![Old Women Dance On RRR Movie Naatu Naatu Song Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/12/naatu-naatu-song.jpg.webp?itok=nCUOSg6j)
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నుంచి ఇటీవల విడుదల మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే మారుమోగుతోంది. ఈ పాట వినిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దవారు సైతం స్టెప్పులేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అలా తాజాగా ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ బామ్మ. వయసనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చదవండి: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’
‘నాటు నాటు’ పాటకు ఈ భామ కాలు కదపడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బామ్మ డ్యాన్స్‌ను అభినందిస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం ఈ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో పంచుకుంది. ‘బామ్మగారు’ అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ‘బామ్మ గారు మీ ఉత్సాహానికి హ్యాట్సాఫ్’, ‘మీ డ్యాన్స్ కెవ్వు కేక’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు లీడ్‌రోల్‌లో నటించిన ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: RRR Movie: నాటు సాంగ్ దెబ్బ...అప్పుడే ఆల్ టైం రికార్డ్
Baamma Gaaru 😍💃 #NaatuFied #RRRMassAnthem
— RRR Movie (@RRRMovie) November 12, 2021
pic.twitter.com/fxq1KsnWJ1
Comments
Please login to add a commentAdd a comment