
సాక్షి, తిరుపతి : తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద అఘోరీ హల్‌చల్ చేశారు. ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనానికి అఘోరీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికురాలైన అఘోరీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో ఆత్మార్పణం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అప్రమత్తమైన పోలీసులు ప్రమాదం నుంచి తప్పించారు. నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
