
వలంటీర్ రజిత పాదాలు కడుగుతున్న ఆర్కే
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు.
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు. పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: పవన్‌కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు