Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TG High Court Breaks Group 1 Appointments1
TG: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్‌

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవతవకలు జరిగియాని హైకోర్టులో 20 పిటిషన్ల వరకూ దాఖలు కావడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నియమాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్సష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. పోస్టింగ్ లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకూ ఇవ్వొద్దని క్లియర్ గా స్పష్టం చేసింది.

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates2
వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్‌ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్‌లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్‌: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు.

Elon Musk reaches out to women to have babies Report3
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!

ఎలాన్‌ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్‌. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్‌ మస్క్‌. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్‌అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్ర‌చురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్‌ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్‌ తండ్రి అంటూ సోషల్‌ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్‌ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్‌ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్‌: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫ‌ర్ చేసిన‌ట్టు వ‌చ్చిన‌ కథనాల్ని మస్క్‌ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్‌జే వెబ్‌సైట్‌ అనేది ఒక గాసిప్‌ వెబ్‌ సైట్‌ అని, అందులో గాసిప్‌ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్‌ డోనర్‌ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్‌ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్‌ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్‌జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.

Italian Cricketer Zain Naqvi Smashed 26 Ball Hundred In European T20 League4
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

ఐపీఎల్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్న వేల పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. యూరోపియన్‌ టీ20 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన జైన్‌ నఖ్వీ కేవలం 26 బంతుల్లోనే శతకొట్టాడు. టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. గతంలో ఈ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉండేది. సాహిల్‌ 2024లో సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో సెంచరీ చేశాడు. సాహిల్‌ తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాళ్లు ఉర్విల్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ పేరిట సంయుక్తంగా ఉంది. ఉర్విల్‌, అభిషేక్‌ తలో 28 బంతుల్లో సెంచరీలు చేశారు. వీరి తర్వాత అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీకి ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు.టీ20ల్లో టాప్‌-10 ఫాస్టెస్ట్‌ సెంచరీలు..జైన్‌ నఖ్వీ- 26 బంతుల్లోసాహిల్‌ చౌహాన్‌- 27ఉర్విల్‌ పటేల్‌- 28అభిషేక్‌ శర్మ- 28క్రిస్‌ గేల్‌- 30రిషబ్‌ పంత్‌- 32లుబ్బే- 33నికోల్‌ లాఫ్టన్‌- 33సికందర్‌ రజా- 33ఆండ్రూ సైమండ్స్‌- 34నమ్మశక్యంకాని స్ట్రైక్‌రేట్‌తో..నఖ్వీ ఇన్నింగ్స్‌ విషయానికొస్తే.. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 37 బంతులు ఎదుర్కొని నమ్మశక్యంకాని 432.43 స్ట్రైక్ రేట్‌తో 24 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. నఖ్వీ ఇన్నింగ్స్‌లో మరో విశేషమేమిటంటే.. ఒకే ఓవర్లో అతను వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో యువరాజ్‌ సింగ్‌, హజ్రతుల్లా జజాయ్‌, కీరన్‌ పోలార్డ్‌, తిసారా పెరీరా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. యూరోపియన్ టీ20లో లీగ్‌లో భాగంగా టీమ్ సివిడేట్, మార్ఖోర్ మిలానో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 23 ఏళ్ల జైన్ నఖ్వీ మార్ఖోర్ మిలానో తరఫున ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మార్ఖోర్ మిలానో.. జైన్ నఖ్వీ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడటంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మార్ఖోర్ మిలానో ఇన్నింగ్స్‌లో జైన్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై 104 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.నఖ్వీ కెరీర్ ఇలా..జైన్ నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటలీ తరఫున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 4 టీ20 మ్యాచ్‌లు ఆడి కేవలం​ 7 పరుగులు మాత్రమే చేశాడు.

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati5
తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్‌, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. భూమన కామెంట్స్‌..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్‌ విసిరారు.ఛాలెంజ్‌ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్‌ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాస్‌ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్‌ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్‌ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్‌ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారుగోశాలకు వెళ్ళకుండా అడ్డగించారుజిల్లా ఎస్పీ అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారుగోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాంగత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారుప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారుటీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసిటీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారుఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనంబైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాంమీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయితిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారుగోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారుతొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారుగోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారుమీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారుదైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాంసీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారుపుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న 550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందంహిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలిఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయిఅజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తిస్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి పుచ్చేదుంకు ప్రయత్నం చేశారుచనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారుస్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయిందిఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్‌ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్‌.ఇటు ఫోన్‌లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్‌ రెడ్డి కామెంట్స్‌..సవాల్‌ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్‌ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్‌..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్లాకు భూమన ఫోన్‌ కాల్‌..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్‌ కట్‌ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్‌ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌?.భూమన కామెంట్స్‌..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్‌?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

 degigners Abu Jani Sandeep Khosla Store Launch Nita Ambani Wore Mirror-Work Black Saree6
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్‌ : ​ స్టైలిష్‌ లుక్‌లో మెరిసిపోతూ..!

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన​ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువచేసే డైమండ్‌ ఆభరణాలు అనగానే ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానిగా, గొప్ప దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్‌ ప్లాజాలో స్టైలిష్‌గా మెరిశారు.ఆరుపదుల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు. వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన స్నేహితులకు టైం కేటాయించడంలో ముందుంటారు. ఏప్రిల్ 16న నీతా అంబానీ తన ప్రాణ స్నేహితులు అబు జాని , సందీప్ ఖోస్లా స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ సందర్భంగా నీతా అంబానీ అద్దాలతో అలంకరించిన చీరలో అద్భుతంగా కనిపించి అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్నారు. తెల్లని ఛాయలో మెరిసి నీతా అంబానీకి బ్లాక్‌ కలర్‌ శారీకి మిర్రర్‌-వర్క్ అలంకరణ హైలైట్‌గా నిలిచింది. దీనికి సీక్విన్డ్ గోల్డెన్ బ్లౌజ్‌ మరింత అందాన్నిచ్చింది. ఈ చీరకు తగ్గట్టు లేయర్డ్ ముత్యాల నెక్లెస్‌ మ్యాచింగ్ చెవిపోగులు , డైమండ్ బ్యాంగిల్స్‌ మరింత స్టైల్‌గా నప్పాయి. బంగారు పొట్లీ బ్యాగ్ సొగసుగా అమిరింది. మరోవైపు, డిజైనర్ ద్వయం అబు జాని , సందీప్ ఖోస్లా తెల్లటి దుస్తులు, ముత్యాల నగలతో రాయిల్‌లుక్‌తో అలరించారు. (రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్‌, ఫోటోలు వైరల్‌)అంతకుముందు పారిస్‌లో జరిగిన ఫెసిలిటేషన్ డే కోసం నీతా అంబానీ అబు జాని , సందీప్ ఖోస్లాద్వజం డిజైన్‌ చేసిన వింటేజ్ దుస్తులను ఎంచుకున్నారు. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకల్లో ఒక్కో సందర్భానికి ఒక్కోలా ముస్తాబై తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకున్నారు. నీతా అంబానీ. ఎపుడూ చీరలకు ప్రాధాన్యత ఇచ్చే నీతా నూతన సంవత్సర వేడుకల కోసం, కేప్ స్టైల్ డిటైలింగ్‌తో సీక్విన్డ్ వర్క్ ఫ్లోర్‌ లెంత్‌ గౌను, గ్రే షాల్‌, డైమండ్ చెవిపోగులు , రింగ్‌, తన లుక్‌ను స్టైల్ చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: షారూక్‌ ఖాన్‌ భార్య హోటల్‌లో ఫేక్‌ పనీర్‌ ఆరోపణల దుమారం : టీం స్పందన

Puppies: Shocking Incident At Residential Apartment In Hyderabad7
హైదరాబాద్‌లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్‌ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అక్క‌డే ఉన్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఆ కుక్క పిల్ల‌లు ఉంటున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.కుక్క పిల్ల‌లు చ‌నిపోయి ఉండ‌డంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు.. ఈ క్ర‌మంలో అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా, అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.ఆశిష్‌ను అపార్ట్‌మెంట్ వాసులు ప్ర‌శ్నించ‌గా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.*VB City Community – Urgent Alert!* The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025

Indian Economy to Surpass Germany Japan in 3 Years Says NITI Aayog CEO BVR Subrahmanyam8
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'

రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటామని సుబ్రహ్మణ్యం అన్నారు. అయితే దీనికోసం న్యాయ సంస్థలు, అకౌంటింగ్ కంపెనీలతో పాటు.. దేశీయ కంపెనీలు ప్రపంచ అగ్రగాములుగా ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెట్టుబడి రంగంలో మార్పులు: భారీగా పెరిగిన కొత్త డీమ్యాట్ అకౌంట్స్మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు.. తక్కువ-ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారు. జపాన్ 15,000 మంది నర్సులను, జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను భారతదేశం నుంచి తీసుకుంది. అంటే.. ఆ దేశాల్లో అవసరమైన స్థాయిలో పనిచేసేవారు లేదు. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైంది. భారతదేశం మాత్రం ప్రపంచానికి పనిచేసేవారిని అందిస్తోంది. ఇది మనదేశానికి ఉన్న అతిపెద్ద బలం అని ఆయన అన్నారు.

Tdp Mlas High Drama At Tirupati Goshala9
తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా

తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు. ఫోన్‌లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్‌ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.ఎమ్మెల్యేల దారిలో పల్లామరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్‌ కాల్‌ను పల్లా శ్రీనివాస్‌ కట్‌ చేశారు.

SC Allows Sacked Bengal Teachers To Continue Till Fresh Selections10
‘సుప్రీం’ కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌ టీచర్లకు స్వల్ప ఊరట

న్యూఢిల్లీ: విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, నియామకాల్లో అవకతవకల కారణంగా ఈ నెల ప్రారంభంలో నియామకాలు రద్దు చేసిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు.. తాజా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. తాజాగా, టీచర్ల నియామకం రద్దులో స్వల్ప ఊరట కల్పించింది.ఆ ఉద్యోగులకు వర్తించదుకొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, ఈ ఉపశమనం 2016 నియామకాలపై దర్యాప్తు సమయంలో ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లకే వర్తిస్తుంది. గ్రూప్- సీ, గ్రూప్-డీ, నాన్-టిచింగ్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది నియామకాల్లో అవినీతి పాల్పడ్డారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నియామక ప్రక్రియ ఎప్పుడంటేచీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్‌ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)కు స్పష్టమైన గడువు విధించింది. కొత్త నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన మే 31లోపు విడుదల చేయాలి. డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందనీ, జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement