volunteer
-
మంత్రి నిమ్మలను ఏకిపారేసిన దీప్తి
-
ఎన్నికల సమయంలో వాలంటీర్లకు కూటమి ఎన్నో ఆశలు పెట్టింది..
-
వలంటీర్లు అప్పుడెలా గుర్తొచ్చారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థే లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అదే వాస్తవమైతే విజయవాడ వరద బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు వలంటీర్లు కావాలని అధికారిక ఉత్తర్వులిచ్చి.. వలంటీర్ల సేవలు ఏవిధంగా వినియోగించుకున్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని నమ్మించి, 2.56 లక్షల మందిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.వలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు అంశంపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్న సోమవారం మండలిలో చర్చకు వచ్చింది. సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని, ఈ నేపథ్యంలో వేతనాల పెంపు అంశమే ఉత్పన్నం కాదన్నారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదల్లో వారిని ఎలా వినియోగించుకున్నారు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లే లేకపోతే విజయవాడ వరదల్లో వారి సేవలను ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుందని నిలదీశారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్, తేదీలతో సహా సభలో చదివి వినిపించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే వలంటీర్లపై మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. వలంటీర్లతో అవసరం తీరాక ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు.‘గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఇచ్చిన రూ.5 వేలు సరిపోదు.. మేం వస్తే రూ.10 వేలు చెల్లిస్తాం’ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరికి నెలకు రూ.10 వేలకు వేతనం పెంచుతామని ప్రస్తుత సీఎం, మంత్రులు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన వలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే వలంటీర్లను రెన్యూవల్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ మనుగడలో ఉందనే భ్రమలో తాము విజయవాడ వరదల్లో వారి సేవలు వినియోగించుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మనుగడలో లేని వారిని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. నిమ్మల ముసిముసి నవ్వులు‘మా ప్రభుత్వం వస్తేనే వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వేతనం పెరిగిన వెంటనే నాకు పూతరేకులు, స్వీట్ బాక్స్, జున్ను ఇవ్వాలి’ అని వలంటీర్లకు చెబుతూ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రి ఒకరు ప్రచారం చేశారని రమేశ్‌యాదవ్ గుర్తు చేశారు. వేతనాలు పెంచితే మంత్రికి పూతరేకులు, జున్ను ఇద్దామని వలంటీర్లు అందరూ రెడీగా ఉన్నారన్నారు. దీంతో వెంటనే సభలోని వారంతా మంత్రి నిమ్మల రామానాయుడు వైపు చూశారు. ఈ క్రమంలో ఆయన పేపర్లో ఏదో చదువుతున్నట్టు తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. -
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీ మేనిఫెస్టోలో ఎలా పెట్టారు
-
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
యూటర్న్ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
తిన్న కంచాన్ని కాళ్ళతో తన్నినట్టు...బాబు,పవన్ పై గుంటూరు వాలంటీర్లు ఫైర్
-
చందాలేసుకుని విద్యా వలంటీర్ నియామకం!
గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బులు పోగు చేసుకుని చదువుకున్న ఒక యువకుడిని వలంటీర్‌గా నియమించుకున్నారు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
9న వలంటీర్ల ఆవేదనా సదస్సు
సాక్షి, విజయవాడ: ఈ నెల 9న వలంటీర్ల ఆవేదనా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఎనిమిది కేబినెట్ మీటింగ్‌లు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న క్యాబినెట్లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిపడ్డ ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. -
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
చంద్రబాబు మార్క్ వెన్నుపోటు
-
మహిళా వలంటీర్‌పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్‌గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్‌కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్‌లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
సాక్షి, అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున జూలై నెల పింఛన్‌తో కలిపి వృద్ధులు, వితంతు మహిళలకు జూలై ఒకటో తేదీ ఉదయాన్నే ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. అదే విధంగా దివ్యాంగులకు సైతం పెంచిన పింఛన్లను అరియర్స్‌తో ఇస్తామన్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలను ఆ పార్టీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో సైతం అమలు చేయడం లేదని, అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము వ్యతిరేకించినట్లు వివరించారు. గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని, ఈసీఐ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అయితే పలువురు వలంటీర్లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వంటి కీలక పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రంలో నిర్విర్యమైన యువతలో నైపుణ్యాలు పెంపునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని మరో మంత్రి డోలా తెలిపారు. ఒక్క చాన్స్ అని మాజీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మంత్రి ఎస్.సవిత విమర్శించారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
వాలంటీర్ గా పని చేయడం గర్వంగా ఉంది
-
ఓటుకు 5-10 వేలు.. టీడీపీ ఎరను తిప్పికొట్టిన వాలంటీర్..
-
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
‘పచ్చ’కుట్రలు పటాపంచలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి ఐదేళ్లుగా పింఛను అందిస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘పచ్చ’కుట్రలు పటాపంచలయ్యాయని వైఎస్సార్సీపీ డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డకున్నా సామాజిక పింఛన్లను సకాలంలో అందించి సచివాలయ వ్యవస్థ విజయం సాధించిందని ప్రశంసించారు. ‘వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛనుగా అందిస్తూ వస్తోంది. వారి జీవనానికి ఒక భరోసా కల్పించింది. ఈ విధానం అనేక దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందాలొచ్చి అధ్యయనం చేశాయి. ఇదెక్కడ జగన్మోహన్రెడ్డికి పేరొస్తుందోనన్న అసూయతో చంద్రబాబు కుతంత్రాలకు ఆదిలోనే తెరలేపారు. వలంటీర్ల వ్యవస్థపై బురదజల్లారు. కించపరిచేలా దుర్భాషలాడారు. ఇవేవీ పట్టించుకోకుండా వలంటీర్లు సేవాదృక్ఫథంతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేయడానికి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఇదే చంద్రబాబు హైదరాబాద్ ప్యాలెస్‌లో తాళాలేసుకొని కూర్చుంటే వలంటీర్లు ఇక్కడ ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా నిలిచారు. వైద్యసేవలు సత్వరమే అందించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రినని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సృష్టించిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ సేవలందించే ముసుగులో తమ ప్రాణాలు ఎలా తోడేశాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 2019 సంవత్సరంలో టీడీపీని తరిమికొట్టారు. జన్మభూమి కమిటీలకు ఎంతో భిన్నంగా ఉన్న వలంటీర్లను చూసి చంద్రబాబు కక్ష కట్టారు. నిమ్మగడ్డ రమేష్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను అందించకుండా వలంటీర్లను దూరం చేశారు. ఇలా ఒక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రకు తెరలేపారు. ఇది దురదృష్టకరం. చంద్రబాబు చేష్టలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కచ్చితంగా బుద్ధి చెబుతారు. జగన్ విజన్‌కు నిదర్శనం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌కు నిదర్శనం. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను పెట్టారు. ప్రభుత్వ సేవలను, పథకాలను పైసా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అందించిన వ్యవస్థగా పేరొందింది. దీన్ని చెడగొట్టడానికి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. వృద్ధులు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛను ఇంటివద్దనే అందుకోకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు. మండుటెండల్లో రోడ్లపైకి లాగి చంద్రబాబు తనలోనున్న సైకో మనస్తత్వత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదిఏమైనా సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం హర్షణీయం. సచివాలయ ఉద్యోగులకు అభినందనలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల్లో కల్పించిన దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను ఇన్నాళ్లూ గుర్తించని చంద్రబాబే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలన్నారంటేనే ప్రజాసేవ పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చాటిచెబుతోంది. వలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్న చంద్రబాబే తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఖజానాలో డబ్బుల్లేవని, అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని దుష్ప్రచారం చేశారు. కానీ లబ్ధిదారులందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేసి జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. -
వెన్నులో వణుకు చంద్రబాబుకు అన్నీ రివర్స్
-
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్‌షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్‌కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్‌పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
సైంధవుడుచంద్రబాబే..
సాక్షి, నెట్వర్క్: పింఛన్‌కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సచివాలయానికి ఎలా వెళ్లాలి ? నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా చంద్రబాబు చూపు పడితే కష్టాలే నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్మోహన్రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా మా ఉసురు తగులుతుంది రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి. టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్‌ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్‌తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా నిస్సహాయులను శిక్షించడమేమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్‌ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా, -
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌న్‌పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మా ఉసురు తగులుద్ది..
మూడుచక్రాల సైకిల్‌పై ఉన్న ఈ దివ్యాంగుడి పేరు షేక్ పాచ్ఛా. పొదిలికి చెందిన ఇతను టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వికలాంగ పింఛన్ మంజూరైంది. ఠంఛనుగా ప్రతినెలా వలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కుట్రలతో వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఎండలో సచివాలయాలకు వెళ్లి క్యూలో ఉండి అధికారుల కోసం పడిగాపులు కాసి పింఛను తీసుకోవాల్సిన దుస్థితి కలి్పంచారు.. మా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా అడ్డుకున్న వారు బాగుపడరు. మాలాంటి వృద్ధులు, వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది’’ అంటూ మండిపడ్డాడు. ఈ వృద్ధురాలి పేరు అల్లు తిరుపతమ్మ. వయస్సు 80 సంవత్సరాలు. తర్లుపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు వలంటీరే ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ అందించేవారు. చంద్రబాబు కుతంత్రంతో ఇప్పుడు వలంటీర్లు పింఛను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి సచివాలయం దగ్గర పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ‘‘1వ తేదీ అయినా వలంటీరు రాకపోవడంతో వాకబుచేస్తే వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదంటూ టీడీపీ నేతలు కేసులు వేశారని.. అందుకే వారు రాలేదని తెలిసింది. ఎండలు మండిపోతున్నాయి. సచివాలయం దాకా నడిచి వెళ్లి పింఛను తీసుకోలేను. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంచి చేసే వాళ్ల మీద కేసులు పెట్టడం ఏందయ్యా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందేవి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అందరి ఇళ్ల ముందు సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. ఏమవ్వా బాగున్నావా... ఏం తాతా ఎలా ఉన్నావంటూ కుశల సమాచారాలు అడిగి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు వారి చేతుల్లో పెట్టేవారు. అవి అందుకున్న వాళ్ల కళ్లల్లో మెరుపులు చూసి వలంటీరు సంతృప్తి పడేవారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అవ్వా తాతలకు పింఛన్లు అందజేసేవారు. ఒకవేళ ఏదైనా పనిమీద వేరే ఊర్లకు వెళ్లి ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా అక్కడికి వెళ్లి అందజేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా అభాగ్యులకు అండగా ఉండే వలంటీరుపై పచ్చదండు కక్ష గట్టింది. రోజుకో రకమైన కథనాలు పచ్చమీడియా వండివార్చేది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తూ వస్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి నాయకులు ఇళ్లకు పరిమితమైతే తన ప్రాణాలకు లెక్కచేయకుండా వలంటీరు సాయం అందించాడు. ఎన్నో మంచి పనులు చేసిన వారి సేవలు ఎల్లో మీడియాకు పట్టలేదు. ఎన్నికల పేరు చెప్పి వారిని అభాసుపాలు చేసేలా రోజుకో రకంగా అసత్య కథనాలు వండివార్చింది. కోర్టులకు ఎక్కింది. తాజాగా ఎన్నికల పేరు చెప్పి కొత్త కుట్రలకు తెరతీసింది. తన అనుకూలుర ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేయించింది. ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించింది. ఫలితంగా వలంటీరు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వరాదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణమైన పచ్చదండుపై అవ్వాతాతలు, అభాగ్యులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఏమన్యాయం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం, అధికార పారీ్టపై ఆ అపవాదు తోసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పత్రికా ప్రకటన. చేసిన తప్పును ఇలా కప్పిపుచ్చుకునేలా ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 95 వేల మందిపై ప్రభావం తెలుగుదేశం పార్టీ దుష్ట కూటమి కుట్రలతో జిల్లాలో 2 లక్షల 95 వేల మంది పింఛన్‌దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీరందరికీ ప్రతి నెలా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మరీ పెన్షన్లు ఇచ్చేవారు వలంటీర్లు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేది. ఇందుకోసం నెలకు రూ.88.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెలుగుదేశం చేసిన కుట్రల వలన ఈ నెల చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చింది. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటు¯ంటారు. ఇందులో ఎంతో మంది ప్రతినెలా వచ్చే పెన్షన్ డబ్బులు చేతికి అందగానే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతుంటారు. అవసరమైన ఔషధాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతినెలా వచ్చే పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్లు రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోయేకాలం దాపురించిందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో నరకయాతన చంద్రబాబు పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే నరకయాతన లాగా ఉండేది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ కోసం పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఉండేది. పైగా జన్మభూమి కమిటీలకు లంచాలు ముట్టచెప్పిన వాళ్లకు త్వరగా పెన్షన్లు అందేవి. ఒకరు చనిపోతే గానీ కొత్తవి వచ్చేవి కావు. ఇంతటి దారుణ పరిస్థితులు చవిచూసిన అభాగ్యులు నేడు ఎలాంటి కష్టం లేకుండా ఇంటికే డబ్బులు వస్తుండడంతో ఆనందంగా ఉన్నారు. రూ.3 వేల వరకు పింఛన్ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది అవ్వాతాతలను కలిశారు. స్వయంగా వారి ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయారు. తాను అధికారంలోకి వచ్చాక రూ.2 వేల వరకూ ఇస్తానని ప్రకటించారు. అప్పటి వరకు కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఎన్నికలకు ముందు రూ.2 వేలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది కూడా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలు ఉన్న దానిని పెంచుకుంటూ రూ.3 వేలు చేశారు సీఎం జగన్. అర్హులందరికీ కొత్త పింఛన్లు సైతం అందేలా చేశారు. మంచంలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు శగబండి మస్తానమ్మ. కురిచేడుకు చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. వలంటీరు ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపేయడంతో ఆ వృద్ధురాలికి కష్టం వచ్చిపడింది. ఈనెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకోవాలని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. ‘‘ఉద్యోగులు లాగే మా ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చేవాళ్లు. ఏ దిక్కూ లేని మాకు జగన్‌బాబే దిక్కయ్యాడు. ఆయన ఇస్తున్న పింఛన్‌కు అడ్డుపడుతున్న వాళ్లు మా ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తారా.. మంచి చేయడం చేతకాకపోయినా చేసేవాళ్లను చెడగొట్టడం నీచమైన పని’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి
హిందూపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని 28వ వార్డు వలంటీరు సంధ్యపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడిచేశారు. స్థానిక సూరççప్ప కట్టకింద (బోయపేట) ప్రాంతంలోని వలంటీర్ సంధ్య ఇంటివద్దకు సోమవారం రాత్రి కొందరు అవ్వాతాతలు వచ్చి పింఛన్ విషయమై ఆరాతీశారు. ఈ నెల 3వ తేదీ నుంచి వార్డు సచివాలయంలో ఇస్తారని ఆమె చెబుతుండగా.. సమీపంలోనే ఉన్న టీడీపీ నాయకులు నవీన్, అనిల్, అశోక్, విజి తదితరులు ఆమెపై దాడిచేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేయడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. టీడీపీ వర్గీయులు అక్కడికి కూడా వెళ్లి గొడవ చేశారు. తరువాత సంధ్య స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారిస్తున్నామని సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. -
కుట్ర కనిపింఛన్
టీడీపీ కుట్ర బయటపడింది.. అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.. ఇంటి వద్దనే పింఛన్ అందుకోవాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే! వలంటీర్ వ్యవస్థతో వైఎస్సార్సీపీకి మంచి పేరొస్తుందని తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు పాల్పడింది.. తన అనుబంధ సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్లు ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వైపు చెబుతూనే మరో వైపు కుతంత్రాలకు పాల్పడటంపై పింఛన్‌దారులు మండిపడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో నేడు గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4.73 లక్షల మంది వివిధ కేటగిరీ పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. డయాలసిస్, కిడ్నీ రోగులు... ఇలా వేలాది మంది అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటువంటి వారందరూ ఏప్రిల్ నుంచి జూన్ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకోవాల్సిందే. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీరందరూ నరకం చూడాల్సిందే! వేలాది మందిని సచివాలయాలకు ఎత్తుకొని రావాల్సి ఉంది. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ తన అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేది. లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించింది. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికార పార్టీకి మంచి పేరొస్తాందనే టీడీపీ కుట్రపన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు. మళ్లీ కష్టాలు మొదలు.. టీడీపీ హయాంలో పింఛన్ పొందడంలో అవ్వాతాతలు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాసేవారు. డబ్బులు రాలేదు.. రేపు..మాపు అంటూ తిప్పుకునేవారు. ఎంత మంది అర్హులు ఉన్నా మండలానికి ఇన్నే పింఛన్లు అని కోటా పెట్టేవారు. ఒక్కో గ్రామానికి 10–15 వరకు పింఛన్లు మాత్రమే వచ్చేవి. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు. ఇందుకోసం నాలుగైదు నెలల పింఛన్ మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చేది. ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌లోనూ రూ.100, 200 కోత పెట్టేవారు. మరణించిన వారిస్థానంలోనే కొత్త పింఛన్ వచ్చేది. వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్‌దారుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. అర్హతే ప్రామాణికంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు గ్రామ, వర్డు వలంటీర్లను నియమించి... వారి ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ పంపే ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ పండుగ ఉన్నా.. సెలవైనా... వానొచ్చినా.. ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టాలు తొలగిపోయాయి. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుంటే అక్కడికే వెళ్లి పింఛన్ అందచేస్తున్నారు. వలంటీర్లు కేవలం సేవాభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలతో అవ్వాతాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఇంటిదగ్గరే పించన్ పంపిణీ చేస్తున్న వలంటీరు(పైల్) ఇందుకే కక్ష.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీల్చివేశాయి. జన్మభూమి కమిటీలకు చంద్రబాబు అపారమైన అధికారాలు ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకొని జన్మభూమి కమిటీలోని సభ్యులు చెలరేగిపోయాయి. అవినీతి అక్రమాలతో లక్షాధికారులయ్యారు. జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు పిండకపోయినప్పటికీ వలంటీర్ల పట్ల అపారమైన ద్వేషం పెరగడానికి వారి వల్ల అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తు వస్తుండటమే కారణమని తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఇవీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. లబ్ధిదారులు ఏప్రిల్ నెల గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి వేలిముద్ర వేసి పింఛన్లు పొందాల్సి ఉంది. ఇందుకు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు సెర్ప్ ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకులకు సెలవు. 2వ తేదీన పింఛన్ల సంబంధించిన మొత్తం ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తారు. మూడో నుంచి 5 రోజుల పాటు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు, ఆర్బీకే ఇన్చార్జీలందరి దగ్గర ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉంటాయి. అనుకున్నట్టే చేశారు.. వలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో టీడీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏదో విధంగా వలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్నేళ్లుగా ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అనేక రకాల అభాండాలు వేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లపై కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లను పక్కన పేట్టే విధంగా చేయగలిగారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లపై ఇంత దారుణంగా పగపట్టడంపై అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధి చెబుతాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతి రోజూ కన్నీళ్లు వచ్చేవి. ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. ప్రతి రోజూ పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలు తొలగిపోయాయి. వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. – రమావత్ నాగమ్మ, మీటేతాండ, తుగ్గలి మండలం మళ్లీ ఎదురు చూపులే టీడీపీ హయాంలో పింఛన్ పొందాలంటే నానా యాతన పడేవాళ్లం. అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఠంఛన్‌గా 1వ తేదీనే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆసుపత్రికి, సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడేవి. టీడీపీ కుట్రలు పన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించింది. మళ్లీ పింఛన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో! – మాబున్నిసా, గడివేముల ఇబ్బందులు తప్పవు వలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి మా అమ్మాయి తని్వకకు పింఛన్ సొమ్ము ఇచ్చి వెళ్లేవారు. వికలాంగురాలైన చిన్నారిని తీసుకొని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ సమయానికి సి బ్బంది పింఛన్ ఇస్తారో తెలియని పరిస్థితి. వలంటీర్ వ్యవస్థ లేకపోతే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిందే. – చిన్నారి తని్వకతో తల్లి, నూనెపల్లె టీడీపీ హయాంలో అన్నీ కష్టాలే మోకాళ్ల నొప్పులతో ఎక్కడికి తిరగలేని పరిస్థితిలో ఉన్నా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే పింఛన్ తీసుకుంటున్నా. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల నుంచి పక్కనబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికో వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులో టీడీపీ హయాంలో చూశాను. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – రత్నమ్మ, మిట్నాల గ్రామం -
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
శభాష్...రేణుక!
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్‌పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్‌తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు. -
మీ సేవకు నా సెల్యూట్ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
మీరే భావి లీడర్లు .. మీరే నా యువ సైన్యం.. : సీఎం జగన్
మన జెండా, అజెండాపై మమకారంతో, మన మేనిఫెస్టోపై నమ్మకంతో, నవరత్నాల పథకాలు – పాలనా సంస్కరణలను ప్రజలకు చేరువచేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ. ప్రతి నిరుపేద బతుకులు మారాలని, భావి తరం పేదరికం సంకెళ్లు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన విప్లవాత్మక పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వలంటీర్లు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తన నోటి నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ కలగాలి. ఆ విశ్వసనీయతను ఏ రోజైతే కల్పించగలుగుతాడో అప్పుడు అతడిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, అభిమాని కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్.. ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని, రాబోయే రోజుల్లో మీరు లీడర్లు కాబోతున్నారని తాను మొట్ట మొదటిరోజే చెప్పానని వలంటీర్లనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ దగ్గర నుంచి మొదలుపెడితే తన వరకూ 58 నెలలుగా అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. ఇంకా రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. 2.60 లక్షల మంది నా సైన్యం.. నా వలంటీర్ల సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ సైన్యం గుండెలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ గుండెలు కావని, ఇవి సేవా హృదయాలని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్లకు వందనం’లో భాగంగా వరుసగా నాలుగో ఏడాదీ పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నాడు దోపిడీ వ్యవస్థ.. నేడు సేవా సైన్యం చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రజలు టీడీపీని అధికారం నుంచి దించేందుకు కారణమైతే మీ అన్న తెచ్చిన సేవా సైన్యం సచివాలయాల వ్యవస్థతో అనుసంధానమై పేదలకు ప్రతి అవసరంలోనూ వారధిగా మారింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ మీ బిడ్డ ప్రభుత్వం ఘన విజయానికి వలంటీర్లు కారకులయ్యాయని గర్వంగా చెబుతున్నా. పరిపాలనను మార్చిన ఈ ప్రజా వ్యవస్థలే 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు వేస్తాయి. మన వ్యవస్థలు , మన ప్రభుత్వం, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన అజెండా ప్రకారం సేవ చేయడానికి పుట్టాయి. ప్రతి గ్రామంలో బడి, ఆసుపత్రి పరిస్థితులను సమూలంగా మార్చాయి. పౌర సేవలను ఇంటివద్దే అందిస్తున్నాం. కళ్లకు కట్టినట్టుగా మీరు గమనిస్తున్న ఈ తేడాను ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియచేయాలి. 2019 కంటే ముందు ఏ సేవ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు, నెలల తరబడి కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే కానీ అడుగు ముందుకు పడని పరిస్థితి. అవ్వాతాతలు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులు ఎరువులు కావాలన్నా ఎండనకా వాననకా చాంతాడంత క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు నాయుడు దాకా లంచాల పాలనే సాగింది. ఇప్పుడు మీ అన్న ప్రభుత్వంలో నెలకు రూ.3 వేలు చొప్పున 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే గత ప్రభుత్వ పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కేవలం రూ.వెయ్యి ముష్టి వేసినట్లు పెన్షన్ ఇచ్చేవారు. నాడు వివక్ష కారణంగా లక్షల మందికి పెన్షన్ అందలేదు. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు, బటన్లూ లేవు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివైతే మన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివి. చంద్రబాబు పాలన ఓ విష వృక్షమైతే మన పాలన కల్పవృక్షం లాంటిది. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గౌరవ వేతనంతో మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వలంటీర్ల సేవాభావానికి మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు. డీబీటీ, నాన్ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనైనా ఇలాంటి లంచాలు లేని, వివక్షలేని వ్యవస్థను ఎక్కడైనా చూశారా? ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. ప్రతి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలకు చెప్పండి. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పటివరకూ రూ.2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాం. వీటికి తోడు ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, ట్యాబ్‌లు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలు కూడా తీసుకుంటే మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువ కూడా తీసుకుంటే అది రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది. ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా వెళ్లింది కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాలను కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా తట్టుకోగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ అప్పటి కన్నా మన ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు చాలా తక్కువ. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించకపోవటానికి కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కాపీ కొట్టి కిచిడీ మేనిఫెస్టో.. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చుని వేరే రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలు కాపీ కొట్టి కిచిడీ రూపంలో తెచ్చారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుడితే చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. తానిచ్చి న హామీలన్నీ నిజంగా అమలు చేసే పరిస్థితి, అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అన్న ఆలోచన కూడా చంద్రబాబుకి ఉండదు. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి అబద్ధాలు ఆడటంలో భావదారిద్య్రం ఎందుకనే ధోరణి ఆయనది. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడనే తత్వం చంద్రబాబుది. ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరని పసిగట్టి చంద్రబాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారు. మొన్నటివరకు జగన్లాగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి ఇప్పుడు అదే నోటితో ఆరు వాగ్దానాలంటున్నారు. పైగా ఇది శాంపిల్ మాత్రమే, దీనికి మరో ఆరు జమ అవుతాయని చెబుతున్నారు. వాటిని టచ్ కూడా చేయలేరు... మీ బిడ్డ కష్టపడి ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాడు. ఇందులో కొన్ని కార్యక్రమాలను టచ్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోదు. నెలకు రూ.3 వేల చొప్పున సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇచ్చే విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం లాంటి ఎనిమిది పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది. వీటిని ఎవరైనా రద్దు చేయాలనుకున్నా చెయ్యి కూడా వేయటానికి సాహసించలేని పథకాలు అవి. మరి రూ.52,700 కోట్లు వెచ్చి ంచాల్సిన ఈ తప్పనిసరి పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే మొత్తంగా రూ.1,26,140 కోట్లు వరకు లెక్క తేలుతోంది. గతంలో ఏమీ చేయకుండా మోసాలకే పరిమితమైన ఆ వ్యక్తి ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఇస్తానని నమ్మబలుకుతున్నాడంటే అంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబు మేనిఫెస్టో.. రంగుల మాయాజాలం 1994, 1999, 2014.. చంద్రబాబు పాలనను ఎప్పుడు తీసుకున్నా అధికారంలోకి రాక ముందు మేనిఫెస్టో రంగురంగులతో ఉంటుంది. 650 పేజీలు.. 650 హామీలంటూ , ఎన్నికలు ముగిశాక చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్సైట్లో కూడా మేనిఫెస్టోను మాయం చేస్తారు. ప్రజలు మోసపోకుండా బాబు రంగుల మాయలను ప్రజలకు వివరించాలి. చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. వారం పాటు ఉత్సవాలు వలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా అభినందించే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవాల మాదిరిగా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం. మీరంతా గత ప్రభుత్వ హయాంలోని లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థను బద్ధలుగొట్టి త్రికరణశుద్ధితో నిజాయితీ చాటుకున్నందుకు గుర్తింపుగా బహుమతిని పెంచుతున్నాం. సేవావజ్రాలకు రూ.45 వేలు, సేవారత్నాలకు రూ.30 వేలు, సేవా మిత్రలకు రూ.15 వేలు చొప్పున అందచేస్తాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను సేవావజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాల్టీ పరిధి నుంచి కనీసం ఐదు మంది, ప్రతి కార్పొరేషన్ పరిధి నుంచి పదిమంది చొప్పున 4,150 మంది వలంటీర్లను సేవారత్న అవార్డులతో గౌరవిస్తున్నాం. ఇలా 2,55,464 మంది వలంటీర్లను అభినందిస్తూ నగదు బహుమతిగా రూ.392 కోట్లను అందచేస్తున్నాం. చొక్కా మడతబెడదాం.. ఇక అబద్ధాలను మట్టి కరిపించేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చి ంది. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకురావాలి. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పెత్తందార్ల మీద చేస్తున్న యుద్ధంలో చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మీకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలపడమేనని ప్రజలకు తెలియచేయాలి. 2004లో చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. నాడు వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీ, రూ.2 వేల నిరుద్యోగ భృతి లాంటి హామీలను ఎగ్గొట్టడం, కోటయ్య కమిటీ అంటూ కోతల కమిటీని నియమించిన వైనాన్ని మరోసారి వివరించాలి. బాబును నమ్మడమంటే... చంద్రబాబును నమ్మడం అంటే ఇంగ్లిషు మీడియం బడుల్ని, సీబీఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, పిల్లలకిచ్చే ట్యాబులు, ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ పెడుతున్న మన స్కూళ్లను, మన క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చేసి మన పిల్లల బంగారు భవిష్యత్‌ను తాకట్టు పెట్టడమేనని ప్రజలకు తెలియచేయాలి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా? అని అడగండి. బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ వ్యవస్థను కాదనుకుని జన్మభూమి కమిటీలను ఆహా్వనించడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. చంద్రముఖిని తెచ్చుకోవడమే.. చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పాలి. బాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయి. వలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమేనని ఎలుగెత్తాలి. దడ పుట్టిస్తున్నాం.. వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. దత్తపుత్రుడి నోటి నుంచి కించపరిచే వ్యాఖ్యలు వినిపిస్తాయి. మహిళల అదృశ్యానికి వలంటీర్లు కారణమని ఒకడంటాడు. వలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతానంటాడు. తాము అధికారంలోకి వచ్చి న తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు. ఇంత మందికి మనం దడ ఎలా పుట్టిస్తున్నామో తెలుసా? ఈరోజు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ సంక్షేమాన్ని డెలివర్ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. విపక్షాల కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు కాకుండా పేదవాడి కడుపులు నిండుతున్నాయి కాబట్టే. విపక్షాల కడుపు నింపేది అవినీతి ఆకలి మాత్రమే. ఇలాంటి విషవృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. 58 నెలలు దాటాం. మీ బిడ్డ ఇంకో 10–15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేదవాడి ఇంట్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడతాడు. పేదల తలరాతలు శాశ్వతంగా మారిపోతాయి. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు పింఛన్ ‘‘తాడికొండ, మంగళగిరి రాజధాని ప్రాంతంలో భూమిలేని 17 వేల మంది నిరుపేదలకు జీవనభృతి పింఛన్ రూ.2,500 నుంచి రూ.ఐదు వేలు చేయాలని ఎమ్మెల్యే సుచరిత కోరారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేస్తాం. ఫిరంగిపురంలోని కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్డు కోసం రూ.39 కోట్లు మంజూరు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ ప్రకటించారు. సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీలు నందిగం సురేష్, ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, కాసు మహేష్ రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, సమన్వయకర్తలు ఉమ్మారెడ్డి వెంకటరమణ, నూరీ ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు. ఉద్యోగ విప్లవం సీఎం జగన్ దాదాపు 2,55,000 మందికిపైగా వలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి తుంగలోకి తొక్కారు. వలంటీర్ వ్యవస్థ తెచ్చి నప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు పొగుడుతున్నారు. మన దేశం హరిత విప్లవం, శ్వేత విప్లవం చూసింది. సీఎం జగన్ ఉద్యోగ విప్లవం తెచ్చారు. ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ ఉద్యోగాలిచ్చారు. – మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు,తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం.. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో అర్హులను గుర్తించి పథకాలు అందిస్తున్నప్పుడు వారి చిరునవ్వు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు దీవెనలు ఉంటాయంటూ మా చేతులను తాకినప్పుడు ఆ అనుభూతిని మరిచిపోలేం. ఆసుపత్రిలో ఉన్న ఓ తాతకు ఒకటో తారీఖు రాత్రి 12 గంటలకు పింఛన్ ఇచ్చా. దురదృష్టవశాత్తూ తరువాత కొద్దిసేపటికే ఆయన చనిపోయారు. ఆయన భార్య నన్ను హత్తుకుంటే ఇది కదా సేవ అని అనిపించింది. తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు? మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నా. ప్రజలు మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. మళ్లీ మీ పాలన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. – దాసరి జ్యోత్సా్న దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మీ చిరునవ్వుతో ఆత్మస్థైర్యం నా క్లస్టర్ లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీ ఆశయాలను నిలబెట్టేలా పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. ఇప్పుడు ప్రతి గడపనూ పలుకరిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లిన 22 ఏళ్ల యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల ఉచిత వైద్యం సంజీవనిలా పని చేసింది. ఆ కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలకు రూ. 10 వేలు ఇచ్చాం. వలంటీర్ వ్యవస్థను మొదట్లో చాలా మంది కించపరిచారు. మీరు అండగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. మీ చిరునవ్వు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నా. మీరు నా వలంటీర్లు అని ఆప్యాయంగా పలుకరిస్తుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవాగుణాన్ని గుర్తించి మాకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని పెంచడం చాలా సంతోషంగా ఉందన్నా. –షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్‌బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్‌కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్‌ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
ఆత్మీయ సేవకులపై రాకాసి రాతలు
-
మాధవీ..మర్యాదగా మసలుకో!
సాక్షి ప్రతినిధి, కడప: శాంతిభద్రతలకు నిలయంగా, మత సామరస్యానికి ప్రతీకగా.. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లా కేంద్రమైన కడపలో దౌర్జన్యకర ఘటనలు జరుగుతున్నాయి. ఏదో ఒకచోట టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు నెలల తర్వాత అధికారం మాదే, మేమేంటో చూపిస్తామంటూ అధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ శ్రేణులు గూండారాజ్‌ను మరిపిస్తున్నారు. ఇదివరకు ఎన్నడు లేనివిధంగా టీడీపీ ఇన్చార్జిగా ఆర్ మాధవీరెడ్డి నియామకమయ్యాక ప్రత్యక్ష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కార్పొరేటర్ షబానా కుమారుడు పీరుల్లా(26)పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప నగరం మోచంపేట 39వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి అరీఫ్ మరికొంతమంది కలిసి పీరుల్లాపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. మొన్న మృత్యుంజయకుంట సమీపంలో మాధవీరెడ్డి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’కార్యక్రమంలో భాగంగా ప్రచారానికి వెళ్లింది. ఇంటింటా టీడీపీ స్టిక్కర్లు గృహస్తుల అనుమతి లేకుండా అతికించారు. గమనించిన వలంటీర్ ఆంజనేయులు తన ఇంటికి టీడీపీ స్టిక్కర్ అతికిస్తుంటే అభ్యంతరం చెప్పారు. నా అనుమతి లేకుండా ఇలా చేయొద్దన్నందుకు టీడీపీ నేతలు దేరంగుల శివ, శివశంకర్ వాదనకు దిగారు. వలంటీర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా మాధవీరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో అక్కడికి వెళ్లి రచ్చ చేశారు. ఈవ్యవహారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసుస్టేషన్లో సైతం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, తర్వాత నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కలెక్టర్ విజయ్‌రామరాజు బుధవారం ఓటర్ల తొలగింపులు, చేర్పులు వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాసులరెడ్డి అదే పదజాలన్నీ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అయిన విజయరామరాజు ఎదుట సైతం ఉపయోగించడం విశేషం. క్రమం తప్పకుండా దౌర్జన్యాలు.... ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లలో పర్యటిస్తున్న మాధవీరెడ్డి ఇటీవల దౌర్జన్య కర ఘటనలకు పాల్పడుతున్నారు. మొన్న టీడీపీ బృందం ప్రచారం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత వినోద్‌కుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అభ్యంతరం చెప్పారు. వెంటనే వినోద్‌కుమార్‌ను టార్గెట్ చేసి, స్వయంగా మాధవీరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనివాసులరెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను సైతం ఏకవచనంతో సంబోధించడం పరిపాటిగా పెట్టుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా ఏకవచనంతో సంభోదిస్తూ కావాలనే సామాజికంగా ఎక్స్‌ఫోజ్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మాధవీ..మర్యాదగా మసలుకో! కడప రూరల్ /కడప అర్బన్: ప్రశాంతంగా ఉన్న కడపకు వచ్చి విద్వేషాలను నింపుతున్న కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాధవిరెడ్డి మర్యాదగా మసలుకుని ప్రవర్తించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప నగర మహిళా నేతలు హితవు పలికారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో పార్టీ కడప సోషల్‌మీడియా కన్వీనర్ సునీతరెడ్డి మాట్లాడుతూ మాధవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఆమె మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తించడమే కాకుండా డిప్యూటీ సీఎం అంజద్బాషతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి 10–12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా దూషించారన్నారు. కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాధవిరెడ్డి నియమితులైనప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తల ఆగడాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశామని సోషల్ మీడీయా కన్వీనర్లు సునీతారెడ్డి, నిశాంత్‌లు తెలిపారు. పార్టీ మహిళా విభాగం కడప నగర అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కడపకు మాధవిరెడ్డి శూర్పనఖలా వచ్చారని అన్నారు. పార్టీ నాయకులు పద్మావతి, మరియలు, సుశీల, తులశమ్మ, నారాయణ, నిర్మల పాల్గొన్నారు. కడపను కలుషితం చేస్తే సహించం టీడీపీ ఇన్చార్జి మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి కడపలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువజన నేత పీరుల్లాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజామెప్పుతో నాయకుడిగా ఎదగాలని సూచిస్తున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు.శాంతియుత వాతావరణంలో ఉన్న కడపను కలుషితం చేస్తే సహించం. –అంజద్‌బాషా, డిప్యూటీ సీఎం కవ్వింపు చర్యలు మానుకోండి టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.వీటిని మానుకోవాలి. అకారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, రామాపురం ప్రాంతాలకు చెందిన ప్రైవేటు సైన్యంతో శ్రీనివాసులరెడ్డి, మాధవీరెడి జిల్లా కేంద్రంలో దౌర్జన్యకర ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పునరావృతమెతే టీడీపీ నేతలు తగిన మూల్యం చె ల్లించుకోవాల్సి వస్తోంది. – సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
వలంటీర్ మానవత్వం..
రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్లో మేకతోటి జయంతి వలంటీర్‌గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్‌పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది. అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్‌పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
AP: నేటి నుంచి కుల గణన
సాక్షి, అమరావతి: నేటి నుంచి ఏపీలో కుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్‌గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్‌లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్‌లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. -
Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి.. విజయవంతంగా ప్రజల వద్దకే పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా.. వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో దాదాపు 80,000 వాలంటీర్ ఉద్యోగాలు నియామకం చేపట్టనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆరు గ్యారెంటీలకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగం.. ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. అలాగే ఆరు గ్యారెంటీల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80 వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇక ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక తెలంగాణలో కొత్తగా రానున్న వలంటీర్లకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి కూడా దాదాపు రూ.5000 నుంచి రూ.10,000 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు: సీఎం జగన్ -
ఎస్సైగా ఎంపికై న వలంటీర్‌కు సన్మానం
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించిన వలంటీరు జి.యోగీశ్వరిని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా.. సమర్థంగా రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు రేషన్ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయి తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు–కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల–బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వారు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిలాల్లో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణ నెల్లూరు, తిరుపతి సహా తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కావాలన్నారు. రైతులకు కలెక్టర్ల భరోసా.. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లింది. దగ్గరుండి సహాయక చర్యలను చేపట్టింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కల్లాల్లో ధాన్యం గుట్టలను సందర్శించి అవి తడవకుండా టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు కలెక్టర్లు భరోసా ఇచ్చారు. -
'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ '
ఢిల్లీ: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. హమాస్‌ను ఉగ్రదాడిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోబోమని నౌర్ గిలోన్ అన్నారు. తమకు మద్దతు తెలుపుతున్న వాలంటీర్లతో మరో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను తయారు చేయవచ్చని నౌర్ గిలోన్ అన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమకు మద్దతుగా మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాను చూడండి. మద్దతు తెలుపుతున్న భారత వాలంటీర్లతో మరో రక్షణ దళాన్ని తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ తరుపున పోరాడటానికి మేమంతా ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు.' అని నౌర్ గిలోన్ తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ స్నేహసంబంధాలు ఎంత ప్రత్యేకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్‌లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్‌కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు. ‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్‌లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం. అక్కడి నుంచి కిబ్బుట్జ్‌లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి' 20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
వీడిన వలంటీర్ హత్య కేసు మిస్టరీ
ఆదోనిఅర్బన్: గతనెలలో పట్టణంలో జరిగిన వలంటీర్ హరిబాబు హత్య కేసును ఆదోని టూటౌన్ పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటున్న ఈరమ్మ కుమారుడు హరిబాబు భరత్‌నగర్ సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో ఉన్న భీమన్న భార్యను మృతుడు వేధించేవాడు. మహిళ కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా గణపతి వేడుకల్లో కూడా ఆమెను వేధించాడు. గమనించిన భర్త భీమన్న హత్యకు పథకం రచించాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి హరిబాబును మాయమాటలు చెప్పి బహిర్భూమికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపేశాడు. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి తండ్రి ఈరన్నకు విషయం చెప్పాడు. ఆయన సలహా మేరకు ఆధారాలు దొరకకుండా హత్య సమయంలో వేసుకున్న దుస్తులను కాల్చివేశాడు. 21వ తేదీ ఉదయం కుమారుడి హత్య విషయం తెలుసుకున్న తల్లి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడి ఫోన్ కాల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న భీమన్న, అతని తండ్రి ఈరన్న మండిగిరి వీఆర్వో రాజశేఖర్ ముందు లొంగిపోయారు. వారు హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించిన టూటౌన్ సీఐ శ్రీనివాసనాయక్, వన్‌టౌన్ సీఐ విక్రమసింహ, హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ ఆంజనేయులు, హోంగార్డు గోవర్ధన్‌ను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
రామ్మా పింఛన్ తీసుకో..
ఆశ్రయం అన్నది లేకుండా ఓ చోట తింటూ, మరో చోట ఉంటూ బతుకుతున్న ఓ యాచకురాలికి ప్రతి నెలా పింఛన్ మాత్రం ఠంచన్‌గా అందిస్తున్నా రు. వలంటీర్ వ్యవస్థ చేసిన మేలు ఇది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన బొచ్చ కాంతమ్మకు మతిస్థిమితం లేక, అనారోగ్యంతో బాధ పడుతుండడంతో జంట పట్టణాల్లో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తింటూ ఉండేది. ఇప్పుడు పింఛన్ డబ్బుతో కడుపు నింపుకుంటోంది. మంగళవా రం పలాస ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వలంటీర్ పట్ట చైతన్య, గొడగలవీధి కార్యదర్శి పాలక మినర్వా సమక్షంలో వేలిముద్రలు తీసుకుని పింఛన్ అందించారు. – కాశీబుగ్గ -
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
మా వలంటీర్ వెంకటేష్ కాదు.. విజయలక్ష్మి
విశాఖపట్నం: వెంకటేష్ వలంటీర్‌గా పనిచేస్తున్నాడనే సంగతి తమకు తెలియదని జీవీఎంసీ 95వ వార్డు సుజాతనగర్‌లోని 80 ఫీట్ రోడ్డులో ఇటీవల హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి తెలిపారు. వరలక్ష్మిని వలంటీర్ వెంకటేష్ హత్య చేశాడని పదేపదే కూస్తున్న ఎల్లో మీడియాతోపాటు కొన్ని అనుబంధ మీడియా సంస్థలకు కనువిప్పు కలిగే నిజాలను ఆయన తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ... గత నెల 31న సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో వృద్ధురాలు వరలక్ష్మి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆమె భర్త, కుమారుడు నడుపుతున్న మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే వెంకటేష్ వృద్ధురాలిని హత్య చేశాడు. అయితే వెంకటేష్ వలంటీర్ అని ఎల్లో మీడియాతోపాటు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కొద్ది రోజుల క్రితమే వెంకటేష్‌ని వలంటీర్‌గా తొలగించామని జీవీఎంసీ జోన్ – 8 కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. అయినప్పటికీ పదేపదే వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం, గత శుక్రవారం సుజాతనగర్‌లోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించిన క్రమంలో మృతురాలి భర్త గోపాలకృష్ణమూర్తి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు వెంకటేష్ తమ ఏరియాకి... తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చే వలంటీర్ కాదని, అతను వలంటీర్ అన్న విషయమే తనకు తెలియదంటున్నారు. తమ ఇంటికి వచ్చే వలంటీర్ విజయలక్ష్మి అని, ఆమె సమయానికి సమాచారం, పింఛన్ల నగదు అందిస్తోందని పేర్కొన్నారు. -
వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్!
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై కత్తి కట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారు. ఇటీవల ఆయన మహిళల కిడ్నాప్‌లకు సహకరించే సంఘ విద్రోహశక్తులంటూ అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆగ్రహోదగ్రులయ్యారు. రోడ్లెక్కి నిరసన తెలియజేశారు. పవన్ దిష్టి»ొమ్మలను దహనం చేసి ఆయన వైఖరిని దుమ్మెత్తి పోశారు. ఊహించని ఈ పరిణామానికి దిగివచ్చిన పవన్.. తాను వలంటీర్లందరినీ అలా అనలేదని, కొందరిని ఉద్దేశించే అలా అన్నానని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. పవన్ గత వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారకముందే తాజాగా మరోసారి వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్లో బంగారం కోసం ఓ వృద్ధురాలిని వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. గతంలో ఇతను వలంటీర్‌గా పని చేస్తున్నప్పుడు ఫిర్యాదులు రావడంతో అధికారులు తొలగించారు. ఇది వృద్ధురాలి హత్యకు ముందే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పవన్ శనివారం వరలక్ష్మి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతటితో ఆగకుండా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాల కోసం నియమించిన వలంటరీ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. వీరు అసాంఘిక శక్తుల్లా మారి నేరాలకు తెగబడుతున్నారు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వలంటీరు ఉద్యోగాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. జనసేన అద్భుతాలు చేయదు.. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తుందని తాను చెప్పడం లేదని, వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడతామని పవన్ చెప్పారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేస్తే.. అదే ఎంపీ వారినే వెనకేసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
అయ్యా పవనూ.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శవ రాజకీయానికి తెరలేపారు. మొన్నటికి మొన్న వలంటీర్ వ్యవస్థపై విషాన్ని కక్కిన పవన్.. ఇప్పుడు విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంకతో శవ రాజకీయాలు మొదలు పెట్టారు. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్ చంపేశాడంటూ అసత్య ప్రచారం చేస్తున్న పవన్.. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్’ అంటూ వాలంటీర్లను అభివర్ణించడం.. పవన్‌లో నిండుకుపోయిన విషానికి నిదర్శనమంటున్నారు. కాగా వరలక్ష్మిని చంపడానికి వారం రోజులు ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్‌గా తొలగించారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేట్‌పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24వ తేదీన వెంకటేష్ వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్‌గా వెంకటేష్ చేరాడు. ఈ క్రమంలో జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్ హత్య చేశాడు. అయితే రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ హత్య చేశాడంటూ పవన్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ వల్ల 30 వేల మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ దుష్ప్రచారం చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తి చంపేస్తే వలంటీర్ చంపేశారంటూ పవన్ విష ప్రచారం చేశారు. ఎంత చంద్రబాబు డైరెక్ట్ చేయించినా.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? అని పవన్ తీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. వ్యవస్థలో ఒకరో, ఇద్దరో చేసిన తప్పుకు మొత్తం అందరిపై నిందలు వేయడం, విషం జిమ్మడం సరికాదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం సరికాదని, చుట్టున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నది పూర్తిగా దుష్ప్రచారమని, ఇటీవల కేంద్రం కూడా పార్లమెంటులో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు, చదవండి: బాలికపై చిరుత దాడి ఘటన.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం -
రోడ్డు ప్రమాదంలో వలంటీరు మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో వలంటీరు మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి(29) మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్తరాశిపాళెంకు చెందిన మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి 4వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్నారు. బుధవారం సొంత పనుల నిమిత్తం తన స్నేహితుడు సురేష్‌ను వెంటబెట్టుకుని బసవయ్యపాళెంకు బయలుదేరాడు. తెట్టు కూడలి వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి గంగమ్మ హద్దురాయి మండపాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులురెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం
వైఎస్సార్: రైల్వేకోడూరు మండలం ఓ.కొత్తపల్లెలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన గుండంలో కల్లూరి బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోగా వలంటీర్ చాపల సురేష్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు సోమవారం వలంటీర్ ఇంటికి వెళ్లి సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందనేందుకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. కాగా పీర్లగుండంలో పడి తీవ్రగాయాలైన బాషాకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రిలోని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్‌రాజు, ప్రముఖ న్యాయవాది ఆర్సీ సురేష్‌బాబు, ఎంపీటీసీ జనార్దన్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సుంకేసుల బాషా, తొండం రాజేంద్ర, ధనుంజయ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
‘పవన్ మానసికంగా వేధించాడు’
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళా వలంటీర్.. విజయవాడ సివిల్ కోర్టులో పవన్‌పై డిఫమేషన్ కేసు వేశారు. కాగా, వలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఈ సందర్బంగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని మహిళా వలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసుపై మహిళా వలంటీర్ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫికింగ్ ఆధారాలు కోర్టుకు ఇవ్వాలి.. అనంతరం.. న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు ఇస్తుంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు కోర్టు తీసుకుంటుంది. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్‌కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలి. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలి. అబద్ధపు వదంతులు, వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం’ అని తెలిపారు. పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఈ సందర్బంగా మహిళా వలంటీర్ మాట్లాడుతూ.. పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాం. పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం. నేను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాను. పవన్ వ్యాఖ్యల తర్వాత నన్ను చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేసి పవన్ తప్పు చేశారు. పవన్‌ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ‘పేదల ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడు అడుగడుగునా అడ్డుపడ్డారు’ -
AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్‌తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు.. -
పవన్ పై మండిపడుతున్న వలంటీర్లు
-
మహిళా వలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు. పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: పవన్‌కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు -
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
పవన్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు ఉన్నారు. అనంతరం, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. పవన్ వారి కోసమే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ల జేబు సంస్థగా పవన్ పనిచేస్తున్నాడు. పవన్‌కు మహిళలంటే గౌరవం లేదు. వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. పవన్‌ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారు. పవన్‌కు ఇదే మా హెచ్చరిక. మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్. మహిళలు, వాలంటీర్లకు పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావ్. పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు. పవన్‌ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని ఫైర్ -
పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: నిత్యం ప్రభుత్వాన్ని నిందించడమే పవన్ కల్యాణ్ పనా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీ నాయకునిగా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పాలి కానీ ప్రతిసారీ సీఎంను విమర్శించడమే పనిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.పవన్ తీరు మార్చుకోకుంటే ప్రజలే చెప్పులు చూపిస్తారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కాకి లెక్కలను ప్రజలను విశ్వసించరని అన్నారు. ఎన్సీపీ, ఎన్సీఆర్బీకి తేడా తెలియని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సైకోలా మాట్లాడుతున్నాడని, ఆయన హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ‘వాలంటీర్లపై పవన్ మాట్లాడిన తీరు బాధాకరం. వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉన్నారు. వాలంటీర్లపై నిందలు వేయడానికి పవన్‌కు బుద్ధి ఉందా? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశారు. వాలంటీర్లు పవన్ క్షమాపణలు చెప్పాలి. పదేళ్లైనా పవన్ రాజకీయాల్లో ఎదగలేదు. అవసరాలకు తల్లి, రాజకీయాల కోసం భార్య పేరు ఉపయోగిస్తున్నారు. పవన్ తల్లిని అవమానించింది టీడీపీ నేతలే కదా. వారిని కాకుండా మమ్మల్ని విమర్శించడం దేనికి?. వైఎస్సార్ సీపీ నాయకులు ఎప్పుడైనా మీ తల్లి, భార్య గురించి మాట్లాడారా? కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. పవన్ ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదు. జనసేన పార్టీ ఎందుకు. డబ్బులు తీసుకొని ఖర్చు చేయడం ఎందుకు. టీడీపీలో విలీనం చేసేయొచ్చు కదా? విలీనం చేస్తే విడతలుగా డబ్బు రాదని ఆలోచిస్తున్నావా ? ‘వారాహి పార్ట్ 2లో భాగంగా పొలిటికల్ సైడ్ హీరో రాజకీయాలు మాట్లాడారు. సంసారం గురించి ఓ తిరుగుబోతు మాట్లాడినట్లు పవన్ మాట్లాడారు. పవన్‌ను చూసి అమ్మాయిలు భయపడుతున్నారు. మీకు ధైర్యం వుంటే అమ్మ ఒడి, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు చెప్పగలవా’ అని ప్రశ్నించారు. చదవండి: ప్రశ్నిస్తే బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు -
చికిత్స పొందుతూ వలంటీర్ మృతి
ఏలూరు: వాహనంపై వెళుతూ అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిన వలంటీర్ రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పంగిడిగూడెం గ్రామ వలంటీర్ కుక్కల రామాంజనేయులు (29) ఈనెల 14న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి పంగిడిగూడెకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పంగిడిగూడెం హైస్కూల్ వద్దకు వచ్చే సరికి వాహనం నుంచి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతనిని జంగారెడ్డిగూడెం తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బీపీ ఎక్కువైందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు వీఆర్వో తెలిపారు. -
ఆమె వికలాంగురాలు అయినప్పటికీ వాలంటీరుగా పనిచేస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తుంది
-
టీసీఎస్ ఉద్యోగుల సరికొత్త రికార్డ్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్‌లు కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 22 లక్షల గంటలు టీసీఎస్ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది. హోప్ చొరవలో భాగంగా టీసీఎస్ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు. సేవా కార్యక్రమాలు ఇవే.. సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్‌లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్‌లను టీసీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
శభాష్ వాలంటీర్ నువ్వు సేవా వారియర్..!
-
థాంక్యూ జగనన్న.. వాలంటీర్ సోంబాబు కృతజ్ఞతలు
సాక్షి, ఎన్టీఆర్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు.. ఈ నినాదం మాటేమోగానీ దానిని చేతల్లో చూపిస్తున్న నేత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ‘‘మీరే నా కుటుంబం, మీకు అండగా నేను ఉన్నాను. మీ జీవితాలకు నాదీ భరోసా. మీ బాధలను నేను చెరిపేస్తా’’ అంటూ సహాయం కోసం అర్థించిన కుటుంబాల్లో స్వయంగా వెలుగులు నింపుతున్నారాయన. సహయం కోసం వచ్చేవాళ్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చే బాపతి కాదు ఆయన. సావధానంగా వాళ్ల సమస్యలను విని.. అప్పటికప్పుడే అధికారులతో ఆ సమస్య గురించి చర్చించి.. గంటల వ్యవధిలోనే సహయం అందేలా చూస్తున్నారు కూడా. తాజాగా.. అలా సాయం అందుకున్న వాలంటీర్ జక్కుల సోంబాబు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడతను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సోంబాబుకి.. పెద్ద ఆపదే వచ్చిపడింది. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయినా ఆ సమస్యను లెక్కచేయకుండా వాలంటీర్‌గా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడతను. అందుకే సీఎం జగన్‌పై ఉన్న అభిమానం కూడా ఓ కారణమని చెబుతున్నాడతను. కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అతనిది. తల్లి సాధారణ కూలీ కావడంతో ఆర్థికంగా ఇబ్బందిగా మారుతూ వస్తోంది. అయినా కూడా వాలంటీర్ బాధ్యతలను ఏమాత్రం విస్మరించలేదతను. ఈలోపు అతని సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన సీఎం జగన్‌ను.. సోంబాబు, అతని తల్లి కలిశారు. అతని సమస్య తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయం అక్కడితోనే ఆగలేదు.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. ఆ సర్జరీకి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం జగన్. ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని చెబుతూ సోంబాబు సంతోషంగా సీఎం జగన్‌కు పాదాభివందనం చేయబోగా.. ఆయన వద్దని వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు. రెండు లక్షల చెక్కు అందజేత ఒక వాలంటీర్‌కు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. గంట లోపే సోంబాబు కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. అలాగే సోంబాబుకు సీఎం జగన్ ప్రకటించిన ఇతర సహాయాలనూ కలెక్టర్ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారాయన. ఇదీ చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? -
తుంగభద్ర డ్రెయిన్‌లో పడి మహిళా వలంటీర్ మృతి
మన్నవ(చేబ్రోలు): పొన్నూరు రూరల్ మండల పరిధిలోని మన్నవ గ్రామంలో మహిళా వలంటీర్ ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన ఘటన గురువారం జరిగింది. అన్నవరపు మానస(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. ఉదయం స్థానికంగా ఉన్న తుంగభద్ర డ్రెయిన్‌లో దుస్తులు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మానసను స్థానికులు కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అనంతనం వలంటీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వలంటీర్ మానస మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పరిమళించిన మానవత్వం: అప్పుడు తమిళ తంబి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి
వైఎస్సార్: మండల కేంద్రమైన కలసపాడులోని ఆర్టీసీ బస్టాండులో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ వృద్ధుడిని వివేకానంద ఆశ్రమం చేరదీసింది. వివరాలు.. అనాథ అయిన ఇతను గాలికి తిరుగుతూ.. దొరికింది తింటూ నెల్లూరు నగరం చేరాడు అరవై ఏళ్ల క్రితం. అప్పటికి తనకు పదహారేళ్లు. అక్కడ హోటల్ నడుపుతున్న తమిళ తంబి రమ్మని పిలిచాడు. అన్నం పెట్టాడు. ఆశ్రయం ఇచ్చాడు. అమ్మానాన్న, గురువు అన్నీ తానే అయ్యాడు. హోటల్ యజమాని తొలిసారి తనను కుమార్ అని పిలిచాడు. అదే పేరుగా మారిపోయింది. కుమార్‌కు హోటల్ యజమానే వివాహం చేశాడు. కాలక్రమంలో హోటల్ యజమాని చైన్నెకి వెళ్లడంతో హోటల్ మూతపడింది. కుమార్ భార్య కూడా కాన్యర్‌తో మృతిచెందింది. దీంతో అనాథ అయిన కుమార్ నెల్లూరు నగరాన్ని వదిలి పాదచారిగా ప్రయాణం ప్రారంభించాడు. ఓపిక ఉన్నంత కాలం తిరిగాడు. అలసిపోయి మూడు రోజుల కిందట కలసపాడుకు చేరుకున్నాడు. ఆర్టీసీ బస్టాండులో ఉన్న అనాథ పరిస్థితిని గమనించిన స్థానిక వలంటీర్ శ్రావణ్‌కుమార్ వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిజెన్నిరామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఆయన, ఆయన సతీమణి రామతులసితో వచ్చి అనాథకు స్నానం చేయించారు. ఫలహారం అందించారు. అనంతరం వివేకానంద సేవాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. మానవత్వంతో కూడిన వీరి సేవలను స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రేమజంట హడావుడి.. గుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆమె సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్. అతను అదే సచివాలయ పరిధిలో వలంటీర్. ఉద్యోగరీత్యా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే భయంతో గ్రామంలోని గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం గుడి తలుపులు మూసేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హడావుడి సృష్టించారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుద్దాలపాలెంకు చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి రెండేళ్ల కిందట సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెకు బుద్దాలపాలెం సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా నాగరాజు గాయత్రిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇరువురికీ వేర్వేరు కులాలు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు. -
వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి..
వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్ షేక్ అష్రాఫ్ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్ అష్రాఫ్ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు. ఆదివారం రాత్రి వలంటీర్ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్æపై దాడికి దిగారు. షఫీ కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్‌ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆ తర్వాత వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవుల కారణంగా ఈ నెలలో పింఛన్ల పంపిణీ మూడో తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 63,42,805 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యా«ధిగ్రస్తులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1747.88 కోట్లను విడుదల చేసింది. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచే సమయానికల్లా ఈ నిధులను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బును గ్రామ సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందించారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల సోమవారం రాత్రి పొద్దుపోయాక కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తూనే ఉన్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చెప్పారు. మరో నాలుగు రోజులు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమిది.. సీఎం జగన్ చేసిన మేలును మరువం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
క్యాన్సర్‌ను జయించిన వలంటీర్ మహమ్మద్
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్‌కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్‌కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్‌కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది. సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు. -
గ్రామ వలంటీర్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం
శ్రీకాళహస్తి రూరల్(తిరుపతి జిల్లా): గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వలంటీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరులో జరిగింది. వివరాలు.. ఇనగలూరుకు చెందిన అంతటి రామరాఘవేంద్ర గ్రామ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. అతను చురుగ్గా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకందిస్తుండటం స్థానిక టీడీపీ నాయకులకు నచ్చేది కాదు. ‘ఎందుకు అంతా నీదే అన్నట్లు చేస్తున్నావ్.. జాగ్రత్త’ అంటూ పలుమార్లు అతన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు చెలికం మోహన్‌రెడ్డి, జడపల్లి రాఘవ, నడవాలి చిరంజీవి శనివారం రాత్రి వలంటీర్ ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్చారు. నిప్పు రవ్వలు ఎగిరి వలంటీర్ రాఘవేంద్ర పిల్లల మీద పడ్డాయి. దీంతో కొంచెం దూరం వెళ్లి టపాసులు కాల్చుకోవాలని వలంటీర్ చెప్పడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. రాఘవేంద్ర భయపడిపోయి పరిగెత్తగా.. వెంటపడి కత్తితో దాడి చేశారు. ఇంతలో స్థానికులు అక్కడికి రావడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వలంటీర్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్
-
AP: వలంటీర్ మారినా ఫోన్ నంబర్ మారదు
సాక్షి, అమరావతి: ఏదైనా కారణంతో వలంటీర్ మారినా.. సమాచారం విషయంలో ఆ క్లస్టర్ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగర కార్పొరేషన్లలో క్లస్టర్ వారీగా శాశ్వత ఫోన్ నంబర్‌ను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం ప్రతి వలంటీర్‌కు మొబైల్ ఫోన్‌తో పాటు సిమ్‌ను కూడా అందజేసింది. అయితే ఏ కారణంతోనైనా ఏదైనా ప్రాంతంలో వలంటీర్ విధుల నుంచి తప్పుకొని తనకు కేటాయించిన ఫోన్ నంబర్ తిరిగి ఇవ్వనప్పుడు ఆ క్లస్టర్ పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బంది ఇకపై తలెత్తకుండా విధుల నుంచి తప్పుకొన్న వలంటీర్‌కు కేటాయించిన సిమ్‌ను బ్లాక్ చేసి, అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకొని కొత్త వలంటీర్‌కు అధికారులు అందజేయనున్నారు. ఇందుకోసం వలంటీర్లకు ప్రభుత్వం కేటాయించిన ఫోను నంబర్ల వివరాలను రాష్ట్ర స్థాయి ఆన్లైన్ డేటా బేస్ సెంటర్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల పదో తేదీ కల్లా ప్రతి వలంటీర్ తమ మొబైల్ నంబర్ వివరాలతో పాటు సిమ్ కార్డు వివరాలు రాష్ట్ర స్థాయి డేటా బేస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా సరైన సిగ్నల్ లేక ప్రభుత్వం కేటాయించిన సిమ్ కాకుండా వలంటీర్లు తమ సొంత ఫోన్ నంబర్ వాడుతుంటే.. అలాంటి చోట్ల సరైన సిగ్నల్ ఉండే కంపెనీలకు చెందిన ఫోన్ నంబర్లనే వలంటీర్లకు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. (క్లిక్ చేయండి: వైద్య శాఖలో కొలువుల జాతర) -
శభాష్ చందన!
మచిలీపట్నం టౌన్: ఆమె నిండు గర్భిణి. పేరు జోగి చందన. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని రెండో డివిజన్ సీ–5 వలంటీర్‌గా పనిచేస్తోంది. నవంబర్ 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె సోమవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించి 1.14 గంటలకు పూర్తి చేసింది. తన పరిధిలోని 90 మందికి పింఛన్ అందజేసింది. -
రైతు సేవలో మరో ముందడుగు
కడప అగ్రికల్చర్: రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. రైతన్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్నదాతల ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన ఆర్బీకే లలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించింది. ప్రస్తు తం రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ పంటలసాగు ఆధారంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్రస్థాయిలో గడపాల్సి వస్తోంది. ప్రధానంగా పంటలసాగు సమయంలో ఈ క్రాపు బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు మండల, సబ్ డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు వీరంతా హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.అలాంటి పరిస్థితిలో వ్యవ ప్రయాసాలతో మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. దేశానికే ఆదర్శంగా ఆర్బీకేలు.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక, ఎరువులు, పురుగు మందులు, పంట విక్రయాలు వంటి అన్ని రకాల సేవలు ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. దీంతోపాటు ప్రైవేటు ఎరువులు, రసాయనిక మందుల డీలర్లు అడ్డుగోలుగా అధిక ధరలకు విక్రయించేవారు. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు అయిన తర్వాత వారి ఆగడాలకు మరింత అడ్డుకట్ట పడింది. తాజాగా వలంటీర్ల నియామకంతో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది. రైతులకు మరింత చేరువలో ఆర్బీకేలు.. జిల్లాలో 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 414 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇది వరకే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 414 మంది వలంటీర్లకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. డిజటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాల, పురుగు మందులు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు ఆర్బీకే ఇన్చార్జుల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. చాలా సంతోషం రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఏదైనా పనిమీద బయటకు వెళితే ఆర్బీకేలను మూసివేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి వలంటీర్‌ను నియమించడం సంతోషంగా ఉంది. –ఎస్. శ్రీనివాసులరెడ్డి, గోపులాపురం, రాజుపాలెం మండలం వలంటీర్లకు సమ్రగ శిక్షణ జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వలంటీర్‌ను నియమించాం. వీరికి ఆర్బీకే నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ శిక్షణ ప్రారంభమైంది. ఆర్బీకే ఇన్చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సందర్భంలో రైతులకు వీరు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ/వెంకటాచలం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్–2020–21) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ కేటగిరీలో జేఎన్టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వలంటీర్ కేటగిరీలో నెల్లూరులోని కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన దేవనపల్లి సిరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించనుంది. ఇందుకోసం ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్‌ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను వీటి ద్వారా గ్రామస్థాయిలోనే అందిస్తోంది. ఆర్బీకేల్లో 14,435 మంది సేవలు ప్రతీ ఆర్బీకేకు ఒక వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. వీటిల్లో ప్రస్తుతం 14,435 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 6,321 మంది గ్రామ వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్థక, 731 మంది మత్స్య, 375 మంది పట్టు సహాయకులు ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యను బట్టి ప్రతీ ఆర్బీకేలో ఒక వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సహాయకుల్లో ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. స్థానికంగా ఉన్న పాడి, పట్టు విస్తీర్ణాన్ని బట్టి ఆయా సహాయకులు కూడా సేవలు అందిస్తున్నారు. ఇలా మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఒక బ్యాంకింగ్ కరస్పాండెం ట్ను కూడా అనుసంధానించారు. సిబ్బందిలేని వేళ ఇబ్బంది లేకుండా.. సాధారణంగా ప్రతిరోజు ఉ.7 నుంచి 9 గంటల వరకు, తిరిగి సా.3 నుంచి 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సమయాల్లో పంటల నమోదు (ఈ–క్రాప్)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంటారు. దీంతో ఆయా సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేక ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్బీకేలు తెరిచి ఉంచడమే కాదు.. రైతులు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆర్బీకేకి ఒకరు చొప్పున వలంటీర్లను అనుసంధానం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ సగిలి షాన్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. వ్యవసాయ శాఖ అభ్యర్థన మేరకు గ్రామాల్లో చురుగ్గా పనిచేస్తూ సేవాతత్పరత కలిగిన వలంటీర్‌ను ఎంపిక చేయాలన్నారు. ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ ఎంపికైన వలంటీర్లకు మండల వ్యవసాయ శాఖాధికారులు, జిల్లా రిసోర్స్ సెంటర్ సిబ్బంది ద్వారా ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఆర్బీకేలకు వచ్చే రైతులతో మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను కియోస్క్ ద్వారా బుక్ చేయించడం, గోడౌన్ల నుంచి వచ్చే ఇన్‌పుట్స్‌ను తీసుకుని స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం, సాగు సలహాలకు సంబంధించిన వీడియోలను రైతులకు స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, ఇతర సేవలపై తర్ఫీదు ఇస్తారు. నిరంతర సేవలే లక్ష్యంగా.. అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. సిబ్బంది లేని పక్షంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేకు ఒక గ్రామ వలంటీర్‌ను అనుసంధానం చేస్తున్నాం. వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నాం. ఈ నెల 20 నుంచి వారి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ (అగ్రికల్చర్), ఆర్బీకేల ఇన్చార్జి -
తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం
Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్‌లు ఇస్తూ.. తైవాన్ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు. పైగా అక్కడ తైవాన్ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్‌లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్. కానీ ఇప్పుడూ చైనా తైవాన్ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు. ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంజెంట్ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్‌లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది. తైవాన్ నేషనల్ డిఫెన్స్ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్ విమానాలు, యాంటీ షిప్ క్షిపణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే తైవాన్ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్‌ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది. (చదవండి: -
వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
గుంటూరు (వేమూరు) నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని గోవాడకు చెందిన కనపర్తి దినేష్ ఈనెల 9న వైఎస్సార్ సీపీ ప్లీనరీకి వెళ్లి వస్తూ నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పార్టీ తరఫున వలంటీర్ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం.. మంత్రి మేరుగ నాగార్జున బుధవారం సాయం అందించారు. జగనన్న బీమా పథకం ద్వారా కూడా లబ్ధి వచ్చేటట్టు చూస్తామన్నారు. దినేష్ తల్లిదండ్రులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అన్నార్తులకు అండగా..
పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్ బాలాజీ. వీఎస్ఎస్ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు. అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్‌గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్ పనులతోపాటు వాటర్ ఫ్యూరిఫైయర్ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్‌గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలి బాధలు దూరం చేస్తూ.. యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్ఎస్ పురం, టీఆర్ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను. – బాలాజీ, వలంటీర్, వీఎస్ఎస్ పురం, తడుకు పంచాయతీ -
టీడీపీ ప్రోద్బలంతో సర్పంచ్, ఆమె భర్తపై దాడి
రాప్తాడు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరు చేయాలంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో సర్పంచ్, ఆమె భర్తపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం మండలం అక్కంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా వలంటీర్ గాయపడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపల్లికి చెందిన కుళ్లాయప్ప, హుస్సేన్, వలీ అనే ముగ్గురు సోదరులు ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థలాన్ని ఇటీవల హౌసింగ్ అధికారులు పరిశీలించారు. ఇల్లు మంజూరు కావాలంటే ఖాళీ స్థలం మరికొంత ఉండాలని, అలా ఉంటేనే జియోట్యాగింగ్ తీసుకుంటుందని చెప్పారు. ఏడడుగుల స్థలంలోని బాత్రూమ్ను తొలగించుకుంటే ఇంటి మంజూరుకు అవసరమైన స్థలం అందుబాటులోకి వస్తుందని సూచించారు. ఇదే విషయాన్ని సర్పంచ్ మల్లెల పుష్పావతి, ఆమె భర్త లింగమయ్య రెండు రోజుల కిందట కుళ్లాయప్ప కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇల్లు మంజూరు కాలేదనే విషయం తెలిసినప్పటికీ కుళ్లాయప్ప సోదరులు ఆదివారం సర్పంచ్ పుష్పావతి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆమెతో గొడవ పడ్డారు. ఎంత చెబుతున్నా వినకుండా మద్యం మత్తులో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆమెపై దాడి చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ భర్త లింగమయ్య ఇంటి వద్దకు చేరుకోగా ఆయనపైనా దాడి చేశారు. వలంటీరు రాజేశ్వరిపై కొడవలితో దాడి కాగా, కుళ్లాయప్ప సోదరులు సర్పంచ్ ఇంటి వద్ద నుంచి అటుగా వెళుతుండగా గ్రామ వలంటీర్ రాజేశ్వరి కనిపించడంతో ఆమెను బండబూతులు తిడుతూ కొడవలితో దాడి చేశారు. దీంతో ఆమె తలకు గాయమైంది. అడ్డుకోబోయిన వలంటీర్ తండ్రి ఆంజనేయులుపైనా దాడికి పాల్పడ్డారు. వెంటనే రాజేశ్వరిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ నబీ రసూల్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సర్పంచ్, వలంటీరు ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
జగనన్నా.. నీ వలంటీర్‌ని
ఒంగోలు సబర్బన్: ‘‘జగనన్నా...నీ వలంటీర్‌ను’’ అని ఒక యువతి పెద్దగా కేకవేసింది. ఆ కేక వినగానే సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ఆపారు. కారు లోంచి కిందకు దిగిన సీఎం వైఎస్ జగన్ సెక్యూరిటీని పంపి ఆ యువతిని తీసుకురమ్మన్నారు. దీంతో పరుగున వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని భవనంపై నుంచి కిందకు రమ్మని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ యువతి ముందుగా తెచ్చుకున్న పూల బొకేను వెంట తీసుకొచ్చి సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చింది. తన పేరు షీలా రాణి అని చెప్పింది. దీంతో సీఎం ‘‘ఏం తల్లీ.. వలంటీర్‌గా ఎక్కడ చేస్తున్నావు’’ అని అడిగాడు. ఒంగోలు రంగుతోటలోని వార్డు సచివాలయం పరిధిలో వలంటీర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. దీంతో ఆ యువతి షీలా రాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిమ్మల్ని కలవాలనుకున్న కల నెరవేరిందని షీలా రాణి సీఎంతో స్వయంగా చెప్పింది. ఆ సమయంలో సీఎం పక్కన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రవిప్రియ మాల్ అధినేత కంది రవి శంకర్, బొత్స ఝాన్సీ ఉన్నారు. కాగా ఒంగోలు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జమచేశారు. -
వాలంటీర్ల మధ్యలో కూర్చున్న సీఎం జగన్
-
బ్రెయిన్ డెడ్ అయిన వార్డు వలంటీర్ అవయవదానం
గన్నవరం/తాడేపల్లి రూరల్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలంటీర్‌గా పనిచేస్తోన్న ఓ యువకుడికి రోడ్డు ప్రమాదం జరగడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి, బంధువుల అనుమతితో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఆ యువకుడి అవయవాలను దానం చేశారు. మచిలీపట్నం సుల్తానా బజార్‌కు చెందిన మరీదు వెంకటరత్నం (లేటు), రేవతిల రెండవ కుమారుడు కోటేశ్వరరావు (27) అక్కడే వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు వివాహం జరగడంతో తల్లితో ఉంటున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వివాహంలో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా భీమడోలు వద్ద కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కోలుకోకపోవడంతో అవయవదానం చేసేందుకు తల్లి రేవతి ముందుకు వచ్చారు. దీంతో కోటేశ్వరరావు అవయవాలను ఎన్ఆర్ఐ వైద్యులు తొలగించారు. 8 మందికి కొత్త జీవితం.. కోటేశ్వరరావు శరీరంలో 6 అవయవాలను దానం చేయడంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎన్ఆర్ఐ చెన్నై ఆసుపత్రికి చెందిన 40 మంది డాక్టర్లు గురువారం శస్త్రచికిత్స చేశారు. కోటేశ్వరరావు శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులు, ప్రాంకయిటిస్, లివర్‌ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికోసం మంగళగిరి పోలీసులతో పాటు తాడేపల్లి, కృష్ణలంక, పటమట, రామవరప్పాడు, ఆటోనగర్, ఎనికేపాడు, గన్నవరం పోలీసులు హైవేపై భారీ బందోబస్తు నిర్వహించి గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రహదారిలో గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. అవయవాలతో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి బయలుదేరిన 3 అంబులెన్స్‌లు 27 నిమిషాల్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. అక్కడ అవయవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 విమానాల్లో వాటిని చెన్నైకి తరలించారు. కోటేశ్వరరావు 2 కిడ్నీలలో ఒక కిడ్నీని గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోగికి అమర్చనున్నారు. రెండు కళ్లను ఓ కంటి ఆసుపత్రికి అందజేశారు. -
ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించిన వలంటీర్
సాక్షి,సింహాద్రిపురం(కడప): మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీకి చెందిన వలంటీర్ గర్భవతి అయిన రాజకుమారి పులివెందుల ఆసుపత్రిలో ఉన్న చర్మ కళాకారుడికి పింఛన్ అందించారు. పింఛన్ లబ్ధిదారుడు వెంకటేష్ వారం నుంచి పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది గమనించిన వలంటర్ రాజకుమారి పులివెందుల ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పింఛన్ అందించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను అభినందించారు. మరో ఘటన.. అభివృద్ధి పరిశీలన పులివెందుల టౌన్: పులివెందులలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని రోటరీపురంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. 10ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తు¯న్న ఏపీటీపీ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. హౌసింగ్ లేఔట్ల పరిశీలన పులివెందుల పట్టణంలోని జగనన్న హౌసింగ్ లే ఔట్లను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. భాకరాపురం, వెలమవారిపల్లె సచివాలయాలను పరిశీలించారు. చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. -
AP: వలంటీర్ నిబద్ధత.. చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేత
నందిగామ: తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి వలంటీర్ చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేశాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వరరావు, అమల దంపతుల కుమారుడు భూక్యా జ్యోతీశ్వర్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ప్రభుత్వం నెలవారీ పింఛన్ అందిస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడిని శస్త్ర చికిత్స నిమిత్తం చెన్నైలోని రేలా ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో గ్రామానికి చెందిన వలంటీర్ బాణావత్ రాముడునాయక్ శుక్రవారం చెన్నై వెళ్లి జ్యోతీశ్వర్‌కు పింఛను నగదు అందజేసి పని పట్ల నిబద్ధతను చాటుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు వలంటీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. -
దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి ప్రభుత్వం అండ
సాక్షి, అమరావతి: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. వివరాలు.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. గతేడాది డిసెంబర్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును వాసిరెడ్డి పద్మ మంగళవారం భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి అందించారు. -
వలంటీర్లపై టీడీపీ దాడి
వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఘటనలు గంగాధర నెల్లూరు(చిత్తూరు )/గాలివీడు (వైఎస్సార్ జిల్లా): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం కొర్లకుంట గ్రామ సచివాలయంలో తలముడిపి వలంటీర్ మల్లికార్జునపై టీడీపీ నాయకులు పేరం సోదరులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. తలముడిపి, కొర్లకుంటకు ఒకే సచివాలయం కావడంతో తలముడిపి సర్పంచ్ మద్దిరాల జ్యోతి, కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లికార్జునపై కొర్లకుంట సర్పంచ్ పేరం మేనక బంధువులు పేరం ప్రభాకర్‌రెడ్డి, ఆనందరెడ్డి, మురళీరెడ్డి, చిన్న ఎరుకల్‌రెడ్డి మూకుమ్మడిగా దాడి చేశారు. వలంటీర్ ఫిర్యాదు మేరకు పేరం సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా గాంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లి వలంటీర్ గాయత్రి ఇంటిముందు టీడీపీ నేతల ఇళ్ల నుంచి వచ్చిన మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై ప్రశ్నించినందుకు గాయత్రి, కుటుంబీకుడు మాధవమందడిపై గురువారం మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు లోకనాథనాయుడు, కమలేష్‌నాయుడు, హేమాద్రినాయుడు, కిషోర్‌నాయుడు, యుగంధర్‌పై కేసు నమోదైంది. -
విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి
పాచిపెంట(విజయనగరం జిల్లా): పాచిపెంట మండలం మిర్తివలస టీడీపీ నాయకుడు, సర్పంచ్ కొత్తల సత్యవతి భర్త పోలినాయుడు గ్రామంలోని వలంటీర్ మండల రమేష్‌పై శుక్రవారం దాడికి పాల్పడ్డారు. మిర్తివలసకు చెందిన కొందరికి కొత్తగా పింఛన్లు మంజూరు కాగా.. ఆ సొమ్ము అందజేసేందుకు సర్పంచ్‌ను, ఎంపీటీసీని, పంచాయతీ కార్యదర్శిని వలంటీర్ ఆహ్వానించారు. సర్పంచ్ సత్యవతి పంచాయతీ కార్యాలయానికి 2 గంటలు అలస్యంగా రావడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎంపీటీసీ రొంగళి మోహన రవళి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దీంతో సర్పంచ్ సత్యవతి భర్త పోలినాయుడు వలంటీర్‌ను దుర్భాషలాడారు. ఎంపీటీసీతో పింఛన్ పంపిణీ చేయించేందుకు నువ్వు ఎవడివిరా.. నీ అమ్మ మొగుడు పంచాయతీరా.. అంటూ వలంటీర్‌పై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. విధుల్లో ఉన్న వలంటీర్‌పై దాడికి పాల్పడటం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మన భుజాలపై వారి తుపాకులు!) -
Volunteer Shantabai: ఎంపీపీగా వలంటీర్!
మార్టూరు: అదృష్టం ఎవరిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ గ్రామ వలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికార పీఠం ఎక్కనున్న భూక్యా శాంతాబాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండాకు చెందిన శాంతాబాయి బీకాం, బీఈడీ పూర్తి చేసింది. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో వివాహమైంది. మార్టూరులో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నది. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక జనార్ధన కాలనీ ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగింది. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీలలో ఎస్టీ కేటగిరీ కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనమే. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఆమె పిన్న వయసు్కరాలు కావడం విశేషం. నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తా.. గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచచ్చిన నేను నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం నచ్చి రాజకీయాల్లో వచ్చా. మండల ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు పడతా. – శాంతాబాయి -
‘వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఇప్పటి వరకు ఇంకా ఎవరైన కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వ్యాక్సిన్ తీసుకున్ని దాన్ని గిఫ్గ్‌గా ఇవ్వండంటూ...ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా శుక్రవారం(సెప్టెంబర్ 17) మోదీ పుట్టిన రోజు సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియతో చారిత్రక రికార్డు సృష్టించాలని చూస్తోంది. (చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు) ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఎనిమిది లక్షల మంది వాలంటీర్లతో రెండు కోట్టకు పైగా వ్యాకిన్నేషన్ ప్రక్రియను చేపట్టి విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మోదీ 20 ఏళ్ల ప్రజా సేవకు గ్తురుగా "సేవా సమర్పణ అభియన్" అనే పేరుతో 20 రోజుల మోగా ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాక పలు సేవకార్యక్రమాలను చేయనున్నట్లు బీజేపీ పేర్కొంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవ్య కూడా వ్యాక్సిన్ వేసుకోనివాళ్లు వ్యాక్సిన్ తీసుకుని "మోదీ బర్త్ డేకి బహుమతిగా ఇద్దాం" అంటూ ట్విట్టర్లో ప్రజలకు పిలుపునిచ్చారు. (చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తమిళి సై టీకా మెలిక) -
వాలంటీర్ టూ చైర్ పర్సన్
-
వహ్వా.. వలంటీర్!
పుత్తూరు (చిత్తూరుజిల్లా) : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, యాచకులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నాడు సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ఓ వలంటీర్. తండ్రిని పోగొట్టుకుని పేదరికపు కష్టాలను స్వయంగా చవిచూసిన ఈ యువకుడు పదిమందికి ఉపయోగపడాలన్న తన లక్ష్యసాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువకుడి సేవాగాథ వివరాలివీ.. పుత్తూరు మండలం తడుకు పంచాయతీ వీఎస్ఎస్ పురం గ్రామానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు బాలాజీ. తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత ఉద్యోగ వేటలో ఉన్న బాలాజీ గ్రామ వలంటీరుగా ఎంపికయ్యాడు. గ్రామస్థులకు ‘సచివాలయ’ సేవలందిస్తూ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. మరోవైపు.. ఎలక్ట్రీషియన్‌గా కూడా పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో.. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో నిరుపేదలు, యాచకులు పడుతున్న బాధలను గుర్తించాడు. వీరికి చేయూతనివ్వాలన్న తలంపుతో ‘సేవా మిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. రోజూ 30 మందికి భోజనాలు, టిఫిన్ అందిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ యజ్ఞం శనివారం 101వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు, వీఎస్ఎస్ పురంలోని గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశాడు. వలంటీరుగా తనకు వచ్చే రూ.5 వేల గౌరవ వేతనంతోపాటు సేవామిత్ర పురస్కారం ద్వారా అందించిన రూ.10 వేలు, ఎలక్ట్రికల్ పనుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నిరుపేదల సేవకు ఖర్చు చేస్తున్నాడు. సేవలోనే సంతోషం.. పేదరికం అంటే ఏమిటో చూశాను. కరోనా కాలంలో కొందరు ఆకలితో రోడ్డు పక్కనే చనిపోయారు. అందుకే నాకు వీలైనంత వరకు సాయం చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాను. మూడు నెలలుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వలంటీరుగా వచ్చే సంపాదన పూర్తిగా పేదలకే ఖర్చు చేస్తున్నాను. – బాలాజీ, వలంటీరు, వీఎస్ఎస్ పురం, పుత్తూరు మండలం -
పీఎంఎల్‌యూ గొల్లపల్లి మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి
సాక్షి, జగిత్యాల : ‘ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్’ కార్మిక సంఘ మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి నియమితులయ్యారు. ఆయనను జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తూ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సోమవారం నియామకపత్రాన్ని విడుదల చేశారు. ‘‘ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల మీకు ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్‌లో సభ్యుడిగా చేరి పనిచేయాలనే మీ ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి మిమ్మల్ని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తున్నాను. ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం.. బ్రతుకుదెరువు కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, ప్రభుత్వ సంస్థలు మీ ప్రాంతంలో నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలు విజయవంత చేయాలి. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల చట్టం,1926 ప్రకారం రిజిస్టర్ చేయబడిన సంస్థ. మీరు నిబంధనల ప్రకారం, యూనియన్ కార్యవర్గ తీర్మానాల ప్రకారం, సూచనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. సేవా కార్యక్రమాలను నిర్వహించడం, పాల్గొనడం మాత్రమే’’ అని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. -
‘వలంటీర్’ సేవ; ఆత్మ బంధువులే తోడుగా..
రాప్తాడు: అసలే చిరుద్యోగం... సంపాదన అంతంత మాత్రమే... అయినా ఆ కొద్ది పాటి ఆదాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు వినియోగిస్తున్నాడు వలంటీర్ దండు బీరప్ప. రాప్తాడు గ్రామ సచివాలయం–2లో విధులు నిర్వర్తిస్తున్న వలంటీర్ దండు బీరప్ప... కోవిడ్ కట్టడికి తన వంతు సాయంగా ముస్లిం మైనారిటీ కాలనీలోని 300 కుటుంబాలకు ఆదివారం మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఇందు కోసం ఎవరినీ ఆశించకుండా తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ సందర్భంగా వలంటీర్‌ను స్థానికులు అభినందించారు. ఆత్మబంధువులే తోడుగా... ఓడీ చెరువు: కరోనా వైరస్ వల్ల రక్త సంబంధాన్ని సైతం మర్చిపోయే మరో ఘటన ఆదివారం ఓడీ చెరువులో చోటు చేసుకుంది. ఇదే సమయంలో సాటి మనుషులుగా ఇతర మతానికి చెందిన వారు మానవత్వం చూపారు. వివరాలు... ఓడీ చెరువులోని బీసీ కాలనీకి చెందిన అశోక్(21)తో కరోనా చికిత్స పొందుతూ ఆదివారం కోవిడ్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతని అంత్యక్రియలు నిర్వహించేందుకు సమీప బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ తలబా ఆర్గనైజేషన్ సభ్యులు ఆరీఫ్, ఆసీఫ్, ఫయాజ్, ఇర్ఫాన్, ఇమ్రాన్, ముస్తాక్, జాఫర్, ఇర్షాద్, షాను ముందుకు వచ్చారు. హిందూ సంప్రదాయ రీతిలో శ్మశానానికి మృతదేహాన్ని తరలించి, ఖననం చేశారు. కరోనాతో మృతి చెందిన యువకుడికి అంతి సంస్కారాలు చేస్తున్న ముస్లిం యువకులు చదవండి: Kurnool: ఆడుతూ పాడుతూ.. ఆరోగ్యంగా ఇంటికి -
పిడుగుపాటుతో మహిళా వలంటీర్ మృతి
కవిటి, ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురంలో వలంటీర్‌గా పనిచేస్తున్న ఆశి జయ (30) తన మరిదికి వధువును చూసేందుకు బంధువులతో కలిసి సమీప గ్రామమైన బిర్లంగి తోటూరుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం పడడంతో ఓ చెట్టు కిందకు చేరారు. సరిగ్గా అక్కడే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కవిటి మండలంలోని శావసానపుట్టుగకు చెందిన వివాహిత కోరాడ గౌరమ్మ (49) ఆదివారం కొబ్బరి తోటలో పనికి వెళ్లింది. సాయంత్రం అకస్మాత్తుగా పిడుగు పడడంతో అక్కికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం.. ఆ ఇద్దరికీ పదవీ గండం? -
పరిపాలన ఇలా కూడా చేయవచ్చని వాలంటీర్లు నిరూపించారు: సీఎం జగన్
-
మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి..
మడకశిర రూరల్: సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్ హరిప్రసాద్ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది. వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ తమిళనాడు రాష్ర్టం మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో మూడు నెలలుగా చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రెండు నెలలుగా పింఛన్ పొందని ఆమె...ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుంది. దీన్ని గుర్తించిన వలంటీర్ హరిప్రసాద్ 800 కి.మీ దూరంలోని ఉసిలంపల్లికి వెళ్లి పుంగమ్మకు మూడు నెలల పింఛన్ అందించాడు. దీంతో పుంగమ్మ వలంటీర్‌కు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి తమిళనాడు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. చదవండి: సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్ చంద్రగిరిలో బాబుకు షాక్ -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: కుప్పం టీడీపీలో ముసలం.. ‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’ -
అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని..
చొప్పరమెట్ల(ఆగిరిపల్లి, నూజివీడు): గతంలో గ్రామం నుంచి వెలివేసిన వ్యక్తితో కలసి వలంటీర్ కుటుంబం ఆటోలో ఊరిలోకి రావడాన్ని జీర్ణించుకోలేని ఓ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దలు వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల శివారు గొల్లగూడెంలో చోటు చేసుకున్న ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గొల్లగూడెంకు చెందిన గంపా పంగిడేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులు వలంటీర్‌గా పనిచేస్తున్న కొడుకు ప్రవీణ్‌కుమార్, కుమార్తె మానసతో కలిసి గత నెల 7న గుంటూరు జిల్లా గోరంట్లలో చర్చికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అదే గ్రామం నుంచి ఏడేళ్ల క్రితం వెలివేయబడ్డ జువ్వనబోయిన విజయ్‌బాబు కూడా వీరితో కలసి ఆటోలో గ్రామానికి వచ్చాడు. దీన్ని ఫొటో తీసిన అదే సామాజిక వర్గానికి చెందిన గంపా రత్తయ్య కులపెద్దలకు చెప్పడమేగాక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. మరుసటిరోజు కులపెద్దలు సమావేశమై వలంటీర్ ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులను పిలిపించి వెలివేసిన కుటుంబంతో కలసి ఒకే ఆటోలో ఎందుకొచ్చారని నిలదీశారు. కిరాయి ఆటోలో వచ్చాం తప్ప వెలివేసిన కుటుంబానికి, తమకు సంబంధం లేదని వారు చెప్పారు. అయితే దీన్ని తప్పుగా పరిగణించిన కులపెద్దలు రూ.5 వేలు కట్టాలని, లేకుంటే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాలని తీర్మానించారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించబోయిన ధనలక్ష్మిపై దాడికి సైతం దిగారు. చేసేది లేక ఆ కుటుంబం వెనుతిరిగింది. తర్వాత గత నెల 28న దేవర జాతరను పురస్కరించుకుని ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు తీసుకెళ్లి ఇవ్వబోగా ఇంకా ఊర్లో నుంచి ఎందుకు వెళ్లలేదు? అంటూ కులపెద్దలు ప్రశ్నించారు. అంతేగాక గ్రామంలో ఎవరైనా వలంటీర్ కుటుంబంతో మాట్లాడినా, వారికి మంచినీళ్లు ఇచ్చినా రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో పొరుగునున్న వడ్లమాను గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ కుటుంబం తలదాచుకుంటోంది. బంధువుల సాయంతో ధనలక్ష్మి ఈ అమానుషంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. చదవండి: జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు పాపం ఆ పిల్లలేం చేశారు? -
విషాదం : పురస్కారం అందుకోవాల్సిన వలంటీర్
ముమ్మిడివరం/అల్లవరం: ఉగాదికి ఉత్తమ పురస్కారం అందుకోవాల్సిన ఒక వలంటీర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోడి గ్రామానికి చెందిన నరసింహం (30) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన మూడేళ్ల పాప, సమీప బంధువు యార్లగడ్డ దుర్గారావుతో కలసి మురమళ్లలో గురువారం ఒక నిశ్చితార్థానికి వెళ్లారు. తిరిగి బైక్‌పై వస్తుండగా అమలాపురం నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గారావు తీవ్ర గాయాలపాలై అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వారి మధ్యలో కూర్చోబెట్టుకున్న పాపను దుర్గారావు పక్కకు విసిరేయడంతో సురక్షితంగా బయటపడింది. కాగా, వలంటీర్‌గా నరసింహం సేవలకు మెచ్చిన గ్రామస్తులు ఆయన భార్య దుర్గాభవానిని ఇటీవల ఏకగ్రీవంగా వార్డు సభ్యురాలిగా ఎన్నుకున్నారు. వలంటీర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నరసింహానికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముమ్మిడివరం ఎస్ఐ కేవీ నాగార్జున కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో ఉగాది రోజు నుంచి వారిని గౌరవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా ఇంకా ఏమి చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించే కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు ఇచ్చే ప్రసంశా పత్రం, మెడల్, బ్యాడ్జి, శాలువాలను ఆయన పరిశీలించారు. సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా, వచ్చే నెల 13వ తేదీన ఉగాది పండుగ రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సత్కార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్షి్మ, గ్రామ, వార్డు సచివాలయాలు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లెవల్–1 2,18,115 మంది వలంటీర్లకు ‘సేవా మిత్ర’ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన 2,18,115 మంది గ్రామ, వార్డు వలంటీర్లను సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.10 వేలు నగదు, సర్టిఫికెట్ (ప్రసంశా పత్రం), శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు. లెవల్–2 4000 మంది వలంటీర్లకు ‘సేవా రత్న’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా మండలానికి ఐదుగురు చొప్పున 659 మండలాల్లో 3,295 మంది, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున 109 మున్సిపాలిటీల్లో 545 మంది, కార్పొరేషన్లలో పది మంది చొప్పున 16 కార్పొరేషన్లలో 160 మంది మొత్తంగా 4,000 మంది వలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. లెవల్–3 875 మంది వలంటీర్లకు ‘సేవా వజ్ర’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. -
వైఎస్సార్ పెన్షన్ కానుక.. వలంటీర్ల సేవకు సలాం
-
శభాష్ వలంటీర్.. ప్రాణాలకు తెగించి మరీ
నరసరావుపేట: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు ఓ గ్రామ వలంటీర్. ఆ మంటలకు తన ఒళ్లు కాలుతున్నా లెక్క చేయకుండా దగ్ధమవుతున్న గుడిసెలోంచి గ్యాస్ సిలిండర్‌ను బయటకు తెచ్చి భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించి శభాష్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఈ ఘటన జరిగింది. రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12 వరకు పూరి గుడిసెలు ఉన్నాయి. అందులో 4 గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండగా.. మరో 8 గుడిసెలు కొద్ది దూరంలోనే ఉన్నాయి. శనివారం ఉదయం ఓ విద్యుత్ స్తంభం నుంచి తీగ తెగి పూరి గుడిసెపై పడింది. గుడిసెకు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు పూరి గుడిసెలకు వ్యాపించాయి. ఆ సమయంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులను వలంటీర్ బొజ్జా శివకృష్ణ బయటికి తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడాడు. తగలబడుతున్న మరో గుడిసెకు తాళం వేసి ఉండగా.. క్షణాల్లో దానిని తొలగించి అందులోని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. వలంటీర్ ఆ సాహసం చేసి ఉండకపోతే గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న ఏడెనిమిది గుడిసెలకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ ఘటనలో శివకృష్ణ ఒంటికి మంటలు అంటుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించి సహాయం అందించారు. వైద్యశాలకు వెళ్లి వలంటీర్ శివకృష్ణను అభినందించారు. అతడి వైద్యానికయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని, శివకృష్ణ లాంటి ఎందరో ఆ వ్యవస్థలో భాగస్వాములై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. కర్తవ్యం గుర్తొచ్చింది: వలంటీర్ శివకృష్ణ ‘మా ఇంటికి సమీపంలోనే ఉన్నట్టుండి హాహాకారాలు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా మంటలు కనిపించాయి. కాలుతున్న ఓ గుడిసెలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. వారిని రక్షించి, వెంటనే తగులబడుతున్న గుడిసెకు వేసి ఉన్న తాళాన్ని తొలగించి సిలిండర్‌ను బయటకు తెచ్చాను. శరీరం, చేతులు, వేళ్లకు మంటలు అంటుకున్నాయి. బయటకు రాగానే స్పృహతప్పి పడిపోయాను. చుట్టుపక్కల వారు నన్ను వెంటనే కారులో నరసరావుపేట ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ -
వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వలంటీర్ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు. -
టీకాతో వలంటీర్ లలిత మృతి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలితతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. సాక్షి, పలాస/కాశీబుగ్గ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందారు. మృతురాలికి భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. పలాస తహసీల్దార్ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలిత మృతిచెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పలాస పీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుటుంబానికి మంత్రి భరోసా ఇదిలా ఉండగా వలంటీర్ మృతి వార్త తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు. అప్పటికే నీరసించిపోయింది.. టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని చెప్పింది. మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పారు. అయితే లక్షణాలు అలాగే ఉంటాయిలే అనుకుని టాబ్లెట్ కూడా వేసుకోలేదు. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో టాబ్లెట్ వేశాం. కానీ అప్పటికే పూర్తిగా నీరసం అయిపోయింది. తెల్లారేసరికి ఇలా జరిగింది. మా పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కేవలం వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే చనిపోయింది. – పి.పార్వతి, మృతి చెందిన వలంటీర్ తల్లి -
సాటిలేని సేవ.. పోటీలేని గెలుపు
ఠంఛనుగా పింఛన్ పంచినప్పుడు ఆమె నిబద్ధతను గుర్తించారు.. ప్రభుత్వ పథకమేదైనా అర్హుల చెంతకు చేర్చడంలో ఆమె చూపిన చొరవ గమనించారు. నలుగురినీ ఆప్యాయంగా పలకరించడంలో ఆమె కలుపుగోలుతనాన్ని తెలుసుకున్నారు. 50 ఇళ్లకు వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆ కుటుంబాల్లో సభ్యురాలిగా మారిన ఆమె మంచితనానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు. కొల్లావారిపాలెంలో వలంటీర్ సరస్వతిని ఊరంతా ఒక్కమాట మీద నిలబడి సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. జిల్లాలో వలంటీర్ల సేవలకు ఆ గ్రామ ప్రజలు పెద్ద బహుమతి ఇచ్చి పట్టం కట్టారు. పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. సుమారు 1,200 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 755 మంది ఓటర్లు (పురుషులు 362 మంది, మహిళలు 393 మంది) ఉన్నారు. ఈ పంచాయతీ ఏర్పాటై సుమారు 53 సంవత్సరాలైంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఆధిక్యం కనబరిచేది. 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను కేటాయించి ఆయా గృహాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మారారు. కోవిడ్ సమయంలోనూ వీరు అమూల్యమైన సేవలు అందించారు. కొల్లావారిపాలెంలో 2వ క్లస్టర్లో కొల్లా సరస్వతికి వలంటీర్ పోస్టు ఇచ్చారు. ఆమె 2019 ఆగస్టు 15 నుంచి వలంటీరుగా విధులు నిర్వర్తించడం ప్రారంభమైంది. ఈమె బీటెక్ వరకు చదువుకుంది. మొదటి నుంచి ప్రభుత్వ పథకాలు తన పరిధిలోని వారికి అందించడంలో ప్రత్యేక చొరవ చూపించేది. అధికారుల వద్ద నిబద్ధతతో వ్యవహరించి మన్ననలు పొందింది. ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో వలంటీర్‌గా పనిచేస్తున్న సరస్వతి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆమె సేవాభావాన్ని తెలుసుకున్న గ్రామమంతా మద్దతుగా నిలిచింది. దీంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ అయింది గ్రామాభివృద్ధికి కృషిచేస్తా కొల్లావారిపాలెం గ్రామాభివృద్దికి కృషిచేస్తా. గ్రామస్తులందరూ ఒకేతాటిపైకి వచ్చి నన్ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళతా. గ్రామ సమస్యలపై నాకు అవగాహన ఉంది. వీటి పరిష్కారానికి కృషిచేస్తా. – కొల్లా సరస్వతి సరస్వతి సేవలు అభినందనీయం కొల్లా సరస్వతి వలంటీర్‌గా తనకు కేటాయించిన 50 ఇళ్లకు తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది. వలంటీర్‌గా ఉన్నప్పుడు అందరి సమస్యల పరిష్కారానికి కృషిచేసేది. ఇప్పుడు గ్రామంలో అందరం కలిసి ఆమెనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. – అనురాధ, గ్రామస్తురాలు ఐకమత్యంతో అభివృద్ధి పంచాయతీల్లోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించడం సంతోషంగా ఉంది. ఐకమత్యంతో పంచాయతీని ఎంతో అభివృద్ది చెందుతుంది. – సంపత్‌కుమార్, మాజీ సర్పంచి -
వలంటీర్‌పై దాడి చేసి పింఛన్ సొమ్ము దోపిడీ
పిడుగురాళ్ల(గురజాల): గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న వలంటీర్, వెల్ఫేర్ అసిస్టెంట్‌పై ఇద్దరు అగంతకులు దాడిచేసి నగదు దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో శనివారం జరిగింది. జూలకల్లు వెల్ఫేర్ అసిస్టెంట్ గడిపూడి శివపార్వతి తెలిపిన వివరాల ప్రకారం.. జూలకల్లు గ్రామ వలంటీర్ బీరవల్లి వెంకటరెడ్డి, శివపార్వతి ఇద్దరూ కలిసి ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్)లో శనివారం ప్రభుత్వ ఖాతా నుంచి రూ.19, 21, 282 డ్రా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా, పందిటివారిపాలెం గ్రామ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద వెనుక నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు క్రికెట్ బ్యాట్‌తో బైక్ నడుపుతున్న వలంటీర్ తలపై బలంగా కొట్టారు. దీంతో బైక్‌తో పాటు ఇద్దరూ రోడ్డు పక్కన పొలాల్లో పడిపోయారు. వలంటీర్ స్పృహ కోల్పోవడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ శివపార్వతిని కూడా క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టేందుకు ప్రయత్నించగా, చేయి అడ్డు పెట్టడంతో చేతికి గాయమైంది. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు వీరి దగ్గర ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కుని తిరిగి పిడుగురాళ్ల వైపు పారిపోయారు. పల్సర్ బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండగా, క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన వ్యక్తి తలపై క్యాప్ ధరించి ఉన్నాడు. జూలకల్లు గ్రామానికి చెందిన వ్యక్తులు గాయాలపాలైన వీరిని చూసి ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి విషయమై శివపార్వతి పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వలంటీర్ వెంకటరెడ్డి తలకు బలమైన దెబ్బ తగలడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మూడు బృందాలతో విచారణ పింఛను సొమ్ము చోరీ కేసులో దుండగులను పట్టుకునేందుకు పోలీసు శాఖ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. నగదు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు
కొత్తూరు: క్యాన్సర్‌తో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఓండ్రుజోలకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు గెల్లంకి రవికుమార్, సుధారాణిలు నానా అగచాట్లుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వలంటీర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రుల ఈకేవైసీ కోసం వలంటీర్ బెంగళూరు వెళ్లి ఈ నెల 14న తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. అనంతరం శనివారం ఆరోగ్యశ్రీకార్డు మంజూరు కావడంతో దానిని చిన్నారి తాతయ్య చలపతిరావుకు అందించారు. ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైన విషయాన్ని తెలుసుకున్న బెంగళూరులోని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంతో వలంటీర్‌కు, గ్రామ సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మనువడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు తీసుకెళుతున్నట్టు చలపతిరావు చెప్పారు. -
చిన్నారి కోసం శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు..
కొత్తూరు: గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొద్ది రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ రెండున్నరేళ్ల చిన్నారికి క్యాన్సర్ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ‘ఆరోగ్యశ్రీ’ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వలంటీర్ బరాటం నరసింగరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వలంటీర్‌వారికి చెప్పడంతో.. తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితికి చలించిపోయిన వలంటీర్ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఒండ్రుజోల నుంచి బయల్దేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని, తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలి ముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్య శ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వలంటీర్‌కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వలంటీర్ మానవత్వాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. -
ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం చేసిన ఘటన శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్ఐ రమేశ్ తెలపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో పానగారి సుధాకర్ విద్యా వలంటీర్. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లగా.. పంచాయతీ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న బాలిక నాయినమ్మ పని నిమిత్తం పంబయటకు వెళ్లింది. చదవండి: పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో! చిన్నారి ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించిన సుధాకర్ ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులను చూసి అక్కడి నుంచి ఉడాయించాడు. రాత్రి చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు 100కు డయల్ చేసి విషయం చెప్పారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్‌ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కోవాగ్జిన్‌కు ఎదురుదెబ్బ.. వలంటీర్ మృతి
భోపాల్: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్ మృతి చెందాడు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భోపాల్‌లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డిసెంబర్ 12న కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన కూలి అయిన దీపక్ మర్వాయి అనే వ్యక్తికి(వలంటీర్) సైతం వ్యాక్సిన్ ఇచ్చారు. అతడు డిసెంబర్ 21న మరణించాడు. అయితే, దీపక్ మర్వాయి విష ప్రయోగం కారణంగా మరణించినట్లు అనుమానాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ చెప్పారు. అసలైన కారణమేంటో నిర్ధారించాల్సి ఉందన్నారు. కోవాగ్జిన్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దీపక్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 21న ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తుదిశ్వాస విడిచాడని పేర్కొన్నారు. అసలైన వ్యాక్సిన్ ఇచ్చారా? లేదా? వలంటీర్ దీపక్ మృతిపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. ఫేజ్–3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు అతడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించలేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొంది. 9 రోజుల తర్వాత మరణించాడంటే అందుకు తమ వ్యాక్సిన్ కారణం కాదని ప్రాథమిక సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది. అయితే, హ్యూమన్ ట్రయల్స్‌లో భాగంగా దీపక్ మర్వాయికి అసలైన కోవాగ్జిన్ ఇచ్చారా? లేక సాధారణ ఔషధం(ప్లాసిబో) ఇచ్చారా? అనేది నిర్ధారణ కాలేదు. -
కోవాగ్జిన్ తీసుకున్న వలంటీర్ మృతి
భోపాల్: కరోనా వైరస్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారని విన్నాం. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ కూడా చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మూడోదశ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా వలంటీర్ మృతి చెందడం వివాదాన్ని మరింత పెంచుతోంది. వివరాలు.. భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్లో నిర్వహించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకు అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోవాగ్జిన్ ట్రయల్‌లో పాలు పంచుకున్న మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కోవాగ్జిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది. విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు. (మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఇక మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు.. విషప్రయోగం వల్ల అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నాడు. కానీ అసలు కారణం ఇంకా తెలియలేదు. ఇక మరవి గతేడాది డిసెంబర్ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని డీసీజీఐ, భారత్ బయోటెక్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరికి వ్యాక్సిన్ ఇవ్వరు. సగం మందికి వ్యాక్సిన్ ఇచ్చి.. మిగతావారికి సెలైన్ ఇస్తారు. ప్రస్తుతం దీపక్కి ఇచ్చింది వ్యాక్సిన్ డోసా లేకా.. సెలైనా అనే విషయం తెలియాలి. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించాం.. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచాం’ అని తెలిపారు. (చదవండి: టీకాపై ఎటూ తేల్చుకోలేక..) ఇక మరవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వచ్చాక.. అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తర్వాత నోటి నుంచి నురగ వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే వినలేదు. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపాడు. ఇలా ఉండగానే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక డిసెంబర్ 21న ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. ఇక రజనా ధింగ్రా అనే సామాజిక కార్యకర్త దీపక్ మరవి ట్రయల్స్‌లో పాల్గొన్నాడనే దానికి రుజువుగా అతడికి ఎలాంటి రసీదు, లెటర్ లాంటిది ఇవ్వలేదని తెలిపారు. -
మా మంచి వలంటీర్
గుమ్మఘట్ట: పనిచేస్తే ఫలితం తప్పక దక్కుతుందనేందుకు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డిలో సోమవారం జరిగిన సంఘటన నిదర్శనంగా ఉంది. నిరంతరం తమ అవసరాలు గమనిస్తూ తమకు సేవ చేస్తున్న వలంటీరును 50 ఇళ్ల ప్రజలు కలిసి సత్కరించారు. సిరిగేదొడ్డి గ్రామ సచివాలయ పరిధిలో భూతయ్యదొడ్డి క్లస్టర్–7 విభాగంలో నాయకుల రాజేష్ గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. తన పరిధిలోని 50 కుటుంబాలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. రోజూ ఇంటింటికీ తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనదిగా భావించి పరిష్కారానికి చొరవ చూపేవారు. ఫలితంగా రాజేష్‌ను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. రాజేష్ వలంటీర్‌గా ఉద్యోగంలో చేరి సోమవారం నాటికి సంవత్సరం పూర్తికాగా ఆయన పరిధిలోని 50 కుటుంబాల వారు పార్టీలకు అతీతంగా సచివాలయం వద్దకు వచ్చి ఘనంగా సత్కరించారు. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, తోటి వలంటీర్లు అభినందనలు తెలిపి ప్రశంసించారు. ప్రతి వలంటీర్ రాజేష్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీవో శివరామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో సిరిగేదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. -
భువనేశ్వరి మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది
సాక్షి, ఒంగోలు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...‘ భువనేశ్వరి మృతిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. మృతి చెందిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి దారుణమైన సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించబోదు. ( 'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం' ) భువనేశ్వరి కేసు విచారణను వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. కాగా, దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు- ఎనిమిది గంటల ప్రాంతంలో భువనేశ్వరి ట్రై సైకిల్ పైనే సజీవ దహనమైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా కొర్రపాడులో వేధింపులకు బలైన 10 వ తరగతి విద్యార్థి సౌమ్య కుటుంబాన్ని , ఒంగోలులో అనుమానాస్పద స్ధితిలో సజీవదహనమైన భువనేశ్వరి కుటుంబాన్ని పరామర్శించి , విచారణ వేగవంతం చెయ్యాలని ఎస్పి లను కోరటం జరిగింది. pic.twitter.com/XNaX6hkGJz — Vasireddy Padma (@padma_vasireddy) December 20, 2020 -
పెళ్లంటే పిల్లలాట కాదు
అవును. పెళ్లంటే ఆట కాదు. అల్లరి కాదు. చదువు కాదు. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు. మోయవలసిన బాధ్యత. ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో పెద్దల్ని మోయడానికి భుజ బలం కావాలి. మనోబలం ఉండాలి. చిన్నప్పుడే పెళ్లి చేయడం అంటే.. కాళ్లకు తాళ్లేసి కట్టేయడమే! పెళ్లంటే పిల్లలాట కాదని.. యశోద చెబుతోంది ఇందుకే. ఆమె ఓ గ్రామీణ యువతి. ఇప్పుడామె.. ఐక్యరాజ్య సమితి వాలంటీర్! ఇల్లిల్లూ కాదు, ఊరూరూ తిరిగి చెబుతోంది యశోద.. చిన్నప్పుడే పిల్లకు పెళ్లిళ్లు చేసేయొద్దని. చెప్పడం ఎవరైనా చెబుతారు. ప్రధాని చెప్పడం లేదా? రాష్ట్రపతి చెప్పడం లేదా. కానీ యశోద.. చెప్పడంతో పాటు ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుంటే వెళ్లి ఆ పెళ్లిని ఆపేస్తోంది! పీలగా, ఎముకల్లో బలం లేనట్లుగా ఉంటుంది ఈ 21 ఏళ్ల అమ్మాయి. ఈమె వెళ్లి ‘ఆపండి’ అని గర్జిస్తే ఎవరు వింటారు? ‘పో పోవమ్మా..’ అంటారు. ‘భజంత్రీలూ మీరు కానివ్వండయ్యా’ అంటారు. అసలు సొంత ఇంట్లోని వాళ్లే యశోదకు సపోర్టుగా రాలేదు. ‘నిన్న మొన్న పుట్టినదానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’ అని చెప్పేశారు. ఇది జరిగింది ఆమెకు 18 ఏళ్ల వయసప్పుడు. యశోద వాళ్ల ఊరు దుమెర్పానీ. ఊరూ అదే, గ్రామ పంచాయితీ అదే. ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఉంటుంది. దుమెర్పానీకి దగ్గరలో హల్దీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎవరో చిన్న పిల్లకు, చిన్న పిల్లాడికీ పెళ్లి చేస్తున్నారని తెలిసి రయ్యిన అక్కడికి వెళ్లింది. ఒక్కటే వెళ్లలేదు. అప్పటికే తను రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనేదొకటి. ‘ఆశా’అనే సంస్థ మరొకటి. వాళ్లు వెనకుంటే, యశోద ముందుకు వెళ్లి.. ‘పిల్లలకు పెళ్లి చేయకండి’ అంది! కోపంగా చూశారు పెళ్లి చేస్తున్నవారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యపరుస్తున్న యశోద వింతగా చూశారు పెళ్లికొచ్చినవాళ్లు. ‘ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అని పెద్దవాళ్లు అన్నారు. ‘తెలిసినమ్మాయే. పక్క గ్రామం’ అన్నారు.. యశోద ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుండటం తెలిసినవాళ్లు. అప్పటికి పెళ్లి ఆగిపోయింది. అంతా వెళ్లిపోయాక చుట్టుపక్కల ఊళ్లలో నిరసన మొదలైంది. ‘‘ఊరి పిల్ల అయుండీ, ఊరి ఆచారాలు తెలియవా! ఎవర్నో వెంటేసుకుని వచ్చి మరీ పెళ్లిని ఆపేయిస్తుందా?’’ అని ఊళ్లో అరుగుల మీద ‘చుట్ట ముక్క’ చర్చలు మొదలయ్యాయి. ఊళ్లో చెరువుల దగ్గర నీళ్ల బిందెలు బుగ్గలు నొక్కుకున్నాయి. విషయం యశోద ఇంట్లో తెలిసింది. ‘నిన్న మొన్న పుట్టిన దానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’’ అని అప్పుడే వాళ్లు అన్నది. ∙∙ కూర్చోలేదు యశోద. సామాజిక కార్యకర్తలతో కలిసి తిరిగింది. ఈ మూడేళ్లలో చుట్టుపక్కల ఊళ్లల్లో జరగబోయిన బాల్యవివాహాలను ఓ ఎనభై వరకు ఆపగలిగింది! ఊరికే లీడర్ అయింది. యువలీడర్. ఆడపిల్లలకు యశోదక్కను చూస్తే యమా క్రేజ్. ఇంట్లో వాళ్లు తమను బడి మాన్పించబోతున్నా, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా, తమను బయటికి వెళ్లి ఆడుకోనివ్వకపోయినా.. ‘యశోదక్కకు చెబుతాం’ అని పైపైకి లేస్తున్నారు. వాళ్లను చెయ్యిపట్టి ఆపడం తల్లిదండ్రుల పనౌతోంది. యశోదక్కకు చెబితే యశోదక్క టీమ్ ఏమీ కర్రలు పట్టుకుని వచ్చేయదు. కూడలి లో గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టి, చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితం ఎలా అయిపోతోందో కళ్లకు కట్టేలా చెప్పి వెళ్తుంది. యశోద మీటింగ్‌లలో ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ కూర్చొని ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారిప్పుడు. ఆ మాటలు వారిలో ఆలోచన కలిగించేలా ఉంటాయి. ఆ ఊళ్లన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. అందుకే ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి, మెట్టినూళ్లలో వారికి మంచి పరిస్థితుల్ని కల్పించాలని తల్లిదండ్రులు త్వరపడుతుంటారు. పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లే వారిలో ఎక్కువమంది. దక్షణాది రాష్ట్రాలకొచ్చి ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి పిల్ల పెళ్లి కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకుని తిరిగి ఊరు చేరుతుంటారు. ఏడాదికి మూడు సీజన్ల వలసలు వాళ్లవి. యశోదకు ఇదంతా తెలియంది కాదు. పిల్ల పెళ్లి కోసం కష్టపడుతున్నవాళ్లు, పిల్లకు తగిన వయసు రాకుండానే పెళ్లి అనే కష్టాన్ని తెచ్చి పెట్టడం ఎందుకు అని ఊళ్లోవాళ్లకు నచ్చ చెబుతుంది. ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘ఆశా’ సంస్థలు కలిసి ‘మ్యారేజ్: నో చైల్డ్స్ ప్లే’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. అందులో వాలంటీర్ యశోద. బాల్య వివాహాలను నివారించడంతో పాటు యశోద ఇప్పుడు బాలబాలికల సమానత్వం, రుతుక్రమ పరిశుభ్రత, గృహ హింస, బాలికల విద్య, నచ్చిన రంగాన్ని ఎంచుకునే విధంగా బాలికల్ని, యువతుల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాలంటీర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో ఇప్పుడు యశోద ఎంత చెబితే అంత అయింది. ఏమైనా మంచే కదా తను చెబుతోంది అనే దగ్గరికి ఊరూ వాడా వచ్చేశారు. ఐక్యరాజ్య సమితి ఏటా ‘వి–అవార్డు’ ఇస్తుంటుంది. ఈ అవార్డును ఈ ఏడాది యశోదకు ఇస్తున్నట్లుగా శనివారం ప్రకటించింది. వి అంటే వాలంటీర్. ది బెస్ట్ వాలంటీర్‌గా యశోద ఐరాస గుర్తింపు పొందింది. ∙∙ 2017లో మొదటి బాల్యవివాహాన్ని ఆపేశాక, యశోద ఆ చుట్టుపక్కల గ్రామాలలో నెలకు రెండుసార్లు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించింది. ఆ పని మొదట తన ఊరితో ప్రారంభించింది. రెండో ఏడాదికల్లా మిగతా ఊళ్లలోనూ అవేర్నెస్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం 10–19 ఏళ్ల వయసులోని పిల్లలు. వాళ్లను సమీకరించి మంచి చెడులు వివరించేది. సొంత ఊరు దుమెర్పానీలోనే 15 బాల్య వివాహాలను నివారించగలిగింది యశోద. అప్పటికే ఆ అమ్మాయి పేరు జిల్లా మొత్తం వ్యాపించింది. నౌపడలోని నేషనల్ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది యశోద. నౌపడలో ఇప్పుడున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సదుపాయం ఆమె తీసుకున్న చొరవ ఫలితమే. ‘ఆడపిల్లల్తో నేనొక సామాజిక చైతన్య సైన్యాన్ని తయారు చేస్తాను’ అంటోంది యశోద ఇప్పుడు. చేస్తోంది కూడా తను. అంత పట్టుదల గల అమ్మాయి. ఐక్యరాజ్యసమితి ‘వి–అవార్డు’ విజేత యశోదా పాండే -
వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. (వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్) అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా 43వ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాకు వెల్లడించారు. అటు టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ చెప్పారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ఆధారంగా అధ్యక్షుడు క్లింటన్ టీకాను తీసుకుంటారన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే, తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా టీకా తీసుకుంటానని మరో మాజీ అధ్యక్షుడు ఒబామా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మరో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి తరువాత ప్రజల విశ్వాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బుష్ తల్లిదండ్రులు దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు. అలాగే 2005 లో కత్రినా హరికేన్ ప్రభావానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల ప్రజల సహాయార్థం జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ క్లింటన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
ఔషధ పరీక్షల్లో వలంటీర్ మృతి
సావోపౌలో: అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం ప్రకటించింది. ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్‌ను కొనసాగిస్తామంది. ఈ ఘటనపై అస్ట్రాజెనెకా స్పందించలేదు. చనిపోయిన వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు నిర్ధారణైతే ట్రయల్స్‌ను 3 నెలలు ఆపివేయ వచ్చని సంబంధితవర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మృతి చెందిన వలంటీర్‌కు మెనింజిటిస్ వ్యాక్సిన్ ఇచ్చారని సదరు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ట్రయల్స్ కొనసాగించవచ్చని ఈ ఘటనపై విచారణ జరిపిన స్వతంత్ర విచారణ కమిటీ సూచించిందని ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న సావోపౌలో ఫెడరల్ యూనివర్సిటీ తెలిపింది. మృతి చెందిన వలంటీర్ రియోడిజినిరోకు చెందిన 28 సంవత్సరాల వైద్యుడి గా చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి వలంటీర్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 8 వేల మంది వలంటీర్లను ట్రయల్స్ కోసం తీసుకున్నారు. -
ఖతర్నాక్ వలంటీర్.. కలెక్టర్ వేటు
సాక్షి, మడకశిర: ‘వైఎస్సార్ పింఛన్’ డబ్బు కోసం కట్టుకథ అల్లాడు ఓ వలంటీర్. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.43,500 దోచుకెళ్లారంటూ అందరినీ నమ్మించే యత్నం చేశాడు. వివరాల్లోకెళితే... పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శివాపురం పరిధిలో వార్డు వలంటీర్‌గా వీరప్ప పని చేస్తున్నారు. గురువారం 1వ తేదీ కావడంతో లబి్ధదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి తెల్లవారు జామున 4.30 గంటలకే సిద్ధమయ్యాడు. శివాపురం కాలనీ పరిధిలోని కొండ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి దాదాపు రూ.43,500 జేబులో పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో కట్టుకథను అల్లాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు కళ్లలో కారంకొట్టి రూ.43,500 దోచుకెళ్లారని స్థానికులను నమ్మించే యత్నం చేశాడు. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. (మడకశిరలో దోపిడీ దొంగల బీభత్సం) విచారణలో తేలిన నిజం విషయం తెలియగానే స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కమిషనర్ నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరప్పను వారు విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని తేల్చారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. రూ.43,500 ను వలంటీర్ నుండి రికవరీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ నాగార్జున తెలిపారు. విధుల నుంచి తొలగింపు మడకశిరరూరల్: శివాపురం సచివాలయ పరిధిలోని వలంటీర్ వీరప్పను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విధుల నుంచి తొలగించాలని కమిషనర్ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ సొమ్ము రూ.43,500 అపహరణ వ్యవహారంలో వలంటీర్ అసత్యాలు, కట్టు కథ అల్లినట్లు విచారణలో తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
అనంతపురం: దోపిడీ దొంగల బీభత్సం
-
వాగు మధ్యలో ప్రసవం..
కేవీబీపురం: ఆ గ్రామం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో వాగు దాటాల్సిందే. వర్షాలు వస్తే సుమారు 20 అడుగుల వరకు వాగు పారుతుంది. కొద్దిరోజుల వరకు బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. -
వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి
తణుకు అర్బన్: నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే మీపై వలంటీరును పోటీకి పెట్టి విజయం సాధిస్తామని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ► అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు ఎన్నికలకు దిగితే ఒక వలంటీరును మీపై పోటీకి దింపి గెలిపించే సత్తా మాకుంది. సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న మీరు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. ► కరోనా వైరస్‌కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటున్న మిమ్మల్ని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మరిచిపోయారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ.8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో మీరు లేరు. ► అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్‌లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడడమే కాకుండా కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని కనుమూరి ఆరోపించడం ఎంతవరకు సమంజసం? 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారు. -
వలంటీర్ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం పరిధిలోని కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వలంటీర్ గబ్బాడ అనురాధ (26) కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వలంటీర్ మరణించిన విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ సీఎంవో అధికారులతో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని వెంటనే అందేలా చూడాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, శుక్రవారం సాయంత్రం పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. సీఎం జగన్ చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం తన భార్య అనురాధ గుండెపోటుతో మృతి చెందడంతో రెండు నెలల శిశువుతో తాను ఒంటరిగా మిగిలిపోయానని భర్త గబ్బాడ కర్రన్న వాపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించి తన బిడ్డ సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారన్నాడు. సీఎం చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటానన్నాడు. తమకు సహకరించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. -
వాలంటీర్ల సర్వే
-
వైద్య సహాయకురాలిగా హెథర్ నైట్
లండన్: ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్హెచ్ఎస్)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్హెచ్ఎస్ వలంటీర్ పథకంలో నేను చేరాను. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నాను. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్హెచ్ఎస్లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్ నైట్ వివరించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సెమీస్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అనంతరం హెథర్ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
నాయకుడి గమ్యం గ్రామ స్వరాజ్యం
-
అమ్మో! సత్యవతమ్మ చూస్తుంది..!
తన ఇల్లే కాదు కాలనీల రోడ్లూ అద్దంలా ఉండాలని సత్యవతమ్మ తపన. అందుకే, తెల్లవారకముందే రోడ్డెక్కుతుంది. కూడళ్ల వద్ద కాపుకాస్తుంది మున్సిపల్ ఆటోలు వస్తున్నాయా లేదా చెక్ చేస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు అందిస్తుంది ఇదంతా ఎందుకంటే.. రోడ్ల మీద, కూడళ్లలో ఎవ్వరూ చెత్త వేయకూడదు. ఇప్పుడిక అక్కడ ఎవరైనా చెత్త వేయడం కాదు వేయాలనే ఆలోచనే మానుకున్నారు. ఎందుకంటే చెత్త వేస్తే.. ‘అమ్మో, సత్యవతమ్మ చూస్తుంది’ అని వారికి భయం. సత్యవతి... జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఈ పేరు తెలియనివారుండరు. ఎందుకంటే నిరంతరం చెత్త సమస్యపై మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు అందిస్తుంటోంది. అధికారులే కాదు ప్రజాప్రతినిధులనూ కలిసి చెత్త సమస్యకు పరిష్కారం చూపమంటూ డిమాండ్ చేస్తుంటోంది. ఇటీవలి కాలంలో తమ కాలనీలో చెత్త సమస్యకు ఆమె ఓ పరిష్కారం చూపింది. మున్సిపల్ నుంచి ఆటో రెగ్యులర్‌గా నడపాలని, రోడ్డుపై, కూడళ్ల వద్ద ఎవ్వరూ చెత్త వేయకుండా చూసే బాధ్యత తనదంటూ సత్యవతి శపథం చేసింది. కూడళ్ల వద్ద చెత్త వేస్తే రూ.50 జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే ఆమె ఆ కూడళ్ల వద్ద కాపుకాస్తోంది. దీంతో ‘అమ్మో సత్యవతమ్మ చూస్తుంది’ అన్న భయంతో కాలనీ వాసులు చెత్త వేయడం మానేశారు. పొరపాటున ఎవరైనా తను చూడనపుడు చెత్త వేస్తే ఆమె స్వయంగా వెళ్లి ఆ చెత్తను తీసి ఆటోల్లో వేసి వస్తుంటుంది. ఏడుపదుల వయసులోనూ.. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివసించే డి.సత్యవతి కుటుంబం భువనగిరి నుంచి 1975లో కామారెడ్డికి వలస వచ్చింది. కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలను నడిపింది. 1985లో పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన సత్యవతి ఐదేళ్ల పాటు పనిచేసింది. పంచాయతీ సభ్యురాలిగా పనిచేసిన సమయంలో, తరువాతి కాలంలోనూ ఆమె సామాజిక బాధ్యతను విస్మరించలేదు. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె నిరంతరం సామాజిక సమస్యలపై సమరం సాగిస్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొనే పారిశుద్ధ్యం సమస్య, తాగునీటి సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంది. ఏడు పదుల వయసులోనూ ఆమె తన మార్గాన్ని వీడకుండా ప్రజల సమస్యలపై స్పందిస్తోంది. ‘ప్రజాప్రతినిధులు, నాయకులు మున్సిపల్ కార్మికులను తమ ఇళ్లలో ఊడిగం చేయించుకుంటున్నారని, వారిని వదిలేస్తే పారిశుద్ధ్య సమస్య ఉండద’ని సత్యవతి చెబుతుంటోంది. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి ఈ సమస్యపై వందల సార్లు ఫిర్యాదులు చేశానని, ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా, తన పట్టుదల విడువనని చెబుతోంది సత్యవతమ్మ. తాను నివసించే శ్రీరాంనగర్ కాలనీ డెవలప్మెంట్ వర్కింగ్ కమిటీకి అధ్యక్షురాలిగా సత్యవతి కాలనీలోని సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది. మున్సిపల్లో అక్రమాలపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంచుతుంటుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం, కాని పక్షంలో నిరసన తెలుపుతూ తన పంథాను కొనసాగించడం సత్యవతమ్మ ముందున్న మరో పని. ఇంటింటికీ తిరుగుతూ.. శ్రీరాంనగర్ కాలనీలో స్థానికులు పలు కూడళ్లు, రోడ్లపై చెత్త వేయడంతో అక్కడ వాతావరణం అపరిశుభ్రంగా తయారవుతోందని గుర్తించిన సత్యవతమ్మ చెత్త వేయవద్దని కాలనీ వాసులకు ఇంటింటికీ తిరుగుతూ విన్నవించింది. అయినా చాలా మంది చెత్త వేస్తుండడంతో ఆమె సొంత డబ్బులతో ఫ్లెక్సీలు, బోర్డులు తయారు చేయించి ఆ కూడళ్ల వద్ద కట్టింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆమె కూడళ్ల వద్ద తిరుగుతూ ఎవరూ చెత్త వేయకుండా కట్టడి చేస్తుంటుంది. పొరపాటున ఎవరైనా చెత్త వేస్తే తానే వెళ్లి ఆ చెత్తను తొలగిస్తూ మున్సిపల్ ఆటోలో పడేస్తున్న సత్యవతమ్మను చూసి ఎవరూ చెత్త వేయడానికి సాహసించడం లేదు. సత్యవతమ్మ తపనను అర్థం చేసుకున్న కాలనీల వాసులు తమ చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలనే అవగాహనను ఏర్పరచుకున్నారు. దీంతో ఇంతకాలం చెత్తతో అధ్వాన్నంగా తయారైన ఆ కూడళ్లు ఇప్పుడు పరిశుభ్రంగా మారాయి. సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: అరుణ్ ►చెత్తను ఎక్కడ చూసినా ఇబ్బందే. మా కాలనీలలో అలాగే కనిపించేది. పేరుకుపోయిన చెత్త తీసేయాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాను. అయినా నా ప్రయత్నం మానలేదు. మున్సిపల్ ఆటోలోనే చెత్త వేయాలని కాలనీ వాసులకు నచ్చజెప్పాను. మొదట్లో నా మాటలు వినిపించుకోకపోయినా ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. అయినప్పటికీ మానవనైజం నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే చెత్త వేయకూడదంటూ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చే సి నియంత్రించే ప్రయత్నం చేశాను. మున్సిపల్ కార్మికులు ప్రజాప్రతినిధులు, నాయకుల ఇళ్లలో పనిచేస్తున్నారు. వారిని విముక్తి చేయాలి. ఇప్పుడు ఉన్న కార్మికులు పట్టణానికి సరిపోవడం లేదు. ఎవరో ఒకరు పూనుకుంటేనే ఎంతటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. సత్యవతమ్మ, స్వచ్ఛ సేవకురాలు, కామారెడ్డి -
వాట్సాప్.. హ్యాట్సాఫ్
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) ట్రాఫిక్ వలంటీర్లుగా పని చేయడమేకాకుండా మానవతా ధృక్ఫథాన్ని చాటుకుంటోంది. ఐటీ ఉద్యోగులుగా పని చేస్తూనే ట్రాఫిక్ వలంటీర్లుగా సేవలందిస్తూ ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు 108, డయల్ 100కి కాల్ చేస్తున్నారు. సేవలు అందడంలో జాప్యం జరిగితే ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తదితరులు సభ్యులుగా ఉండటంతో వెంటనే స్పందించి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడుతున్నారు. సెకన్లలో స్పందించిన సీపీ మాదాపూర్‌లోని 24ఎంఎం స్టార్టప్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ చిన్నం ప్రతిరోజూ శంకర్పల్లి సమీపంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి కార్యాలయానికి వచ్చి వెళుతుంటాడు. 2018 అక్టోబర్‌లో ఎస్సీఎస్సీ వలంటీర్‌గా చేరిన అతను సైబర్ టవర్ జంక్షన్ సిగ్నల్ వద్ద వారంలో నాలుగు రోజులు సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను వలంటీర్ విధులు ముగించుకొని కారులో వెళుతుండగా మోకిలా వద్ద రెండు బైక్‌లు కిందపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారికి తన వద్ద ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ బ్యాగ్‌తో ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108కి కాల్చేస్తే అంబులెన్స్‌లు అందుబాటులో లేవని సమాధానం వచ్చింది. డయల్ 100కు కాల్ చేసినా వెయింటింగ్ అని రావడంతో ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శంకర్పల్లి పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడికి పంపారు. బాధితులను శంకర్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్విక్ రియాక్షన్... నిజాంపేటకు చెందిన విద్యాసాగర్ జగదీషన్ గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ టెక్నాలజీ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తూ ఐదు నెలలుగా ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నల్ వద్దనే ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా ఇంటికి తిరిగివెళుతుండగా ఓ గుర్తు తెలియని బైక్ రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీనిని గుర్తించిన విద్యాసాగర్ తన వద్ద ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో అతడికి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108, 100 డయల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సమీపంలోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని అప్రమత్తం చేసి ఘటనాస్థలికి పంపడంతో ఆస్పత్రికి తరలించారు. అందరూ ముందుకొస్తేనే.. పోలీసులు, ట్రాఫిక్ వలంటీర్లే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనకెందుకులే అనుకోకుండా ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయవచ్చు. అలాంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. చాలా సార్లు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేద్దామని అనుకున్నప్పటికీ... సాయంచేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని ముందుకు రారు. మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ ప్రాణం. మీ ఉదాసీనత కారణంగా క్షతగాత్రులకు చికిత్స ఆలస్యమై వారు చనిపోయే ప్రమాదం ఉంది. మీరు తక్షణమే స్పందించడం వల్ల ఓ మనిషి ప్రాణాన్ని కాపాడినవారవుతారు. ముగ్గురు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వలంటీర్లకు అభినందనలు. – వీసీ సజ్జనార్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఏమిటీ వాట్సాప్ గ్రూప్ ఐటీ కారిడార్‌లోని వివిధ జంక్షన్లలో పనిచేస్తున్న 250 మంది ట్రాఫిక్ వలంటీర్లు ఈ ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆయా జంక్షన్లలో వాహనదారులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు రోడ్ల పరిస్థితి, సిగ్నలింగ్ సమస్యలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకొని ఇందులో పోస్టు చేస్తుంటారు. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయాల్లోనూ సమాచారం చేరవేస్తూ సిగ్నల్ మాన్యువల్‌గా మార్చేస్తుంటారు. ఈ గ్రూప్‌లో ఎస్సీఎస్సీ ప్రతినిథులు, వలంటీర్లతో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. -
మహిళా పోలీస్ వాలంటీర్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో జరిగే ప్రతీ విషయాన్ని, నేరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఇప్పటికే వీపీవో(విలేజ్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థ తెలంగాణలో అందుబాటులో ఉంది. ఇదే తరహాలో.. గ్రామాల్లో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులు, ఇతర ఘటనల నేపథ్యంలో.. పోలీసులు, బాధితుల మధ్య వారధిగా పనిచేసేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ఇదే మహిళా పోలీస్ వాలంటీర్ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, వారిపై జరుగుతున్న దాడులు, వరకట్న హత్యలు, ఆత్మహత్యలు తదితర నేరాలను నియంత్రించేందుకు ‘మహిళా పోలీస్ వాలంటీర్ల’ను నియమించనుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఈ మహిళా పోలీస్ వాలంటీర్ విధానం ద్వారా సత్ఫలితాలు సాధించింది. దీంతో ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సన్నాçహాలు చేస్తోంది. పనితీరును బట్టి బహుమతులు.. ఈ వాలంటీర్లకు నెలకు రూ.500 గౌరవ వేతనంగా అందించనున్నారు. అదే విధంగా ప్రతి మూడు నెలలు, ఆర్నెల్లకోసారి వేధింపుల నియంత్రణలో పనితీరును బట్టి రూ.10వేలు, రూ.5వేలు, రూ.3 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నవారు, నాయకులుగా చెలామణి అవుతున్నవారు, నేరచరిత్ర కల్గిన వారు ఈ వాలంటీర్ పోస్టుకు అనర్హులని పోలీ స్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీస్, స్త్రీ–శిశు సంక్షే మశాఖ నేతృత్వంలో ఈ వ్యవస్థ పనిచేస్తుందని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణ, మహిళావేధింపుల కట్టడికి కృషిచేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 21 ఏళ్లు, ఇంటర్ పాస్ తప్పనిసరి... రాష్ట్రంలో నల్లగొండ, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతీ గ్రామంలో మహిళా పోలీస్ వాలంటీర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంటర్ పాసయిన 21 ఏళ్ల యువతులకు వాలంటీర్‌గా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీరు.. గ్రామాల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఇతర నేరాలను స్థానిక స్టేషన్‌కు చేరవేయాల్సి ఉంటుంది. దీంతో పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులను నియంత్రించడం సులభతరం కానుంది. -
సోషల్ పోరులో హోరాహోరీ
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. అయితే ఈసారి క్షేత్ర స్థాయిలో నేతల ప్రచారంతో సమానంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాన పార్టీల మధ్య యుద్ధం తారస్థాయిలో సాగనుంది. అందుకోసం ఆయా పార్టీలు తమ సోషల్ మీడియా ప్రచార వీరుల్ని యుద్ధం కోసం సన్నద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది వలంటీర్లకు సమాచార విశ్లేషణ, సంప్రదింపుల అంశంలో శిక్షణను పార్టీలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్ద పార్టీలే కాకుండా.. ఆమ్ ఆద్మీ, సీపీఎం వంటి పార్టీలు కూడా సైబర్ సైన్యాన్ని ఎన్నికల ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. 2014 ఎన్నికల ప్రచారం నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచార స్థాయిని గణనీయంగా పెంచుకుని బీజేపీతో సమానంగా పోటీకి సిద్ధమైంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా భారత్‌లో 46.21 కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. ఇక 2019 నాటికి దేశంలో సోషల్ మీడియాను వాడేవారి సంఖ్య 25 కోట్లకు చేరనుంది. 2016లో ఆ సంఖ్య 16.8 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం. బీజేపీకి దీటుగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో డిజిటల్ ప్రచార విభాగాల్ని చాలాకాలం నుంచే బలోపేతం చేశామని, సోషల్ మీడియా ప్రచార వ్యూహాల్ని ఖరారుచేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక విభాగాల్ని నెలకొల్పామని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ దివ్య స్పందన తెలిపారు. ‘ప్రతీ రాష్ట్రంలోను సోషల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటిని జిల్లా స్థాయికి విస్తరిస్తున్నాం. పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ డిజిటల్ విభాగంతో అనుసంధానమయ్యారు. దాంతో సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందుతోంది’ అని స్పందన చెప్పారు. పార్టీ వాట్సాప్ నంబర్‌కు అందరూ అనుసంధానం కావాలని కార్యకర్తలకు కాంగ్రెస్ సూచించింది. కార్యకర్తలందరినీ డిజిటల్ ప్రచారానికి అనుసంధానం చేసేలా ‘ప్రాజెక్టు శక్తి’ని చేపట్టామని కాంగ్రెస్ సమాచార విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. 12 లక్షల మంది వలంటీర్లు: బీజేపీ 2014 ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించిన బీజేపీ.. ఈసారి మరింత దీటుగా ప్రతిపక్షం ఆరోపణల్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. సోషల్ మీడియా ప్రచారం కోసం 12 లక్షల మంది వలంటీర్లు అందుబాటులో ఉన్నారని.. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాల్వియ తెలిపారు. -
రియల్ హీరో ఈ ఐఏఎస్ అధికారి
తిరువనంతపురం : కేరళ సహాయ శిబిరాల వద్ద కొన్ని రోజులుగా ఓ యువకుడు మూటలు మోస్తూ.. అక్కడివారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సహాయక శిబిరాలకు వచ్చిన వస్తువులను ట్రక్కులనుంచి కిందకు దించి వాటిని అవసరమైన వారికి చేరుస్తున్నాడు. గత ఎనిమిది రోజులుగా అతడు ఇవే పనులు చేస్తున్నాడు. తొమ్మిదో రోజు ఆ వ్యక్తిని కాస్తా పరిశీలనగా చూసిన ఓ అధికారి ఆశ్చర్యంతో ‘సార్.. మీరు ఏంటి ఇక్కడ, ఇలా..?’ అని అడిగాడు. అంతవరకూ అతన్ని తమలాంటి ఓ సాధరణ వాలంటీర్ అనుకున్న వారికి ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలిసింది. దాంతో ఆ వాలంటీర్‌తో సెల్ఫీ దిగడానికి వారంతా ఎగబడ్డారు. మూటలు మోసే వ్యక్తితో సెల్ఫీ దిగడం ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే మూటలు మోస్తున్న ఆ వాలింటీర్ ఓ జిల్లా కలెక్టర్. కలెక్టర్ ఏంటి.. ఇలా మూటలు మోయడమెంటీ అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరి చదవండి. కేరళకు చెందిన కన్నన్ గోపీనాథన్(32) 2012 బ్యాచ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి. శిక్షణ అనంతరం అతనికి కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో కేరళలో సంభవించిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కేరళను ఆదుకోవడానికి దేశమంతా తరలి వచ్చింది. అందులో భాగంగా పలు రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని అందించాయి. అలా సాయం చేసిన వాటిలో దాద్రా నగర్ హవేలీ కూడా ఉంది. ప్రస్తుతం అక్కడే కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథన్ దాద్రా నగర్ హవేలీ తరపున కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేందుకు వచ్చాడు. ఆ పని ముగిసిన తర్వాత తిరువనంతపురం నుంచి తన సొంత ఊరు పుతుపల్లికి వెళ్లాల్సిన గోపీనాథన్ కాస్తా వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయిన చెంగన్నూర్‌కి వెళ్లి సహాయక శిబిరాల్లో ఉంటూ వాలంటీర్‌గా బాధితులకు సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా 8 రోజులు గడిచిపోయింది. అనంతరం ఓ అధికారి గోపీనాథన్‌ని గుర్తుపట్టడంతో అతని గురించి అక్కడివారికి తెలిసింది. దీంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాలంటీర్‌గా పని చేయడం గురించి గోపీనాథన్ మాట్లాడుతూ.. ఇక్కడి అధికారులు పడిన శ్రమతో పోలిస్తే.. నేనేం గొప్ప పని చేయలేదని వినయంగా చెప్పుకొచ్చాడు. నన్ను హీరో చేయొద్దు, క్షేత్ర స్థాయిలో ఇక్కడెంతో మంది సాయం చేస్తున్నారు. వారే రియల్ హీరోలు. ఇదే స్ఫూర్తితో అంతా కష్టపడితే.. త్వరలోనే కేరళ తన పూర్వ వైభవాన్ని పొందుతుందని గోపినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిపా వైరస్: కేరళకు కఫీల్ ఖాన్..
సాక్షి, తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న అరుదైన వైరస్ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తగిన నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానించారు. నిపా వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ కఫీల్ ఖాన్ తెలిపారు. ఆయన కేరళ వెళ్లనున్నారు. కాగా ప్రమాదకర నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వైరస్ గోవా, ముంబై రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ‘అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ కఫీల్ ఖాన్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విజయన్ నిపా బాధితులకు ఉచితంగా వైద్యం చేసేందుకు కేరళ వస్తున్న డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌ని బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలో కఫీల్‌ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసింది. కఫీల్‌ఖాన్ ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. గోరఖ్‌పూర్ వదిలి వెళ్లను ‘నిపా వైరస్‌తో కేరళలో ఒక నర్సుతో సహా పదిమంది మరణించారని తెలుకున్నా. ఎలాగైనా వారికి సహాయం చేయాలని కేరళ వెళ్లాలి అనుకున్నా. యూపీ ప్రభుత్వం నా సస్పెన్షన్ ఇంకా రద్దు చేయలేదు. ఇటీవల ఆసుపత్రిని సంప్రదించాను. గోరఖ్‌పూర్‌ను వదిలి ఎక్కడికి వెళ్లను త్వరలోనే అక్కడికి వెళ్తా’ అని కఫీల్ ఖాన్ పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి బెస్ట్ ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా అంజలి
–శ్రీకాకుళంలో అవార్డు ప్రదానం కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రస్థాయి ఉత్తమ జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)వలంటీర్‌గా కర్నూలుకు చెందిన కె. అంజలి ఎంపికయ్యింది. శనివారం ఆమెకు శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ గోకుల్ కృష్ణ, స్టేట్ లైసెన్స్ ఆఫీసర్ రామచంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. బనగానపల్లికి చెందిన హోటల్ వ్యాపారి కె. బద్రీనాథ్, కె. సుధ కుమార్తె అయిన కె. అంజలి కర్నూలులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. కళాశాలలో విద్యనభ్యసించే సమయంలో ఆమె ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనింది. ఆమె చేసిన సేవలకు 2015–16 సంవత్సరానికి గాను రాష్ట్ర అధికారులు ఉత్తమ అవార్డు పురస్కారం అందజేశారు. -
సేవకులే.. సైనికులై..