second song
-
కాశీలో శివశక్తి
నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ‘తండేల్’ లోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేయనున్నాను.‘‘శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్యాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్‌గా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
కల్యాణి... వచ్చా వచ్చా...
‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ పాట పాడేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. వివాహ వేడుకల్లో భాగంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, కార్తీక్ పాడారు. ‘కల్యాణి... వచ్చా వచ్చా, పంచ కల్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, క్రియేటివ్ ప్రోడ్యూసర్: వాçసూ వర్మ. -
ఆ రోజు గోల గోల చేద్దాం
‘‘మీ అందరి (అభిమానులు) ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఈగల్’ వైవిధ్యమైన మాసీ ఫిలిం. వినోదం అద్భుతంగా ఉంటుంది. నాకు విపరీతంగా నచ్చింది.. మీ అందరికీ తెగ నచ్చుతుంది. జనవరి 13న అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి.. గోల గోల చేద్దాం’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవ్ జాంద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లంతే..’ అంటూ సాగే రెండో పాటని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్, లిన్ పాడారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘గల్లంతే..’ పాట నాకు చాలా ప్రత్యేకం. రవితేజగారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి సంగీతం ఇవ్వడంతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు దేవ్ జాంద్. ఈ వేడుకలో కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు. కోటికి రవితేజ వాయిస్ తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో కోటి పాత్రలో నటించిన వానరానికి హీరో రవితేజ డబ్బింగ్ చె΄్పారు. ‘‘రవితేజగారి వాయిస్‌తో కోటి పాత్ర మరింత హ్యూమరస్, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని మేకర్స్ అన్నారు. -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
నన్ను చూసినావే పిల్ల!
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిల్మ్స్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. ‘‘సోదరా’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. ‘నన్ను చూసినావే పిల్ల..’ పాట ఫ్రెష్ ఫీల్‌తో మంచి లవ్ రొమాంటిక్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్. -
ఎలా సహాయపడగలను రాధిక
‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్‌తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్‌తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
చెప్పరా శివా...
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా, నువెవడివి సొల్లుడా శివా (చెప్పరా శివా)...’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పా టని అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర పా డారు. -
నాతో రా... ఖుషీ సెకండ్ సాంగ్ విన్నారా?
‘నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా..’ అంటూ విజయ్ దేవరకొండ పాడగా, ‘పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా..’ అంటున్నారు సమంత. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రంలోని రెండో పాట ఇది. ఈ చిత్రదర్శకుడు శివ నిర్వాణ తెలుగు వెర్షన్‌కి ఈ పాట రాయగా, తమి ళంలో మదన్ కార్కీ సాహిత్యం అందించారు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి, హిందీలో జుబిన్ నాటియల్, పలక్ ముచ్చల్, కన్నడంలో హరిచరణ్ శేషాద్రి, చిన్మయి, మలయాళంలో కేఎస్ హరిశంకర్, శ్వేతా మోహన్ ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
చిరంజీవి 'జామ్ జామ్ జజ్జనక' కోసం రెడీగా ఉండండి
‘జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క..’ అంటూ చిందేశారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే రెండో పాట ప్రోమోని ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్‌గా కనిపిస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భోళా మానియా...’ అనే మొదటి పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే పూర్తి పాటని ఈ నెల 11 విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్. -
ఆరాధ్య...
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఆరాధ్య..’ అంటూ సాగే రెండో పాటను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘నా రోజా నువ్వే..’ పాట వంద మిలియన్లకు చేరువలో ఉంది. ‘ఆరాధ్య..’ పాట ప్రోమోను సోమవారం, పాటను బుధవారం విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: జి. మురళి. -
విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లను వేగవంతం చేసిన మూవీ టీం వరుసగా అప్డేట్స్ వదులోంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లైగర్ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మరో అప్డేట్తో లైగర్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది మూవీ యూనిట్. చదవండి: ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్ తాజాగా మేకర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగర్ యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ స్వర పరిచిన ఈ పాటను విజయ్ స్వయంగా ఆలపించాడు. పూరి సాహిత్యం అందించాడు. ఇలా చిత్రబృందం డిఫరెంట్‌గా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. విజయ్ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మి కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ హీరో తల్లిగా నటిస్తుండగా.. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ అతిథి పాల్రలో మెరవనున్నాడు. India! Presenting, The Liger attitude - Podham. Kotladudham. Sabki #WaatLagaDenge 🤙 - https://t.co/WNZJw6dnS4#LIGER #LigerOnAug25th pic.twitter.com/hz9yWRYpob — Vijay Deverakonda (@TheDeverakonda) July 29, 2022 -
‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన బామ్మ, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి ఇటీవల విడుదల మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే మారుమోగుతోంది. ఈ పాట వినిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దవారు సైతం స్టెప్పులేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అలా తాజాగా ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ బామ్మ. వయసనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చదవండి: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ ‘నాటు నాటు’ పాటకు ఈ భామ కాలు కదపడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బామ్మ డ్యాన్స్‌ను అభినందిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఈ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో పంచుకుంది. ‘బామ్మగారు’ అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ‘బామ్మ గారు మీ ఉత్సాహానికి హ్యాట్సాఫ్’, ‘మీ డ్యాన్స్ కెవ్వు కేక’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు లీడ్రోల్లో నటించిన ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: RRR Movie: నాటు సాంగ్ దెబ్బ...అప్పుడే ఆల్ టైం రికార్డ్ Baamma Gaaru 😍💃 #NaatuFied #RRRMassAnthem pic.twitter.com/fxq1KsnWJ1 — RRR Movie (@RRRMovie) November 12, 2021 -
బస్టాండే.. బస్టాండే...
బస్టాండే... బస్టాండే.. సింపుల్గుండే లైఫు.. టెంపుల్ రన్‌లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీగుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే లేనిదాయే’ హీరోయిన్‌కి తాళి కట్టే ముందు హీరో పాడే పాట ఇది. ఈ బాధ ఎందుకు? అనేది ‘రంగ్ దే’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. పీడీవీ ప్రసాద్ సమర్పకులు. నితిన్, కీర్తిపై చిత్రీకరించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘సింపుల్గుండే లైఫు..’ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. రెండో పాట కూడా వీనులవిందుగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
డుమ్ డుమ్ డుమ్
‘డుమ్ డుమ్ డుమ్ గట్టి మేళం మోగేట్టు...’ అంటూ సాగే పెళ్లి పాటను ‘దర్బార్’ చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలోని రెండో పాట (డుమ్ డుమ్..)ను గురువారం రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. గేయరచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారికి పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. సినిమాలో ఓ యువ జంటకు పెళ్లయ్యే సందర్భంలో వచ్చే పెళ్లి పాట ఇది. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి చిన్న ఫిలాసఫీ ఉన్న పాట. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్ శివన్. -
చాలా రోజుల తర్వాత పాట పాడా
‘‘చాలా రోజుల విరామం తర్వాత ‘ప్రణవం’ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడాను. ఈ పాట శ్రోతలకు నచ్చుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అన్నారు. ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ముఖ్య తారలుగా కుమార్ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను. ఎస్ నిర్మించారు. పద్మారావ్ భరద్వాజ్ స్వరపరచిన ఈ సినిమాలోని రెండవపాటను ఆర్.పి. పట్నాయక్ విడుదల చేశారు. ఈ పాటను ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి పాడటం విశేషం. హీరో శ్రీ మంగం మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మార్చిలో సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆర్పీగారు పాడిన పాట అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల మా చిత్రంలోని తొలిపాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది’’ అని పద్మారావ్ భరద్వాజ్ అన్నారు. పాటల రచయిత కరుణ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్. -
అదరహో అంటున్న..‘ఏక్ దిల్.. ఏక్జాన్’
సాక్షి, ముంబై: సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్ గా నిలిచిన ‘పద్మావతి’ చిత్రం సుప్రీం భారీ ఊరట అందించడంతో శరవేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రంలోని రెండవ పాటను రిలీజ్ చేసింది. రిలీజ్‌కుముందే ఈ సినిమాను చుట్టుముట్టిన పలు వివాదాలు భారీ హైప్ ను క్రియేట్ చేయగా.. చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన మొదటిపాటకు మంచి ఆదరణ లభించింది. అంతేకాదు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా బాలీవుడ్ అవార్డు హీరోయిన్ దీపాకా పడుకోన్ అత్యద్భుతంగా రొమాన్స్ పండిస్తున్న ఈ రెండవ పాటతో ఈ సినిమాపై మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. కెమెరా వర్క్ తో పాటు ఆర్ట్ డైరెక్షన్ కూడా అదరహో అని సినీ విమర్శకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పద్మావతి మూవీని అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చడంతో జోష్‌గా ఉన్న చిత్రం తాజా ‘ఏక్ దిల్.. ఏక్జాన్’ పాటలను విడుదల చేసింది. అటు ఈ చిత్ర కథానాయిక దీపికా పదుకోన్ ట్విట్టర్లో చారిత్రక ప్రేమ గానమంటూ ట్విట్టర్లో ఈ పాటను షేర్ చేశారు. కాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావతి చిత్రం డిసెంబర్ 1న థియేటర్లను పలకరించనుంది. An epic love ballad...❤️ #EkDilEkJaan @FilmPadmavati https://t.co/hEHhcVXyu8 — Deepika Padukone (@deepikapadukone) November 11, 2017 -
కాటమరాయుడు సెకండ్ సాంగ్..
-
సుందరీ ... దేవిశ్రీ మరో కిక్కు
హైదరాబాద్: మెగా అభిమానులకు మరో శుభవార్త. అమ్మడు- కుమ్ముడు సాంగ్ తో పండగ చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మరో మాంచి కిక్కు ఎక్కించే సమాచరం అందించారు. ఆల్ సందరాస్ గెట్ రడీ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సుందరీ పాట పాడుకోవడానికి రడీగా ఉండండి ..లెట్స్ పార్టీ ఫర్ క్రిస్మమస్ అంటూ లెట్స్ పార్టీ ఫర్ క్రిస్మమస్ అంటూ ఈ మోస్ట్ ఎవైటింగ్ సినిమాలోని రెండవ పాటపై మరింత ఉత్కంఠ రాజేశారు. డిసెంబర్ 24 (రేపే) రెండవ పాటను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా కొణిదెల ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఖైదీ 150. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవలన విడుదలైన చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ అందించిన కుమ్ముడు పాట దుమ్ము రేపిన సంగతి తెలిసిందే.