు 1066 పరిధిలో అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్   ఉ న్నాయి. రికార్డుల ప్రకారం కార్పొరేషన్ పార్కు కోసం కేటాయించిన స్థలం. ఇక్కడ 5.11 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను రూపొందించారు.
  
దర్గా కాజీపేట పరిధిలో సర్వే నంబరు 977లో దీన్‌దయాళ్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం ఇది  సర్కారు పోరంబోకు భూమి. వరంగల్ కార్పొరేషన్ ఈ స్థలాన్ని చెరువు శిఖం భూమిగా గుర్తించింది. ఇక్కడ 20.22 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను సిద్ధం చేశారు.
 
దర్గాకాజీపేట సర్వే నంబరు 37లో ప్రగతినగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువశిఖం. 3.79 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలో ఉన్న గరీబ్‌నగర్ సర్వేనంబరు 95 ఉంది. ఇటీవల ఇది గ్రేటర్‌లో విలీనమైంది. రికార్డుల ప్రకారం ఈ స్థలం మల్లికుంట శిఖం. ఇక్కడ 28 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. సర్వేనంబరు 195లో ఎస్సార్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువు శిఖం. 18.15 ఎకరాల్లో లే అవుట్ చేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement