ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత స్వప్నిల్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Wishes Olympic Athlete Swapnil Kusale For Wins Bronze Medal For India, Tweet Inside | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత స్వప్నిల్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Thu, Aug 1 2024 4:49 PM | Last Updated on Thu, Aug 1 2024 5:47 PM

Ys Jagan Wishes Olympic Athlete Swapnil Kusale

ఒలంపిక్ క్రీడాకారుడు స్వప్నిల్ కుసాల్‌కి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, గుంటూరు: ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాల్‌కి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో పతకం సాధించిన స్వప్నిల్‌కు అభినందనలు తెలుపుతూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత్‌ తరఫున స్వప్నిల్‌ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్‌ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్‌లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు.

పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్‌... 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌–సరబ్‌జోత్‌ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్‌ స్టార్‌.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement