Sweating smell
-
తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..?
చెమట పట్టడం అందరిలో కనిపించే ఓ జీవక్రియ. వాతావరణంలో వేడిమి పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా దేహ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు చెమటలు పట్టి... అవి దేహంలోని ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి కావడంతో దేహం చల్లబడుతుంది. ఇదే పని వ్యక్తులు శారీరక శ్రమ చేసినప్పుడూ, బాగా ఆటలాడినప్పుడూ జరుగుతుంది. అంతేకాదు... బాగా ఆందోళనకు గురైనప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది మానవ మనుగడకు ప్రకృతి చేసిన ఏర్పాటు. కొందరిలో అతిగా చెమటలు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు తెలిపే కథనమిది. మనుషుల్లో ఎక్రైన్ అలాగే అపోక్రైన్ గ్లాండ్స్ అనే రెండు రకాల గ్రంథులుంటాయి. వీటిల్లో ఎక్రైన్ గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు పుట్టినప్పటి నుంచీ ఒంటి నిండా వ్యాపించి ఉంటాయి. అయితే అపోక్రైన్ గ్రంథులనేవి బాహుమూలల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండి, కొంతకాలం తర్వాత (అంటే ముఖ్యంగా యుక్తవయసుకు వచ్చాక) అవి క్రియాశీలమవుతాయి. అందుకే చిన్నప్పుడు కాకుండా యుక్తవయసుకు వచ్చాకే బాహుమూలాల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టడం మొదలవుతుంది. చెమటలు పట్టడం కొందరిలో మరీ ఎక్కువ...కొందరిలో చెమట పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలూ ఎదురవుతాయి. కొందరిలో అరికాళ్లు తేమగా అవుతుంటాయి. మరికొందరిలో అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడంతో ఏది పట్టుకున్నా తడిసిపోవడం, జారిపోవడం కూడా జరుగుతుంటుంది. ‘హైపర్ హిడరోసిస్’లో మళ్లీ రెండు రకాలు. అవి... జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్ (దేహమంతటా విపరీతంగా చెమటలు పట్టడం) లోకలైజ్డ్ హిడరోసిస్ (దేహంలోని కొన్ని చోట్లలోనే చెమటలు ఎక్కువగా పట్టడం). జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు... చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నందున చెమటలు పట్టడం పెద్దగా జరగదు. కానీ వేసవిలో... అందునా మార్చినుంచి వాతావరణంలో వేడిమి పెరగడంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చెమటలకు మరికొన్ని కారణాలు... విపరీతమైన దేహశ్రమ లేదా వ్యాయామం తర్వాత వైరల్ ఫీవర్స్, మలేరియా, క్షయ వంటి జబ్బులతో జ్వరం వచ్చి తగ్గాక గుండెకు సంబంధించిన వ్యాధుల్లో అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్స్‌లో ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్‌లో (అంటే హైపర్ పిట్యుటరీజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్కసులినోమా, డయాబెటిస్ వంటి సమస్యల్లో) లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో గర్భిణుల్లో అలాగే మెనోపాజ్‌కు దగ్గరవుతున్నప్పుడు స్థూకాలయం ఉన్నవారిలో మద్యం తాగాక ఫ్లూయాక్సిటిన్ వంటి మందులు వాడుతున్నప్పుడు పార్కిన్సన్స్ జబ్బులున్నవారిలో, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ సమస్యలున్నవారిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.లోకలైజ్డ్ హైపర్ హిడరోసిస్ రకాలు... ఎమోషనల్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : తీవ్రమైన ఉద్విగ్నత ఉన్నప్పుడు లేదా ఉద్వేగాలు లేదా భయాలకు లోనైనవారిలో అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుండటం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ : బాహుమూలాల్లో చెమటలు పట్టడం ∙గస్టెటరీ హైపర్ హిడరోసిస్ : బాగా వేడివీ లేదా బాగా ఘాటైన మసాలాలతో కూడిన ఆహారాలు తీసుకుంటున్నప్పుడు కొందరిలో పెదవుల చుట్టూ లేదా ముక్కు మీద, నుదుటి మీద, తలలో విపరీతంగా చెమటలు పట్టడం పోశ్చరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ : కుర్చీల్లో కూర్చున్నప్పడు లేదా సీట్‌కు అనుకుని ఉన్న శరీరభాగమంతా చెమటలు పట్టడం వంటి రకాలు కూడా చూడవచ్చు ఎమోషనల్ లేదా ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : ఉన్నవాళ్లలోనూ కాస్త వైవిధ్యమైన లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కొందరిలో అరచేతులు, అరికాళ్లలో మాత్రమే చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి లక్షణాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి కొందరిలో వేసవిలో అరచేతుల్లో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంతో చేతుల్లోని వస్తువులు తడిసిపోవడం, జారిపోవడం జరుగుతుండవచ్చు. అలాగే కాళ్ల నుంచి చెమటలు కారుతున్నప్పుడు వాళ్ల అరికాళ్ల గుర్తులు నేల/గచ్చు మీద కనిపిస్తుంటాయి. కొందరిలో చెప్పులూ జారిపోవచ్చు ఇంకొందరిలో పగటిపూట చాలా ఎక్కువగానూ, రాత్రుళ్లు తక్కువగానూ, నిద్రలో పూర్తిగా లేకుండానూ ఉండవచ్చు. లేదా మరికొందరిలో దీనికి పూర్తి భిన్నంగా ఉండవచ్చు.ఇలా చెమట పట్టేవారిలోనూ రెండు రకాలుగా చెమటలు పట్టవచ్చు. అవి... కంటిన్యువస్ స్వెటింగ్ : చెమటలు నిరంతరమూ ధారాపాతంగా పడుతుండవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.ఫేజిక్ స్వెటింగ్ : ఏ చిన్న పనిచేసినా లేదా ఏ చిన్నపాటి ఒత్తిడికి గురైనా అప్పడు మాత్రమే కంటిన్యువస్‌గా చెమటలు పడతాయి.అరచేతులూ... అరికాళ్లలో చెమటలతో సమస్యలిలా... పిల్లల్లో ఇలా చెమట పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమటలు ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగి΄ోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలు సాధారణంగా చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారి΄ోతుంటాయి∙ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం లేదా నిర్భయంగా షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం కొందరిలో నడుస్తుండగానే చెప్పులు / పాదరక్షణలు జారిపోవడం (ఇలాంటివారు షూ వేసుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనమే ఉంటుంది. అయితే విపరీతమైన చెమటల కారణంగా వారి మేజోళ్లు తడిసి΄ోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన పొడి మేజోళ్లు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటలు, మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: చర్మానికి సంబంధించిన అలర్జీలు రావడం ∙పామ్ఫోలిక్స్ : చర్మంపై చిన్న చిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం పిట్టెడ్ కెరటోలైసిస్ : చర్మానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం డర్మటోఫైటోసిస్: చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం.చికిత్సలు... చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గి΄ోతుంది. తగ్గకపోతే ఈ కింది సూచనలు/చికిత్సలు అవసరమవుతాయి. యాంటీ పెర్స్పెరెంట్లు : ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫార్మాల్డిహైడ్, గ్లూటరాల్ డిహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్ హెగ్జాహైడ్రేట్... వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. యాంటీ పెర్స్పిరెటంట్లు ఎక్కువగా లేదా డాక్టర్ సలహా లేకుండా వాడటం వల్ల కాంటాక్ట్ డర్మటైటిస్ అనే అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ డియోడరెంట్లు : ఇవి చెమటను తగ్గించవు, నిరోధించవు. కానీ చెమట వల్ల దుర్వాసనను కొంత తగ్గిస్తాయి. అయాన్ ఫోరోసిస్ : ఇదికరెంట్ ద్వారా చేసే చికిత్స బొట్యులినమ్ టాక్సిన్ : ఇదో రకం విషం. ఇంజెక్షన్ సహాయంతో చేసే చికిత్స ఇది శస్త్రచికిత్స : సింపాథెక్టమీ అనే సర్జరీ. (ఇటీవల దీన్ని ఎక్కువగా సిఫార్సు చేయడం లేదు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నందున అంతగా ప్రోత్సహించడం లేదు).జాగ్రత్తలు... రోజూ స్నానం చేయాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచిది ∙మాయిష్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు ధరించడం మేలు ఎప్పటికప్పుడు బాగా ఉతికిన, శుభ్రమైన బట్టలనే ధరిస్తుండాలి. (చదవండి: ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?) -
చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..
చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. చెమట వల్ల సమస్యలు ►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. ►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ►టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ తుడుచుకోవలసి వస్తుంది. ►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం ►నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే.. ► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ►మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది. ►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు «ధరించడం మంచిది. ►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి. శరీర దుర్వాసన ►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. ►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది. ►గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది. ►బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి. ► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి. ►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ►డియోడరెంట్ వాడవచ్చు. లేదంటే టాల్కమ్ పౌడర్ రాసుకోవడం. ►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి. తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే! చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. ఎలా బయటపడాలి? ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.) ►రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి. ►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. ►అలోవెరా జెల్లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. -
నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి
Mexican Influencer Odalis Santos Mena: మెక్సికన్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యంగ్ బాడీ బిల్డర్ ఒడాలిస్ సాంటోస్ మీనా శస్త్ర చికిత్స వికటించి మృత్యువాతపడింది. 23 ఏళ్ల ఒడాలిస్ తన శరీరంలోని చెమటను నివారించేందుకు చేసుకున్న సర్జరీ వికటించి జూలై7న ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల మెక్సికోలోని గ్వాడాలజారాలోని స్కిన్పీల్ క్లినిక్ అండర్ ఆర్మ్(బాహువుల కింద) చెమటను తగ్గించడానికి చేసే చికిత్స ‘నో స్వెట్’ను ప్రోత్సహించడానికి ఓడాలిస్ను ప్రమోటర్‌గా నియమించుకుంది. ఇందులో చెమట గ్రంథులను తొలగించడానికి హీట్ ఎనర్జీని ఉపయోగిస్తూ చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని దుర్వాసన, అండర్ ఆర్మ్ జుట్టును తగ్గించడానికి దోహదపడుతుంది. తాజాగా ఒడాలిస్ ‘నో స్వెట్’ చికిత్సను చేయించుకున్నారు. అయితే శస్త్రచికిత్సలో భాగంగా అధిక అండర్ ఆర్మ్ చెమటను నిరోధించేందుకు ఒడాలిస్ చెమట గ్రంథులను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో మత్తుమందు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే క్లినిక్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్ ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఒడాలిస్ చనిపోయారు. కాగా ఒడాలిస్ మృతిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు అందించిన మత్తుమందు, స్టెరాయిడ్ ప్రభావం వల్లే మరణించినట్లు పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లినిక్‌లో శిక్షణ లేని వ్యక్తి మత్తుమందు ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని అక్కడి మరో మీడియా పేర్కొంది. ఇక సాంటోస్ మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంది. అలాగే 2019లో మిస్ మరియు మిస్టర్ హెర్క్యులస్ టైటిల్‌తో పాటు వెల్నెస్ ఫిట్నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలిచింది View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) -
అమ్మాయిలను ఆకర్షించాలంటే....
సిడ్నీ: అమ్మాయిలను ఆకర్షించేందుకు యువకులు అనేక విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు రకరకాల రీతుల్లో హేర్ కట్ చేసుకొని, స్టైలిష్‌గా దుస్తులు వేసుకుంటారు. మరి కొందరు నీట్‌గా గడ్డం గీసుకొని గుభాలించే గులాబీ అత్తరును ఒళ్లంతా పూసుకుంటారు. మరికొందరు నీవులేక నేను లేను...నేను లేక నీవు లేవు...అని కూనిరాగాలు కూడా తీస్తారు. ఇక అలాంటి అగచాట్లు మగవాళ్లకు అక్కర్లేదని, మగవాళ్ల చెమట నుంచి వచ్చే సువాసనలకు అమ్మాయిలు పడిపోతారని, అందుకు ఓ చిట్కా కూడా ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. శరీరం నుంచి వెలువడే చెమట ఆడవాళ్లను ఆకర్షించే సువాసనలను వెదజల్లాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మంచి ప్రొటీన్లు కలిగిన కూరగాయల సలాడ్లు, పండ్లు తీసుకోవాలి. వీలైనంత మేరకు కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇవి తిన్నవారి మగవాళ్ల చెమట నుంచి సుమధుర సువాసనలు వెలువడుతాయట. ఆ వాసనను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. కోడి, మేక మాంసం తినే అలవాటున్న నాన్ వెజిటేరియన్ మగవాళ్ల నుంచి కూడా ఇలాంటి సువాసనలే వెలువడుతాయట. ఏదేమైనా కార్బోహైరేట్లను మాత్రం గణనీయంగా తగ్గించాలట. కార్బోహైరేట్లు ఎక్కువగా ఉన్న మగవారి చెమట కంపు కొడుతుందట. ఈ విషయాన్ని సిడ్నీలోని మాక్వారీ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ ఐయాన్ స్టీఫెన్ బృందం తొమ్మిది మంది ఆడవాళ్లు, 43 మంది మగవాళ్లపై పరిశోధన జరిపి తేల్చారు. ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో తమ పరిశోధన వివరాలను వివరించారు. స్టీఫెన్ ఈ ప్రయోగం కోసం ముందుగా 43 మంది యువకుల నుంచి వారి చెమటను సేకరించారు. వాటిలో ఏ చెమట మధురంగా ఆస్వాదించేలా ఉందో, ఏ చెమట శాంపిల్ కంపుకొడుతూ అసహ్యించుకునేలా ఉందో కనుక్కోవాల్సిందిగా పరీక్ష పెట్టారు. తొమ్మిది మంది మహిళులు అభిప్రాయాలను తీసుకొని 43 మంది చెమటకు గ్రేడ్లు కేటాయించారు. ఆశ్చర్యంగా కూరగాయ సలాడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకొని, కార్బోహైడ్రేట్స్‌ను తక్కువగా తీసుకునే వారి చెమటకే ఆ మహిళంతా ఓటేశారు. తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకొని మాంసం ఎక్కువగా తీసుకునే వారి చెమటను కూడా కొంచెం తక్కువగా అదే గ్రేడ్‌ను కేటాయించారు. స్టీఫెన్ బృందం స్పెక్ట్రోమీటర్ ద్వారా మగవాళ్ల చెమటోవున్న ‘కరోటినాయిడ్స్’ను లెక్కించారు. కరోటినాయిడ్స్ ఎక్కువగా వున్న మగవాళ్ల చెమటనే మహిళలు గ్రేడ్ వన్‌గా నిర్ణయించారు. కూరగాయలు, పండ్లు, మాంసం ఎక్కువగా తీసుకునే వారిలోనే కరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ స్టీఫెన్ తెలిపారు. ప్రోటీన్లకన్నా కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకున్న వారి చెమట వాసనకు ఆడవాళ్లు ముక్కులు మూసుకున్నారు. కంపు అంటూ ఛీదరించుకున్నారు. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునే వారిలో కరోటినాయిడ్స్ తక్కువగా ఉంటుందట. అందుకని వారి నుంచి వెలువడే చెమట వాసన బాగుండదట. అనంతరం స్టీఫెన్ బృందం చెమట సేకరించిన 43 మంది అహార అలవాట్ల గురించి ముందుగానే సేకరించిన సమాచారంతో ఆడవాళ్లు కేటాయించిన గ్రేడ్లను పోల్చి చూశారు. గ్రేడ్లకు, మగవాళ్ల ఆహారపు అలవాట్లకు సరిపోయిందని ఈ పరిశోధన ద్వారా తేల్చారు. అయితే ఇదే ప్రయోగం ఆడవాళ్ల చెమటపై కూడా జరపాలని అనుకుంటున్నామని స్టీఫెన్ బృందం తెలిపింది. మగవాళ్ల వద్ద నుంచి వచ్చే ఒకవిధమైన వాసన ఆడవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చారు.