Shanthi Priya
-
గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
ఆడవారికి కురులే అందం. కాస్త జుట్టు రాలినా అస్సలు తట్టుకోలేరు. అందులోనూ సెలబ్రిటీలు హెయిర్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటారు. అయితే ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అందంగా కనిపించాలంటే జుట్టు తప్పనిసరా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే అంటూ గుండు గీయించుకుంది. ఇంతకీ తనెవరో కాదు స్టార్ హీరోయిన్, భానుప్రియ సోదరి శాంతిప్రియ (Shanthi priya). తాజాగా ఆమె గుండుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధైర్యంగా..'ఈ మధ్యే గుండు కొట్టించుకున్నాను. ఒక అమ్మాయిగా మనకు జీవితంలో చాలా పరిమితులు, షరతులు ఉంటాయి. ఇవన్నీ మనల్ని బోనులో బంధీలుగా చేస్తాయి. వాటి నుంచి స్వేచ్ఛ కోరుకున్నాను. నన్ను నేను విముక్తి చేసుకున్నాను. అందం అంటే ఇదే అనుకునే ప్రమాణాలను బ్రేక్ చేయాలనుకున్నాను. మనసు నిండా నమ్మకంతో ఎంతో ధైర్యంగా ముందడుగు వేశాను. అలాగే నా దివంగత భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతడి బ్లేజర్‌ను ధరించాను' అని రాసుకొచ్చింది.పర్సనల్ లైఫ్- సినిమాఈమె తెలుగులో కాబోయే అల్లుడు, నాకు పెళ్లాం కావాలి, మహర్షి (1987), సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, అగ్ని, కలియుగ అభిమన్యుడు, జస్టిస్ రుద్రమదేవి సినిమాల్లో నటించారు. తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. 1994లో ఇక్కె పె ఇక్క సినిమాతో బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. మూడు దశాబ్దాల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. బ్యాడ్ గర్ల్ అనే తమిళ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల్ని పలకరించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. శాంతిప్రియ నటుడు సిద్దార్థ్ రాయ్‌ను 1992లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 2004లో సిద్దార్థ్ రాయ్ గుండెపోటుతో మరణించాడు. View this post on Instagram A post shared by Shanthi Priya (@shanthipriya333) చదవండి: వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?: యాంకర్ రవి -
ఆ హీరో వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ భానుప్రియ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కాకపోతే తమిళ, హిందీలో వచ్చినన్ని ఛాన్సులు ఇక్కడ రాలేదు. అయితే కొన్నాళ్ల ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరిన్ని విషయాలు బయటపెట్టింది. ఏం జరిగింది? అక్షయ్-శాంతిప్రియ కలిసి 'ఇక్కె పె ఇక్కా' సినిమా చేశారు. ఓ మిల్లులో షూటింగ్. గ్లామర్ రోల్ కావడం వల్ల హీరోయిన్ శాంతిప్రియ కాస్త పొట్టిబట్టలు వేసుకుని ఉంది. దీంతో ఆమె మోకాలు కనిపించింది. అయితే అది చూసిన అక్షయ్.. ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలాందా అని అన్నాడు. అంత నల్లగా ఉన్నాయేంటి అని కూడా కామెంట్ చేశాడు. దీంతో సెట్లోని ఉన్నవాళ్లందరూ శాంతిప్రియని చూసి నవ్వారు. (ఇదీ చదవండి: అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!) డిప్రెషన్‌తో బాధపడ్డా 'నాకు అప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఆ సమయంలో అమ్మ నాకు అండగా నిలబడింది. నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటివి ఫేస్ చేసింది. నార్త్‌లోని కొన్ని మ్యాగజైన్స్ అయితే.. ముఖంపై మొటిమలు(పింపుల్స్) సంఖ్య బట్టి భానుప్రియ, తన సినిమాలకు పారితోషికం తీసుకుంటోందని రాసుకొచ్చారు' సారీ చెప్పలేదు తన స్కిన్ కలర్‌పై అప్పట్లో కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఓసారి ఈ విషయమై మాట్లాడుతూ.. జోక్ చేశానని అన్నాడు తప్పితే సీరియస్‌గా సారీ లాంటిదైతే అస్సలు చెప్పలేదని ఈమె తెలిపింది. ఇదిలా ఉండగా 1994 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. 2014లో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)