
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది మే 19న రూ. 2000నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండువేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. కానీ ఇంకా సుమారు రూ. 7581 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నట్లు సమాచారం.
ఆర్‌బీఐ ప్రకారం.. ఇప్పటికి 97.87 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలుస్తోంది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఇది 2024 జూన్ 28 నాటికి రూ. 7581 కోట్లకు తగ్గింది. అంటే మిగిలిన మొత్తం నోట్లు మళ్ళీ బ్యాంకులకు చేరాయి.
2024 జూన్ 28 నాటికి వెనక్కు వచ్చిన పెద్ద నోట్లు 97.87 శాతం. నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తరువాత కూడా.. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. దీనికోసం దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలు తమ నోట్ల మార్పిడి కోసం డబ్బును ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.
Withdrawal of ₹2000 Denomination Banknotes – Statushttps://t.co/L2SXdYpCTR
— ReserveBankOfIndia (@RBI) July 1, 2024