మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే! | SP Impose Fine To Traffic CI For Not Wearing Mask Guntur | Sakshi

మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే!

Published Tue, Mar 30 2021 11:47 AM | Last Updated on Tue, Mar 30 2021 2:44 PM

SP Impose Fine To Traffic CI For Not Wearing Mask Guntur - Sakshi

లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు.

సాక్షి, గుంటూరు: దేశంలో కరోనా మళ్లీ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి. గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి, స్వయంగా మాస్కు తొడిగారు.

కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఏప్రిల్‌ 1న కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్న సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement