
సాక్షి, ఢిల్లీ: మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. విభజన చట్టం మేరకు ఈ పోర్టు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఉన్న ఆరు లైట్ హౌస్ లను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.