Shivaratri 2025
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడోసారి జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ యాత్రలో సింగపూర్‌లో ఉన్న 11-12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీంతోప్రముఖ దేవాలయాలు భక్తుల భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి.ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీకి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, శివ రామ్ ప్రసాద్, కిరణ్ కైలాసపు, లక్ష్మణ్ రాజు కల్వ , అందరికి కృతజ్ణతలు తెలియజేశారు.మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లోనే ఉండి జాగారం, ఉపవాసం చేసే భక్తుల కోసం హార్ట్ఫుల్నెస్ సింగపూర్ సహకారంతో, జూమ్ ద్వారా ఉచిత మెడిటేషన్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి,నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్ తదితర యాత్రను విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమానికి సింగపూర్‌లో పని రోజు అయినప్పటికీ భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు, స్పాన్సర్స్ కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
హరహర మహాదేవ! ఘనంగా శివరాత్రి వేడుకలు
సాక్షి, ముంబై: ముంబైలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పశ్చిమ అంధేరితోపాటు నగరంలోని పలుప్రాంతాల్లో శివాలయాలన్నీ మహాదేవుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. అంధేరి వెస్ట్‌లోని ఆరంనగర్, వర్సోవా, ఇతర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, విశేష పూజలతో ఆధ్యత్మిక సౌరభాన్ని వెదజల్లాయి. భక్తులు శివ భజనలు, శివ తాండవ స్తోత్రాలు, ఇతర భక్తి గీతాలతో ఆది దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా జాగరణ చేశారు. గురు వారం తెల్లవారుజామున ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివి ధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాలను అందించారు. వర్లీ, శివకృప క్రీడా మండల్ ఆధ్వర్యంలో... వర్లీ, నెహ్రూనగర్‌లో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివ మహాపూజ, సత్యనారాయణ మహాపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇకపై ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని మండల్ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో... ప్రముఖ ఆధ్యాత్మిక సంస్ధ ‘ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ్’ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న పద్మావతి భవనం ఆవరణలో బుధవారం ఉదయం, సాయంత్రం వివిధ భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పలు ఆధ్యాత్మిక సేవా సంస్ధలు, తెలుగు సంఘాల ప్రముఖులు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముఖ్య అతిథి, ఆంధ్ర మహాసభ సాంస్కృతిక శాఖ మాజీ ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ శివరాత్రి ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారి సంస్ధ చేపడుతున్న వివిధ సేవా కార్యాక్రమాలను గురించి రాధా మోహన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన భక్తులందరినీ ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు బి.కే.శీతల్ బేన్, బి.కే.పుష్పబేన్, బి.కే.అరుణబేన్ ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలు పంపిణీ చేసి కానుకలు అందజేశారు. అనంతరం సాయంత్రం జరిగిన ప్రవచన కార్యక్రమంలో యూబీటీ శివసేన ఎమ్మెల్సీ, రాష్ట్రపతి అవార్డు గ్రహిత సునీల్ శిందే, ప్రభాదేవి–దాదర్ నియోజక వర్గం ఎమ్మెల్యే మహేశ్ సావంత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్ధ ఆర్గనైజింగ్ ఇన్చార్జ్ డా.నాయిని రవి, తెలుగు డాక్టర్స్ అసోసియేషన్ (టీడీఎస్) అధ్యక్షుడు డా.ఎన్.ఎం.తాటి, మాజీ అధ్యక్షుడు డా.కే.ఆర్.దుస్సా, పదాధికారులు, సభ్యులు డా.స్వాతి, డా.వేముల గోదావరి, డా.పల్లాటి రాజు, డా. ఆడెపు, డా.ఎల్.ఎన్.గుడ్డేటి, డా.వేముల సుదర్శన్, డా.ఆర్.ఆర్.అల్లే, డా.శ్రీనివాస్, డా.వెంకటేశ్, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు, కార్యవర్గ పదాధికారులు ఏక్నాథ్ సంగం, వాసాల శ్రీహరి (వంశీ), నడిమెట్ల ఎల్లప్ప, వేముల మనోహర్, యాపురం వెంకటేశ్, షేర్ల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖపట్నం : శివనామస్మరణతో పులకించిన సాగరతీరం (ఫొటోలు)
-
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
విశాఖపట్నం : సాగరతీరంలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలు (ఫొటోలు)
-
ఆ పాట రాయడం శివుడి అనుగ్రహంగా భావిస్తున్నా
-
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
-
కీసరగుట్టలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
‘ఉమ’ నిస్టు సగమై సంగమమై!
లోకంలో భార్యను ప్రేమించే వారు చాలామంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత! శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్యలహరిలో అనేక ఉదాహరణ లున్నాయి కానీ... మచ్చుకు మొదటి రెండు శ్లోకాలు పట్టుకుంటే చాలు. ‘శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి‘శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీగురించి చెప్పాలంటే గతజన్మల్లో పుణ్యం లేకపోతే...బ్రహ్మ–విష్ణు–రుద్రులకైనా సాధ్య మవుతుందా? అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట ‘శివ‘ అని అయ్యవారితో మొదలుపెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి. ‘కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మేశివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్‘ శివపార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆది దంపతులు ఇద్దరూ సమానం. అమ్మవారి సౌందర్యానికి తగిన శబ్దసౌందర్యంతో సాగిన రచన ఇది. శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థగాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రక రకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం... ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టక΄ోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక, యోగ సాధనా రహస్యాలు దాగున్నాయి. కాళిదాసు రఘువంశ ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు–‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ‘అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి; పార్వతిలో భాగమైన శివుడికి; వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆదిదంపతులిద్దరికీ నమస్కారం పెట్టి... లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం. – పమిడికాల్వ మధుసూదన్ -
YS Jagan: రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-
శివరాత్రి శోభతో అలరారుతున్న తెలుగు రాష్ట్రాలు
-
నెట్టింట వైరల్ అవుతున్న 'మంగ్లీ' సాంగ్
తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే.. అంతలా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది శివుడి పాటలు పాడి అందరి ఇంట్లో తన గొంతును వినిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆమె ఈ శివరాత్రి కోసం 'భం.. భం.. భోళా' అంటూ అదిరిపోయే సాంగ్‌ను ఆలపించారు. చరణ్ అర్జున్ రచించిన ఈ పాటు మంగ్లీ సిస్టర్స్ పాడటమే కాకుండా తనదైన స్టైల్లో స్టెప్పులు కూడా వేశారు. శివభక్తుల్లో మంచి జోష్ నింపేలా సాంగ్ ఉండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.కోయంబత్తూర్‌లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక కేంద్రం ఈషా ఫౌండేషన్‌లో ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శివభక్తులు వస్తుంటారు. అక్కడ కూడా మంగ్లీ పాటలు పాడుతారు. కొన్నేళ్లుగా ఆమె సద్గురుతో పాటు శివరాత్రి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
మహా శివరాత్రి పర్వదినాన పరమశివుణ్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అభిషేకాలు, ఉపవాసాలు జాగారాలతో భక్తకోటి శివుణ్ని ఆరాధిస్తారు. రోజంతా నిష్టగా ఉవవాసం ఉండి, జాగరణ దీక్ష చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఎంత ఓపిక లేకపోయినా, తన శక్తికొద్దీ ఆ ముక్కంటిని పూజిస్తారు. ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కొందరు 24 గంటలు, మరికొందరు ఒక్క పొద్దు ఇలా పలువిధాలుగా ఉపవాస దీక్ష పాటిస్తారు. అయితే శివరాత్రి ఉపవాస దీక్ష అనగానే చాలామందికి గుర్తొచ్చేది చిలగడ దుంప. శివరాత్రికీ చిలగడదుంపకీ ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం రండి!మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష విరమించిన తరువాత భక్తులుచాలామంది చిలగడ దుంపతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఈ దుంపలో ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలే ఇందుకు కారణం. స్వీట్ పొటాటో లేదా చిలగడదుంపలను ధనసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. చిలగడ దుంపలను ఆరోజు తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఉపవాస అలసట నీరసం తగ్గి ఎక్కువ శక్తినిస్తుంది.చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్హల్దీ ఫంక్షన్లో హనుమాన్ హల్చల్.. వైరల్ వీడియోచిలగడదుంప ఆరోగ్య ప్రయోజనాలుచిలగడదుంపలలో విటమిన్లు ఏ, సీ, బీ,డీ, కే, జింక్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బీటా కెరోటిన్‌కు మంచి మూలం. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఎముకల బలానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా కేన్సర్, తదితర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది.ఇంకా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కళ్ళు పొడిబారడం, రాత్రి అంధత్వాన్ని నివారిస్తాయి. ఇందులోని విటమిన్ఏ కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందిఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. నాడీ , జ్ఞాపకశక్తి సామర్థ్యంలో మెరుగుదలను సాధిస్తాయి.మహా శివరాత్రి స్పెషల్గావీటిని పాలలో ఉడికించి తినవచ్చు. సలాడ్లు, కూర రూపంలో తీసుకోవచ్చు. చిక్కటి పాలు డ్రైఫ్రూట్స్‌తో కలిపి చిలగడ దుంప పాయసం లేదా చిలగడదుంప హల్వా చేసుకోవచ్చు -
Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్
మహాశివరాత్రి శైవభక్తులకు ఎంతో ఇష్టమైన పండుగ. అలాగే ఆ పరమశివుడికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైన పర్వదినం. ఫాల్గుణ మాసంలో చీకటి పక్షంలో పద్నాలుగో రోజున వస్తుంది,శివర్రాతి రోజు భక్తకోటి శివుడికి అభిషేకాలు చేస్తారు. రోజంతా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి సాయంత్రం శివలింగాన్ని పూజిస్తారు. దీపాలు వెలిగించి, రాత్రంతా ఆలయంలో గడుపుతారు. భారతదేశంలోని అనేక దేవాలయాలలో, రాత్రిపూట శివుడు, పార్వతిని అద్భుతమైన ఊరేగింపుగా పల్లకీపై తీసుకువెళతారు.మహాశివరాత్రి ధ్యానానికి కూడా మంచి సమయం. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రాలు, పురాణ పండితులు చెబుతున్న మాట. ఆయుర్వేద పరంగా కూడా ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆధ్యాత్మికంగా మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసును శుద్ధి చేయడానికి ఉపయోపడుతుంది. మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. ఉపవాసం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి పెరుగు తుంది. శివరాత్రి సమయంలో ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పంచేద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట.అయితే మన శక్తి, ఆరోగ్యస్థాయిని బట్టి ఉపవాసం చేయాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు కఠిన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని భక్తితో శివుణ్ణి తలచుకుని, విశ్వాసంతో పూజచేసుకొని, ఉంగలిగితనంత అంటే, ఒక పూట లేదా, ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉపవాసం ఉండి "ఓం నమః శివాయ" అని జపాన్మి స్మరించుకుంటే, ఆత్మకు శాంతిని, శివుని ఆశీస్సులను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసాన్ని శక్తిని బట్టి సాధ్యమైనంత తొందరగా ముగించేయాలి. చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం ఉపవాస రకాలునిర్జల ఉపవాసం.. 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోకూడదు. ఆరోగ్యం సహకరిస్తేనే ఈ ఉపవాసం చేయాలి.జల ఉపవాసం.. రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి.ద్రవ ఉపవాసం.. ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి.పాలు, పండ్ల ఉపవాసం.. పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.సాత్వికాహార ఉపవాసం.. ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, సాబుదాన కిచిడి, గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.నీరసం రాకుండా ఉండాలంటేముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి. చిత్తం ఆ పరమ శివుడిమీద పెడితే అస్సలు ఆకలే అనిపించదని భక్తులు చెబుతున్న మాట. భక్తితో, శివనామస్మరణతో రోజంతా గడపాలి. ఒకవేళ శారీరకంగా బాగా నీరసం అనిపిస్తే జాగ్రత్త పడాలి. ఉపవాసం తర్వాత మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి పండ్లు మాత్రమే తినాలి. ఈ రోజున, అరటిపండ్లు, ఆపిల్స్, బొప్పాయి, కొబ్బరి, దానిమ్మ మొదలైన పండ్లను తీసుకోవచ్చు.ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది.మాంసాహారం: శివరాత్రి పర్వదింన ఉపవాసం ఉండేవారు శాకాహారం మాత్రమే తినాలి. -
మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో ఉండే ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం, సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర ఇక్కడున్న శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓం అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటి నుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ ముని వల్లే ఇక్కడ పంచ బుగ్గ కోనేరు వెలసిందనీ... ఆ నీటితోనే పార్వతీపరమేశ్వరులకు రోజూ అభిషేకం నిర్వహిస్తారనీ చెబుతారు. వ్యాస మహర్షి అశ్వత్థనారాయణ స్వామి (ఆంజనేయస్వామి)ని ఇక్కడ ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలనూ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కశిరెడ్డి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఓ స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాడనీ ప్రతీతి. కశిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని ‘నాయనా’ అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట. ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడనీ, ఆయన పరమపదించాక అద్దాల మండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారనీ అంటారు. ధర్మస్థాపనకు కష్ణభగవానుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా రావొచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందనీ, అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా పదమూడు రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామనీ చెబుతారు. భక్తులే అన్నీ సమకూరుస్తారు కొండపైనున్న శివాలయంతోపాటూ ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1,500 మంది భోజనం చేస్తే కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో అయిదారు లక్షల మందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటరు ద్వారా కొర్ర అన్నం, రాగి,లడ్డూ వంటివి వడ్డిస్తారు. ఇరవై నాలుగు గంటలూ ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందనీ, ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారనీ అంటారు. అర్ధరాత్రో, అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారు. మార్చి 1 వరకు ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం మార్చి 1వ తేది వరకు ఉత్సవాలకు ఓంకార క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నాగప్రసాద్ తెలిపారు. 25న బండిఆత్మకూరు గ్రామంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. 26న ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాలతో బండిఆత్మకూరు గ్రామం నుంచి బయలుదేరి శింగవరం, సోయయాజులపల్లె, గ్రామాల్లో గ్రామోత్సవం జరిపి ఆలయ ప్రవేశం చేసి, గణపతిపూజ, రక్షాబంధనం, ద్వజరోహణం, వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి ఉత్సవమూర్తులకు కళ్యాణం ఉంటుంది. 27న నంది వాహనోత్సవం, 28న రథోత్సవం అనంతరం వసంతోత్సవం ఉంటుంది. మార్చి 1న స్వామివారు ఓంకారం నుంచి బయలుదేరి బండిఆత్మకూరు చేరటంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. ఎలా రావాలంటే..భక్తులు ఓంకారం చేరుకునేందుకు నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వసులు ఏర్పాటు చేశారు. (చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం) -
Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం
మహాశివరాత్రి పర్వదినంకోసం ముంబైతోపాటు రాష్ట్రంలోని శివాలయాలన్నీ ముస్తాబ వుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, పర్లి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి కొన్ని విశేషాలు.... త్రయంబకేశ్వర్.. జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రం నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని నల్లరాతితో అద్భుత శిల్ప నైపుణ్యంతో నిరి్మంచారు. ఇక్కడ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర..ఇలా ముగ్గురి ముఖా లున్న స్వర్ణకవచంతో త్రిముఖ లింగంగా వెలుగొందుతోంది. పాండవుల కాలం నుంచి శివలింగాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో మహా శివరాత్రితోపాటు శ్రావణ మాసంలోనూ విశేష పూజలను నిర్వహిస్తారు. పర్లీ వైద్యనాథ్..బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైధ్యనా««థ్ దేవాలయ నిర్మాణ కాలం ఇతమిద్ధంగా తెలియదు. అయితే క్రీ.శ.1706 లో రాణి అహల్యాదేవి హోల్కర్ దీన్ని పునఃనిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్రం చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, ఔషధ మొక్కలతో అలరారు తుంటుంది. ఈ కారణంగా పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని భక్తుల కథనం. ఔండా నాగనాథ్ ..ఈ క్షేత్రం రాష్ట్రంలోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీలు (భక్తుల సముదాయం) నాగనాథ్ ఆలయంలో భజనలు చేస్తుండగా పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని పూజారి బయటకువచ్చి చెప్పాడు. దీంతో వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగించారట. వారి భజనలకు ముగ్దుడైన శివుడు వెనకవైపుకు తిరిగి వారి భక్తిగానాన్ని ఆలకించాడట. ఇందువల్లే ఈ ఆలయంలో నందీశుడు మందిరం వెనుక భాగంలో దర్శనమిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. భీమశంకర్..పుణేకు 128 కిమీ దూరంలో భీమశంకర్ క్షేత్రం ఉంది. భీమా నదీ తీరంలో ఉన్నందువల్లే ఈ క్షేత్రానికి భీమశంకర్ అనే పేరువచ్చిందని స్థానికులు నమ్ముతారు. భీమశంకర్ దేవాలయాన్ని పదమూడో శతాబ్దంలో నిరి్మంచారని, దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించారని చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. భీమశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో నిర్మించారు. ఘృష్ణేశ్వర్ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ ఘృష్ణేశ్వర్ క్షేత్రాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆ«ధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని ఘృష్ణేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు. కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది. దీంతో ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఘృష్ణేశ్వర క్షేత్రంగా పేరు వచ్చిందదని పురాణ కథనం. మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలురామనాథస్వామి లింగం, రామేశ్వరంశ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం), శ్రీశైలంభీమశంకర లింగం, భీమా శంకరంఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం, ఎల్లోరా గుహలుత్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)సోమనాథ లింగం, సోమనాథ్నాగేశ్వర లింగం, దారుకావనం (ద్వారక)ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు, ఓంకారక్షేత్రంవైద్యనాథ్ జ్యోతిర్లింగం, డియోఘర్ (జార్ఖండ్)కేదారేశ్వర లింగం, హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉందివిశ్వేశ్వర లింగం - వారణాశికేదారేశ్వర్: కేదార్నాథ్ -
ఆనతి నీయరా! మహాశివరాత్రికి వైభవంగా ముస్తాబవుతున్న మహేశ్వరం
ఆనతి నీయరా హరా.. సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా.. సన్నిధి చేరగా.. నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం.. అన్నట్లు శివరాత్రి ఉత్సవాలకు నగరం చుట్టుపక్కల ఉన్న పలు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. విద్యుత్ కాంతుల ధగధగలతో దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతున్నాయి. యాత్రికుల కోసం ఆయా ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అన్ని రకాల ఏర్పాట్లనూ పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా నగరానికి చేరువగా ఉన్న కీసరగుట్టలోని శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తోంది దేవాలయ కమిటీ. దీంతో పాటు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.. ఈ నేపథ్యంలో వీటి గురించిన మరిన్ని విశేషాలు.. – కీసర, మహేశ్వరం నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి మధ్యన కీసరగుట్టలో కొలువుదీరిన శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా శివరాత్రికి లక్షల సంఖ్యతో భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. నేటి నుంచి మార్చి 1 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. సికింద్రాబాద్ నుండి కీసరగుట్టకు బస్సుసౌకర్యం ఉంది. ఇసీఐఎల్ నుండి 15 కిలోమీటర్ల ప్రయాణం. బ్రహోత్సవాల సందర్భంగా నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ వారు 200 ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇదీ స్థలపురాణం.. కీసరగుట్టలో భక్తులచే పూజింపబడుతున్న శ్రీరామలింగేశ్వరుడు స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్టించబడినట్లు ప్రతీతి. రావణుడు తపస్సు ద్వారా బ్రహ్మత్వంపొందాడు. రావణబ్రహ్మను హతమార్చినందువల్ల బ్రహ్మహత్యాదోషం అంటకుండా శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివలింగార్చన చేయాలనుకుంటాడు. కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుని పంపిస్తాడు. సమయం మించిపోతున్నా హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముడు ప్రార్థన ఆలకించిన శివుడు స్వయంగా లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగాన్నే శ్రీరాముడు ప్రతిష్టించి పూజచేశాడని స్థలపురాణం చెబుతోంది. మూడు ప్రత్యేకతలు.. ఈ ఆలయానికి మూడు ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలో శివలింగం సైకత లింగం (ఇసుకతో చేసినది)గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరేయబడ్డట్టుగా చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉంటాయి. గుట్ట పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉంది. వీటికి భక్తులు తైలాభిషేకాలు చేస్తారు. వీటితోపాటు జైన విగ్రహాలు, గర్భాలయంలో అభిషేకం నీరు ఎటు వెళ్తాయో ఇప్పటికీ తెలియకపోవడం ఇక్కడి విశేషం. మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 25 మంగళవారం నుండి మార్చి 1 శనివారం వరకూ ఉత్సవాలు జరుగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ అల్లె కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గంగలో శివుడు, పార్వతి ఉండడం ఇక్కడి ఆలయ విశేషం. బ్రహ్మోత్సవాలకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు రానున్నట్లు తెలిపారు. నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చారి్మనార్ నుంచి 253ఎం, 253టి, 253కె, 253హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఏ, 253ఎం, జూబ్లీ బస్సు డిపో నుంచి 253ఎం బస్సుల సౌకర్యం ఉంది. దీంతో పాటు పలు డిపోల నుంచి ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.చరిత్రలోకి వెళితే.. తానీషా నవాబు వద్ద మంత్రులుగా చేసిన అక్కన్న మాదన్నలు 1672లో తమ పర్యటనలో భాగంగా శిథిలావస్థలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 1677లో ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా మార్గమధ్యలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు చరిత్ర చెతుతోంది. ఆలయంపై 1687లో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు తన సైన్యంతో దాడి చేసి గుడిని ధ్వంసం చేసినట్లు చెబుతుంటారు. నాటి శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. శివగంగ చుట్టూ 16 శివాలయాలు ఉండటం దీని ప్రత్యేకత. చారిత్రక ప్రశస్తి.. కీసరగుట్ట ప్రాంతాన్ని క్రీ.పూ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకూ విష్ణుకుండినుల పాలించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. పుట్టుకతో బ్రాహ్మణులైన క్ష్రతియులుగా వ్యవహరించిన విష్ణుకుండినులు కీసరగుట్టను విజయానికి చిహ్నంగా భావించి ఆయుధాగారంగా వృద్ధిచేశారు. విష్ణుకుండినులలో శ్రేష్టుడైన రెండో మాధవవర్మ నరమేధయాగం ఇక్కడే చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఆ కాలం నాటి అవశేషాలు, నాణేలు, మట్టిపాత్రలు, అలంకరణ వస్తువులు, రేకులు, రాజప్రాసాదాలు బయటపడ్డాయి.అన్ని ఏర్పాట్లూ చేశాం.. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాం. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. – అల్లె కుమార్, శివగంగ రాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, మహేశ్వరం -
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
ఎత్తైన పంచముఖ మహాశివలింగం, కొలువైన శివపరివారం ఎక్కడో తెలుసా?
36 అడుగుల పంచముఖ మహాశివలింగం 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు, 40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు. అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు. (ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?) ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది. పూజ చేస్తున్న ముస్లిం మహిళఎలా వెళ్ళాలంటే...ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) అంతా శివయ్య మహిమే!మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు