
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019–2020 అసెస్‌మెంట్ ఇయర్) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) రిటర్న్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.