శతాధిక వృద్ధురాలికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలికి సన్మానం

Published Mon, Apr 14 2025 12:57 AM | Last Updated on Mon, Apr 14 2025 12:57 AM

శతాధి

శతాధిక వృద్ధురాలికి సన్మానం

జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పొట్ట నర్సమ్మను ఆమె కుటుంబీకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఇటీవల లక్ష్మీనర్సమ్మ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనర్సమ్మ నాలుగు తరాల కుటుంబీకులు ఆమెకు శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు.

జిల్లా ‘కుంగ్‌ఫూ’ కమిటీ ఎన్నిక

కొత్తగూడెంటౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్‌ఫూ, మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఐ.ఆదినారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పి.కాశీహుస్సేన్‌, కోశాధికారిగా బి.కనకరాజు, ఉపాధ్యక్షులుగా ఎస్‌కే హుస్సేన్‌ఖాన్‌, కె.శ్రీనివాస్‌, బి.మల్లికార్జున్‌, ఐ.మోహన్‌రావు, వై.సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులుగా బి.బుచ్చయ్య, ఎం.రాజయ్య, హరిబాబు, ఎస్‌.సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి బి.సాగర్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు లీల శ్రీనివాస్‌, ఎస్‌.సతీశ్‌, ఎం.దామోదర్‌, బాబు, వి.శ్రీకాంత్‌, ఎస్‌.రమేశ్‌ను ఎన్నుకున్నట్లు అసోసియేషన్‌ బాధ్యులు తెలిపారు.

నేటి నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి

అందుబాటులోకి మొదటి యూనిట్‌

జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సేవలు

మణుగూరురూరల్‌: మండలంలోని చిక్కుడుగుంట ప్రాంతంలోని 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌)లో మొదటి యూనిట్‌లో జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సేవలు ఆదివారం నుంచి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. గతేడాది జూన్‌ 29వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో మొదటి యూనిట్‌ జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిన విషయం విదితమే. పది నెలలుగా 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడటంతో 2024–25 వార్షిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పవచ్చు. పది నెలల తర్వాత మరమ్మతులు పూర్తవడంతో జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆదివారం బిగించారు. సోమవారం నుంచి బీటీపీఎస్‌ ద్వారా 1080 మెగావాట్ల విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరగనున్నట్లు బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న తెలిపారు.

మంత్రి తుమ్మలను

కలిసిన ఏపీ రైతులు

దమ్మపేట: ఏపీకి చెందిన పామాయిల్‌ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మలను ఏపీ పామాయిల్‌ రైతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి మాట్లాడారు. ఏపీలో పండిన పామాయిల్‌ గెలలను అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు గాను హర్షం వ్యక్తం చేశారు.

అంగన్వాడీ కేంద్రంపై పిడుగుపాటు

వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిడుగు పడి, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అంగన్వాడీ కేంద్రంపై పిడిగు పడటతో రికార్డులు, పిల్లల ఆట వస్తువులు, భోజన పదార్థాలు కాలి బూడిదయ్యాయి. భారీ వర్షానికి విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పాడింది.

శతాధిక వృద్ధురాలికి సన్మానం 1
1/3

శతాధిక వృద్ధురాలికి సన్మానం

శతాధిక వృద్ధురాలికి సన్మానం 2
2/3

శతాధిక వృద్ధురాలికి సన్మానం

శతాధిక వృద్ధురాలికి సన్మానం 3
3/3

శతాధిక వృద్ధురాలికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement