ITR
-
నవీకరించిన ఐటీఆర్‌లతో ఖజానాకు రూ.9,118 కోట్లు
గడిచిన నాలుగేళ్లలో 90 లక్షలకు పైగా నవీకరించిన(అప్డేట్) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు రూ.9,118 కోట్లు సమకూరినట్లు సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్నుదారులు స్వచ్ఛందంగా వివరాలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించినట్లు తెలిపారు. 2022లో అదనపు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా సంబంధిత మదింపు సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు నవీకరించిన ఐటీ రిటర్న్‌లు(ఐటీఆర్-యూ) దాఖలు చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.ఫైనాన్స్ బిల్లు, 2025 ద్వారా అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి కాలపరిమితిని సంబంధిత మదింపు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో (2024-25) ఫిబ్రవరి 28 వరకు 4.64 లక్షల అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని, అందుకు రూ.431.20 కోట్ల పన్నులు చెల్లించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు.ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్ఆయన తెలిపిన వివరాల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో 29.79 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా రూ.2,947 కోట్ల అదనపు పన్నులు చెల్లించారు. 2022-23, ఏవై(అసెస్మెంట్ ఇయర్-మదింపు సంవత్సరం) 2021-22 సంవత్సరాల్లో వరుసగా 40.07 లక్షలు, 17.24 లక్షల అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. వాటిల్లో అదనంగా రూ.3,940 కోట్లు, రూ.1,799.76 కోట్ల పన్నులు చెల్లించారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో 91.76 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా, ప్రభుత్వానికి రూ.9,118 కోట్ల అదనపు పన్నులు వచ్చాయి. -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్‌పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్‌ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్‌కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్‌లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
ఐటీఆర్ ఫైలింగ్: రేపటి నుంచి రూ.5000 ఫైన్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇచ్చిన గడువు నేటితో (జనవరి 15) ముగియనుంది. ఇక రేపటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఆ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో గడువు మరో 15 రోజులు ముందుకు సాగింది.నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఈ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు.. వారి ఫైలింగ్‌లను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.సాధారణంగా ప్రతి ఏటా ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఈ తేదీ లోపల ఐటీఆర్ ఫైల్ చేయనివారు.. జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపల ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గడువును కూడా మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 లోపల ఐటీఆర్ ఫైల్ చేయని వారు మాత్రమే కాకుండా.. ఫైల్ చేసిన వారు కూడా ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 6.68 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలియజేశారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసుకునే మొత్తం వ్యక్తుల సంఖ్య 8,09,03,315 అని ఆయన పేర్కొన్నారు.CBDT extends the last date for furnishing Belated/ Revised return of income for AY 2024-25 in the case of Resident Individuals from 31st December, 2024 to 15th January, 2025.✅Circular no. 21/2024 dated 31/12/2024 issued-https://t.co/DedADMfnGX pic.twitter.com/sBVdGZqxRF— Income Tax India (@IncomeTaxIndia) December 31, 2024 -
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికిగాను నవంబర్ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024 -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కార్పొరేట్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 31 గడువు తేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 15 రోజులు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.సీబీడీటీ ఇప్పటికే ఆడిట్ నివేదికల దాఖలు తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.గడువు తేదీ లోపు ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి చాలా మంది ట్యాక్స్‌పేయర్స్, సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడవు పొడిగింపు వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదనపు సమయం లభించడంతో ఎలాంటి ఒత్తిడి, జరిమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లను పూర్తి చేయవచ్చు. -
స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?
ఇల్లు అమ్మి కొత్తగా మరో ఇల్లు కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల్లో మాత్రం తేడాలున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 54, సెక్షన్ 54ఎఫ్‌లో ఈ విషయాలను పొందుపరిచారు. అవి ఏమిటో తెలుసుకుందాం.1. మీకు ఉన్న పాత ఇల్లు అమ్మి తదనుగుణంగా సక్రమించే మూలధన లాభాలతో మరో కొత్త ఇల్లు కొనుగోలు చేసినప్పుడు సెక్షన్ 54 వర్తిస్తుంది. అంటే ఇల్లు అమ్మి, ఇల్లు కొనడం అన్నమాట. 54ఎఫ్ సెక్షన్ ప్రకారం మీ ఇల్లు అమ్మితే ఎటువంటి ప్రయోజనం రాదు. మీరు అమ్మే క్యాపిటల్ అసెట్ ఇల్లు తప్ప మిగిలింది ఏదైనా కావాలి. అంటే స్థలం, షేర్లు, బంగారం మొదలైనవి. 54ఎఫ్ ప్రయోజనం పొందాలంటే ఇల్లు అమ్మకుండా ఇతర ఆస్తుల అమ్మకంతో ఏర్పడ్డ లాభాలతో ఇల్లు కొనాలి.2. సెక్షన్ 54 ప్రకారం కేవలం మూలధన లాభాలు పెట్టి కొత్త ఇల్లు కొంటే మినహాయింపు దొరుకుతుంది. ఉదాహరణకు మీరు రూ.40 లక్షలు పెట్టి కొన్న ఇల్లు రూ.90 లక్షలకు అమ్మగా ఏర్పడ్డ లాభం రూ.50 లక్షలు. ఈ రూ.50 లక్షలతో కొత్త ఇల్లు కొంటే సరిపోతుంది. కానీ 54ఎఫ్ ప్రకారం మీకు చేతికొచ్చిన మొత్తం ప్రతిఫలంతో కొనాలి. ఉదాహరణకు బంగారం రూ.40 లక్షలకు కొని రూ.1 కోటికి అమ్మారు.. ఇప్పుడు లాభంతో నిమిత్తం లేకుండా మొత్తం ప్రతిఫలం వెచ్చించి ఇల్లు కొనాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో ముడిపడి ఉంది. 54లో కన్నా 54ఎఫ్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. బైటకు పోయే మొత్తం ఎక్కువ.3. 54 ప్రకారం కొనే ఇంటి మీద ఎటువంటి ఆర్థిక ఆంక్షలు లేవు. ఎంత మొత్తం అయినా ఖర్చు పెట్టొచ్చు. మీకు సంక్రమించే ఆదాయాలు నిబంధనల ప్రకారం ఉండాలి. 54ఎఫ్ ప్రకారం కొత్త ఇల్లు ధర రూ.10 కోట్లు దాటకూడదు. పది కోట్లు దాటితే మొత్తం మీద పన్ను మినహాయింపు ఇవ్వరు.4. ఇల్లు కొనే నాటికి మీకు ఇల్లు ఉండకూడదు. 54ఎఫ్ కేవలం ఇల్లు కొనడానికే ప్రోత్సాహకంగా పెట్టారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి ఇల్లు కొనేవారికే అనుకూలించేలా పెట్టారు. 54 ప్రకారం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అన్ని రూల్స్ ఫాలో అయితే ఇల్లు కొనడం–అమ్మడంలో లబ్ధి పొందవచ్చు.5. 54ఎఫ్ ప్రకారం ఆస్తి అమ్మిన తేదీ నుంచి ఏడాది ముందు, అలాగే రెండు సంవత్సరాల్లోపల కొనుక్కోవచ్చు. లేదా అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోపల కొనుగోలు చేసుకోవచ్చు. 54లో ఇటువంటి ఆంక్షలు లేవు.ఇదీ చదవండి: ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది మెరుగు?ఈ రెండు సెక్షన్లు వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. నిబంధనల మేరకు రెండింటికీ క్యాపిటల్ గెయిన్స్ అకౌంటు రేటు వర్తిస్తుంది. సకాలంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా ప్రయోజనం ఉంటుంది. అయితే, సెక్షన్ 54 ప్రయోజనం, 54ఎఫ్ ప్రయోజనం పరస్పరం ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలి. కానీ 54ఎఫ్ ప్రయోజనం.. 54 ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుంది. 54 ప్రకారం ఇల్లు అమ్మితే ఇల్లు కొనుక్కోవచ్చు. బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. రెండింటిలోనూ వెచ్చించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేపుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోవడం మేలు.-మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
ఐటీఆర్ ప్రాసెసింగ్.. ఐటీ శాఖ అప్డేట్
2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెసింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ అప్డేట్ విడుదల చేసింది. జూలై 31 నాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈ-వెరిఫై అయ్యాయి. వీటిలో 5.81 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వైరిఫై చేశారు.ఐటీ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలైన ఐటీఆర్‌లలో ఇప్పటికే 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశారు. ఇవి మొత్తం దాఖలు చేసిన రిటర్న్స్‌లో 43.34 శాతం అని ఐటీ శాఖ పేర్కొంది.జూలై 31 గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఈసారి గణనీయమైన సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో 5.27 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. పాత పన్ను విధానంలో 2.01 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 58.57 లక్షల మొదటిసారి ఫైలర్లు ఉన్నారు. -
ఐటీఆర్.. ఈరోజే చివరి తేదీ.. ప్రయోజనాలివే..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈరోజే(జులై 31) చివరి తేదీ. నిబంధనలకు అనుగుణంగా ఆదాయపన్ను రిటర్నులను ఇంకా ఎవరైనా దాఖలు చేయకపోతే వెంటనే నమోదు చేయాలని నిపుణులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ఏటా సమకూరే ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు రిటర్నులు ఫైల్ చేస్తే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా దరఖాస్తు కోసం పన్ను రిటర్నులు ఉపయోగపడతాయి. ఏదైనా బకాయిలుంటే వేరే దేశం వెళ్లేందుకు అవాంతరాలు ఏర్పడుతాయి.బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణం మంజూరుకోసం ఆదాయ రుజువు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు రిటర్నులు సాయపడతాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరానికి జత చేయొచ్చు. అంటే పాత నష్టాలను భవిష్యత్తు ఆదాయానికి జతచేసి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా ఇతర వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎంతో ఉపయోగం.ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!ఐటీ రిటర్నులను కొన్నిసార్లు గుర్తింపు పత్రాలుగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వీటిని ఐడెంటిటీ ప్రూఫ్‌గా వాడుకోవచ్చు.నిర్దిష్ట సమయంలో ఐటీఆర్‌లను ఫైల్ చేసే వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్ మెరుగవుతుంది. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ అంచనా వేసే సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. దానివల్ల ఎప్పుడైనా రుణాలకోసం దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీకే వాటిని పొందే వీలుంది.భవిష్యత్తులో వ్యాపారం ప్రారంభించాలన్నా, ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్డింగ్ వేయాలన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో పూర్తి ఆర్థిక లావాదేవీలుంటాయి. దానివల్ల భవిష్యత్తులో పెట్టుబడి, ఖర్చులు వంటి వాటిపై మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.నిత్యం మనం చేసే వస్తువులకు ప్రభుత్వం టీడీఎస్ వసూలు చేస్తుంది. వీటిని తిరిగి పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సమీపిస్తున్న గడువు.. ఐటీ శాఖ బిగ్ అప్డేట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. -
ఐటీఆర్ గడువు పొడిగింపు? ఐటీ శాఖ క్లారిటీ
ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. “ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం’’ అని వివరించింది.అదే విధంగా ఆదాయపు పన్ను రీఫండ్లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. “తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలు లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్ఎంఎస్లు, మెయిల్ పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అప్రమత్తం చేసింది.కాగా 22 జూలై వరకు 4 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాఖలు చేసిన రిటర్న్‌లతో పోలిస్తే 8% ఎక్కువ. జూలై 16న రోజువారీ దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్య 15 లక్షలు దాటింది. గడువు తేదీ సమీపిస్తుండటంతో రోజువారీ ఫైలింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. -
కొత్త పన్ను విధానంలోనే 66% రిటర్నులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
వాట్సాప్ ద్వారా ఐటీ రిటర్న్స్!! ఎలాగో చూడండి..
ITR Filing 2024: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలో హడావుడిగా ఉన్నారు. అయితే ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీస్‌ను అందించే ‘క్లియర్ ట్యాక్స్’ (ClearTax) వాట్సాప్‌ని ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది.ఈ కొత్త సర్వీస్ సరళమైన, చాట్-ఆధారిత అనుభవాన్ని అందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. తక్కువ-ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది పన్ను దాఖలును సులభతరం చేస్తుంది. ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది.ఈ సర్వీస్ ముఖ్యమైన ఫీచర్లు» ఇది ప్రస్తుతం ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్‌లకు మద్దతు ఇస్తోంది.» ఇంగ్లీష్, హిందీ, కన్నడతో సహా 10 భాషల్లో అందుబాటులో ఉంది.» ప్రతిదీ వాట్సాప్‌లోనే పూర్తి చేసేలా భద్రతతో కూడిన చెల్లింపు వ్యవస్థ.» అవసరమైన సమాచారాన్ని ఇమేజ్‌లు, ఆడియో, టెక్ట్స్ ద్వారా సమర్పించవచ్చు.» ఏఐ వ్యవస్థ ప్రతి యాజర్‌కు ఉత్తమమైన పన్ను విధానాన్ని ఎంపిక చేస్తుంది. వారికి మరింత ఆదా చేయడంలో సహాయపడుతుంది.ఉపయోగించండి ఇలా..» క్లియర్ ట్యాక్స్ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసి, "హాయ్" అని టైప్ చేయడం ద్వారా సంభాషణను ప్రారంభించండి.» మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.» అడిగినప్పుడు మీ పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.» అవసరమైన పత్రాలను సులభంగా సమర్పించడానికి చిత్రాలను అప్లోడ్ చేయండి లేదా ఆడియో/టెక్స్ట్ సందేశాలను పంపండి.» ఐటీఆర్1 లేదా ఐటీఆర్4 ఫారమ్‌లను దశల వారీగా పూరించడానికి ఏఐ బాట్ సూచనలను అనుసరించండి.» ముందుగా నింపిన ఫారమ్‌ను సమీక్షించండి, ఏవైనా అవసరమైన మార్పులు చేయండి. మీ వివరాలను నిర్ధారించండి.» వాట్సాప్ ద్వారా నేరుగా సురక్షిత చెల్లింపుతో ప్రక్రియను పూర్తి చేయండి.» సబ్మిట్ తర్వాత, మీరు మీ రసీదు సంఖ్యతో నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. -
ఐటీ పోర్టల్‌లో అప్డేట్.. ఆ మినహాయింపు దూరం!
ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఇటీవలి అప్డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అసలేమైంది? మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్‌లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్‌కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
ఐటీఆర్ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. రిటర్ను దరఖాస్తులు దాఖలు చేసేపుడు చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి అనువుగా వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే కొంతమేర పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పన్ను చెల్లింపుల్లో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇండెక్సేషన్పన్నుదారుల్లో చాలామంది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దానికి అనువుగా ఆదాయాన్ని సర్దుబాటు చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేపుడు చాలావరకు గతంలో చేసిన పెట్టుబడులను ప్రస్తుత విలువగానే పరిగణిస్తున్నారు. కానీ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.ఏదైనా ఒక వస్తువును రూ.10కు కొనుగోలు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం కారణంగా ఏడాదిలో దాని ధర రూ.12కు చేరినట్లు భావించండి. ఆ వస్తువుపై రూ.1 లాభం రావాలంటే మీరు దాన్ని ప్రస్తుత విలువ ప్రకారం రూ.13కు అమ్ముతారు. కానీ మీరు కొన్నది రూ.10కే. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ మీరు అమ్మే సమయానికి రూ.2 పెరిగింది. కాబట్టి మీకు వచ్చిన లాభంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలి. దానికోసం ఇండెక్సేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
‘ప్రాథమిక పన్ను మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచాలి’
కేంద్రం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్ను విధానానికి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.1 లక్షకు పెంచాలని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ ఈవై డిజి ఇండియా తెలిపింది. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3.5 లక్షలకు పెంచాలని కోరింది.ఈవై తెలిపిన వివరాల ప్రకారం..ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి విధాన పరమైన ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించాలి. పన్ను విధానాలను క్రమబద్ధీకరించాలి. దేశీయంగా పెట్టుబడులు ఆకర్షించే వాతావరణాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కార్పొరేట్ పన్ను రేట్లను స్థిరంగా కొనసాగించాలి. టీడీఎస్ నిబంధనను మార్చాలి. వివాద పరిష్కారాలను సరళీకరించాలి. పన్ను మినహాయింపులు లేని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి. రాయితీ పన్ను విధానంలో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచాలి. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు చేర్చాలి. ఐటీఆర్ ప్రాసెస్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దాన్ని మెరుగుపరిచేలా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) సేవలు వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ‘టీడీఎస్‌ను హేతుబద్ధీకరించాలి. ప్రస్తుతం టీడీఎస్ కింద 33 విభాగాలు ఉన్నాయి. దాంతో పన్నుదారుల్లో చాలా గందరగోళం నెలకొంటుంది. వీటిలో 0.1 నుంచి 30 శాతం వరకు పన్ను రేట్లు ఉంటాయి. ఇందులోని విధానాలను సరళీకరించాలి’ అని ఈవై కన్సల్టెన్సీ కోరింది. -
ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
స్టాక్‌మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు, సెబీ హెచ్చరిస్తున్నా వారి సూచనలు పట్టించుకోకుండా చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ నిపుణుల సలహాలు పట్టించుకోని ఓ బీటెక్ విద్యార్థి రెండేళ్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసి ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఆ విద్యార్థి రోషన్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.రోషన్ తెలిపిన వివరాల ప్రకారం..‘బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని నా వద్దకు వచ్చాడు. తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి హోటల్ నిర్వహిస్తోంది. పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్ల అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఆ డబ్బుతో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు నష్టపోవడంతో యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ట్రేడింగ్ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’ అని చెప్పారు.‘ఆ విద్యార్థి మిత్రుడు ఒకరు ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం నష్టం వస్తునపుడు ఆ ట్రేడింగ్‌ను మానేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే..ట్రేడింగ్‌కు బానిసైపోయా అని బదులిచ్చాడు. ఇంతలా నష్టపోయావు కదా.. భవిష్యత్తులో మళ్లీ ట్రేడింగ్ చేస్తావా? అని అడిగితే ఇకపై ట్రేడింగ్ చేయనని చెప్పాడు’ అని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ అన్నారు. ‘ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న దాదాపు 45.24 లక్షల మందిలో, కేవలం 11 శాతం మందే లాభాలు పొందుతున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు పొందవచ్చు. సంపద సృష్టికి అవకాశం ఉన్న విభాగంలోనే పెట్టుబడులు పెట్టండి’ అని ఆమె గతంలో మదుపర్లకు సూచించారు. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలు
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి ఆన్లైన్లో నమోదుచేసేపుడు ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ తరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా ధ్రువీకరణ, ఈ-వెరిఫై, మినహాయింపులు..వంటి కొన్ని అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాంకు అకౌంట్ ధ్రువీకరణపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలుకు ముందే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించుకోవాలి. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్గానే ఉందని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.ఈ-వెరిఫైఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసి తప్పకుండా వెరిఫై చేయాలి.మినహాయింపులు ఇలా..ఆదాయపు పన్ను మినహాయింపుల్లో భాగంగా సెక్షన్ 80సీ నిబంధనల ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ వెసులుబాటు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, హోమ్‌లోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్ఆర్ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది.ఆదాయాలన్నీ చెప్పాల్సిందే..చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. వడ్డీ, కమిషన్ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్ కట్ చేసి ఉంటారనే ఉద్దేశంతో అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని పేర్కొనాల్సిందే.గడువు పూర్తయితే..ఐటీఆర్ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాలి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!అన్ని పత్రాల పరిశీలనకొన్నిసార్లు ఇన్‌కమ్‌ట్యాక్స్ వివరాలు, ఫారం-16లోని వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పూర్తిగా పరిశీలించాలి. ఏదైనా తేడా ఉంటే మీరు పనిచేసే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలి. -
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి
గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్) చేసే సమయం దగ్గర పడింది. జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి వరకు వేచిచూడకుండా ఆలోపే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలనే సందేహంతో ఉన్నారు. కొన్ని అంశాలు పాటించడం ద్వారా ఏ పద్ధతి ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ముందుగానే నింపిన ఐటీఆర్ ఫారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ మొదటిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికీ, పాతవారికీ కొంత ఆందోళన ఉండటం సహజమే. అయితే దీన్ని అధిగమించాలంటే కొన్ని అంశాలపై అవగాహన అవసరం.ఆదాయంఆర్థిక సంవత్సరం 2023-24లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి మొత్తం ఆదాయం ఎంతనే విషయంలో స్పష్టత ఉండాలి. వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీ, డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఆదాయం తెలుస్తుంది. ఇందులో నుంచి ఆదాయపు పన్ను చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయంపై స్పష్టత వస్తుంది.కొత్తదా..? పాతదా..?రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. ఈ విధానాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80ఈ, గృహరుణ వడ్డీ, ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. రూ.7.50లక్షల లోపు ఆదాయం (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్న వారు ఈ పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి పన్ను వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ పన్ను విధానం ఉత్తమమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను వెబ్సైట్లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలివే..పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫారం-16, ఫారం 26ఏఎస్, వడ్డీ ఆదాయం, డివిడెండ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి రుణం వడ్డీ, ఇతర పెట్టుబడుల ఆధారాలు దగ్గర ఉండాలి. ఫారం-16, రిటర్నులను దాఖలు చేసిన రశీదుతో పాటు పెట్టుబడులు, ఇతర పత్రాలన్నింటినీ కలిపి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వీటిని వెంటనే తీసుకునేందుకు వీలవుతుంది.ఫారం-16: మీ జీతభత్యాలు, మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్)కు సంబంధించిన వివరాలతో యాజమాన్యం అందించే పత్రం ఇది. దీని ఆధారంగానే ఉద్యోగులు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఫారం 26ఏఎస్: ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన అన్ని ఆదాయాలు, టీడీఎస్, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) వివరాలు ఇందులో తెలుస్తాయి. మీ ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పోల్చి చూసుకోవాలి.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్): వేతనం, ఇతర మార్గాల్లో ఆర్జించిన ఆదాయాలతోపాటు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు మొదలైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఏఐఎస్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆదాయాల ఆధారంగానే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఫారం ముందుగానే కొంత మేర నింపి ఉంటుంది. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
పన్నుదారులకు అందుబాటులో ఐటీఆర్ ఫారాలు
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2024, ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) 1, 2, 4, 6 ఫారాలు అందుబాటులో ఉన్నాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు 23,000 రిటర్న్‌లు దాఖలయ్యాయని తెలిపింది. 2024-25 మదింపు సంవత్సరానికి (2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఐటీఆర్ దాఖలు అవకాశాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు వాడే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కంపెనీలు కూడా ఐటీఆర్-6 ద్వారా ఏప్రిల్ 1 నుంచే రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఐటీ విభాగం అవకాశం కల్పించడం ఇటీవలి కొన్నేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిబంధనల సరళీకరణ, పన్ను చెల్లింపు సేవల సులభతరం దిశగా ఇది ఓ కీలక అడుగుగా చెప్పొచ్చు. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లు వాడుతారు. ఐటీఆర్-2 ఫారంను నివాస స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఆర్జించే వాళ్లు దాఖలు చేస్తారు. -
ఐటీ రిటర్న్స్‌లో తప్పులు.. ట్యాక్స్ పేయర్లకు అప్డేట్
ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. -
పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా విస్తరిస్తుండటమే కాక అవి ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2019–20 నుంచి 2022–23 మధ్య కాలంలో రాష్ట్రంలో కొత్తగా 18.3 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం.. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేస్తుండడం ఐటీ రిటర్నుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత గడిచిన మూడేళ్ల కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్ 12.7 లక్షలు, గుజరాత్ 8.8 లక్షలు, రాజస్థాన్ 7.9 లక్షలు చొప్పున ఐటీఆర్ పెరిగాయి. కానీ, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్నుల సంఖ్య 11.7 లక్షలు తగ్గడం గమనార్హం. ఎంఎస్ఎంఈలు 1.93లక్షల నుంచి 6.6 లక్షలకు.. ఇక అసంఘటిత రంగంగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని సంఘటితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2020న ఎంఎస్ఎంఈ యూనిట్ల నమోదు కోసం ఉద్యమ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ వంటి అనేక సౌలభ్యాలు ఉండటంతో ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530గా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు 6.6 లక్షలు దాటినట్లు ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా 2.18 కోట్ల ఎంఎస్ఎంఈలు కొత్తగా రిటర్నులు దాఖలు చేయడానికి దోహదపడినట్లు ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఇక మొత్తం పెరిగిన ఐటీఆర్‌ల్లో 60 శాతం తొలి ఐదు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 4.1 లక్షలకు దాటడం కూడా రిటర్నులు దాఖలు పెరగడంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలవల్ల రానున్న కాలంలో ఈ రిటర్నులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం.. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ రిస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో చేయిపట్టి నడిపించడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి పునరుజ్జీవం కల్పించడంతో కొత్త యూనిట్లు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి వాటిని ఆదుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీపడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.118 కోట్లతో ‘ర్యాంప్’కార్యక్రమాన్ని చేపట్టింది. -
ఏపీలో ఉద్యోగులు పెరిగారు.. ఆదాయం పెరిగింది! ఇవిగో లెక్కలు
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రంగాల్లో ఉద్యోగులు పెరిగారు. వారి సంపాదన, ఆదాయం పెరిగింది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు. ఇన్కమ్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఆధారంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( SBI ) తాజా నివేదిక వెల్లడించిన గణాంకాలివి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. కొత్తగా ఏమీ రావట్లేదు.. యువత బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారంటూ అరకొర, అసత్య విమర్శలు చేసేవారికి ఈ గణాంకాలు చెంపపెట్టు. అసెస్మెంట్ సంవత్సరం 2020 నుంచి 2023 మధ్య కొత్తగా పన్ను దాఖలు చేసినవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 18 లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అసెస్మెంట్ ఇయర్స్ 2020 నుంచి 2023 మధ్య కాలంలో దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం మూడేళ్లలో కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 18 లక్షలు ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర (13.9 లక్షలు), ఉత్తరప్రదేశ్ (12.7 లక్షలు), గుజరాత్ (8.8 లక్షలు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇతర దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సంఖ్య తమిళనాడులో 4 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రతికూల వృద్ధిని సాధించింది. ఈ కాలంలో 12 లక్షల మంది ఐటీఆర్ ఫైలర్లు తగ్గిపోయారు. పెరిగిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈపీఎఫ్ ఖాతాల ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఏపీలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాల్లో చేరినట్టు రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గతేడాది డిసెంబర్ 22న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, వారి ఆదాయాలు పెరిగినట్లు చట్టబద్ధమైన కేంద్ర సంస్థల గణాంకాలు చెబుతుంటే.. కొందరు మాత్రం పనికట్టుకుని ఏపీపై విష ప్రచారం చేస్తున్నారు. ఆదాయాలు పెరిగితేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తారు. వీరిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు ఈపీఎఫ్ ఖాతాల ఆధారంగా కేంద్ర మంత్రి సైతం వెల్లడించారు. ❑ Post the release of SBI Research report on 15 August 2023 ('Deciphering emerging Trends in ITR Filing: The Ascent of the new Middle Class in circular migration') compiled with limited data available then, Income Tax department subsequently released granular data of taxpayers’… — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) January 8, 2024 విద్యుత్తు శాఖలో ఇలా.. వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728 2019లో తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 1,05,869 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 13,136 రెండు విడతల నోటిఫికేషన్ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529 తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని గతంలో సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని గతంలో సీఎం చెప్పారు. ఇవికాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83–84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని వివరించారు. ఆర్బీఐ నివేదికలోనూ.. చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గినట్లు ఆర్బీఐ ఇదివరకే తెలిపింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని పేర్కొంది. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్ : ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు!
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్ ఫైలింగ్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఐటీఆర్-2, ఐటీఆర్ -3 ఫారమ్స్ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఆడిట్ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్ 31, 2024 లోపు ఐటీఆర్-3 ఫైల్‌ను తప్పని సరిగా చేయాలని కోరుంది. ఐటీఆర్-2 ఫైలింగ్ ఎవరు చేయాల్సి ఉంటుంది? ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్‌పోర్టల్ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్‌యూఎఫ్.. అంటే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్‌యూఎఫ్‌కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్ కట్టేవారు ఐటీఆర్-2ని తప్పని సరిగా ఫైల్ చేయాలి. ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-2లో మార్పులు రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. -
దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది. ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి. -
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
వారికి ఐటీ శాఖ ఫైనల్ వార్నింగ్!
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. ఆలస్యమైన లేదా సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు ఐటీ శాఖ అవకాశం కల్పించింది. ఇంక రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. ఐటీఆర్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. అవసరమైన సమాచారం కోసం వెబ్సైట్ లింక్‌ను అందించింది. ఎవరు చేయాలి? ఎవరెవరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, విద్యుత్ బిల్లుల కోసం 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా? ఎవరైనా నిర్దిష్ట సమయంలోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే, వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే ఇందు కోసం ప్రత్యేక ఫారం ఉండదు. పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి నోటిఫై చేసిన ఫారాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమౌతుంది? ఆలస్యమైన ఐటీఆర్ కూడా ఫైల్ చేయకపోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు. సెక్షన్ 234A కింద వడ్డీ విధించడం, సెక్షన్ 234F కింద రుసుము, 10A, 10B సెక్షన్ల కింద మినహాయింపులకు అనర్హత వంటి ఎదురుకావచ్చు. దీంతోపాటు చాప్టర్ 6-A పార్ట్ సి కింద తగ్గింపులు అందుబాటులో ఉండవు. సెక్షన్ 234F కింద రూ.5,000 (చిన్న పన్ను చెల్లింపుదారులకైతే రూ.1,000) జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపులకు సెక్షన్ 234A కింద నెలకు 1 శాతం చొప్పున జరిమానా వడ్డీ వర్తిస్తుంది. ఇక దాఖలు చేసిన ఐటీఆర్‌లు 30 రోజులలోపు వెరిఫై కావడం కూడా చాలా కీలకం. వెరిఫై కాని ఐటీఆర్ ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని సూచిస్తున్నాం. Kind Attention Taxpayers! Here's your last and final call to file your ITR for A.Y. 2023-24 by 31st December, 2023. Hurry!#FileNow. For more information, please visit https://t.co/uv6KQUbXGv pic.twitter.com/DxMV5Xzu0e — Income Tax India (@IncomeTaxIndia) December 29, 2023 -
ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?
Income tax department: మీరు ట్యాక్స్ పేయరా..? ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది? పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్ పేయర్స్‌కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో సహా పలు ఏజెన్సీలు. "ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్‌లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్‌లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది. Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them. Taxpayers may pl note that such communication is to facilitate the taxpayers & make them aware of the information… — Income Tax India (@IncomeTaxIndia) December 26, 2023 -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్‌లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్‌లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్‌కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
చారిటబుల్ ట్రస్ట్‌లకు ఐటీఆర్ గడువు పెంపు
న్యూఢిల్లీ: చారిటబుల్ ట్రస్ట్‌లు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంస్థలకు సంబంధించి, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ సంస్థలు ఐటీఆర్–7 దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 గడువు కాగా, ఒక నెల అదనంగా నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు సమర్పించేందుకు ఫండ్, ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ లేదా విద్యా సంస్థలు, మెడికల్ ఇన్స్టిట్యూషన్లకు నవంబర్ 30 వరకు గడవును పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. -
ఐటీఆర్ వెరిఫికేషన్! ఐటీ డిపార్ట్మెంట్ ఈ మెసేజ్చూశారా? లేదంటే?
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ-ఫైలింగ్ ప్రాసెస్‌ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్‌ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000; రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ-వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ-వెరిఫై వద్దనుకుంటే ఫారం-Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్‌కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్‌ను వెంటనే ఆధార్‌తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్‌పోస్ట్‌లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు .. డిపార్ట్మెంట్ వారు. Dear Taxpayers, Complete the e-filing process today! Please find below the modes of e-verification of return. Remember to verify your ITR within 30 days of filing. Delayed verification may lead to levy of late fee in accordance with provisions of the Income-tax Act, 1961.… pic.twitter.com/bu7jrXLFNH — Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023 -
IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!
IT Refund Scam: ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు ఒక ఎత్తయితే.. రిఫండ్ రావడం మరో ఎత్తు. రిటర్న్స్ దాఖలు యుగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్‌లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఏమిటీ మెసేజ్ దీనిక థ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదీ స్కాం ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి.ఎందుకంటే ఇది సైబర్ నేరస్తులకొత్త ఎత్తుగడ.వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి) A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck ✔️ This claim is 𝐅𝐚𝐤𝐞. ✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message. ✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg — PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 రీఫండ్ ఎలా వస్తుంది? ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి. రీఫండ్ ఎపుడు వస్తుంది? ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను అమలు చేసింది. ఎలా చెక్ చేసుకోవాలి? యూజర్ ID, పాస్వర్డ్, పుట్టిన తేదీ / ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు. -
రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్‌లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్–జూన్ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్ మీడియా ప్రచారం, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. పెరిగిన కోటీశ్వరులు రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు. 2020–21 అసెస్మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్‌లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
6.50 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య 6.50 కోట్లకు చేరింది. వేతన జీవులు, ఆడిటింగ్ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇందులో 36.91 లక్షల ఐటీఆర్‌లు 31వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు నమోదయ్యాయి’’అంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది.పన్ను ఎగవేతకు రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, నిబంధనలను అనుసరించే వారు పెరగడంతో పన్ను చెల్లింపుదారుల బేస్ విస్తృతం అవుతున్నట్టు పన్ను నిపుణులు అభిప్రా యపడుతున్నారు. డేటా అనలైటిక్స్, ఇతర సమాచారం ఆధారంగా అధిక రిస్క్ కేసులను ఆదాయపన్ను శాఖ గుర్తించి, వారికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ సమీకరించి, విశ్లేíÙస్తున్నట్టు చెప్పారు. -
దేశంలో అందరి కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేదెవరో తెలుసా?
India’s highest taxpayer: దేశంలో ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ (Income tax) రిటర్న్ ఫైలింగ్ హడావుడి నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లందరూ ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేయడంలో బిజీలో ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువు జులై 31తో ముగియనుండగా జులై 30 వరకు వరకు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను ఎవరు కడుతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తి ఉండవచ్చు. అంబానీ, అదానీనో లేదా టాటా, బిర్లానో కడుతుంటారులే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టేది వీళ్లెవరూ కాదు.. అసలు బిజినెస్మెన్లే కాదు.. మరి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్. అక్షయ్ కుమార్ 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ సంవత్సరం ఆయన తన వార్షిక ఆదాయాన్ని రూ. 486 కోట్లుగా ప్రకటించారు. అంతకుముందు కూడా ఆయనే.. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ని నడుపుతున్నారు. ఇక వివిధ బ్రాండ్ల ఎండార్స్మెంట్ల నుంచి కూడా చాలానే ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అక్షయ్ కుమారే హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్ కావడం విశేషం. ఆ సంవత్సరంలో ఆయన రూ. 25.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి బిజినెస్మెన్ల పేర్లు చెబుతారు. కానీ వారెందుకు టాప్ ట్యాక్స్ పేయర్ల జాబితాలో లేరు అను సందేహం చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానం.. ఆ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత ఆస్తులు లేవు. అన్నీ వారి కంపెనీల పేరుతోనే ఉంటాయి. కాబట్టి ఆదాయాలు కూడా వారి కంపెనీల వాటాకు వెళ్తాయి. ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్‌కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు -
గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది?
2023- 24 సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. పలు నివేదికల ప్రకారం.. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫైలింగ్ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్ పోర్టల్ పనితీరు బాగుంది. ఫైలింగ్ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చు’ అని ట్వీట్ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్ జులై 31లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ ఫీ పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే లేట్ ఫీ రూ.5,000 చెల్లించాలి. అనతరం డిసెంబర్ 31లో మరో సారి ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు లేట్ ఫీ ఛార్జీలు వర్తించవు. . వడ్డీ ఒకవేళ, రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్ పేయర్స్ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్ రిలీఫ్/ట్యాక్స్ క్రెడిట్ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు. ట్యాక్స్ మినహాయింపు ఉండదు నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోలేము. జరిమానా, జైలు శిక్ష జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ట్యాక్స్ రిఫండ్ లేనట్లే టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే.. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే..
ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి ➤ Income Tax Refund: ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్ పేయర్ ట్విటర్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్‌లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు Dear @NeeleshTax, The e-filing portal is working fine. May we request you to write to us at orm@cpc.incometax.gov.in detailing the specific issue you've encountered (along with PAN, your mobile no. & a screenshot of the error). Our team will get in touch with you. — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
5.83 కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
2022-23 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 5.83 కోట్ల ట్యాక్స్ రిటర్న్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ట్యాక్స్ ఫైలింగ్‌కి ఈ రోజే చివరి రోజు కావడంతో పన్ను చెల్లింపు దారులు ఈ-ఫైలింగ్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ రోజు (జూలై 30) మధ్యాహ్నం 1 గంటల వరకు 5.83 కోట్ల ఐటీఆర్‌లు ఫైలింగ్ జరిగాయని ఆదాపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. దీంతో గత ఏడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటింది అని ఐటీ శాఖ ట్వీట్లో పేర్కొంది. . ఆదాయపు పన్ను రిటర్నుల గణాంకాలను అందిస్తూ.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు 46 లక్షలకు పైగా ఫైలింగ్ చేసినట్లు తెలిపింది. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్లు జరిగాయి. గడిచిన గంటలో 3.04 లక్షల ఐటీఆర్‌లు దాఖలు చేయబడ్డాయి” అని ఐటీ శాఖ మధ్యాహ్నం 02:03 గంటలకు ట్వీట్ చేసింది. 📢 Kind Attention 📢 Here are some statistics of the Income Tax Returns filed. 5.83 crore #ITRs have been filed till 1 pm today (30th July) crossing the number of ITRs filed till 31st July, last year. We have witnessed more than 46 lakh successful logins till 1 pm today and… — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా?
ఆదాయపు పన్ను రీఫండ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వేగంగా మారింది. ట్యాక్స్ రీఫండ్ల కోసం వారాల పాటు వేచి ఉండాల్సి పని లేదు. 2023-24 అసెస్మెంట్ ఇయర్‌కు గానూ ఇటీవల తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసిన చాలా మందికి కొన్ని రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లు ఓ పన్ను చెల్లింపుదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన నిర్ణయ్ కపూర్ అనే ట్విటర్ యూజర్ తన ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ స్క్రీన్షాట్లను షేర్ చేశారు. ట్యాక్స్ రీఫండ్‌ను ఇంత వేగంగా ప్రాసెస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు. నిర్ణయ్ కపూర్ జూలై 27 ఉదయం తన ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయగా అదే రోజు సాయంత్రంలోగా ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెసింగ్‌లో వేగం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఐటీఆర్‌లు దాఖలు చేసిన ఒక్కరోజులోనే ప్రాసెస్ చేయడం గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారు రిఫండ్ ప్రాసెసింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్యాక్స్ నిపుణలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా మారిందని, పన్ను చెల్లింపుదారులు ముందస్తు రీఫండ్‌కు అర్హులు కావాలంటే వీలైనంత త్వరగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా మందికి తెలియని మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్‌పై నెలకు 0.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుందని తెలిసిందే. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసినప్పటి నుంచి ఇది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రయోజనం పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31. కాగా జూలై 27 వరకు, 5 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. అలాగే ఇప్పటికే 2.69 కోట్ల వెరిఫైడ్ ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. -
ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?
ITR filing deadline July 31: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని విధి. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నప్పటికీ, ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. జరిమానా జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే వరకు గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది. (బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్) అప్డేటెడ్ రిటర్న్స్ సెక్షన్ 139(8A) ప్రకారం అప్డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టింది. అయితే, సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని ఫైల్ చేయవచ్చు. ప్రాసిక్యూషన్, జైలు శిక్ష? అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైల్ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ITRను అస్సలు ఫైల్ చేయకపోతే, వారు ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరంలోని నష్టాలను ముందుకు తీసుకెళ్లలేరు. అలాగే, అసెస్డ్ ట్యాక్స్‌లో కనిష్టంగా 50 శాతం లేదా అసెస్డ్ ట్యాక్స్‌లో గరిష్టంగా 200 శాతం పెనాల్టీ విధించవచ్చు. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం వేతన జీవులను ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది. కాగా ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు శరవేవంగా జరుగుతోందనీ, సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఐటీ రిటర్న్స్‌లో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్‌గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
ఎడతెగని వర్షాలు: ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు మరో నెల పొడిగింపు?
ITR filing 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. మరో తొమ్మిది రోజుల్లో అంటే జూలై 31 నాటికి ఈ గడువు ముగియనుంది. అలాగే డెడ్‌లైన్ ముగిసేలోపు, రిటర్న్స్ దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా ఇప్పటికే సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది గడువు పెంపు ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. గతంలో, ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది. అలాగే ప్రస్తుత వరదలు, అనిశ్చిత వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) మరోవైపు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ గడువును ఒక నెల పెంచాలంటూ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో వరదల కారణంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ సహా చాలా ఆఫీసులు పనిచేయ లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) కాగా ఐటీఆర్ ఫైలింగ్ పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఇక మీ పప్పులుడకవ్..వేతన జీవులకు కేంద్రం హెచ్చరిక!
వేతన జీవులకు అలెర్ట్. కేంద్ర ఆర్ధిక శాఖ విభాగానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం కృత్తిమ మేధ (artificial intelligence)ను ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో (ఐటీఆర్) తప్పుడు సమాచారం అందించినా, ఫైలింగ్‌లో తప్పులు దొర్లినా, ఇంటి రెంట్ చెల్లిస్తున్నామంటూ ఇతర కుటుంబసభ్యుల పేర్ల మీద ఫేక్ రెంట్ రిసిప్ట్లు తయారు చేసినా, తప్పుడు విరాళాలు ఇస్తున్నట్లు తేలినా, అనుమానాస్పద రుణాలతో పాటు ఇంకా ఇతర అనైతిక పద్ధతుల్ని గుర్తించనుంది. ఫైలింగ్ సమయంలో జరిగే లోపాల్ని గుర్తించేలా ఏఐని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవల, ఐటి అధికారులు ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లకు సంబంధించి ఆధారాలు చూపించాలని శాలరీ ఉద్యోగులు నోటీసులు జారీ చేసింది. వారిలో సెక్షన్ 10 (13ఎ) కింద ఇంటి అద్దె అలవెన్స్ కింద మినహాయింపులు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఐటి చట్టంలోని సెక్షన్ 24 (బి) కింద మినహాయింపులు, అధికారిక విధులను నిర్వహించేలా ఉద్యోగుల(హెల్పర్)ను నియమించుకున్నట్లు సెక్షన్ 10 (14) కింద అలవెన్స్‌ల కోసం ఐటీఆర్ ఫైలింగ్ చేసిన ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిని కనిపెట్టేలా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. కొద్ది మొత్తంలో పన్ను చెల్లించే శాలరీడ్ ఉద్యోగులు ఐటీఆర్ ఫైలింగ్‌లో మోసాలకు పాల్పడితే తమని ఎవరు గుర్తిస్తారు? అనే ధోరణిలో ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. కాబట్టి ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో వేతన జీవులు నిబంధనలకు లోబడి ఫైలి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి : అమెజాన్ కొత్త పాలసీ.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో!, ఆందోళనలో ఉద్యోగులు -
మూడు కోట్లు దాటిన ఐటీఆర్‌లు
న్యూఢిల్లీ: గడువు సమీపిస్తుండడంతో ఆదాయపన్ను రిటర్నులు అధిక సంఖ్యలో దాఖలవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91 శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు నమోదు చేయడానికి గడువు జూలై 31తో ముగియనుంది. ఆడిట్ అవసరం లేని వారందరికీ ఇదే గడువు వర్తిస్తుంది. ఈ ఏడాది గడువు పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ స్పష్టం చేయడం గమనార్హం. -
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్‌లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్
ఐటీ రిటర్నులకు తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆదాయ పన్ను శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ('చట్టం') కింద ఆదాయాన్ని తప్పుగా నివేదించడం , తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేస్తే కఠినమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇందులో నేరం రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, పన్ను మీద 200 శాతంజరిమానా ఉంటుందని ప్రకటించింది. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పీఐబీ తెలంగాణా ట్విటర్ హ్యాండిల్ ఒక ట్వీట్ షేర్ చేసింది. ఇదీ చదవండి: ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు ప్రక్రియ గడువు జులై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపు దారులంతా ఐటీఆర్ ఫారంలో కచ్చితంగా సరైన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తప్పుడు వివారాలు సమర్పించినా, డిడక్షన్లు తప్పుగా చూపించినా, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. తప్పుడు వివారాలు ఇచ్చినట్లు రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, 200 శాతం పెనాల్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాదు న్యాయపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి) కాగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు పాత లేదా కొత్త విధానంలో ఒక దాన్ని ఎంపిక చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్, ప్యాన్, ఫాం-16, బ్యాంకు స్టేట్ మెంట్లు, ఫారం 26 ఏఎస్, పెట్టుబడి ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్, సేల్ డీడ్, డివిడెండ్ వారంట్స్ వంటి పత్రాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. Under the Income-tax Act,1961 (the 'Act') there are stringent consequences of misreporting of income and claiming wrongful deductions Those include interest @ 12% /yr, penalty @ 200% of taxes, prosecution which may entail imprisonment -Pr Chief Commissioner, @IncomeTax_APTS pic.twitter.com/2qGQwSG6op — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) July 10, 2023 -
గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు గడువు దగ్గర పడుతోంది. మీ ఆదాయం, పన్ను పరిధిలోకి వచ్చినా రాకపోయినా, రిటర్న్స్ దాఖలు దాఖలు చేయడం చాలా అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్వల్ల వచ్చే లాభాలు, ఇతర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆదాయం,పెట్టుబడులను వెల్లడించేందుకు ఆదాయ పన్ను శాఖకు ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా 5 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. గడువుకు ముందే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడం ఖచ్చితంగా అవసరం. కొత్త బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం మీరు ఏ విధానం కిందికి వస్తారో గుర్తించి సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవాఇ. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేసిన 30 రోజులలోపు వెరిఫై చేయడం ముఖ్యం. రిటర్న్ ధృవీకరించబడకపోతే, అది చెల్లనిదిగా పరిగణించ బడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు , హోమ్ లోన్ వడ్డీలు ప్రామాణిక తగ్గింపులకు అర్హులు. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇలాంటి వాటిని క్లెయిమ్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆదాయపు పన్ను ఫైలింగ్ పోర్టల్‌లో ఎలాంటి పొరపాటు దొర్లకుండా మన బ్యాంకు ఖాతా నంబరును జోడించాలి. తద్వారా రీఫండ్ క్రెడిట్లో సమస్యల్ని నివారించవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైలింగ్ ద్వారా, పెనాల్టీలను నివారించవచ్చు . టాక్స్ రిఫండ్ కోసమే కాకుండా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఒకవేళ చెల్లించిన పన్ను మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మించి ఉంటే, దాన్ని రీఫండ్ రూపంలో క్లెయిం చేసుకోవచ్చు. వీసా జారీలో సమస్యల్లేకుండా ఉండాలంటే: ఉద్యోగరీత్యానో మరో కారణంగానో విదేశాలకు ఎగిరి పోవాలనుకుంటే వీసా ఖచ్చితంగా కావాలి. మరి అలాంటి వీసాకు దరఖాస్తు సమయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే వీసా పని ఈజీ అవుతుంది. ఆదాయ నిర్ధారణగా: ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు, బిజినెస్ అవసరాల్లో ఆదాయ పన్ను శాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈజీగా బ్యాంకు లోను కావాలంటే: అంతేకాదు ఐటి రిటర్న్స్ దాఖలు పూర్తి చేసి ఉంటే వ్యక్తిగత లోన్లతో పాటు, భారీ మొత్తంలో బ్యాంకు రుణం పొందడం కూడా సులువు. బీమా కవర్: అలాగే ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసినపుడు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ వివరాలను చాలా వరకు బీమా సంస్థలు డిమాండ్ చేస్తాయి -
ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి?
జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైంది. ఎప్పటి నుంచో పొడించుకుంటూ వస్తున్న ఆధార్-పాన్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీతో ముగిసిపోయింది. ఇక పొడిగింపు ఉండదని ఆదాయపు పన్న శాఖ తేల్చి చెప్పేసింది. అయితే జూలై నెలలో పూర్తి చేయాల్సిన ఫినాన్సియల్ డెడ్లైన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఐటీఆర్ దాఖలు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 ఆఖరు తేదీ. గడువు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందడం సహజం. అయితే ఫారమ్ 16, 26AS, వార్షిక సమాచార స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వడ్డీ, మూలధన లాభాల స్టేట్మెంట్ వంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, తరచుగా చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులువుగా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో హడావుడి తప్పులకు దారితీస్తుంది.ఆదాయపు పన్ను రిటర్న్‌ను సంబంధిత డాక్యుమెంట్లు జోడించకుండా ఫైల్ చేయడం వలన తక్కువ రిపోర్టింగ్‌కు దారి తీయవచ్చు. దీనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఆఖరు వరకు వేచి ఉండకుండా కాస్త ముందుగానే ఐటీఆర్ ఫైల్ ఉత్తమం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువును జూలై 11 వరకు పొడిగించింది. అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్లను ఆన్లైన్ ద్వారా ఎంచుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉద్యోగి UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వంటి నిర్దిష్ట వివరాలను అందించాలి. దరఖాస్తు ధ్రువీకరణ కోసం ఉద్యోగి ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, చందా సమాచారంతో కూడిన మునుపటి క్రియాశీల పీఎఫ్ లేదా పెన్షన్ ఖాతాల గురించిన సమాచారాన్ని అందించాల్సిన అప్లికేషన్ తదుపరి పేజీకి వెళ్తారు. ఇక్కడ సమాచారంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయ్యాక ఒక రసీదు సంఖ్య వస్తుంది. దాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం దాచుకోవాలి. అధిక పెన్షన్ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్‌వో లింక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా.. -
కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
ఐటీ నోటీసులను లైట్ తీసుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి..
పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు పాల్పడకుండా ఆదాయపు పన్ను శాఖ నూతన మార్గదర్శకాలతో పట్టు బిగించింది. ఐటీ శాఖ పంపించే నోటీసులను లైట్ తీసుకునేవారి పట్ల కఠిన వైఖరి అవలంభించనుంది. నోటీసులకు స్పందించనివారు పూర్తి స్క్రూటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను ఎగవేత చర్యలను కట్టడి చేయడంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త చర్యలను చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ నోటీసులకు స్పందించని పక్షంలో ఐటీ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు కూడా లోతుగా పరిశీలించనున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయంలో వ్యత్యాసాలను గుర్తించిన ఐటీ అధికారులు జూన్ 30లోగా ఐటీ చట్టం సెక్షన్ 143(2) కింద రెండో నోటీసు పంపుతారు. అలాగే సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు అందుకున్న వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఐటీ శాఖ పరిశీలిస్తుంది. స్క్రూటినీకి మార్గదర్శకాలు ఐటీ శాఖ పరిశీలనకు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ సీబీడీటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏవైనా చట్టబద్ధమైన సంస్థల నుంచి పన్ను ఎగవేతను సూచించే నిర్దిష్ట సమాచారం అందిన సందర్భంలో ఆ కేసులను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది. ఆ పన్ను చెల్లింపుదారు సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌కు ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నోటీసుకు స్పందనగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, సెక్షన్ 148 కింద నోటీసులు అందుకున్న సందర్భంలోనూ ఐటీ శాఖ పరిశీలన చేపడుతుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 142 (1) కింద నోటీసుపై రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తుంది. రిటర్న్ దాఖలుకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ ఈ సెక్షన్ 142(1) కింద నోటీసు జారీ చేస్తుంది. 2021 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత ఐటీ శాఖ సోదాలు చేసి సీజ్ చేసి ఉంటే అటువంటి వారు కూడా స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 1023(C) మొదలైన వాటి కింద ఐటీ శాఖ ఆమోదించకపోయినా పన్ను మినహాయింపు లేదా తగ్గింపును క్లెయిమ్ చేసిన వారిపై కూడా విచారణ ఉంటుంది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! -
IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఐటీఆర్ ఫారమ్‌లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్ యుటిలిటీ షీట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు.. తర్వాత ఏం చేయాలంటే?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధిం ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. సాధారణంగా జూలై 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ఈపీఎఫ్, పీపీఎఫ్, బీమా ప్రీమియం చెల్లింపులు, మూలధన లాభాలు అన్నింటినీ ఒక పేపర్‌పై రాసి పెట్టుకుంటే రిటర్నులను సులభంగా దాఖలు చేయవచ్చు. పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలమో కూడా మదింపు వేసుకోవాలి. అయితే, రిటర్నులు సమర్పించడంతోనే పని పూర్తయినట్టు అనుకోవద్దు. రిటర్నులు దాఖలు తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం. రిటర్నులు ధ్రువీకరణ రిటర్నులు దాఖలు చేసిన ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటర్నులు విజయవంతంగా సమర్పించినట్టు అవుతుంది. ధ్రువీకరించకపోతే అవి మదింపునకు వెళ్లవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రిటర్నులు చెల్లుబాటు కూడా కావు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరించేందుకు 120 రోజుల గడువు ఉంటుంది. ఆలోపు ఎప్పుడైనా చేయవచ్చు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ కాపీని ప్రింట్ తీసుకుని, దానిపై సంతకం చేసి లేదంటే ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్సైట్ నుంచి ఫామ్ 5ను డౌన్లోడ్ చేసుకుని బెంగళరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయవచ్చు. కొరియర్ ద్వారా చేయకూడదు. ఆన్‌లైన్‌లోనూ వెరిఫై చేయవచ్చు. పోస్ట్ ద్వారా పంపించడం కంటే ఇది ఎంతో సులభ విధానం. నెట్‌బ్యాంకింగ్ అకౌంట్ లేదంటే ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది ఎంపిక చేసుకుంటే ఆ రూపంలో మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఆదాయపన్ను శాఖ పోర్టల్‌పై నమోదు చేయడం ద్వారా రిటర్నులను వెరిఫై చేయవచ్చు. వెరిఫికేషన్‌కు సంబంధించి ఎలక్ట్రానిక్ కోడ్‌ను బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా పొందొచ్చు. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సేవలను అందిస్తున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డును స్వైప్ చేసి, పిన్ నంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ‘జనరేట్ ఈవీసీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్’ను ఎంపిక చేసుకోవాలి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులై, పాన్ నంబర్ ఇచ్చి ఉన్న వారికే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏబీ కింద పుస్తకాలను ఆడిట్ చేయించుకోవాల్సిన వారు రిటర్నులు దాఖలు చేసిన వెంటనే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు రిటర్నులు వేసి, 120 రోజులు అయినా వాటిని వెరిఫై చేయలేదనుకుంటే.. అప్పుడు కండోనేషన్ ఆఫ్ డిలే సర్వీస్ రిక్వెస్ట్ సమర్పించాలి. తగిన కారణాన్ని పేర్కొనాలి. ఆదాయపన్ను శాఖ కండోనేషన్ రిక్వెస్ట్‌ను ఆమోదిస్తే అప్పుడు రిటర్నులను వెరిఫై చేయవచ్చు. లేదంటే రిటర్నులు దాఖలు చేయనట్టుగానే ఆదాయపన్ను శాఖ పరిగణిస్తుంది. తిరిగి రిటర్నులను దాఖలు చేయాల్సిందే. లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే, దానిపై వడ్డీ కూడా పడుతుంది. తప్పులు దొర్లితే? ఆదాయ పన్ను రిటర్నులను గడువులోపు సమర్పించిన వారు, అందులో తప్పులు దొర్లితే సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. దాఖలు చేసిన రిటర్నులు ఇంకా ప్రాసెస్ చేయకపోతే రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు. ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తాజా రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. సవరించిన రిటర్నుల పత్రంలో మొదటిసారి దాఖలు చేసిన అసలు రిటర్నుల అక్నాలెడ్జ్మెంట్ నంబర్, డేట్ కూడా ఇవ్వాలి. అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకు రివైజ్డ్ రిటర్నులు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన రిటర్నుల పత్రాన్ని ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసినట్టయితే సెక్షన్ 143 (1) కింద ఇంటిమేషన్ పంపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్నులు వేయడానికి అనుమతి ఉండదు. ఆలస్యపు రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువు అసెస్మెంట్ సంవత్సరంగా గుర్తించాలి. రిటర్నులు దాఖలు చేసి, దాన్ని ఆదాయపన్ను శాఖ ఇంకా ప్రాసెస్ చేయనట్టయితే గడువులోపు ఎన్ని సార్లు అయినా సవరణలు దాఖలు చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. ఒక్కసారి సవరించిన రిటర్నులు సమర్పించగానే, ముందు దాఖలు చేసినది చెల్లకుండా పోతుంది. తాజా రిటర్నుల పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవకాశం ఉంది కదా అని చాలా పర్యాయాలు సవరించిన రిటర్నులు సమర్పిస్తే అది పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడుతుంది. దాంతో ప్రత్యేక స్క్రూటినీ చేయవచ్చు. ముఖ్యంగా సవరించిన రిటర్నుల్లో పెద్ద మార్పులు ఉంటే తప్పకుండా విస్తృత పరిశీలన ఉంటుంది. మొదటిసారి దాఖలు చేసిన పత్రాల మాదిరిగానే, సవరించిన రిటర్నులనూ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి. రిఫండ్ల సంగతి ఇదీ.. దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ చెల్లించాల్సిన మొత్తానికంటే అదనంగా పన్ను చెల్లింనట్టయితే అప్పుడు రిఫండ్ కోరడం ఒక్కటే మార్గం. యూజర్లు ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డులో ఇది కనిపిస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ పాన్ నంబర్ సమర్పించడం ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ నడుస్తోంది. రిఫండ్లు పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటిమేషన్ అందుకున్న 15 రోజుల్లోగా ఇది సాధ్యపడుతుంది. బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల రిఫండ్లు నిలిపోతుంటాయి. అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్సీ నంబర్లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడికి రావాల్సిన రిఫండ్లు ఆలస్యం అయితే ఒక్కో నెలకు అర శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తారు. టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో పన్నును మినహాయించి ఉంటే లేదా ముందస్తు పన్ను చెల్లించి ఉండి, చివర్లో పన్ను బాధ్యత తగ్గడం వల్ల వెనక్కి తిరిగి రావాల్సి ఉంటే.. అప్పుడు ఏప్రిల్ 1 నుంచి చెల్లించే నాటి వరకు వడ్డీ కూడా లభిస్తుంది. ఐటీఆర్‌లను గడువు తర్వాత దాఖలు చేసిన వారు, ఆ తేదీ నుంచే రిఫండ్‌పై వడ్డీ చెల్లింపులకు అర్హులవుతారు. రిఫండ్‌పై వచ్చే వడ్డీ సంబంధిత ఆర్థిక సంవత్సరం అదనపు ఆదాయం కింద చపించాలి. సరిపోలేకపోతే..? దాఖలు చేసిన రిటర్నుల్లో వివరాల ఆధారంగా చెల్లించాల్సిన పన్నులో వ్యత్యాసం ఉంటే, ఆదాయపన్ను శాఖ పంపించే 143 (1) ఇంటిమేషన్‌లో ఆ వివరాలు ఉంటాయి. పన్ను లెక్కల్లో పొరపాట్లు ఉంటే, అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆదాయపన్ను శాఖ ఈ ఇంటిమేషన్‌లో పేర్కొంటుంది. ఆదాయపన్ను శాఖ వివరాలతో, పన్ను లెక్కలతో ఏకీభవిస్తే అప్పుడు పన్ను చెల్లింపుదారు ఆ మేరకు అదనపు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో పన్ను మినహాయింపులు పేర్కొనడం మర్చిపోయినా.. పన్ను అదనంగా చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. లేదంటే ఆదాయ పన్ను శాఖ అసెసింగ్ ఆఫీసర్ అయినా పొరపాటు పడొచ్చు. లేదా ఎర్రర్ చోటు చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ సమర్పించాలి. అంటే దాన్ని సరిదిద్దాలని కోరడం. ఇంటిమేషన్ పంపించిన నాటి నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా కానీ దీన్ని దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ గుర్తించిన వాటితో మీరు ఏకీభవించకపోవచ్చు. లేదా మీరు పేర్కొన్న వివరాల పరంగానూ ఆదాయపన్ను శాఖ లేవనెత్తిన తాజా డిమాండ్ సమ్మతం కాకపోయినా రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయవచ్చు. ఇలా దాఖలు చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు ఆదాయపన్ను శాఖ స్పందిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు తనవైపు నుంచి అన్ని రకాల వివరాలు సమర్పించినప్పటికీ, పన్ను శాఖ ఏదైనా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనట్టయితే అప్పుడు ‘రీ ప్రాసెస్ ద రిటర్న్’ను ఎంపిక చేసుకోవాలి. టీడీఎస్/టీసీఎస్ లేదా ఐటీ చలాన్లలో దిద్దుబాటు చేయాల్సి ఉంటే అప్పుడు ‘ట్యాక్స్ క్రెడిట్ మిస్వ్యచ్ కరెక్షన్’ రిక్వెస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. సెక్షన్ 234సీ కింద వడ్డీ లెక్కలను సరిదిద్దాల్సి ఉంటే ‘అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 234సీ ఇంటరెస్ట్’ను ఎంపిక చేసుకోవాలి. వాస్తవ రిటర్నుల్లో ఇతర వివరాలను సరిదిద్దాలంటే అప్పుడు ‘రిటర్న్ డేటా కరెక్షన్’ను ఎంపిక చేసుకోవాలి. -
ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?
ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష లోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదు. అయినా ఈ లాభాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలా? – వివేక్ మీరు పన్ను రిటర్నులను నిబంధనల ప్రకారం దాఖలు చేయాల్సి ఉంటే, అందులో లాభ, నష్టాలను వెల్లడించాలి. స్టాక్స్, లేదా ఈక్విటీ మ్యూచుల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చేవి దీర్ఘకాల లాభాలు. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో మూలధన లాభాల పన్ను వివరాలు ఉంటే, అవి పన్ను రిటర్నుల్లో ముందుగానే నింపి ఉంటాయి. ఒకవేళ మీ ఆదాయం బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటే, అప్పుడు మీరు రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. 60 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.3 లక్షలు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. మరింత వివరంగా అర్థం చేసుకునేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ పొందొచ్చు. అప్పుడు పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిందని అనుకుంటే, అప్పుడు రిబేట్ వర్తించదు. అప్పుడు సాధారణ శ్లాబు రేటు ప్రకారం పన్ను వర్తిస్తుంది. అలాగే, పన్ను వర్తించే ఆదాయం ఉంది కనుక రూ.లక్షకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. ఒకవేళ మీ వార్షిక ఆదాయం బేసిక్ పరిమితి లోపే, రూ.2 లక్షలుగానే ఉందని అనుకుందాం. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష మించినప్పుడు.. రూ.50వేల మొత్తాన్ని బేసిక్ పరిమితి కింద మిగిలి ఉంది కనుక చూపించుకోవచ్చు. అన్ని కేసుల్లోనూ దీర్ఘకాల మూలధన లాభాల వివరాలను రిటర్నుల్లో చూపించాల్సిందే. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌కు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం) ప్రయోజనాన్ని తొలగించారని తెలిసింది. నూతన చట్టం అమలుపై స్పష్టత ఇవ్వగలరా? – గణేశన్ ఈ ఏడాది మార్చి 31 వరకు చేసే పెట్టుబడులకు లాభాల్లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నాన్ ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించింది. దీంతో ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారనే దానితో సంబంధం లేకుండా.. డెట్ ఫండ్స్‌లో వచ్చే లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నూతన నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే పెట్టుబడులకే అమలవుతుంది. దీనికంటే ముందు చేసే పెట్టుబడులకు ఇండెక్సేషన్ ప్రయోజనం వర్తిస్తుంది. ఇదీ చదవండి: ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం.. -
Taxpayers-ITR Filing: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్‌లను గడువుకు ముందే సమర్పించాలి. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) ఆలస్యమైతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్‌లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! -
కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు!
ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! 2023 బడ్జెట్ ఏమి చెబుతోంది? ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్లో రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది. (ఇక ఎయిర్‌ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ!) సెక్షన్ 87ఏ కింద రాయితీ ఎవరికి వర్తిస్తుంది? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే. ప్రవాసభారతీయులు (ఎన్నారైలు), హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు వంటి ఈ రాయితీకి అనర్హులు. స్టాండర్డ్ డిడక్షన్ జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది. ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది. రూ. 7.5 లక్షల వరకూ పన్ను లేదు 2023 బడ్జెట్లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పుల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక మినహాయింపుపై గందరగోళం వద్దు 2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారని గందరగోళానికి గురికావద్దు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. -
ఈ వెరిఫికేషన్ కోసం 68వేల ఐటీఆర్‌లు
న్యూఢిల్లీ: రిటర్నుల్లో ఆదాయం తక్కువ చూపించడం లేదా అసలు చూపించకపోవడానికి సంబంధించి ఆదాయపన్ను శాఖ 2019–20 సంవత్సరానికి 68,000 ఐటీఆర్‌లను ఈ–వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లోని వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు మధ్య పోలిక లేకపోతే ఆదాయపన్ను శాఖ ఈ–వెరిఫికేషన్ నోటీసు జారీ చేస్తుంది. దాంతో పన్ను చెల్లింపుదారులు సమాచారం మధ్య పోలిక లేకపోవడంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ–వెరిఫికేషన్ నోటీసులో పేర్కొన్న సమాచారం నిజమేనని పన్ను చెల్లింపుదారులు గుర్తించినట్టయితే సవరించిన రిటర్నులు వేసి, అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాము 68,000 పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వగా.. 35,000 కేసుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదంటే సవరించిన రిటర్నులు వేసినట్టు గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల సవరించిన రిటర్నులు దాఖలయ్యాయని, వీటి రూపంలో రూ.1,250 కోట్లు వసూలైనట్టు చెప్పారు. మరో 33,000 కేసులకు సంబంధించి ఇంకా సమాధారం రాలేదని.. వారు సవరించిన రిటర్నులు (2019–20 సంవత్సరానికి) వేసేందుకు మార్చి 31 వరకు సమయం ఉందన్నారు. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్‌లు) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తెలిపింది. దీంతో అసెస్మెంట్ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్‌లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
అలెర్ట్.. సంస్థలకు ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ పొడిగింపు
ట్యాక్స్ పేయర్స్‌కు ముఖ్య గమనిక. కేంద్ర ఆర్ధిక శాఖ 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి గాను సంస్థల ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన గడువును నవంబర్ 7కు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), ఆదాయం,కార్పొరేట్ పన్ను విషయాలలో అపెక్స్ బాడీ గత నెలలో ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును పొడిగించినందున ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీని కూడా పొడిగించినట్లు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ‘సీబీడీటీ అసెస్మెంట్ ఇయర్ 2022-23 చట్టంలోని సెక్షన్ 139 సబ్-సెక్షన్ (1) కింద సంస్థలు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే గడువు తేదీని అక్టోబర్ 31, 2022.. నవంబర్ 7, 2022 వరకు పొడిగించింది’ అని సీబీడీటీ పేర్కొంది. -
దీపావళికి గిఫ్ట్స్, బోనస్‌లు వచ్చాయా? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరినుంచైనా గిఫ్ట్స్ తీసుకున్నారా? లేదంటే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బోనస్ స్వీకరించారా? అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బహుమతులు వాటి స్వభావాన్ని బట్టి ఈ పన్ను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో పండుగ బహుమతులు, బోనస్‌పై ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఒక సారి చూద్దాం. పండుగ సీజన్ వచ్చిందంటే గిఫ్ట్స్, సాలరీ బోనస్ ఇవన్నీ సర్వ సాధారణం. ఉద్యోగులందుకునే బోనస్‌ను కూడా వేతనంగా భావించే ఆదాయ పన్ను శాఖ వాటిపై పన్ను విధిస్తుంది. వేతనాల ఆధారంగా చెల్లించే బోనస్‌కు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని బహుమతుల విలువను బట్టి , ఎవరి నుండి స్వీకరించారో బట్టి వాటిపై పన్ను విధించే అవకాశం ఉంది. ఈ బహుమతి మినహాయించిన కేటగిరీ కిందకు రాకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసేటప్పుడు దానిని కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. శ్లాబ్ రేటును బట్టి సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాలి. ► ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో స్వీకరించే బహుమతుల మొత్తం విలువ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను వడ్డింపు ఉంటుంది. ► ఈ బహుమతులు నగదు లేదా రకమైన రూపంలో ఉండవచ్చు. అయితే, దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతులపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ► భూమి లేదా భవనం రూపంలో బహుమతులు వచ్చినట్లయితే, వాటిని స్థిరమైన ఆస్తిగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ 50వేల రూపాయలు దాటితే బహుమతిపై పన్ను విధించబడుతుంది. ► అదే సమయంలో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు, పెయింటింగ్‌లు, డ్రాయింగ్లు, షేర్లు/సెక్యూరిటీలు వంటి బహుమతులు, ఇతర వాటితో పాటుగా, చరాస్తుల మార్కెట్ విలువ రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిందే. -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు కనిపించడం లేదా? అప్పుడేం చేయాలి?
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు కనిపించడం లేదా? ఇదేమి ప్రశ్నంటారా? ఇది నిజంగానే చాలా మందిని కలవరపెట్టి, కంగారు పెట్టిన ప్రశ్న.మీరు చెల్లించిన పన్ను చెల్లింపులు ..అడ్వాన్స్ ట్యాక్స్ కానివ్వండి..సెల్ఫ్ అసెస్మెంట్ కానివ్వండి..మీ తరఫున మరో వ్యక్తి చేసిన టీడీఎస్..టీసీఎస్ లాంటివన్నీ మీరు చెల్లించినట్లు .. మీ ఖాతాలోనే పడాలి .. కనిపించాలి. గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించాం. ఫారం 16ఏ. ఇది మీ జాతక చక్రం. ఈ ఫారంలో ఎప్పటికప్పుడు ప్రతీ చెల్లింపు నమోదు అవ్వాలి. డిపార్ట్మెంటు వారు నమోదు చేస్తారు. అందులో కనిపిస్తేనే మీరు చెల్లించినట్లు. ఒకవేళ కనిపించకపోతే కారణాలివే. ►మీరు కట్టినప్పుడు చలాన్ నింపాలి. పాన్ తప్పు రాసినా. పేరు తప్పు రాసినా. అసెస్మెంట్ సంవత్సరం తప్పు రాసినా ఆ వివరాలు పొందుపర్చరు. ►టీడీఎస్, టీసీఎస్ చేసిన వ్యక్తి చేసే తప్పులు పూర్తి సమాచారం రాయకపోవడం,మర్చిపోవడం. ►మీరు మీ పాన్ ఇవ్వకపోయినా ►మీ పాన్ తప్పుగా ఇచ్చినా ►డిడక్ట్ చేసిన వ్యక్తి మీ పాన్ తప్పు రాసినా, అసలు రాయకపోయినా ►మీరు తప్పుడు చలాన్లు వాడినా ►డిడక్టరు తన ఖీఅ తప్పుగా రాసినా, అసలు రాయకపోయినా ► డిడక్టరు తన పాన్ తప్పుగా రాసినా, అసలు రాయకపోయినా పైన జాబితా విశ్లేషిస్తే, ఏ స్థాయిలో ఎవరు తప్పు చేసినా, వివరాలు రాయకపోయినా, ఏ గోల్మాల్ జరిగినా, మీ స్టేట్మెంట్లో తప్పులు దొర్లవచ్చు. ఎంట్రీలు కనపడకపోవచ్చు.అలాంటప్పుడు మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ‘‘అయ్యగారు ఏం చేస్తున్నారు..అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు’’ అన్నట్లు అన్నీ దిద్దుబాటు చర్యలే. దేవుణ్ని పక్కకు జరగమని పూజారిని ఆశ్రయించాలి. మీరే స్వయంగా చలాన్ నింపి బ్యాంకులో చెల్లించినప్పుడు, మీ చేతిలో తప్పులు దొర్లేందుకు అవకాశం ఉంది. బ్యాంకర్లు వాటిని చెక్ చెయ్యరు. చేయలేరు. మీరు తప్పు చేస్తే వారిని ఏమీ అనలేరు. వారు రికార్డుల ద్వారా రిటర్నులు ‘‘టీడీఎస్, టీసీఎస్’’ రూల్స్ ప్రకారం చేయాలి. ఆ రిటర్నులు వేసేటప్పుడు తప్పులు దొర్లితే సరిదిద్దమనండి. కొంత మంది డిడక్టర్లు ‘‘నిదానమే ప్రధానం’’ అని ఆలస్యం చేస్తుంటారు. కొంత మంది పన్ను ఎగవేతదారులు పన్ను చెల్లించకుండా నాటకాలు ఆడుతుంటారు. కొంత మంది మీనమేషాలు లెక్కపెడుతుంటారు. వారిని నిద్రలేపండి. రిటర్నులు కరెక్టుగా వేసేలా చేయండి. వేసిన వాటిలో తప్పులు దిద్దమనండి. అవసరమైన కూర్పులు, మార్పులు, చేర్పులు చేయమనండి. పొరపాటునో, కావాలనో వారు చేసిన తప్పులను మీ గ్రహపాటుగా భావించి, తప్పులు తడకలను మార్చి రిటర్నులలో మీ సమాచారం సరిగ్గా .. సక్రమంగా .. సమగ్రంగా ఉండేలా సరిచూసుకోండి. పన్ను చెల్లింపులు కనిపిస్తాయి. ఇలా చేస్తే మీ జాతకచక్రం సరిగ్గా వేసినట్లు అవుతుంది. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? -
ఆన్లైన్లో రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?
సాక్షి, ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగిసింది. కేంద్రం ఈ సారి గడువు తేదీని పొడిగించకపోవడంతో, గడుపు పొడిగింపు లభిస్తుందిలే అని ఆశించిన పన్ను చెల్లింపుదారులుకునిరాశే ఎదురైంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు కొన్ని హడావిడిగా ఫైల్ చేయడంతో అవాంఛిత తప్పులు దొర్లి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి తప్పులను, పొరబాట్లను సరిదిద్దుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) ప్రకారం రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఉంది. ఇలా మళ్లీ ఐటీఆర్ దాఖలు చేయాలని భావిస్తున్నవారు ఆన్లైన్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. అయితే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ రిటర్న్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2022. రివైజ్డ్ ఐటీఆర్ ఎవరు దాఖలు చేయవచ్చు ఐటీఆర్ దాఖలు చేసిన ప్రతి మదింపుదారుడు సెక్షన్ 139(5) కింద దీన్ని సవరించుకోవడానికిఅర్హులు. ఆలస్యంగా ఐటిఆర్ ఫైల్ చేసిన వారు కూడా, అంటే, గడువు ముగిసిన తర్వాత ఐటిఆర్ ఫైల్ చేయబడితే, రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. రివైజ్డ్ రిటర్న్ ఎలా దాఖలు చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటాను సరిచేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి మీ అకౌంట్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. 'రిటర్న్ ఫైల్ అండర్' కాలమ్‌లో రివైజ్డ్ u/s 139(5) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ అసెస్మెంట్ ఇయర్ ఎంచుకుని సీపీసీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి వాలిడేట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ టైప్ చేసుకోవాలి. రెక్టిఫికేషన్ చేయాల్సి వచ్చిందో కూడా కారణం తెలియజేయాలి. మొత్తం ఆప్షన్లలో గరిష్టంగా 4 కారణాలను మాత్రమే ఎంచుకోవాలి. తర్వాత ట్యాక్స్ క్రెడిట్ మిస్‌మ్యాచ్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఎన్ని సార్లు ఫైల్ చేయవచ్చు రివైజ్డ్ రిటర్న్‌ను ఎన్నిసార్లు ఫైల్ చేయవచ్చో పరిమితి లేదు. అయితే, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఐటీ డిపార్ట్మెంట్ ఆగస్టు 1, 2022 నుండి, ఐటీఆర్‌ని ధృవీకరించడానికి 120 రోజుల ముందు ఉన్న కాల పరిమితిని 30 రోజులకు తగ్గించింది. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. ధృవీకరణకు అందుబాటులో ఉన్న 6 పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. -
ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?
తగిన జాగ్రత్తలు తీసుకుని వేసినా.. యథాలాపంగా వేసినా.. మొక్కుబడిగా వేసినా.. మమ అనిపించినా 31–7–22 నాటికి రిటర్నులు వేయడం జరిగిపోయింది. ఏదేని కారణాన వేయకపోయినా.. ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం వేసినంత మంది ఈసారి వేయలేదు. మరిచిపోయినా.. మానేద్దామనుకున్నా.. ఏదైనా సరే.. రిటర్నులు దాఖలు చేయండి. ఎప్పటికైనా రిటర్ను వేయటమే మంచిది. ప్రస్తుతం మీరు వేసే రిటర్నులను, వేయని వారితో వేయించి (దాఖలు), ఆ తర్వాత వేయించడం (మూకుడులో కాదు).. ఇలా అసెస్మెంట్ ప్రక్రియను సక్రమంగా, సత్వరంగా, సమగ్రంగా, సమిష్టిగా చేపట్టటానికి మొత్తం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సాధారణంగా మీరు ఆన్లైన్లో దాఖలు చేసిన వెంటనే చాలా త్వరగా అసెస్మెంట్ అవుతుంది. ముఖ్యంగా పాన్‌తో అనుసంధానమైన కేసులో 24 గంటల్లోనే రిఫండు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి రెండు మూడు రోజుల్లోనే వారి సెల్‌ఫోన్‌కి ఒక సందేశం వచ్చింది. ‘మీరు వేసిన రిటర్నుని ప్రాసెస్ చేశాం.. అంటే మీ ఇన్‌కం ట్యాక్స్ అసెస్మెంటు పూర్తి చేశాం. మీ రిజిస్టర్డ్ ఈ–మెయిల్‌కి సెక్షన్ 143 (1) సమాచారం పంపుతున్నాం. చెక్ చేసుకోండి. అందకపోతే మీ సిస్టంలో spam (సాధారణంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు పంపే మెయిల్స్) వెళ్లి వెతకండి‘ అని సమాచారం వస్తోంది. కానీ ఈ సందేశం రాగానే, అది చదవగానే అందరూ భయపడుతున్నారు. ఏదో ‘శ్రీముఖం’ వచ్చిందని వాపోతున్నారు. దాఖలు చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే నోటీసా అని నుదురు కొట్టుకుంటున్నారు. ఏమి కొంప మునిగిందిరా అని రామచంద్రుణ్ని తలుచుకుంటున్నారు. అప్పుడే ‘మొదలెట్టావా సీతమ్మ తల్లి’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ గారి మీద శివమెత్తుతున్నారు. ఆగమేఘాల మీద ఆడిటర్గారి దగ్గరికి పరిగెడుతున్నారు. దయచేసి ఏమీ గాభరా పడక్కర్లేదు.ఎందుకంటే .. దీనర్థం ఏమిటంటే.. ►మీరు రిటర్ను వేసినట్లు (మీ బాధ్యత తీరింది) ►సదరు రిటర్ను అసెస్మెంట్ పూర్తయినట్లు (ఈ సంవత్సరం బెడద వదిలింది) ►ఆర్డరు మీ చేతిలో పడినట్లు (ఫైల్లో భద్రపర్చుకోండి) ►ఇది కేవలం సమాచారం మాత్రమే (ఉత్తర్వులు కాదు) ►రిఫండులు రావచ్చు (బ్యాంక్ అకౌంటు చెక్ చేసుకోండి) ►తప్పొప్పులు సరిదిద్దుతారు (సరిదిద్దుకోండి) ►మిమ్మల్ని చెల్లించమంటే, అది నిజమైతే చెల్లించండి ►అది తప్పయితే వివరణతో జవాబులివ్వండి ► ఏ తప్పు లేకపోతే ఆర్డరు ఇవ్వరు ► కొంత మంది కావాలని తప్పు చేసి, ఆర్డరు వచ్చాకా, డిమాండు చెల్లించి హమ్మయ్య అనుకుంటారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్ పోర్టల్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌లైన్ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. పోర్టల్ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్, రకరకాల మీమ్స్‌తో ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately Tax professionals are not machines. They are working under a lot of stress and tension. Fix 31st August for non audit returns for ever. — K K Atal (@kkatal88) July 26, 2022 #Extend_Due_Date_Immediately #incometaxportal Sitting in office trying to download 26AS/AIS/TIS: pic.twitter.com/ciV0pjGLTg — Atish Paliwal (@atishpaliwal22) July 23, 2022 Clients with pending ITRs looking at their CAs : #Extend_Due_Date_Immediately #Extend_Due_Dates pic.twitter.com/N6yI9CSyyA — Yum (@upsehooon) July 24, 2022 Right now:-#Extend_Due_Date_Immediately#IncomeTaxReturn pic.twitter.com/JO5TJuEDwh — Bhavya (@iconic232001) July 26, 2022 -
ITR Filing: మూడేళ్లలో తొలిసారి కేంద్రం ఇలా..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల పైగా ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ సోమవారం వెల్లడించింది. జూలై 25 వరకు 3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆఖరు రోజైన జులై 31 వరకూ ఆగకుండా, వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. గత ఆర్థిక సంవత్సరంలో గడువు తేదీ పొడిగించడంతో డిసెంబర్ 31 నాటికి మొత్తం 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. జూలై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగియనుంది.మరోవైపు ప్రభుత్వం డెడ్‌లైన్ పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు. పెనాల్టీలు లేదా ఇతర చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోకుండా ఉండాలంటేగడువు లోపేఫైల్ చేయాలి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో గడువు పొడిగింపు అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడంలేదు. గడువును పొడిగించకుండా ఉండటం మూడేళ్లలో తొలిసారి కావడం గమనార్హం. (చదవండి: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!) కాగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారని చాలామంది పన్నుచెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా?
సాక్షి,ముంబై: ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల (జూలై,31) చివరి లోపు తప్పనిసరిగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌ను కచ్చితంగా పూర్తి చేయాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ITR ఫైలింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి రూ.2.5లక్షల్లోపు ఉన్న వారుఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరికాదు. ఫైల్ చేయక పోయినా జరిమానా ఉండదు. 60 ఏళ్లు పైబడి 80 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారులకు, ఈ మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 80 ఏళ్లు పైబడిన వారికి పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు ఈ నేపథ్యంలోనే సాధారణంగా చాలామంది ఐటీఆర్ దాఖలును పట్టించుకోరు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఈజీగా బ్యాంక్ రుణం పొందడం, క్రెడిట్ కార్డ్ లేదా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ లాంటి ఇతర లాభాలు న్నాయి. ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు ఈజీగా రుణాలు : ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఐటీఆర్ కీలకం. ఐటీఆర్‌ను బ్యాంకులు, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఆదాయ వనరుకు రుజువుగా భావిస్తాయి. సో.. రెగ్యులర్‌గా ఐటీఆర్ దాఖలు చేస్తూ ఉంటే రుణం పొందడం తేలిక. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని చవిచూసి ఉంటే, తదుపరి ఏడాది సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. గడువు తేదీకి ముందే ITRని ఫైల్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. వీసా ప్రాసెస్: అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, జర్మనీ వీసా ప్రాసెసింగ్ సమయంలోసంబంధిత ఇమ్మిగ్రెంట్ కార్యాలయంలో ఐటీ రిటర్న్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దాదాపు 3-5 ఏళ్ల ఐటీఆర్ హిస్టరీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తే. ఈ ప్రాసెస్‌లో ఆటంకాలను తగ్గించు కోవచ్చు. టీడీఎస్,రాయితీ క్లెయిమ్: ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్నా, ఐటీ విభాగం పన్ను విధించి ఉంటే దాన్ని క్లెయిమ్‌కు ఐటీఆర్ ఫైలింగ్ సాయపడుతుంది. పెట్టుబడిపై ఏదైనా పన్ను మినహాయింపు లభించిందా అని ఫారమ్ 26ASలో చెక్ చేసు కోవచ్చు. ఐటీఆర్‌ను ఆదాయం పన్ను విభాగం అధికారులు అంచనా తర్వాత, ఏమైనా రిఫండ్ ఉండే అది నేరుగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అలాగే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదంలో వైకల్యం సంభవించిన సందర్భాల్లో పరిహారం పొందేటప్పుడు కూడా ఐటీఆర్ ఒక ముఖ్యమైన ఆదాయ రుజువుగా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో నష్టాలొచ్చినపుడు మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులపై నష్టాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయంలో సర్దుబాటు చేసుకోవచ్చు. నిర్ధిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు ఈ పన్ను మినహాయింపును అభ్యర్థించవచ్చు.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 70, 71 ఒక నిర్దిష్ట సంవత్సరంలోని నష్టాలను తదుపరి సంవత్సరానికి నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు . దీంతోపాటు ఆధార్ కార్డ్ లేదా మరేదైనా డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీన్ని అడ్రస్ఫూఫ్గా కూడా అంగీకరిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఫారమ్ 16 అందుబాటులో లేని వారికి ఐటీఆర్ ఫైలింగ్ చాలా ఉపయోగపడుతుంది. -
హై క్యాష్ ట్రాన్సాక్షన్స్: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ విషయాలు మర్చిపోతే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితికి మించి జరిపే నగదు లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచుతుంది. పరిమితికి మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్‌లో తప్పకుండా సమచారాన్ని అందించాలి. లేదంటే ఐటీ అధికారుల నుండి నోటీసులొచ్చే అవకాశం ఉంది. అలా నోటీసులు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో తెలియజేయాలి. అధిక-విలువ లావాదేవీలకు సంబంధించి వ్యక్తుల రికార్డులను యాక్సెస్ నిమిత్తం ఐటీ శాఖ అనేక ప్రభుత్వ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి సంబంధిత లావాదేవీలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు సహా అధిక-విలువ నగదు లావాదేవీలపై ఐటీ విభాగం నిఘా ఉంచుతుంది. లావాదేవీలు థ్రెషోల్డ్ పరిమితిని మించి ఉంటే సమాచారాన్ని ఐటీఆర్ ఫైలింగ్‌లో పొందుపరచాలి. టాప్ 5 హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవో చూద్దాం. సేవింగ్స్ అకౌంట్ క్యాష్ డిపాజిట్ లిమిట్ ఒక వ్యక్తికి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ తమ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేస్తే.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షలు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చి వివరణ కోరవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు ఆదాయపు పన్ను శాఖ అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు నగదు రూపంలో చెల్లించే క్రెడిట్ కార్డ్ బిల్ పరిమితి రూ.1 లక్షగా ఉంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లావాదేవీల పరిమితి దాటితే ఐటీకి సమాచారం అందించాలి. లేదంటే నోటీసులు తప్పవు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్డీలలో 10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై ఐటీ విభాగానికి తెలియజేయాలి. ఫారమ్ 61Aని ఫైల్ చేయడం ద్వారా సింగిల్ లేదా మల్టిపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేసిన మొత్తం నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే బ్యాంకులు లావాదేవీలను బహిర్గతం చేయాలి స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు దేశంలోని అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్-రిజిస్ట్రార్ వద్ద రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఏదైనా స్థిరాస్తిని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం గురించి పన్ను అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌లు, బాండ్లు లేదా డిబెంచర్లలో పెట్టుబడులకు సంబంధించిన నగదు లావాదేవీల పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించకూడదు. -
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదా? లేదంటే కత వేరుంటది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ ( ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం. గడువు కంటే ముందే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోని ప్రాముఖ్యత, ప్రయోజనాలు ♦ పన్ను చెల్లింపుదారులు ఏదైనా జరిమానా లేదా పెనాల్టీని నివారించడానికి గడువు ముగిసేలోపు ఐటీఆర్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. ♦ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తులు, ఉద్యోగుల ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ♦ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారికి గడువు అక్టోబర్ 31. పెనాల్టీ గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి. చట్టపరమైన చర్య ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు మనమిచ్చిన సమాధానంతో ఐటీ డిపార్ట్మెంట్ సంతృప్తి చెందకపోతే, ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసును కూడా ఎదుర్కోవాలి. రుణాలను పొందడం సులభం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్‌లో క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే, బ్యాంకులనుంచి రుణాలను పొందడం సులభమవుతుంది. లోన్లను అందించే సమయంలో ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే. సో.. అధికారిక రుణం కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ తప్పనిసరి. ఐటీఆర్ ఫైల్ చేయని వ్యక్తులు సంస్థాగత రుణదాతల నుండి రుణాలు పొందడం కష్టం కేరీ ఫార్వర్డ్ లాసెస్ గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ఫార్వార్డ్ చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు అనుమతిస్తాయి. ఇది పన్ను చెల్లింపు దారులు తమ భవిష్యత్ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వరగా వీసా కావాలంటే వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్ ఫైలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది. -
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే చివరి తేదీ!
2020-21 మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫై చేసుకోలేకపోతే వాటిని 'డీఫెక్టివ్ రిటర్న్' అని అంటారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంతోమంది రిటర్నుల ఈ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది ఐటీఆర్-వీ లేదా ఈ-వెరిఫికేషన్ సమర్పించకపోవడం వల్ల వెరిఫికేషన్ కోసం పెండింగ్'లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను ఫిబ్రవరి 28, 2022 వరకు ధృవీకరించవచ్చని పన్ను శాఖ డిసెంబర్ 28, 2021న జారీ చేసిన సర్క్యులర్'లో తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు ఈ-వెరీఫై చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిపై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్డ్మెంట్ను పంపించాలి. లేకపోతే రిటర్ను సమర్పించినప్పటిక్సీ, అది చెల్లదు. Don’t miss the final chance to verify your ITR for AY 2020-21. Pl note that the ITR can be verified by several modes. The last date for verification is 28th February, 2022. Pl visit: https://t.co/GYvO3mStKf #ITR #VerifyNow pic.twitter.com/llkfxoppf3 — Income Tax India (@IncomeTaxIndia) February 26, 2022 (చదవండి: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!) -
ఐటీ రిటర్న్స్: గుడ్ న్యూస్ చెప్పిన ఆదాయ పన్ను శాఖ!
IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్’ కాకపోవడం వల్ల సబ్మిట్ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి. ఇక పాన్‌తో ఆధార్ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం V’’ అని ఆప్షన్ పెట్టాలి. వారికి ఫారం V అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. అటువంటి వారు ఫైల్ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. ►1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు. ► నికర ఆదాయం/ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది. ► నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. ► నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే.. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలో తెలుసా?
2020-21 ఆర్థిక సంవత్సరానికి(మార్చి 2021తో ముగిసింది) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లను ఆన్లైన్లో దాఖలు చేసే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. డిసెంబర్ 31, 2021 గడువు ముగిసే నాటికి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే జనవరి 10, 2021 నాటికి దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు 5.95 కోట్లు. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ల దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువ. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా? చాలా వరకు సామాన్య జనం గుడువు తేదీని చివరి తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. కానీ గడువు తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలి? గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము కింద రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్న పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే(మార్చి 31, 2022 చివరి తేదీ లోపు) ఆలస్య రుసుము గరిష్టంగా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము అనేది రూ.5 వేల వరకు ఉంటుంది. (చదవండి: ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..) -
గడువు(డిసెంబర్ 31)లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?
2020-2021 ఆర్థిక సంవత్సరానికి లేదా 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేయాల్సిన గడువు తేదీ సాధారణంగా జులై 31 కాగా, కరోనా నేపథ్యంలో గడువును డిసెంబర్ 31 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. ఇది పన్ను చెల్లింపుదారుల సాధారణ వర్గానికి, వేతనజీవులకు వర్తిస్తుంది. 2021-2022 మదింపు సంవత్సరానికి డిసెంబర్ 31, 2021 లోపు మీ ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది? తెలుసుకుందాం.. గడువు తేదీ ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీనా? చాలా వరకు సామాన్య జనం చివరి తేదీనే గుడువు తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్‌ని సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే, చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 2021-2022 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాల్సిన గడువు తేదీ జూలై 31, 2021 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. ఐటీఆర్ గడువు లోపు ఫైల్ చేయకపోతే ఏమి జరుగుతుంది? ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఐటీఆర్‌ని గతంలో పొడగించిన గడువు తేదీ నాటికి సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే(31 డిసెంబర్ 2021 నాటికి) మీరు 31 మార్చి 2022 వరకు చేయవచ్చు. కాని, తర్వాతి సంవత్సరాలకు మీ నష్టాన్ని కొనసాగించే హక్కును మీరు కోల్పోతారు. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో మీ వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు లేదా గృహ ఆస్తి కింద రెండు లక్షల రూపాయలకు మించి నష్టం ఉన్నట్లయితే తర్వాతి సంవత్సరాల్లో ఆ నష్టాన్ని చూపించేందుకు వీలుంటుంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ 31లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే తర్వాత సంవత్సరాల్లో మీ నష్టాన్ని చూపడానికి వీలుండదు. (చదవండి: ఐటీ రిటర్న్ గడువు తేదీని పొడగించని కేంద్రం) ఒకవేళ మీరు లేదా మీ తరఫున చెల్లించే పన్నులు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే, చెల్లించిన అదనపు పన్నులకు రీఫండ్ పొందటానికి వీలుండదు. దీంతోపాటు మీరు చెల్లించిన అదనపు పన్నులకు సంబంధించి వడ్డీని పొందలేరు. మరోవైపు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉంటే, ఆలస్యంగా చెల్లించిన కారణంగా దానిపై అదనపు వడ్డీ కూడా వర్తిస్తుంది. గడువు తేదీ తర్వాత ఐటిఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము ఎంత? పై పరిణామాలకు అదనంగా, ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, గడువు తేదీ తర్వాత ఐటీఆర్ సబ్మిట్ చేసినట్లయితే తప్పని సరిగా ఆలస్య రుసుము చెల్లించాలి. మీ ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు తప్పనిసరిగా 5 వేల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పన్ను పరిధిలోకి తీసుకునే ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము రూ.1,000/-కు ఉంటుంది. చివరి తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమి జరుగుతుంది? ఒకవేళ మీరు చివరి తేదీ నాటికి మార్చి 31, 2022లోగా కూడా మీరు ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను శాఖ కనీస జరిమానాను పన్నులో 50 శాతం వరకు విధించవచ్చు. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మీరు చివరికి ఐటీఆర్ దాఖలు చేసే తేదీ వరకు అదనంగా వడ్డీ భారం మీద పడుతుంది. అయిన, మీరు ఐటీఆర్ దాఖలు చేయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయకపోతే ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్షను విధించవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన ప్రతి సందర్భంలోనూ ఇలా జరగకపోవచ్చు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ. 10,000/-కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రమే ఆదాయపు శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!) -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఐటీ రిటర్న్‌ల గడువును పొడగించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు సజావుగా దాఖలు అవుతున్నాయని, ఈ రోజుతో ముగిసే ఐటీ రిటర్న్‌ల గడువును పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. టాక్స్ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, మధ్యాహ్నం 3 గంటల వరకు.. 5.62 కోట్ల రిటరర్న్స్ ఫైల్ అయ్యాయని, కేవలం ఇవాళ 20 లక్షల దాకా రిటర్న్స్ ఫైల్ అయ్యాయని తరుణ్ బజాజ్ తెలిపారు. There is no proposal to extend the date for income tax return filing: Revenue Secretary Tarun Bajaj, Govt of India — ANI (@ANI) December 31, 2021 ఇదిలా ఉంటే 2021-22 అసెస్మెంట్ ఇయార్‌కు సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. కానీ, కొవిడ్ వ్యాప్తి, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వం దానిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే, గత కొద్ది రోజుల నుంచి ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల గురించి తెలియజేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు యూజర్లు ట్వీట్లు చేశారు. డిసెంబర్ 31 అనే తుదిగడువు పోర్టల్ డెవలపర్లకే గానీ.. పన్ను చెల్లింపుదార్లకు మాత్రం సరిపోదని పేర్కొన్నారు. మరికొందరు, ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీని పొడగించాలని కేంద్రాన్ని కోరడంతో పాటు ఈ ఐటీ పోర్టల్ సమస్యలను స్క్రీన్ షాట్లు తీసి ట్విటర్లో పోస్టు చేశారు. (చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’) -
ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ గడువు పొడిగింపు
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్‌లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్‌లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా కాకపోతే ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)’కు ఫైల్ చేసిన ఐటీఆర్ పత్రాలను బెంగళూరులోని ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటిఆర్-వి ఫారం ద్వారా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానట్లయితే, ఐటీఆర్‌ను దాఖలు చేయనట్లుగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఇతర కారణాల వల్ల ఇప్పటికే తిరస్కరణకు గురైన ఐటీఆర్‌లను తాజా ఈ-వెరిఫికేషన్‌లో అనుమతించబోమని తెలిపింది. వారికి ఈ గడవు వర్తించదని పేర్కొంది. (చదవండి: వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్‌పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!) -
ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారికి బంపరాఫర్..!
File ITR To Get A Chance To Win Royal Enfield Bullet: 2021 ఆర్థిక సంవత్సరానికిగాను డిసెంబర్ 31తో ఐటీ రిటర్న్ గడువు పూర్తి కానుంది. దీంతో ఐటీఆర్ ఫైలింగ్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు ఆఫర్లతో ముందుకు వచ్చింది. డిసెంబర్ 31 వరకు 1000కిపైగా ఐటీఆర్ దాఖలు చేసిన(విలేజ్ లేవల్ ఎంట్రిప్యూనర్స్) వీఎల్ఈలకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బంపరాఫర్ ప్రకటించింది. 1000కిపైగా లక్ష్యాన్ని చేరుకున్న వీఎల్ఈలు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని సీఎస్సీ ట్విటర్లో పేర్కొంది. బుల్లెట్ బండి..లక్ష గెలుచుకునే అవకాశం..! కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిజిటల్ సేవల పోర్టల్ కామన్ సర్వీసెస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా 75,000 కంటే ఎక్కువ కేంద్రాలను నడుపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 25 లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని సీఎస్సీ ఆశిస్తోంది. ఐటీఆర్ దాఖలును మరింత వేగం పెంచడం కోసం వీఎల్ఈలకు బంపరాఫర్ ట్విటర్లో ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వీఎల్ఈలు 2021 డిసెంబర్ 31 లోగా 1000 మందితో ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను గెలుచుకునే అవకాశం పొందనున్నారు. అంతేకాకుండా వీఎల్ఈలు రూ.1 లక్ష వరకు కమీషన్లను కూడా గెలుచుకోవచ్చునుని సీఎస్సీ పేర్కొంది . భారీగా పెరిగిన ఐటీఆర్ దాఖలు..! గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఈ-ఫైలింగ్ అయ్యాయి. 2021 డిసెంబర్ 21వ తేదీన ఒక్కరోజే దాదాపు 8.7 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయని ఐటీ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ కావడంతో...ఈ-ఫైలింగ్‌లో భారీ పెరుగుదల కన్పిస్తోంది. గత ఏడు రోజుల్లో 46.77 లక్షల మంది తమ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారని తెలుస్తోంది. ATTENTION VLEs!! File 1000 ITR By December 31, 2021 And Win A ROYAL ENFIELD BULLET and Also Earn More Than Rs. 1 LAKH Commission... Last date for filing ITR - December 31, 2021#DigitalIndia #RuralEmpowerment #ITRFiling #ITR #FridayMotivation #FridayVibes #RoyalEnfield pic.twitter.com/JcNCi2HClA — CSCeGov (@CSCegov_) December 24, 2021 చదవండి: దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..! -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
భారీ ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకత!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఫామ్ 26ఏఎస్‌లో పొందుపరచాల్సిన అంశాలను పెంచింది. ఐటీఆర్‌లో తెలుపుతున్న సమాచారంతోపాటు ఇకపై విదేశాల నుంచి అందిన డబ్బు (ఫారిన్ రెమిటెన్స్) మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, వంటి అంశాలనూ ఇకపై ఫామ్ 26ఏఎస్‌లో తెలపాల్సి ఉంటుంది. అధిక–విలువ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లక్ష్యంగా యాక్ట్ 285బీబీ సెక్షన్ కింద సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫామ్ 26ఏఎస్... ఒక వార్షిక ఏకీకృత పన్ను ప్రకటన. దీనిని పన్ను చెల్లింపుదారులు వారి శాశ్వత ఖాతా సంఖ్య (పీఏఎన్) ఉపయోగించి ఆదాయపు పన్ను వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. 2020–21 బడ్జెట్ ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 285బీబీని ప్రవేశపెట్టింది, ఫామ్ 26ఏఎస్‌ని ’వార్షిక సమాచార ప్రకటన’గా పునరుద్దరించడం దీని ఉద్దేశం. టీడీఎస్/టీసీఎస్ వివరాలతో పాటు, నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు, పన్నుల చెల్లింపు, డిమాండ్/ సమగ్ర సమాచారాన్ని ఫామ్ కలిగి ఉంటుంది. అందుబాటులో ఆడిట్ యుటిలిటీ ఫామ్ కాగా, ఆదాయపు పన్ను శాఖ 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన పోర్టల్‌లో పన్ను ఆడిట్ యుటిలిటీ ఫారమ్‌ను అందుబాటులో ఉంచింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, వ్యాపార విక్రయాలు, టర్నోవర్ లేదా స్థూల రసీదులు రూ. 10 కోట్లకు మించి ఉంటే పన్ను చెల్లింపుదారులు వారి ఖాతాలను ఆడిట్ చేయవలసి ఉంటుంది, అయితే ప్రొఫెషనల్స్ విషయంలో, 2020–21లో (అసెస్మెంట్ ఇయర్ 2021–22) ఈ పరిమితి రూ. 50 లక్షలకు మించి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను తనిఖీ నివేదికను దాఖలు చేయడానికి చివరి తేదీ 2022 జనవరి 15. రూ.లక్ష కోట్ల రిఫండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 25 మధ్య రూ. 1,02,952 కోట్ల ఐటీ రిఫండ్స్ జరిగినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 76,21,956 కోట్ల మందికి రూ.27,965 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్స్, 1,70,424 లావాదేవీలకు సంబంధించి రూ.74,987 కోట్ల కార్పొరేట్ పన్ను రిఫండ్స్ జరిగినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి. -
డీఆర్డీవో, ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో–ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 116 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్ అప్రెంటిస్‌లు–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in -
టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...!
పన్ను చెల్లింపుదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఐటీఆర్ ఫైలింగ్ చేసే వారి కోసం ఎస్బీఐ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎస్బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను దాఖలు చేసే సౌకర్యాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. టాక్స్ పేయర్లకు ఇకపై ఎస్బీఐ ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ మరింత ఈజీ కానుంది. ఈ సదుపాయంతో టాక్స్ పేయర్స్ ఉచితంగానే ఆదాయపు పన్ను దాఖలు చేయవచ్చును. యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు ఇవే...! 1. పాన్ కార్డ్ 2. ఆధార్ కార్డ్ 3. ఫారం-16 4. పన్ను మినహాయింపు వివరాలు 5. ఇంట్రస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు 6. ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ ఫర్ టాక్స్ సేవింగ్ ఐటీఆర్ ఫైలింగ్ యోనో యాప్‌లో ఇలా చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వాలి. తరువాత ‘షాప్స్ అండ్ ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్’ సెలక్ట్ చేయాలి. అక్కడ మీకు కనిపించే ‘ట్యాక్స్2విన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆయా స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయొచ్చు. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి భారీ ఊరట కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు(సెప్టెంబర్ 30, 2021 వరకు ఉన్న) గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగిస్తూ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సీబీడీటీ సర్క్యులర్ నెం.17/2021 జారీ చేసింది. అకౌంట్లు ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సాధారణంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారాలను ఉపయోగించి తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తుల కోసం ఈ గడువును పొడగించారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు గడువును గతంలో జూలై 31, 2021 వరకు పొడిగించారు. అయితే, కొత్త ఆదాయపు పన్ను ఈ -ఫైలింగ్ పోర్టల్ లో సమస్యలు రావడం, కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 30 వరకు మళ్లీ పొడగించారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం వ్యక్తులకు సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు తేదీని నాలుగుసార్లు పొడిగించింది. మొదట జూలై 31 నుంచి నవంబర్ 30, 2020 వరకు, తర్వాత డిసెంబర్ 31, 2020 వరకు, చివరకు జనవరి 10, 2021 వరకు సీబీడీటీ పొడగించింది. -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) శనివారం ఏప్రిల్ 1, 2021 - ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 3న ఐటీఆర్ దాఖలు చేసిన 22,61,918 మందికి రూ.16,373 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లు, అలాగే, 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్ చేసినట్లు పేర్కొంది.(చదవండి: ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన) ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల మధ్య ఐటీఆర్ రీఫండ్ చేసింది. అయితే, ఈ సమస్య కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయలేదు. సాధారణంగా, ఐటీఆర్ రీఫండ్ దాఖలు చేసిన 10 రోజుల్లోగా జారీ చేస్తారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఆలస్యం కావొచ్చు. అయితే, ఒకవేళ మీరు ఇంకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఐ-టీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ మీరు ఐటీఆర్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డీఎల్) వెబ్ సైట్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్ సైట్ లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ డిఎల్ వెబ్ సైట్ లో, మీరు పాన్, అసెస్ మెంట్ ఇయర్(ఎవై) వివరాలు నమోదు చేసి 'ప్రొసీడ్' మీద క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది.(చదవండి: నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?) మొదట మీరు ఐ-టీ డిపార్ట్ మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ కావాలి. ఇప్పుడు రిటర్న్స్/ఫారమ్స్ ఎంచుకోండి. ఆ తర్వాత 'మై అకౌంట్' ట్యాబ్ కు వెళ్లి 'ఐ-టీ రిటర్న్స్' ఎంచుకోండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే, అక్నాలెడ్జ్ మెంట్ నెంబరుపై క్లిక్ చేయండి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ తో పాటు మీ రిటర్న్ వివరాలను పేజీ మీద కనిపిస్తాయి. పన్ను చెల్లింపుదారులు రీఫండ్ డబ్బు నేరుగా వారి ఖాతాకు క్రెడిట్ చేస్తారు. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చిరునామాకు పంపిస్తారు. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా నింపబడ్డాయని వారు ధృవీకరించుకోవాలి. -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఊరట..!
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ చేసే వారికి ఊరట. కొత్త ఐటీఆర్ పోర్టల్ విషయంలో అనేకా సాంకేతిక సమస్యలు రావడంతో ఆ సమస్యలను ఇన్ఫోసీస్ పరిష్కరించింది. దీంతో ఫైలింగ్ విషయంలో వేగం పుంజుకున్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) గడువు తేదీలను పొడగించే అవకాశం ఉంది. సాంకేతిక కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో గడువు పొడగించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న గడువు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఆగస్టు 21 నుండి రెండు రోజుల పాటు పోర్టల్ మొత్తం నిలిచిపోవడంతో గత నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అందుకే పరిస్థితిని బట్టి కేంద్రం కీలక రిటర్న్ ఫైలింగ్ గడువు తేదీలను పొడగించనుంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఇవనున్నట్లు తెలుస్తుంది. "కొత్త పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యం అవుతున్నాయి. అందుకే, తేదీల పొడిగింపు గురుంచి రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం ఉంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్ చేయడానికి తగినంత సమయం ఇవ్వడం వల్ల వారిలో ఉన్న భయం కొంచెం తగ్గే అవకాశం ఉంది" అని కొందరు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.(చదవండి: ఆస్తుల నగదీకరణ ఎందుకు ?) కొత్త వెబ్సైట్లో ఉన్న మొత్తం సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ సీఈఓకు సూచించారు. ఒకవేల అప్పటి వరకు అన్ని సమస్యలను పరిష్కరించిన మరో 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. కాబట్టి, అంత తక్కువ సమయంలో ఐటీ రిటర్న్స్ సమర్పణ సాధ్యం కాదనే భావనలో అధికారులు ఉన్నారు. అందుకే మరోసారి ఐటీ రిటర్న్స్ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలుగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా సాధారణ పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఆదాయపు పన్ను శాఖ ఇంతకు ముందు ఐటీఆర్ దాఖలు చేసే గడువును జూలై 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే, గడువు పొడగించిన తర్వాత కొత్త పోర్టల్ ద్వారా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో అదనపు వడ్డీ, ఆలస్యం రుసుము వసూలు చేసినట్లు చాలా మంది పన్ను చెల్లింపుదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొన్న సమస్యని పరిగణలోకి తీసుకోని ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఉపయోగించే ఐటీఆర్ పోర్టల్‌లో ఉన్న లోపాలను ఆదాయపు పన్ను శాఖ సరిచేసింది. అలా జూలై 31 తర్వాత నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తుంది. -
సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం అందించేందుకు గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని జూలె 31 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఇప్పటికే పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ, ఆలస్య రుసుములను చెల్లించినట్లయితే వాటిని రీఫండ్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. జూలై 31 తర్వాతి నుంచి ఆలస్య రుసుములు, వడ్డీలు వసూలు చేస్తున్నారని కొంతమంది ట్యాక్స్‌పేయర్లు ఫిర్యాదులు చేశారని.. ఈనెల ఒకటో తేదీన సాఫ్ట్వేర్ లోపం సరిదిద్దామని ఐటీ శాఖ ట్వీట్లో పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఇప్పటికే ఎవరైనా ట్యాక్స్‌పేయర్లు అదనపు వడ్డీ లేదా ఆలస్య రుసుములతో ఐటీఆర్‌లను సమర్పించినట్లయితే సీపీసీ–ఐటీఆర్ ప్రాసెస్‌లో సరిచేయబడుతుందని.. ఏదైనా అదనపు చెల్లింపులుంటే వాటిని సాధారణ కోర్స్‌లో రీఫండ్ చేస్తామని ఐటీ శాఖ వివరించింది. -
ఐటీఆర్ ఫైలింగ్ కోసం మొబైల్ యాప్!
ఈ మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీని రెండు నెలలు పొడగించింది. కొత్త గడువు ప్రకారం, 30 సెప్టెంబర్ 2021 వరకు ఎప్పుడైనా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. అయితే ఇంతకు ముందు ఈ గడువు తేదీ 31 జూలై 2021 వరకు ఉండేది. ప్రజలకు పన్ను దాఖలు సులువుగా చేయడం కొరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్, మొబైల్ యాప్ లో కీలకమైన ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రజల దగ్గరకు చేరడం కొరకు గతంలో ఆదాయపు పన్ను శాఖ "ఆయకర్ సేతు" పేరుతో యాప్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్‌తో ఇప్పుడు మీరు మీ ఐటీఆర్ ని సులభంగా ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0లో సరికొత్త మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్లు భారత ఆదాయపు పన్ను శాఖ ఇంతకు ముందు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మొబైల్ యాప్ ను జూన్ 7, 2021న లాంఛ్ చేసింది. ఈ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఐటీ రిటర్న్ ఈ-ఫైలింగ్ పోర్టల్, కొత్త మొబైల్ యాప్‌ను పన్ను చెల్లింపుదారులు సులభంగా ఉపయోగించవచ్చని డిపార్ట్ మెంట్ పేర్కొంది. అంతేగాక, మొబైల్ యాప్ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం, ముందస్తుగా నింపిన ఆదాయపు పన్ను వివరాలు, సరళ ఆదాయపు పన్ను సౌకర్యం, రీఫండ్ క్లెయిం, ఇతర సౌకర్యాలు వంటి సమాచారాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త తెలిపింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి వేతన తరగతి ప్రజలు ఇకపై చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సమీపంలోని పోస్టాఫీసు కామన్ సర్వీసెస్ సెంటర్స్(సీఎస్ సీ) కౌంటర్ లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. "ఇప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కౌంటర్ వద్ద ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను సులభంగా పొందవచ్చు#AapkaDostIndiaPost" అని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది. పోస్ట్ ఆఫీస్ సీఎస్ సీ కౌంటర్ వద్ద ప్రజలు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలతో పాటు ఇతర ప్రభుత్వ సమాచారం యాక్సెస్ చేసుకోవచ్చు అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది. ప్రభుత్వం అందించే అన్ని ఈ-సేవలను, పౌరులు వారి స్థానిక తపాలా కార్యాలయాలలో పొందవచ్చు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అందించే సేవలను వేగంగా స్వీకరించడానికి, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకు ముందు జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ తన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inను ప్రారంభించింది. अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs — India Post (@IndiaPostOffice) July 14, 2021 -
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30. డిజిటల్ సంతకం.. డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్లైన్లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్మెంటు ఆన్లైన్లో మెషీన్ ద్వారా జరుగుతుంది. ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందండి ఇలా..?
ఒకవేళ మీరు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నట్లయితే, మీరు పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై లేదా చిన్న పొదుపు పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్నును ఆదా చేయడం కొరకు పన్ను మినహాయింపుల కోసం క్లెయిం చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80టీఎ కింద సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై సంపాదించిన వడ్డీపై ₹10,000 వరకు మినహాయింపును మీరు క్లెయిం చేసుకోవచ్చు? అని మీలో ఎంత మందికి తెలుసు. ఇది వాణిజ్య బ్యాంకు లేదా కో ఆపరేటివ్ బ్యాంకు లేదా పోస్టాఫీసుతో పొదుపు ఖాతాల ద్వారా సంపాదించిన వడ్డీకి వర్తిస్తుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ₹3,500 వరకు పోస్టాఫీసు పొదుపు ఖాతాపై సంపాదించిన వడ్డీపై అదనపు మినహాయింపును మీరు క్లెయిం చేయగలరని మీకు తెలుసా? ఉమ్మడి ఖాతా విషయంలో ₹7,000 వరకు వడ్డీ ఆదాయం పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, మీరు తపాలా కార్యాలయంలో మీ భార్యతో ఉమ్మడి పొదుపు ఖాతాను తెరిచినట్లయితే, మీరిద్దరూ విడిగా ₹3,500 పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి, అలాగే పొదుపు బ్యాంకు ఖాతా నుంచి ₹10,000 వరకు, పోస్టాఫీసు పొదుపు జాయింట్ ఖాతా నుండి ₹7,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(15) కిందకు వస్తుంది. సెక్షన్ 10(15) ఒక వ్యక్తి మొత్తం ఆదాయంలో భాగం కాకూడని మినహాయింపు ఆదాయాల గురించి వివరిస్తుంది. "పోస్టాఫీసు పొదుపు ఖాతాల, బ్యాంకు పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై సెక్షన్ 80టీఎ కింద ₹10,000 వరకు మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. అదే సమయంలో ₹3,500 వరకు వడ్డీ సెక్షన్ 10 (15) కింద పన్ను మినహాయింపు అయితే, అంతే మొత్తాన్ని ఒకే సమయంలో రెండుసార్లు క్లెయిమ్ చేసుకోలేము" అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ప్రకాష్ హెగ్డే అన్నారు. కానీ, మీకు పోస్టాఫీసు పొదుపు ఖాతా నుంచి ₹10,000 వడ్డీ ఆదాయం వస్తే, మీరు వడ్డీ మినహాయింపు కోసం ₹3,500 క్లెయిం చేసుకోవచ్చు, మిగిలిన ₹6,500లను సెక్షన్ 80టీఎ కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లో వడ్డీ ఆదాయాన్ని మీరు ఎలా చూపుతారు అనేది మీరు కోసం క్లెయిమ్ చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. "ఒకవేళ మీరు సెక్షన్ 80టీఎ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేస్తున్నట్లయితే, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద వడ్డీ ఆదాయాన్ని మీరు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పన్ను మినహాయింపును క్లెయిం చేస్తున్నట్లయితే, మినహాయింపు ఆదాయం అనే హెడ్ కింద మీరు దీనిని చూపించవచ్చు"అని ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ తరుణ్ కుమార్ అన్నారు. అయితే, ఈ సంవత్సరం నుంచి, బ్యాంకులు, పోస్టాఫీసులు మొదలైన సంస్థలు వ్యక్తులు సంపాదించిన వడ్డీ వివరాలను పన్ను శాఖకు పంపాల్సి ఉంటుంది కనుక, మీ పన్ను ఫారాల్లో ముందస్తుగా నింపిన ఈ మొత్తం సమాచారాన్ని మీరు పొందే అవకాశం ఉంది. -
ఆదాయపు పన్ను చెల్లించే వారికి కొంత ఊరట..!
కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆదాయపు పన్ను చెల్లించే అసెస్సీలకు ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. ఇటు కోవిడ్ అటు వెబ్సైటు మొరాయించడం తదితర కారణాల వల్ల ఎన్నో అంశాల్లో గడువు పొడిగించింది. దీనితో తొందరపడకుండా నిదానంగా మన పని చేసుకోవచ్చు. ఉద్యోగికి ఊరటనిచ్చే విషయాలు ఓసారి చూస్తే.. కోవిడ్ నేపథ్యంలో చాలా మంది యజమానులు తమ కింద పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా సహాయం చేశారు. కొంతమంది.. ఉద్యోగులను ఆదుకున్నారు. కొంతమంది కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టారు. తాజా మార్పుల ప్రకారం 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లోనూ, ఆ తర్వాత యజమాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉద్యోగి విషయంలో మినహాయింపుగా భావిస్తారు. దీనిపరంగా ఉద్యోగికి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఎవరైనా ఉద్యోగి కోవిడ్ బాధితుడై మరణిస్తే, ఆ సమయంలో యజమాని ఆ కుటుంబానికి ఇచ్చిన నష్టపరిహారం.. ఎక్స్‌గ్రేషియా మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇది కూడా ఊరట కలిగించే అంశమే. పాన్ కార్డుతో, ఆధార్ అనుసంధానానికి గడువు తేది 2021 జూన్ 30. దీన్ని కూడా కేంద్రం 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించింది. ఇక్కడ సమస్య సమయానిది కాదు. ఆధార్ నిర్వాహకులు, ఇన్‌కం ట్యాక్స్ విభాగం మధ్య సమాచారం విషయంలో సయోధ్య, సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఎవరి మటుకు వారే తమ సమాచారమే కరెక్ట్ అని, సర్దుబాటుకు ఒప్పుకోవడం లేదు. అసెసీ మాట విన డం లేదు. అసెసీ నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుని ముగించాల్సిన అనుసంధాన ప్రక్రియను ‘అసెస్మెంట్‘ అంత కష్టం చేస్తున్నారు. దీని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ముందుగా చెప్పినట్లు చాలా అంశాల్లోలాగే ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద చెల్లింపులకు కూడా గడువు తేదిని పొడిగించారు. అయితే, మరింత సమయం లభిస్తున్నప్పటికీ.. మీరు తగిన సమాచారం, కాగితాలతో సిద్ధంగా ఉండటం శ్రేయస్కరం. ఆ తర్వాత పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. మూలధనం మీద పన్ను లెక్కించడం కోసం, మినహాయింపు పొందడం కోసం ఇల్లు కొనడం, బాండ్లు కొనడం వంటి వాటికి మీమీ లావాదేవీలను బట్టి గడువు ఉంటుంది. ఈ గడువును 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించారు. ఉదాహరణకు బాండ్లు కొనడానికి గడువు తేది 30–6–2021తో ముగిసినట్లయితే, దాన్ని ఇప్పుడు 30–9–2021 దాకా పొడిగించారు. మీరు బాండ్లను 30–9–2021లోగా కొని, మూలధన లాభాల విషయంలో మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి ఊరట కలిగించే అంశాలు. సందేహం లేదు. సమయానుకూలంగా గడువు తేదిని మళ్లీ పొడిగించవచ్చు. కానీ దాని కోసం ఎదురు చూడకుండా అన్నీ అమర్చుకుని సిద్ధంగా ఉండండి. వెబ్సైటు అందుబాటులోకి రాగానే ఫైల్ చేయండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: Stockmarket:లాభాల రింగింగ్,బ్యాంక్స్, ఐటీ గెయిన్ -
ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి?
గత కొద్ది రోజులుగా మీలో కొంత మంది గమనించే ఉంటారు. 31-3-2020తో పూర్తయిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో కొంత మందికి నోటీసులు వచ్చాయి. సెక్షన్ 139(9) ప్రకారం డిపార్టుమెంటు వారు నోటీసులు ఇవ్వొచ్చు. ఈ నోటీసుకి బదులుగా రిటర్నుని సరిచేస్తూ 15 రోజుల్లో తెలియజేయాలి. ఏ సందర్భంలో తప్పులు జరిగే అవకాశం ఉందంటే.. సరైన ఫారంలో రిటర్న్ ఫైల్ చేసి ఉండకపోతే.. ఉదాహరణకు ఫారం 2కి బదులుగా ఫారం 3 ఫైల్ చేయడం వంటివి. రిటర్నుల్లో అంశాలకు సంబంధించి వివరాలు పొందుపర్చకపోవడం. నింపకపోవడం. తప్పుగా రాయడం. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. ప్రతీ కాలమ్‌కి బదులివ్వాలి. కొన్ని మీకు వర్తించవు. కొన్ని మీకు ఉండకపోవచ్చు. వర్తించకపోతే ‘నాట్ అప్లికేబుల్’ అని రాయాలి. ఉండకపోతే ‘నిల్’ అని రాయాలి. ఆన్లైన్ ఫైలింగ్‌లో చిన్న తప్పు జరిగినా, రిటర్ను డిఫెక్టివ్ అయిపోతుంది. ఆదాయం వివరాలను తప్పుగా డిక్లేర్ చేసినా, టీడీఎస్ మొత్తానికి.. ఆదాయానికి పొంతన లేకపోయినా.. అంటే ఉదాహరణకు వడ్డీకి సంబంధించిన టీడీఎస్ చూపించి ఆ ఆదాయాన్ని చూపించకపోవడం లాంటి తప్పిదాలు. అకౌంట్ బుక్స్ కంపల్సరీ అయిన చోట ‘అవసరం లేదు’ అని రాయడం. ఆడిట్ అవసరం అయిన చోట ఆ వివరాలు రాయకపోవడం, వివరాలను తప్పుగా రాయడం .. ట్యాక్స్ ఆడిట్ వివరాలు రాయకపోవడం లేదా తప్పుగా రాయడం మొదలైనవి ఊహాజనిత పన్ను చెల్లించినప్పుడు వివరాలు ఇవ్వకపోవడం, తప్పుగా రాయడం పన్నులు చెల్లించిన వివరాలు పొందుపర్చకపోవడం, పన్నుల వివరాలు సరిపోలకపోవడం సమాచారం తప్పుగా రాయడం.. వ్యత్యాసాలు కనిపించడం, షెడ్యూల్లో వివరాలు తప్పుగా రాయడం వంటి తప్పిదాలు ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు నోటీసులు రావచ్చు. అయితే, ఆ నోటీసులు రాగానే.. భయపడనవసరం లేదు. ‘డిఫెక్ట్’ ఏమిటో తెలుసుకోండి. వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. నోటీసు కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయండి ‘డిఫెక్ట్’ని అర్థం చేసుకోండి. వారు పేర్కొన్న ‘డిఫెక్ట్’ని అంగీకరించిన పక్షంలో, ఒప్పుకున్నామని తెలియజేస్తూ దాన్ని సరిచేయండి. ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ‘నో’ అని జవాబు ఇవ్వండి. ఇందుకు తగిన కారణాలు చెప్పాలి. జవాబు 15 రోజుల్లోగా ఇవ్వాలి అలా ఇవ్వకపోతే రిటర్ను రద్దు అయిపోతుంది. మీరు రిటర్నులు దాఖలు చేసినట్లుగా పరిగణించరు. డిఫెక్ట్‌ని సరిచేసినప్పుడు సమగ్ర సమాచారం ఇవ్వాలి. రిటర్నుని మళ్లీ నింపాల్సి రావచ్చు. రిఫరెన్సులు ఇవ్వాలి. స్క్రీన్ మీద అన్ని వివరాలు వస్తాయి. ఓపిగ్గా.. జాగ్రత్తగా సరిచేయండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూరి కె.వి.ఎన్ లావణ్య -
ఐటీ రిటర్నుల్లో మార్పులు గమనించారా?
సాక్షి, ముంబై: ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) నోటిఫై చేసింది. సాధారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సీబీడీటీ నోటిఫై చేసిన ఐటీఆర్‌లను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఐటీఆర్‌లలో పరిమిత మార్పులనే చేశారు. 2020 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపన్ను చట్టంలోని సవరణల మేరకు మార్పులను పొందుపరిచారు. అదే సమయంలో..గతేడాది కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాట్లను ఐటీఆర్‌ల నుంచి తొలగించారు. డీఐ షెడ్యూల్ కూడా ఇలా తొలగించిన వాటిల్లో ఒకటి. డీఐ అంటే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు/డిపాజిట్లు/చెల్లింపుల వివరాలు. 2021-22 అసెస్మెంట్ ఐటీఆర్‌లలో డీఐ కాలమ్ కనిపించదు. వీటితోపాటు ఐటీఆర్‌లలో ఏఏ మార్పులు చోటు చేసుకున్నదీ వివరంగా తెలుసుకుంటే.. రిటర్నుల దాఖలు మరింత సులభమవుతుంది. ఐటీఆర్-1కు సంబంధించి చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. సెక్షన్ 194ఎన్ కింద పన్ను చెల్లింపుదారులు ఎవరికైతే మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)అమలవుతుందో.. వారు ఐటీఆర్–1 రూపంలో రిటర్నులు దాఖలు చేయరాదు. సెక్షన్ 194 కింద బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలు,పోస్టాఫీసులకూ ఇది వర్తిస్తుంది. మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారు నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే అప్పుడు 2 శాతం టీడీఎస్‌ను మినహాయిస్తాయి. ఒకవేళ సదరుఖాతాదారు అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఐటీఆర్‌లను దాఖలు చేయనట్టయితే.. అప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 20లక్షలు మించినా 2 శాతంటీడీఎస్ను అమలు చేయాలి. లేదా రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 5 శాతాన్ని అమలు చేయాలి. ఇటీవల పన్ను చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. ఉద్యోగులు తమకు సంస్థజారీ చేసిన ఈసాప్‌లపై (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్) పన్నును వాయిదా వేయదలుచుకుంటే అప్పుడు ఐటీఆర్1 లేదా ఐటీఆర్2 బదులు.. ఐటీఆర్ 2, 3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈసాప్‌లపై పన్ను వాయిదా ఈసాప్‌లపై పన్నును వెంటనే చెల్లించాల్సిన పని లేకుండా, వీలునుబట్టి వాయిదా వేసుకునే సౌకర్యాన్ని బడ్జెట్ 2020లో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈసాప్‌లపై రెండు సార్లు పన్నుపడుతుంది. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి ఈ సాప్లు అందుకున్నప్పుడు ఒక పర్యాయం, ఉద్యోగి తిరిగి స్టాక్ ఆప్షన్లను విక్రయించినప్పుడు వచ్చిన మూలధన లాభాలపై మరో పర్యాయంపన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్టంలో చేసిన సవరణ ప్రకారం.. అర్హత కలిగిన స్టార్టప్‌ల ఉద్యోగులు తాము అందుకున్న ఈసాప్‌లపై పన్నును వాయిదా వేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్లుకేటాయించిన ఆర్థిక సంవత్సరం ముగింపు నుంచి 48 నెలల పాటు అంటే నాలుగేళ్ల వరకు ఇలా పన్నును వాయిదా వేసుకునే సౌకర్యం ఉంది. ఈసాప్‌లపై ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను,వాయిదా వేసుకుంటున్న పన్నును వివరంగా షెడ్యూల్ టీటీఐ (కంప్యుటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ టోటల్ ఇన్కమ్)లో పేర్కొనాలి. డివిడెండ్ ఆదాయం.. డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను ఎత్తేసి.. డివిడెండ్ అందుకున్న వ్యక్తి పన్ను చెల్లించాలన్న సవరణను గతంలో తీసుకొచ్చారు. దీంతో ఐటీఆర్‌లలో డీడీటీ సెక్షన్‌ను ఎత్తేసి షెడ్యూల్ ఓఎస్ (ఇతర వనరుల ద్వారా ఆదాయం)ను తాజా సవరణలకు అనుగుణంగా మార్పు చేశారు. అంటే ఇతర వనరుల ద్వారా ఆదాయం కాలమ్‌లోనే డివిడెండ్ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. డివిడెండ్ ఆదాయానికి సంబంధించి వడ్డీ వ్యయాలు ఏవైనా చేసి ఉంటే (రుణాలు తీసుకుని చెల్లింపులు).. వాటిని సెక్షన్ 57(1) కింద తగ్గించి చూపించుకునేందుకు కొత్తగా ఒక వరుసను ప్రవేశపెట్టారు. భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో నివసించే భారతీయుల పన్ను చెల్లింపుదారులు అందుకునే డివిడెండ్‌కు సంబంధించి కొత్త వరుసలను చేర్చారు. సెక్షన్ 115ఏ కింద ప్రవాస భారతీయులు అందుకునే డివిడెండ్‌పై ప్రత్యేక పన్ను రేటును వసూలు చేయనున్నారు. ఐటీఆర్ 2, 3, 4ను దాఖలు చేసే వారు డివిడెండ్ ఆదాయాన్ని త్రైమాసికాల వారీగా వేరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్–1 దాఖలు చేసే వారు సైతం డివిడెండ్ ఆదాయాన్ని నాలుగు త్రైమాసికాలుగా వేరు చేసి చూపించాలి. దీంతో అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను చెల్లింపులు) బాధ్యతను లెక్కించేందుకు పన్ను అధికారులకు సులభంగా ఉంటుంది. రాయితీ పన్ను రేట్లు 2021-22 అసెస్మెంట్ సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 115బీఏసీ కింద తక్కువ పన్ను రేట్ల విధానాన్ని ఎంచుకోవచ్చు. దీన్ని ఎంపిక చేసుకుంటే కొన్నిమినహాయింపులు, తగ్గింపులను కోల్పోవాల్సి వస్తుంది. అన్ని ఐటీఆర్లలోనూ పార్ట్–ఏలో పన్ను చెల్లింపుదారులు తాము 11బీఏసీ కింద నూతన పన్ను విధానాన్ని ఎంపికచేసుకుంటున్నట్టు అయితే తెలియజేయాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి పరమైన ఆదాయం కలిగిన వారు నూతన విధానాన్ని గడువులోపు 10-ఐఈ దాఖలు చేయడం ద్వారాఎంచుకోవాలి. ఫామ్ 10–ఐఈ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఐటీఆర్-3లో పొందుపరచాలి. ఐటీఆర్-3లో షెడ్యూల్ డీపీఎం (ప్లాంట్, మెషినరీ విలు వ తరుగుదల), షెడ్యూల్ యూడీ (సర్దుబాటు చే యని తరుగుదల)లకు సంబంధించి మినహాయిం పులను ఇప్పుడు వదులు కోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ రిటర్నులు దాఖలు చేయాలి ♦ ఐటీఆర్–1 వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు (దేశంలో నివసించే వారు) లేదా, మరియు ఒక ఇల్లు కలిగి ఉండి.. వ్యవసాయ ఆదాయం రూ.5,000లోపు కలిగినా, ఇతర ఆదాయం (వడ్డీ ఆదాయం) ఉన్నా.. అంతా కలుపుకుని సంవత్సరాదాయం రూ.50లక్షల్లోపు ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. మినహాయింపులు: పైన చెప్పుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఎలా అంటే.. రూ.50లక్షల్లోపు ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డ్‌లో డైరెక్టర్‌గా ఉన్నా లేదా ఏదేనీ అన్‌లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఐటీఆర్-1 దాఖలు చేయకూడదు. అదే విధంగా సెక్షన్ 194 ఎన్ కింద టీడీఎస్ మినహయించినా లేదా ఈసాప్పై పన్నును వాయిదా వేసుకున్న వారు కూడా ఐటీఆర్–1 దాఖలు చేయడానికి లేదు. ఇంటిపై నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు.. ఇతర వనరుల రూపంలో నష్టాన్ని కూడా క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు సైతం ఐటీఆర్-1 దాఖలు చేయరాదు ♦ ఐటీఆర్-2: ఐటీఆర్-1 దాఖలు చేసే అర్హత లేని వ్యక్తులు (ఎన్ఆర్ఐలు సైతం), హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం, లాభాలు లేనట్టయితే ఐటీఆర్-2 దాఖలుకు అర్హులు. ♦ ఐటీఆర్-3 :వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం, లాభాలు కలిగి.. ఇతర రూపాల్లో ఆదాయం లేనట్టయితే అప్పుడు ఐటీఆర్–3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ♦ ఐటీఆర్-4 : వృత్తి, వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్–4ను దాఖలు చేయాలి. సెక్షన్ 44ఏడీ కింద వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంపై ప్రిసంప్టివ్ ట్యాక్స్‌ను ఎంపిక చేసుకున్న వ్యక్తులు (స్థానిక నివాసులు), హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కానివి) రూ.50లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉంటే ఐటీఆర్-4ను దాఖలు చేయాలి. ♦ఐటీఆర్-5/6/7: ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యక్తులు (పై విభాగాల్లోకి రాని వారు), ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఐటీఆర్-5, 6, 7 వర్తిస్తాయి. ♦ ప్రిసంప్టివ్ ట్యాక్స్: వృత్తి నిపుణులు లేదా సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.50లక్షల వరకు ఉంటే ప్రిసంప్టివ్ ట్యాక్స్ స్కీమ్‌ను ఎంచుకుని.. తన టర్నోవర్‌లో 50% పన్ను వర్తించే ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించే సౌలభ్యత ఉంది) -
ఐటీఆర్1-4కు ఆఫ్‌లైన్ యుటిలిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల పత్రాలైన ఐటీఆర్1, 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీని ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. ఈఫైలింగ్ పోర్టల్‌లో ఈ ఆఫ్‌లైన్ యుటిలిటీ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ (జేఎస్వోఎన్) అనే నూతన టెక్నాలజీ ఆధారితంగా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ‘‘విండోస్ 7, ఆ తర్వాతి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన కంప్యూటర్లలో ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐటీఆర్-1, ఐటీఆర్-4కు మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఐటీఈఆర్లను తర్వాత జోడించడం జరుగుతుంది’’ అంటూ ఆదాయపన్ను శాఖా ప్రకటించింది. ఆదాయపన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి ముందుగా నింపిన డేటా ఆధారిత రిటర్నులను డౌన్లోడ్ చేసుకుని, మిగిలిన డేటాను నింపిన అనంతరం దాఖలు చేయవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్ అప్లోడ్ చేసేందుకు ఇంకా అనుమతించనందున.. ఐటీఆర్‌ను పూర్తిగా నింపి ఆఫ్‌లైన్ యుటిలిటీలో సేవ్ చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖా తెలిపింది. నూతన యుటిలిటీ అన్నది రిటర్నుల దాఖలు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని నాంజియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ నేహా మల్హోత్రా పేర్కొన్నారు. సాధారణ బీమా సంస్థలకు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సాధారణ బీమా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరలకు సంబంధించి ముసాయిదా నిబంధనలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) విడుదల చేసింది.ముఖ్యంగా బీమా పాలసీల తయారీ విషయంలో అనుసరించాల్సిన కనీస కార్యాచరణను ఇందులో నిర్దేశించింది. బీమా సంస్థల్లో సమర్థతను పెంచడం ద్వారా పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలూ ఇందులో ఉన్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అప్పుడు అన్ని సాధారణ బీమా ఉత్పత్తులు, యాడాన్ కవర్లకు ఇవి వర్తిస్తాయి. -
మార్చి 31లోగా ఈ పనులను వెంటనే పూర్తి చేయండి!
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు జరగనున్నాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రింద తెలిపిన పనులను మార్చి 31వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ - ఆధార్ లింక్ పాన్ కార్డు - ఆధార్ కార్డును లింకు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ఈసారి పాన్-ఆధార్ లింక్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించబడింది. ఈలోగా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున, వీలైనంత త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.10,000 ఆలస్య రుసుము వసూలు చేయబడుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి. కాబట్టి మార్చి 31లోగా మీ ఐటీఆర్ దాఖలు చేయడం మంచిది. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని 2020 మే 13న ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కాన్ఫిడెన్స్ బై కాన్ఫిడెన్స్ స్కీమ్ కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఎల్టీసీ క్యాష్ వోచర్ ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31లోగా మీ బిల్లులను సరైన ఫార్మాట్లో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్ నెంబర్ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ.10 వేల వరకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పొందవచ్చు. ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకంతో పాటు 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్ తీసుకుంటే 10 వాయిదాల్లో డబ్బును తిరిగి చెల్లించవచ్చు. డబుల్ టాక్సేషన్ కోవిడ్ -19 కారణంగా చాలా మంది విదేశీ పౌరులు, వలసదారులు భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించే ఆదాయంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్ సమర్పించి డబుల్ టాక్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. 2021 మార్చి 3న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. డబుల్ టాక్సేషన్ చెల్లింపుదారులు తమ వివరాలను ఫారం-ఎన్ఆర్ లో సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. 75 అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుండి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టిడిఎస్ ను ప్రతిపాదించారు. ఇక ఈపిఎఫ్ ఖాతాలో ఏటా రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులపై పన్ను విధించాలని ప్రకటించారు. 1) పిఎఫ్ పన్ను నియమాలు: 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 2) టిడిఎస్: ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. 3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు: సీనియర్ సిటిజన్లపై పన్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి లభించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది. 4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంలలో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 5) ఎల్‌టిసి: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. చదవండి: 2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే -
ఐటీఆర్ ఫైలింగ్ : గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌ను పంపుతోంది. జీఎస్టీ రిటర్న్స్ గడువు అక్టోబర్ 31 వరకూ... మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా ప్రేరిత అంశాలు దీనికి నేపథ్యం. -
పన్ను చెల్లింపు దారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది. Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare #IndiaFightsCorona pic.twitter.com/ZoGBpok3V7 — Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020 -
మీ ఐటీఆర్ ఏ దశలో ఉంది?
గత నెల 31తో ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువు ముగిసింది. గడువులోపు రిటర్నులను ఆన్లైన్లో ఫైల్ చేసిన వారు, సంబంధిత ఐటీఆర్ ఏ దశలో ఉందో (స్టాటస్) తెలుసుకోవడం అవసరం. దీనివల్ల మీ ఐటీఆర్ ప్రాసెస్ అయిందా? లేక పన్ను చెల్లింపు దారు వైపు నుంచి తదుపరి చర్య ఏదైనా అవసరం ఉందా? అన్నది తెలుస్తుంది. మీ ఐటీఆర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఎంతో సులభం. ఈ ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తర్వాత ‘వ్యూ రిటర్న్స్/ఫామ్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, దాఖలు చేసిన ఐటీఆర్‌ల జాబితా కనిపిస్తుంది. ‘రిటర్న్ అప్లోడెడ్, పెండింగ్ ఫర్ ఐటీఆర్వీ/ఈ వెరిఫికేషన్’ అని చూపిస్తే.. మీరు వెరిఫై చేసిన తర్వాతే మీ ఐటీఆర్ ప్రాసెస్‌కు వెళుతుందని అర్థం. మీ ఐటీఆర్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేస్తే అక్కడే అదే కనిపిస్తుంది. ఇలా మీ ఐటీఆర్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. -
ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? మీకో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా పాన్ కార్డును ఇవ్వనుంది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణింస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్ పీసీ మోడీ తెలిపారు. ఆధార్ కార్డులో వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల పాన్ కార్డును జారీ చేస్తామన్నారు. పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్‌కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. -
5.65 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు చేసిన వారి సంఖ్యలో మంచి వృద్ధి చోటు చేసుకుంది. జూలై వరకు దాఖలు చేయాల్సిన గడువును ఆగస్ట్ నెల వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 31తో గడువు ముగియగా, మొత్తం 5.65 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 5.42 కోట్ల ఐటీఆర్‌లో పోలిస్తే 4 శాతం వృద్ధి నమోదైంది. రికార్డు ఏమిటంటే... ఆగస్ట్ 31 ఆఖరి ఒక్క రోజే 49,29,121 మంది ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేయడం. ఆగస్ట్ 27 నుంచి 31 నాటికి 1,47,82,095 రిటర్నులు దాఖలయ్యాయి. ఇక, నమోదైన 5.65 కోట్ల రిటర్నుల్లో ఇప్పటి వరకు 3.61 కోట్ల రిటర్నుల వెరిఫికేషన్ కూడా పూర్తయినట్టు ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. -
ఐటీ రిటర్న్ దాఖలు ఆలస్యమైతే...
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో అశ్రద్ధ వహించి గడువులోపు ఆ పనిచేయకపోతే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఈ లోపు దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ కింద ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసిన వారికి రూ.10,000 వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు రిటర్నులు దాఖలు చేశారన్న దానిపై ఈ పెనాల్టీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే చెల్లించాల్సిన పన్ను మొత్తంపై వడ్డీ అదనంగా చెల్లించుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సకాలంలో రిటర్నులు దాఖలు చేయడమే సరైనది. సెక్షన్ 139 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆలస్యంగా దాఖలు చేసే వివిధ రకాల రిటర్నుల వ్యవçహారాలకు సంబంధించినది. ఓ వ్యక్తి లేదా సంస్థ నిర్దేశిత గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే ఈ సెక్ష¯Œ తగిన మార్గదర్శకాలను తెలియజేస్తోంది. ఈ సెక్షన్ లో ఉప సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇవి విడిగా భిన్న రిటర్నుల వ్యవహారాల పరిష్కారానికి సంబంధించినవి. కనుక వీటిపై ఓ సారి దృష్టి సారించాలి. సెక్షన్ 139(1) ఈ సెక్షన్ కింద వ్యక్తులు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. చట్టం అనుమతించిన బేసిక్ పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు గడువు లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. భారత్‌కు వెలుపల ఏదైనా ఆస్తి ఉన్న వారు (ఏదైనా సంస్థతో ఆర్థిక ప్రయోజనం ముడిపడి ఉన్నా) లేదా విదేశీ ఖాతాకు సంబంధించి సంతకం చేసే అధికారం కలిగి ఉంటే అప్పుడు ఆదాయం ఎంతన్నదానితో సంబంధం లేకుండా రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సిందే. ఇక చట్టంలోని నిబంధనల మేరకు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆ పనిచేస్తే స్వచ్చంద రిటర్నులుగా పరిగణిస్తారు. ఇవి చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే రిటర్నులు. ఈ సెక్షన్ కొన్ని రకాల వ్యక్తులను పన్ను రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు కూడా ఇస్తోంది. సెక్షన్ 139 (3) పన్ను చెల్లింపుదారులు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయడం వల్లే ప్రయోజనం పొందగలరు. అందుకే ఈ విషయంలో కొన్ని నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. ‘క్యాపిటల్ గెయి¯Œ ్స’ (మూలధన లాభాలు), ‘ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ్స ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ’ కింద నష్టాలను ఎదుర్కొన్న వారు, వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరాల ఆదాయంలో సర్దుబాటు చేసుకోదలిస్తే తప్పనిసరిగా గడువులోపే ఐటీఆర్ దాఖలు చేయాలి. ఒకవేళ ఇంటిపై నష్టం ఎదురైతే మాత్రం గడువు దాటిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినా గానీ, ఆ నష్టాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు ఈ సెక్షన్ అనుమతిస్తోంది. ఇక ఇతరత్రా ఏ నష్టమైనా కానీ సకాలంలో రిటర్ను లు దాఖలు చేసినా, చేయకపోయినా వాటిని సెట్ ఆఫ్ (ఆదాయంలో సర్దుబాటు) చేసుకోవచ్చు. సెక్షన్ 139(4) పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(1)లో పేర్కొన్న మేరకు గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, అసెస్మెంట్ సంవత్సరం నుంచి ఏడాదిలోపు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేయవచ్చు. లేదా సెక్షన్ 144 ప్రకారం మదింపు పూర్తవకముందు దాఖలు చేయవచ్చు. కాకపోతే సెక్షన్ 271ఎఫ్‌లో పేర్కొన్న ప్రకారం రూ.5,000 జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సెక్షన్ 139(1) కింద రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినప్పటికీ పెనాల్టీ ఉండదు. సెక్షన్ 139(5) గడువులోపు ఐటీఆర్ దాఖలు చేసిన వారు, ఆ తర్వాత అందులో ఏదైనా తప్పున్నట్టు గుర్తిస్తే, సవరణ రిటర్నులు సమర్పించే హక్కు ఉంటుంది. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాదిలోపు ఈ పని చేయవచ్చు లేదా ఐటీఆర్ అసెస్మెంట్ పూర్తి కాకముందు వీటిల్లో ఏది ముందు అయితే అదే అమల్లోకి వస్తుంది. ఈ గడువులోపు ఎన్ని సార్లయినా సవరణ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. అయితే, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల ఈ సెక్షన్ పరిధిలోకి రారు. సవరణ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉండదు. సవరణ రిటర్ను దాఖలు చేయడం ఆలస్యం సెక్షన్ 139(5) కింద అదే అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. అంతకుముందు సెక్షన్ 139(1) కింద దాఖలు చేసినది అమల్లో ఉండదు. అయితే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్నుల్లో లోపాలు లేదా తప్పుడు ప్రకటనలన్నవి ఉద్దేశపూర్వకంగా చేయకపోతేనే సవరణ రిటర్నులు దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా లోపాలు లేదా తప్పిదాలతో దాఖలు చేసినా, మోసానికి పాల్పడినా పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. సెక్షన్ 139 (9) లోపాలతో కూడిన ఐటీ రిటర్ను దాఖలు చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేయనప్పుడు సెక్షన్ 139(9) మార్గదర్శకాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని పూర్తి చేయాల్సిన కాలమ్స్‌ను వదిలి వేయడం లోపంగానే పరిగణిస్తారు. టీడీఎస్ మినహాయించిన సందర్భాల్లో ఆధారం జత చేయకపోయినా దాన్ని లోపంతో కూడిన రిటర్న్గానే చూస్తారు. పన్ను అధికారి ఇలా గుర్తించిన సందర్భంలో ఈ సమాచారం పన్ను చెల్లింపుదారునికి తెలియజేస్తారు. అప్పటి నుంచి 15 రోజుల్లోపు ఆ తప్పులను సవరించుకోవాల్సి ఉంటుంది. అయితే, దరఖాస్తు ద్వారా ఈ గడువు పొడిగించాలని కోరొచ్చు. పన్ను అధికారి ఇచ్చిన సమయంలోపు తప్పులను సవరిస్తూ రిటర్ను ఫైల్ చేయకపోతే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్న్ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోవాలి. ఆలస్యం చేయడం వల్ల ప్రతికూలతలు ♦ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి రావచ్చు. సెక్ష 234ఎఫ్ ప్రకారం సకాలంలో రిటర్నులు దాఖలు చేయడంలో విఫలం చెందితే.. రూ.10,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణ గడువు ముగిసిన తర్వాత, అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 లోపు రిటర్ను దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అదే జనవరి 1 తర్వాత రిటర్ను ఫైల్ చేస్తుంటే ఈ జరిమానా రూ.10,000. అయితే, రిటర్ను దాఖలు చేసే వారి వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉంటే, జరిమానా కేవలం రూ.1,000 మాత్రమే ఉంటుంది. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారిపై భారం ఎక్కువ ఉండకూడదని తక్కువగా నిర్ణయించారు. ♦ గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, మూలధన నష్టాలను, వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చిన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు వీలుండదు. ♦ ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే, అంతకాలానికి నిర్ణీత పన్నుపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి. ♦ ఆలస్యంగా రిటర్నుల వల్ల, రిఫండ్ వచ్చేది ఉంటే ఆ మొత్తంపై వడ్డీ రాదని గుర్తుంచుకోవాలి. ఆలస్యపు రిటర్నుల్లో పన్నుపై వడ్డీ ఆలస్యపు రిటర్నుల్లో జరిమానాకు తోడు పన్ను మొత్తంపై ఆలస్యమైన కాలానికి వడ్డీ చెల్లించాలి. సెక్షన్ 234ఏ కింద నెలకు ఒక శాతం వడ్డీ ఉంటుంది. నిర్ణీత గడువు, దాఖలు చేసిన గడువు మధ్య కాలానికి దీన్ని వసూలు చేస్తారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు ఆగస్టు 31. ఈ నెల 31లోపు దాఖలు చేయకుండా వచ్చే డిసెంబర్ 30న దాఖలు చేశారనుకోండి. రూ.1,00,000 పన్ను చెల్లించాల్సి ఉంటే, ఈ మొత్తంపై ఒక శాతం వడ్డీ చొప్పున నాలుగు నెలలకు రూ.4,000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
2018–2019కు ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019–2020 అసెస్మెంట్ ఇయర్) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) రిటర్న్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
కంపెనీలకు ఐటీఆర్ మినహాయింపులు రద్దు
న్యూఢిల్లీ: డొల్ల కంపెనీలపై కొరడా ఝుళిపించే క్రమంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా .. కట్టాల్సిన పన్ను రూ. 3,000కు లోబడి ఉండే సంస్థలకు ఐటీ రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి మినహాయింపునిస్తుండటాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులను ఆదాయ పన్ను విభాగం నిశితంగా పరిశీలిస్తుందని వివరించారు. లాభం తక్కువగా చూపే సంస్థలు, అలాగే తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న సంస్థలపైన కూడా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు అధికారి పేర్కొన్నారు. సుమారు అయిదు లక్షలకు పైగా కంపెనీలు రిటర్నులు దాఖలు చేయడం లేదని, మనీలాండరింగ్‌కు ఇవి ఉపయోగపడుతున్నాయన్న సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల పైగా సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటిలో సుమారు 7 లక్షల సంస్థలు వార్షిక నివేదికలతో పాటు రిటర్నులూ దాఖలు చేస్తున్నాయి. ఇందులో 3 లక్షల సంస్థలు ఆదాయమే లేనట్లుగా చూపుతున్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 276సీసీ ప్రకారం ఉద్దేశపూర్వకంగా గడువులోపల ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిపై జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారా? అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన పెద్ద మొత్తాల నగదుపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన ఈ మొత్తాలతో మార్చి 31 వరకు రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రిటర్నులు దాఖలు చేయకపోతే, జరిమానాలు, న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన ట్రస్ట్‌లు, రాజకీయ పార్టీలు, అసోసియేషన్లు ఈ తుది డెడ్‌లైన్ వరకు ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేసి, క్లీన్‌చీట్ పొందాలని పేర్కొంది. ప్రముఖ దినపత్రికల్లో ప్రజా ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐటీఆర్‌లను సమీక్షించుకోవడానికి, పెండింగ్‌లో ఉన్న రిటర్నులు దాఖలు చేయడానికి ఇదే తుది ఆదేశంగా పేర్కొంది. ఒకవేళ మీరు బ్యాంకు అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే.. ఐటీఆర్‌లను ఫైల్ చేయాలని, లేదంటే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అడ్వయిజరీ కూడా హెచ్చరించింది. అన్ని కంపెనీలు, సంస్థలు, బాధ్యతాయుత భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా దీనికి మినహాయింపు కాదని, అందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయమున్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రూ.3 లక్షలకు పైన, రూ.5 లక్షలకు పైన ఉన్నఆదాయమున్న సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆర్థిక సంవత్సరాలకు గాను రిటర్నులు దాఖలు చేయాలని ప్రకటించింది. -
అటెన్షన్ టాక్స్ పేయర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కొత్త హెల్ప్ లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇ-ఫైలింగ్ కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లను మారుస్తున్నామంటూ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇ-ఫైలింగ్( ఆన్లైన్ ద్వారా) పన్ను వివరాలను నమోదు చేసుకునే వారి కోసం ఆదాయపన్ను శాఖ కొత్త హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది. అడ్వైజరీ ద్వారా ఐటీశాఖ నేడు కొత్త నెంబర్లతో ఈ ప్రకటన జారీ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్18001030025, డైరక్ట్ నెంబర్ 918046122000 కొత్త నెంబర్లు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటాయని ఐటీశాఖ వెల్లడించింది. https://www.incometaxindiaefiling.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా పన్నుదారులు తమ పన్నులకు సంబంధించిన అంశాలను ఈ-ఫైయిలింగ్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం దాఖలు సందర్భంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించ వచ్చని సీనియర్ అధికారి తెలిపారు. -
రిటర్నుల్లో మాయచేస్తే భారీ పన్ను
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత దాఖలైన సవరించిన ఐటీ రిటర్నులను(రివైజ్డ్ ఐటీఆర్) మరింత నిశితంగా పరిశీలించాలని ఆదాయపు పన్ను అధికారులకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఆయా రిటర్నుల్లో నల్లధనం గనుక గుర్తించడం లేదా వివరాలను తారుమారు చేసినట్లు తేలితే పన్ను రేటును భారీగా పెంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 24న ఐటీ శాఖలోని ప్రాంతీయ ప్రధాన అధికారులందరికీ సీబీడీటీ తగిన సూచనలతో కూడిన రెండు పేజీల లేఖను పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘నోట్ల రద్దు తర్వాత దాఖలైన రివైజ్డ్ రిటర్నులలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనుమానాలు ఉంటే వాటిపై కచ్చితంగా మరింత నిశిత పరిశీలన అవసరం. అటువంటి కేసుల్లో లెక్కల్లో చూపని ఆదాయాలేవైనా బయటపడితే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 115బీబీఈ ప్రకారం అధిక పన్ను రేటును విధించి వసూలు చేయాలి’ అని సీబీడీటీ స్పష్టం చేసింది. కాగా, వ్యాపార వర్గానికి చెందిన పన్ను చెల్లింపుదారులు గనుక అమ్మకాలను పెంచి చూపినట్లు అనుమానాలు ఉంటే.. సెంట్రల్ ఎక్సైజ్/వ్యాట్ రిటర్నులతో పోల్చిచూడాలని కూడా ఐటీ అధికారులను ఆదేశించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా... ‘చట్టప్రకారం సవరించిన లేదా ఆలస్యంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు.. డీమోనిటైజేషన్ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిచూపేందుకు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి అడ్డుకట్టవేయడమే సీబీడీటీ తాజా ఆదేశాల ముఖ్య ఉద్దేశం. నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద ఆర్థిక లావాదేవావీల ఆధారంగా ఇప్పటికే ఐటీ శాఖ 20 వేలకు పైగా కేసులను నిశిత పరిశీలనకోసం గుర్తించింది. ఇప్పుడు కొత్త ఆదేశాల ఆధారంగా వీటిపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు’ అని సీనియర్ ఐటీ అధికారి ఒకరు వివరించారు. ఐటీ రిటర్నుల్లో సవరణ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే(ఆదాయాన్ని మార్చి చూపడం వంటివి) జరిమానాతోపాటు చట్టపరమైన కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే సీబీడీటీ అసెస్సీ(పన్ను చెల్లింపుదారులు)లను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం అసెస్సీలు అసలు రిటర్నుల్లో తప్పులేవైనా ఉంటే సరిదిద్దడానికి, అనవసరమైన అంశాల తొలగింపునకు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్‌లను దాఖలు చేసేందుకు వీలుంటుంది. -
ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ను సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుం డా) అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. -
రెండేళ్లలో మెచ్యూరిటీ, సరెండర్ చేయాలా?
నేను ప్రవాస భారతీయుడ్ని. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ. లక్షన్నర వరకూ మూలధన లాభాలు ఆర్జించాను. భారత్‌లో మరే ఇతర ఆదాయాలేవీ లేవు. నేను ఐటీఆర్‌ను దాఖలు చేయాలా? మూలధన లాభాల పన్ను చెల్లించాలా ? - నవనీత్, విశాఖపట్టణం ప్రవాస భారతీయుల విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడు, మూలం వద్దే పన్ను (టీడీఎస్-ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)విధిస్తారు. మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, డెట్ లేదా గోల్డ్ ఫండ్స్‌కు అయితే 30 శాతం టీడీఎస్ ఉంటుంది. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌కు అయితే 15 శాతం టీడీఎస్ ఉంటుంది. అయితే మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించిన పక్షంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే.. మూడేళ్లలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులపై పన్ను 10 శాతం(ఇండేక్సేషన్‌తో కాకుండా), లేదా 20 శాతం(ఇండేక్సేషన్ను కలుపుకొని)గా పన్ను విధిస్తారు. దీనికి సెస్ అదనం. మీరు ప్రవాస భారతీయులు కాబట్టి, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడే మూలధన లాభాల పన్ను విధిస్తారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు చెల్లించాల్సిన పన్ను, కోత విధించిన పన్ను కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను రిఫండ్ కోసం దరఖాస్తు చేయాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కు సంబంధించి.. రిటైర్మెంట్ తర్వాత మొత్తం కార్పస్‌లో 60 శాతాన్ని యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది కదా ! ఒకవేళ ఆ సబ్‌స్క్రైబర్ మరణిస్తే ఆ యాన్యుటీని ఆ వ్యక్తి వారసులకు చెల్లిస్తారా? - రమేశ్, హైదరాబాద్ యాన్యుటీ అంటే దానిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం అందించేది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో సబ్‌స్క్రైబర్ ఎంచుకోవడానికి విభిన్నరకాలైన యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో లైఫ్‌టైమ్ యాన్యుటీ, లైఫ్‌టైమ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, యాన్యుటీ విత్ జాయింట్ లైఫ్, లాస్ట్ సర్వైవర్ బెనిఫిట్స్.. ఇలా రకరకాలైన ఆప్షన్లు ఎంచుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అందుకని యాన్యుటీని ఎంచుకునేటప్పుడే డెత్ బెనిఫిట్స్, వారసులకు యాన్యుటీ బెనిఫిట్స్ లభిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. సబ్‌స్క్రైబర్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, అసలైన కార్పస్ వారసులకు అందజేస్తారు. యాన్యుటీని మాత్రం ఆపేస్తారు. ఒకవేళ జాయింట్ యాన్యుటీని ఎంచుకుంటే, యాన్యుటీని ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను. 2010 తర్వాత దీనిని భారత్‌కు బదిలీ చేసుకున్నాను. 20 ఏళ్ల ఈ ప్లాన్ 2018లో మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పాలసీ నుంచి వైదొలిగితే, నాకు నష్టమా, లాభమా? నన్ను ఏం చేయమంటారు ? - యాదగిరి, కరీంనగర్ ఎండోమెంట్ ప్లాన్లు... బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన హైబ్రిడ్ ప్లాన్లు. ఇవి తగిన బీమా కవర్‌ను ఇవ్వలేవు. మంచి రాబడినీ అందించలేవు. ఈ పాలసీలను సరెండర్ చేయమనే ఎప్పుడూ సలహాఇస్తాం. కానీ మీ విషయానికొస్తే, మరో రెండేళ్లలో ఈ ప్లాన్ మెచ్యూర్ అవుతోంది. 18 ఏళ్లపాటు ప్రీమియమ్‌లు చెల్లించారు. కాబట్టి ఈ ప్లాన్‌ను ఇప్పుడు సరెండర్ చేయడం సరికాదు. మరో రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేస్తే మీకు భారీ నష్టాలు వస్తాయి. కొన్ని పాలసీల్లో సరెండర్ విలువగా మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతమే చెల్లిస్తారు. తొలి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించుకుంటారు. దీనిని సరెండర్ చేయకుండా మరో మార్గం కూడా ఉంది. ఈ పాలసీని పెయిడప్ పాలసీగా మార్చుకోవచ్చు. మీ బీమా కంపెనీని సంపదించి ఈ పెయిడప్ పాలసీని ఎంచుకుంటే ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోండి. సరెండర్ విలువతో ఈ పెయిడప్ పాలసీ విలువను పోల్చి ఈ పాలసీ నుంచి వైదొలగడం లాభమో, కాదో తేల్చుకోండి. మొత్తం మీద మీ ఎండోమెంట్ పాలసీ మెచ్యూరిటీకి రెండేళ్ల గడువు మాత్రమే ఉంది. కనుక ఈ పాలసీ నుంచి వైదొలగడం కంటే కొనసాగించడమే సబబు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇలాంటి హైబ్రిడ్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి. ఇల్లు, కారు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నతాభ్యాసం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రూ.50 లక్షల పైగా ఆర్జించే వర్గాలపై ఐటీ దృష్టి
న్యూఢిల్లీ: ఇకపై వార్షికంగా రూ.50 లక్షల పైగా ఆదాయమున్న వారు తప్పనిసరిగా ఖరీదైన ఆభరణాలు, ఎయిర్‌క్రాఫ్ట్ మొదలైన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి రానుంది. ఈ మేరకు 2016-17 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను విభాగం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫారంలను నోటిఫై చేసింది. వీటి ప్రకారం రూ. 50 లక్షలు దాటిన వార్షికాదాయం గల వారిని ఉద్దేశించి ఐటీఆర్‌లలో (ఐటీఆర్-2, 2ఏ) ప్రత్యేకంగా ‘సంవత్సరాంతాన ఆస్తులు, అప్పులు’ పేరిట కాలమ్‌ను పొందుపర్చింది. స్థలం, భవంతులు వంటి స్థిరాస్తులను ఎలాగూ కొత్త ఐటీఆర్‌లో వెల్లడించాల్సి ఉన్నా.. ఇకపై చేతిలో ఉన్న నగదు, ఆభరణాలు, బంగారం, వాహనాలు, యాట్స్, బోట్లు, విమానాలు వంటి చరాస్తులన్నింటి గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది సుమారు 1.5 లక్షల మంది అత్యంత సంపన్నులపై మాత్రమే ప్రభావం చూపుతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. -
ఐటీఆర్ ఫామ్‌లపై నేడు వ్యాపారవర్గాలతో జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్‌లలో (ఐటీఆర్) చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి వ్యాపారవర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇందులో సీఐఐ, ఫిక్కీ, అసోచాం వంటి పరిశ్రమ సమాఖ్యల ప్రతినిధులు హజరుకానున్నారు. కొత్త ఐటీఆర్ ఫామ్‌లలో విదేశీ ప్రయాణాలు, బ్యాంకు అకౌంట్లు మొదలైన అనేక వివరాలను పన్ను శాఖ సేకరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీఆర్ ఫామ్‌లను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, కార్మిక చట్టాలకు అనుగుణంగా కంపెనీలు సరళతరంగా ఆన్లైన్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు వీలుగా కొత్త సదుపాయాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించనుంది. -
విజయంతో ఘనంగా వీడ్కోలు
మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్డీవో చీఫ్‌గా అవినాశ్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది. డీఆర్డీవో చీఫ్‌గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్కే మాథుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది. -
అగ్ని-5 సక్సెస్..
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ఉదయం 8.06 గంటలకు ‘అగ్ని-5’ను ప్రయోగించినట్లు ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. ఎక్కడికైనా సులువుగా తరలించగలిగే మొబైల్ లాంచర్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. క్షిపణిని ప్రయోగానికి సిద్ధం చేయడానికి అతితక్కువ సమయం సరిపోతుందని, నిర్వహణ వ్యయం, శ్రమ తగ్గుతుందని చెప్పారు. బంగాళాఖాతం మధ్యలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని.. దానికి కొంత దూరంలో సిద్ధంగా ఉన్న నౌకల్లోని సిబ్బంది దీనిని ప్రత్యక్షంగా వీక్షించారని ఈ మిషన్ డెరైక్టర్ వి.జి.శేఖరన్ చెప్పారు. రాడార్లు, పరిశీలక వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణ మార్గాన్ని, దాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించామన్నారు. మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-5 క్షిపణి ప్రయోగం మన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా క్షిపణులను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారని.. దానిని సులువుగా గుర్తించడంతో పాటు శత్రువులు దాడి చేసేందుకు అవకాశముంటుందని అంటున్నారు. అదే మొబైల్ లాంచర్ వెర్షన్‌ను రహస్యంగా తరలించి, ప్రయోగించవచ్చంటున్నారు. అభినందనలు.. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న వారందరికీ దేశం రుణపడి ఉంటుందనిడీఆర్డీవో డీజీ అవినాశ్ చందర్‌కు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. అగ్ని-5 ప్రత్యేకతలు.. 5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణి ఇది. డీఆర్డీవో ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు. బరువు 50 టన్నులు... పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. 1000 కిలోలకుపైగా బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు.. అంటే దాదాపు గంటకు 30 వేల కిలోమీటర్ల వేగం) దూసుకెళుతుంది. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి దాదాపు 600 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి... ఆ తర్వాత లక్ష్యం దిశగా దూసుకెళుతుంది. క్షిపణిలో ఏర్పాటు చేసిన ఆన్‌బోర్డు కంప్యూటర్, లేజర్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ సహాయంతో ప్రయాణించి... లక్ష్యాన్ని ఢీకొడుతుంది. భూవాతావరణంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణిపై కవచం ఉష్ణోగ్రత దాదాపు 4,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ లోపల పరికరాలు, వ్యవస్థల ఉష్ణోగ్రత మాత్రం 50 సెంటీగ్రేడ్ల లోపే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందే రెండు సార్లు సాధారణ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు కూడా. మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. విజయంతో ఘనంగా వీడ్కోలు మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్డీవో చీఫ్‌గా అవినాశ్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభిం చినట్లయింది. డీఆర్డీవో చీఫ్‌గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్కే మాథుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది.