‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే.. | Tax payers choosing old regime to act quickly | Sakshi
Sakshi News home page

‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..

Published Wed, Apr 16 2025 6:44 PM | Last Updated on Wed, Apr 16 2025 7:21 PM

Tax payers choosing old regime to act quickly

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత పన్ను విధానంలో కొనసాగాలా లేక కొత్త విధానంలోకి వెళ్లాలా అనేది ఎంచుకునే పనిలో ఉన్నారు. డిడక్షన్లు, మినహాయింపులకు ప్రసిద్ధి చెందిన పాత పన్ను విధానం గణనీయమైన పెట్టుబడులు, ఖర్చులు ఉన్నవారికి ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది. కానీ దీనికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి.

జీతం పొందే ఉద్యోగులు
పాత పన్ను విధానం కింద ట్యాక్స్‌ పేయర్స్‌ సుమారు 70 డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ వంటి పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు, గృహ రుణ వడ్డీకి రూ.2 లక్షల వరకు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) కోసం మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ విధానాన్ని ఎంచుకోవడానికి త్వరపడాల్సిన అవసరం ఉంది. జీతం పొందే ఉద్యోగులు తాము ఈ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తమ యజమానులకు తెలియజేయాలి. తద్వారా టీడీఎస్‌ (TDS) సరిగ్గా లెక్కించేందుకు వీలుంటుంది. ఈ సమాచారం ఇవ్వకపోతే యజమాన్యాలు కొత్త విధానాన్ని డిఫాల్ట్‌గా అప్లయి చేస్తారు. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ డిడక్షన్లు తక్కువగా ఉంటాయి.

వ్యాపారులు
వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. వారు పాత విధానాన్ని ఎంచుకోవడానికి ఐటీఆర్‌ గడువు జూలై 31 లోపల ఫారం 10-IEA ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారిని పాత విధానంలో లాక్ చేస్తుంది. కొత్త విధానానికి తిరిగి మారడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గడువు తప్పడం లేదా ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి డీఫాల్ట్‌గా వెళతారు. ఇది వారికి విలువైన డిడక్షన్లను కోల్పోయేలా చేస్తుంది.

ఇదీ చదవండి: ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..

పన్ను ప్రణాళిక సౌలభ్యం
పాత విధానం ఆకర్షణ దాని పన్ను ప్రణాళిక సౌలభ్యంలోనే ఉంది.  ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏ లేదా సెక్షన్ 80సీ పెట్టుబడుల వంటి సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించిన డిడక్షన్లు ఉన్న అధిక ఆదాయ వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువ మినహాయింపు పరిమితుల (60–79 సంవత్సరాల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు) నుండి ప్రయోజనం పొందుతారు. అయితే, ఇది అదనపు డాక్యుమెంటేషన్, ఉదాహరణకు అద్దె రసీదులు, పెట్టుబడి రుజువులు, ఐటఆర్‌ దాఖలు సమయంలో లేదా ఆడిట్ సమయంలో ధ్రువీకరించడానికి అవసరం.

రెండూ పోల్చుకోండి..
ఆదాయపు పన్ను విభాగం ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి రెండు పన్ను విధానాలనూ పోల్చిచూసుకోవాలని ట్యాక్స్‌ పేయర్స్‌కు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాత విధానం ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడతాయి. కొత్త విధానం డిఫాల్ట్‌గా ఉన్నందున, పాత విధానం ప్రయోజనాలను పొందడానికి పన్ను చెల్లింపుదారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement