
సాక్షి, తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ చంద్రప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో స్వామి వారి వాహన సేవలను ఆలయంలో ఏకంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ మలయప్ప స్వామి వారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఉదయం 8.00 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు..కరోనా విజృభిస్తున్న నేపధ్యంలో రేపు ఉదయం స్వర్ణరధంను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. (వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు )