
సాక్షి, అమరావతి: ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను, ఐదు బోధనాస్పత్రులకు కొత్త సూపరింటెండెంట్లను నియమించినట్టు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. వైజాగ్ ఆంధ్ర, కాకినాడ రంగరాయ, రాజమండ్రి, కడప, నెల్లూరు, తిరుపతి శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లను నియమించారు.
డీఎంఈ డాక్టర్ నరసింహాన్ని కాకినాడ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పించారు. అదే విధంగా వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్‌లుగా పనిచేస్తున్న వారిని ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి రుయా, విశాఖ కేజీహెచ్‌లకు నూతన సూపరింటెండెంట్‌లుగా బదిలీ చేశారు.