Top Stories
ప్రధాన వార్తలు

Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్‌కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్)

అక్షర్ధామ్ టెంపుల్‌కు చేరుకున్న జేడీ వాన్స్..
US Vice President JD Vance Tour Updates..అక్షర్ధామ్ టెంపుల్‌కు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి అక్షర్ధామ్ టెంపుల్ చేరుకున్న జేడీ వాన్స్భారీ భద్రత మధ్య అక్షర్ధామ్ టెంపుల్‌కు జేడీ వాన్స్ #WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, reach Akshardham Temple. pic.twitter.com/y0D2zp1lBi— ANI (@ANI) April 21, 2025 భారత్ చేరుకున్న జేడీ వాన్స్..👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్.. సోమవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం దిగారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. 👉కాగా, వాన్స్ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్ పిల్లులు.. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్‌పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో వారు ఢిల్లీలోని అక్షర్ధామ్ టెంపుల్‌కు వెళ్లనున్నారు.#WATCH | Delhi: Visuals from the Akshardham Temple where Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, will visit shortly.Akshardham Temple Spokesperson Radhika Shukla says, "The Vice President and the Second Lady are coming… pic.twitter.com/yEKwdZemVj— ANI (@ANI) April 21, 2025👉అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance arrive at Palam airport. pic.twitter.com/iCDdhYLVdz— ANI (@ANI) April 21, 2025👉విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్, అమెరికా సంబంధాలపై మాట్లాడతారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1— ANI (@ANI) April 21, 2025👉ఈనెల 23వ తేదీ(బుధవారం) ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children welcomed at Palam airport. Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/ocXCXOdmgQ— ANI (@ANI) April 21, 2025

మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests."Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025

ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 21) గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది కోర్ట్ (Court: State vs a Nobody). హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) రివ్యూ ఇచ్చాడు.కోట్లు పెట్టి టెన్షన్ పడేకన్నా..పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అద్భుతమైన రచయితలు, దర్శకులు చూపించే స్క్రీన్‌ప్లే విధానాన్ని, కథా నైపుణ్యాన్ని రామ్ జగదీష్ ఫాలో అయ్యాడు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్‌ను సైతం అభినందించాల్సిందే! దాదాపు ఐదారు కోట్లతో తీసిన ఈ మూవీకి రూ.66 కోట్ల పైనే కలెక్షన్స్ వచ్చాయి. కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీసి టెన్షన్ పడేకంటే.. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీస్తే ఇలా కోర్ట్లాగే విజయాలు వస్తాయని నిరూపితమవుతోంది. ఆయనకు ఇంకొన్ని సీన్లు పడాల్సిందిసినిమాలోకి వెళ్తే.. హీరోకు చాలా భవిష్యత్తు ఉందని మొదలుపెట్టి.. అతడి బతుకును శూన్యం చేసే దిశగా స్క్రీన్‌ప్లే నడిచింది. సినిమాలో రెండురకాల న్యాయవాదులుంటారు. అందులో ఒకరు హీరోకు సపోర్ట్ చేయకుండా అవతలివారికి అమ్ముడుపోయారు. న్యాయవాదుల్లో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా? అని చూపించారు. న్యాయం, ధర్మం అమ్ముడుపోతే ఈ సమాజం నిలబడదు. శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) మంచి ఆర్టిస్ట్. ఆయనకు ఇంకొన్ని సీన్లు పడుంటే బాగుండనిపించింది. పేరెంట్స్ మాట వినరుసినిమాలో హీరోయిన్ మైనర్ అని మనకు ముందే చెప్పరు. దీనివల్లే కథనం ఆసక్తికరంగా సాగింది. లేదంటే కథ ముందే గెస్ చేసేవాళ్లు. కథ ఊహించేట్లుగా ఉంటే సినిమాలు ఆడవు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చదువుకోమని చెప్తుంటే పిల్లలు పెడచెవిన పెడ్తున్నారు. వాళ్లందరికీ ఇదొక అద్భుతమైన మెసేజ్. పేరెంట్స్ మనసు తెలుసుకోండి. చదువును మించినదంటూ ఏదీ లేదు. ముందు జ్ఞానం సంపాదించుకోవడమే ముఖ్యం.క్లైమాక్స్ ఊహించలేకపోయాఇక వయసులో ఉన్న పిల్లలు గదిలో 16 నిమిషాలు ఏం చేశారన్న ఉత్కంఠను పెంచారు. అక్కడ ఏం జరిగిందనేది నేను కూడా ఊహించలేకపోయాను. చివర్లో అందర్నీ బయటకు వెళ్లగొట్టి జాబిలి స్టేట్మెంట్ తీసుకుంటారు. గదిలో వాళ్లు పెళ్లిని ప్రాక్టీస్ చేసినట్లు చూపించారు. దీంతో అబ్బాయి నిర్దోషి అని తేలుతుంది. కోర్టును తప్పుదోవ పట్టించిన మంగపతి, లాయర్, పోలీసులపై చర్యలు తీసుకుంటారు.చప్పట్లు కొట్టాఇదంతా జరిగాక అబ్బాయి మళ్లీ చదువుకోవడానికి వెళ్లాడు. అప్పుడు ఆ అమ్మాయి నాకు 18 ఏళ్లు నిండాయని అబ్బాయిని హత్తుకోగానే నేను కూడా చప్పట్లు కొట్టాను. ఇప్పుడిద్దరూ మేజర్లు కాబట్టి ఏ కేసులు గట్రా ఉండవు. వాళ్లిద్దరూ చదువుకుని, గొప్పవాళ్లయి పెళ్లి చేసుకున్నారని చూపించుంటే బాగుండేదనిపించింది. ఇదొక్కటే మిస్ అయ్యారేమో అనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా చాలా బాగుంది అని పరుచూరి చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్

Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు.
సినిమా

సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
తమిళ నటుడు కాదల్ సుకుమార్ కోలీవుడ్‌లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. శింబు కాదల్ వావ్తిల్లై (కుర్రాడొచ్చాడు), కమల్ హాసన్ విరుమాండి(పోతురాజు) వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుని ఛాన్సులు అందుకున్నాడు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన కాదల్ (ప్రేమిస్తే) చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభించినందున అతన్ని కాదల్ సుకుమార్ అని పిలుస్తారు. ప్రస్తుతం తిరుట్టు విశీల్, షుమ్మవే ఆడువోమ్ అనే 2 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌లు కూడా ఆర్ధాంతరంగానే ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాల్లో నటించే ఛాన్స్‌లతో పాటు కొత్తగా దర్శకత్వం వహించడానికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కాదల్ సుకుమార్ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలో చైన్నె టీనగర్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఒక నటి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు కాదల్ సుకుమార్ తనను పెళ్లి చేసుకుంటానని, 3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 7 లక్షలు డబ్బుతో పాటు నగలు తీసుకుని మోసం చేశాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సుకుమార్‌పై కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కాదల్ (ప్రేమిస్తే) సినిమా తెలుగులో కూడా విడుదలైంది. దీనిని దర్శకుడు శంకర్ తన బ్యానర్‌పై తక్కవ బడ్జెట్‌తో నిర్మించారు. భరత్, సంధ్యలకు పెళ్లి జరిపించిన స్టీఫెన్ పాత్రలో సుకుమార్ కనిపిస్తాడు. ఈ పాత్రతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచయమేనని చెప్పవచ్చు.

భారీ విశ్వంభర
‘విశ్వంభర’ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతున్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయిందట. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసమే రూ. 75 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. సో... విజువల్స్ పరంగా ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
ప్రియదర్శి (Priyadarshi Pulikonda).. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొమ్మిదేళ్లలోనే తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మొదట్లో హీరో స్నేహితుడిగా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ పోయిన అతడు ప్రస్తుతం కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు. కోర్ట్‌తో సంచలన విజయాన్ని సాధించిన ప్రియదర్శి సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఎంజాయ్ చేస్తున్నానంతే..ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియదర్శి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రియదర్శి మాట్లాడుతూ.. నా తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని చూసి నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఇంకా కూడా ఏదో చేయాలన్న తపన ఉంది. కాకపోతే ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఏమవ్వాలో తెలియదు కానీ ఎలా ఉండకూడదో మాత్రం బాగా తెలుసు.నేను కమెడియన్ కాదుఅయితే నన్ను నేను కమెడియన్ (Comedian) అనుకోలేను. ఎందుకంటే సత్య, వెన్నెల కిశోర్‌లా కామెడీ చేయలేను. ఆ విషయం నాకు తెలుసు. నేను కమెడియన్ అవుతానని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌లను చూసి వీళ్లలా యాక్టింగ్ చేయాలనుకువాడిని. ఇన్నేళ్ల కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్ సినిమా ఒప్పుకోవడమే! మిఠాయి సినిమా (Mithai Movie) చేయడం చెత్త నిర్ణయంగా భావిస్తాను.(చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్)పొరపాట్ల నుంచే నేర్చుకోగలంఎందుకంటే ఈ సినిమాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అటు దర్శకుడు కూడా పూర్తిగా మనసు పెట్టి తీయలేదు. సినిమాలు ఎలాంటివి చేయాలి? ఎలాంటివి చేయకూడదు? అన్న విషయం నేర్పించింది మిఠాయి సినిమానే.. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఎంతో నేర్చుకోగలం. ఉదాహరణకు గతంలో నేను చాలా సిగరెట్లు తాగేవాడిని. దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలుసుకున్నాను కాబట్టే మానేశాను అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.సినిమాప్రియదర్శి.. 2016లో వచ్చిన టెర్రర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. తొమ్మిదేళ్ల ప్రయాణంలో 50కు పైగా సినిమాలు చేశాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పెళ్లిచూపులు, బలగం, మల్లేశం, 35:చిన్న కథ కాదు, మంగళవారం, కోర్ట్ వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: సౌత్‌లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!

పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
బిగ్ బాస్ షోతో పరిచయమై.. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకున్న జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అబ్బాయి ముస్లిం అయినప్పటికీ.. ఆమ్మాయి ఇష్టప్రకారం హిందు సంప్రదాయంలోనే పెళ్లి జరగడం విశేషం.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)2012 నుంచి సినిమాలు చేస్తున్న నటి పావని రెడ్డి.. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 తదితర చిత్రాలు చేసింది. తమిళ, తెలుగులో పలు సీరియల్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది.పావనికి ఇదివరకే 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది. పావని ఓ తెలుగు సీరియల్ చేస్తున్న టైంలో ఇతడి పరిచయమయ్యాడు. కాకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్ లోకి వెళ్లిన ఈమె.. దాన్నుంచి తేరుకుని షోలు చేయడం మొదలుపెట్టింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)అలా తమిళంలో బిగ్ బాస్ 5వ సీజన్ లో పావని పాల్గొంది. ఇదే షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకి విషయం చెబితే తొలుత నో చెప్పింది గానీ కొన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా 2022 నుంచి ఆమిర్-పావని రెడ్డి రిలేషన్ షిప్ లో ఉన్నారు.దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పలు షోల్లోనూ జంటగా పాల్గొని విజేతగానూ నిలిచారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి పావని బయటపెట్టింది. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఆమిర్-పావని పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్)
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక
క్రీడలు

CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్‌లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్‌కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్‌లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025

ఎదురులేని హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) బత్కుయాగ్ మున్‌గున్‌తుల్‌తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్‌లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన మరో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత జు జినెర్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దివ్య దేశ్‌ముఖ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్‌తో హంపి; మున్‌గున్‌తుల్‌తో దివ్య దేశ్‌ముఖ్; పొలీనాతో హారిక తలపడతారు.

జయహో జ్వెరెవ్
మ్యూనిక్ (జర్మనీ): స్వదేశంలో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అదరగొట్టాడు. తన 28వ పుట్టిన రోజున... తనకెంతో కలిసొచ్చిన బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో జ్వెరెవ్ మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జ్వెరెవ్ 6–2, 6–4తో అమెరికాకు చెందిన రెండో సీడ్ బెన్ షెల్టన్‌ను ఓడించాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. 2017, 2018లలో కూడా ఈ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ ఓవరాల్‌గా తన కెరీర్లో 24వ టైటిల్‌ను సాధించాడు. చాంపియన్‌గా నిలిచిన జ్వెరెవ్‌కు 4,67,485 యూరోల (రూ. 4 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు రూ. 1 కోటీ 40 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎం70 మోడల్ ఎలక్ట్రిక్ కారు లభించింది.

IPL 2025 GT vs KKR: టైటాన్స్ జోరు సాగేనా!
కోల్‌కతా: ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్‌లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్‌కతా మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్‌లో డగౌట్ నుంచి కోల్‌కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్‌కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి! నిలకడ లేమి సమస్య... డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆరంభించిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్‌కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్‌లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్‌దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్‌ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్నీ రంగాల్లో పటిష్టంగా... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్‌ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తుది జట్లు (అంచనా) కోల్‌కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
బిజినెస్

ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
బాగా చదువుకుని ఉద్యోగం చేయాలి, జీవితం సెటిల్ అవ్వాలని చాలామంది చిన్నప్పటి నుంచే చెబుతూ ఉంటారు. ఆ మాటలనే వింటూ.. డిగ్రీలు పూర్తి చేసుకుని ఏదో ఒక కంపెనీలో చేరి.. నెలనెలా జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న ఉద్యోగులు కోకొల్లలు. ఇలాంటి ఉద్యోగులంతా.. ప్రమాదంలో ఉన్నారని, అలాంటి ఉద్యోగాలు కనుమరుగవుతాయని.. పోర్ట్‌ఫోలియో - మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, మార్కెట్ ఎనలిస్ట్ 'సౌరభ్ ముఖర్జియా' అన్నారు.'బియాండ్ ది పేచెక్: ఇండియాస్ ఎంటర్ప్రెన్యూర్ రీబర్త్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారతదేశం కొత్త ఆర్థిక దశలోకి ప్రవేశించింది. జీతాలపైన జీవించే మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుంది అన్నారు. మంచి చదువులు చదివి, కష్టపడి పనిచేసేవారికి జీతాలిచ్చే కంపెనీలు తగ్గిపోతాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయితఇప్పుడు దాదాపు చాలా కంపెనీలలో ఆటోమిషన్, ఏఐ ద్వారానే పనులు పూర్తిచేస్తున్నారు. దిగ్గజ టెక్ కంపెనీ గూగులే సైతం తన కోడింగ్‌లో మూడోవంతును ఇప్పటికే 'ఏఐ'కు అప్పగించింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్సింగ్ రంగాలు కూడా ఇదే విధానం పాటిస్తాయి. కాబట్టి ఉద్యోగాలు చాలావరకు కనుమరుగవుతాయని ముఖర్జియా పేర్కొన్నారు.టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం కూడా.. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అవుతోంది. కాబట్టి జీతం మీదనే బతకాలనే విధానం మార్చుకోవాలి. మనది డబ్బు మీద ఆధారపడిన సమాజం. సక్సెస్ అంటే డబ్బు అనే చాలామంది చెబుతారు. ఇది మారాలి. తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలను ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యం అన్నట్టు పెంచకూడదని సౌరభ్ ముఖర్జియా స్పష్టం చేశారు.

బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది?
నేను పదవీ విరమణ తీసుకున్నాను. ఉద్యో గ విరమణ తర్వాత వచ్చిన ప్రయోజనాలన్నింటినీ స్థిరమైన ఆదాయం కోసం.. ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ లేదంటే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి? - అజయ్ ప్రకాష్ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకు ఎంత మేరకు అవగాహన ఉన్నదన్న అంశం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈక్విటీల్లో గతంలో ఇన్వెస్ట్ చేసిన అనుభవం మీకు ఉండి.. మార్కెట్లలో ఆటుపోట్లను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయగలరు? ప్రతి నెలా మీకు ఎంత ఆదాయం కావాలి? అన్నవి కూడా ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశాలు.పెట్టుబడి నుంచి స్థిరమైన ఆదాయం కోరుకుంటున్నట్టు అయితే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడుల్లో ఎలాంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఎంత ఆదాయం కోరుకుంటున్నారు? రిస్క్ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగానే ఎంపిక ఉండాలి.బంగారం ధర ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా? - కృతి వాసన్బంగారం బలంగా ర్యాలీ చేస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టాలని అనిపించడం సాధారణమే. ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం ర్యాలీ చేసింది. కానీ, అది ఇంకా ఎంత వరకు పెరుగుతుందన్నది ప్రశ్నార్థకమే. ఇందుకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఏ అస్సెట్ క్లాస్ (పెట్టుబడి సాధనం) విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది.మీ పెట్టుబడుల ప్రణాళికకు బంగారం ఎంత మేర ప్రయోజనం కలిగిస్తుందో విశ్లేషించుకోండి. అనిశి్చత పరిస్థితు ల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఈక్విటీ మార్కెట్లలో కల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు బంగారం ర్యాలీ చేస్తుంటుంది. ఒక్కసారి ఈ పరిస్థితులు అన్నీ కుదుటపడితే అక్కడి నుంచి బంగారం పెరుగుదల పరిమితంగానే ఉంటుంది.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?గత పదిహేనేళ్ల కాలంలో చూసుకుంటే బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. అదే ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏటా 12 శాతం రాబడులను అందించాయి. రాబడుల్లో వ్యత్యాసం చూడ్డానికి ఎక్కువగా లేదు. కానీ, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనంతో ఫండ్స్‌లో పెట్టుబడి వృద్ధి ఎక్కువగా ఉంటుంది. విలువను సృష్టించే వ్యాపారాల్లో వాటాను సొంతం చేసుకునేందుకు ఈక్విటీ పెట్టుబడులు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వకే పరిమితం అవుతుంది. బంగారం దీర్ఘకాలంలో సంపద సృష్టించే సాధనం కాదు. హెడ్జ్ సాధనంగా పరిగణించి తమ పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో - వ్యాల్యూ రీసెర్చ్.

ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
ముంబై: ప్రజా ప్రయోజనాలను వాణిజ్య ప్రాధాన్యతలు అధిగమించేందుకు అనుమతించబోమని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలపై పాండే తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలు బలపరచవలసి ఉన్నట్లు సీఐఐ నిర్వహించిన కార్పొరేట్ పాలన సదస్సులో తెలియజేశారు. వాణిజ్య లేదా లాభార్జన సంస్థలు ఎక్సే్ఛంజీలుగా ఆవిర్భవించేందుకు భారత్ అనుమతిస్తుందని, అయితే నియంత్రణ సంస్థలు మాత్రం సాధారణ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాయని వివరించారు. ఈ అంశంలో సర్దుబాట్లకు అవకాశంలేదని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా స్టాక్ ఎక్సే్ఛంజీల మధ్య ఘర్షణలు తలెత్తితే పరిష్కరించడం సెబీ బాధ్యతగా పేర్కొన్నారు. కాగా.. ఎనిమిదేళ్లుగా ఎన్ఎస్ఈ ఐపీవో ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదట్లో సెబీ అనుమతిని కోరింది. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీ ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అన్నిరకాల సమస్యలనూ పరిష్కరించుకోవలసిందిగా ఎన్ఎస్ఈని ఆదేశించింది.

జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. తవ్వేకొద్దీ... సెబీ తరఫున ఎస్ఎస్ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్ వద్దనున్న జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జెన్సోల్ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్ ఇంజినీరింగ్ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది.
ఫ్యామిలీ

వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్

గాడిద పాల వైద్యం
అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్ఠంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్లి దానిపై దాడి చేయబోయింది. కాని, అది గమనించిన గాడిద తన వెనుక కాళ్లు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్లతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క ‘కుయ్యో.. మొర్రో’ అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకు గాడిదపై ఫిర్యాదు చేసింది. ‘ప్రభూ! పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటోంది’ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క.మృగరాజు అప్పటి వరకు గ్రామాల్లో ఉండే గాడిద గురించి వినటమే గాని, చూడనేలేదు. మృగరాజు వెంటనే తన ఆంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గుహకు తీసుకు రమ్మని చెప్పాడు. ఏనుగు పరుగునవెళ్లి గాడిదను తీసుకువచ్చింది, గాడిద భయం భయంగా గుహ బయట నిలుచుంది. గుహ లోపల మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం విన్నది గాడిద. మృగరాజు సింహం గుహలోంచి బయటికి వచ్చాడు.గాడిద తన ముందు రెండు కాళ్ళను గాలిలోకి లేపి నమస్కరించింది. ‘ఎవరు నువ్వు!’ ప్రశ్నించాడు మృగరాజు. ‘ప్రభూ! నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ, అతనికి సహాయం చేసే దాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కలను తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపకశక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయేవాడు.అతను ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. గత వారం అతను పట్నం వెళ్లి, ప్రమాదవశాత్తూ మరణించాడు. యజమాని మరణించాక నేను గ్రామంలో ఉన్నంతసేపు నాకు నా యజమానే గుర్తుకు వచ్చేవాడు. అందుకే నేను అక్కడ ఉండలేక అడవి బాట పట్టాను!’ చెప్పింది గాడిద. మృగరాజుకు గాడిద మనసు అర్థమైంది. అంతే కాదు శాకాహారి అయిన గాడిద తన ఆత్మరక్షణ కోసమే నక్కను గాయపరచిందని తెలుసుకుంది. నక్క గుణం తెలిసిన మృగరాజు దాన్ని మందలించాడు.ఇంతలో గుహ నుంచి మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతూ బయటకువచ్చింది.‘మిత్రమా! ఎన్ని పసరు మందులు వాడినా దగ్గు, ఆయాసం, జలుబు గత నెల రోజులుగా నా బిడ్డను వదలటమే లేదు’ విచారంగా అన్నాడు మృగరాజు.గాడిద చిట్టికూనను పరిశీలనగా చూసి, మృగరాజుతో, ‘ప్రభూ! ఎలాంటి దగ్గు, జలుబు, ఆయాసాన్నయినా పూర్తిగా నయం చేసే ఔషధ గుణం మా పాలలో ఉంది. మా పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మీరు అనుమతి ఇస్తే నేను మీ బిడ్డకు వైద్యం చేస్తాను’ అంది గాడిద. మృగరాజు సంతోషంగా అంగీకరించాడు. చిట్టికూనకు గాడిద తన పాలు తాగించింది.పాలు తాగిన చిట్టి కూన నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. మృగరాజు గాడిదను తనతోనే ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. తన యజమాని చూపిన ప్రేమను, గౌరవాన్ని మృగరాజు దగ్గర తిరిగి పొందింది గాడిద. మనం కీడు తలపెట్టినా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుసుకుంది నక్క.

మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్‌లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్‌తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్‌ను రామ్వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు సంతాపండాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్‌లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్‌కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
ఫొటోలు


కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు (ఫొటోలు)


ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)


శతాబ్దాల చరిత్రకు నిలయం డిచ్పల్లి ఖిల్లా రామాలయం.. అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే (ఫొటోలు)


విజయవాడలో సందడి చేసిన నటి కీర్తి సురేష్ (ఫొటోలు)


సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో సినీనటి సౌమ్యజాను (ఫొటోలు)


నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)


#PavaniReddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావని రెడ్డి... ఫోటోలు వైరల్


జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)


శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది లేటెస్ట్ ఫోటో గ్యాలరీ


'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్‌కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్‌గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్

సియాచిన్, గల్వాన్‌లకు సైతం మొబైల్ కనెక్టివిటీ
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్‌లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్‌లో 5జీ మొబైల్ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు.

త్వరలో 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ల మూసివేత
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది.

ఉల్కాపాతపు వెలుగులు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

విశ్రాంత డీజీపీ దారుణ హత్య
యశవంతపుర: కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలోని నివాసంలో ఆయన కత్తి పోట్లకు గురయ్యారు. శనివారం రాత్రి ఘటన జరగ్గా ఆదివారం ఉదయం బయటపడింది. ప్రకాశ్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా మూడంతస్తుల నివాసం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై అనేక కత్తి గాట్లున్నాయి. కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఆయన భార్య పల్లవితోపాటు కుమార్తెను పోలీసులు ప్రశి్నస్తున్నారు. విషయం తెల్సిన సీనియర్ పోలీసు అధికారులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఓం ప్రకాశ్ దంపతుల మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ప్రకాశ్ ఇటీవల కొందరు సన్నిహితులతో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రకాశ్‌కు సన్నిహితులైన కుటుంబసభ్యులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ బిహార్‌లోని చంపారన్ వాసి. అక్కడే జియాలజీలో పీజీ చేశారు. 1981లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. బళ్లారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్లో పూర్తికాలం కర్ణాటకలో పనిచేశారు. భత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు.

జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్‌లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

బీజేపీ వివరణ రాజకీయ వంచన
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు. తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్లకు సీజేఐ కారణమని నిందించారు. అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.

నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సతీసమేతంగా భారత పర్యటనకు రాబోతున్నారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి ఆయన సోమవారం ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దేశంలో మొత్తం నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్ దంపతులు ఇండియాకు వస్తుండడం ఇదే మొదటిసారి. ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికా మహిళ అనే సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించడం, తర్వాత 90 రోజులపాటు వాయిదా వంటి పరిణామాల నేపథ్యంలో జె.డి.వాన్స్ ఇండియా పర్యటన ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఇరువురు నేతలు సమావేశమవుతారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇరు దేశాల నడుమ సంబంధాల పురోగతిని వారు సమీక్షిస్తారు. సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ–వాన్స్ భేటీలో ముందడుగు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల్లో భారత్ తరఫున ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని తెలిసింది. అమెరికా తరఫున వాన్స్‌తోపాటు ఐదుగురు సీనియర్ అధికారులు హాజరవుతారని సమాచారం. జైపూర్, ఆగ్రా సందర్శన ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాన్స్, ఉషా దంపతులు ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భారతీయ సంప్రదాయ హస్తకళాకృతులు విక్రయించే మార్కెట్‌ను సందర్శిస్తారు. ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బస చేయబోతున్నారు. సోమవారం రాత్రి వారు రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు చేరుకుంటారు. రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం అమేర్(అంబర్) కోటతోపాటు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత కట్టడాలను సందర్శిస్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ కార్యక్రమంలో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ పాలనలో భారత్–అమెరికా సంబంధాలపై ఆయన అభిప్రాయాలు వెల్లడిస్తారని సమాచారం. బుధవారం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు తిరిగివెళ్తారు. వాన్స్ కుటుంబం జైపూర్ నుంచి గురువారం అమెరికాకు పయనమవుతుంది
ఎన్ఆర్ఐ

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.
క్రైమ్

Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు.
వీడియోలు


విశాఖలో భూములే కాదు.. ప్రజాస్వామ్యమూ గోవిందా


వైన్ షాప్ కోసం కోట్లు కమిషన్ ఇచ్చారు.. మహిళలపై ఎక్సైజ్ CI ఫైర్


పెళ్లి పై నమ్మకం లేదు..! త్రిష సెన్సేషనల్ కామెంట్స్


మళ్లీ పెరిగిన బంగారం ధర


భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్


దిక్కున్నచోట చెప్పుకోండి.. మా వెనుక బాబున్నాడు


చేసుకోబోయే అమ్మాయి కోరికలు చూసి అవాక్కెన రాజేష్


ఊరూపేరు లేని ఉర్సా.. బట్టబయలైన బాబు సర్కార్ భారీ భూకుంభకోణం


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవేదన


ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి