
గత నెల 31తో ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువు ముగిసింది. గడువులోపు రిటర్నులను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసిన వారు, సంబంధిత ఐటీఆర్ ఏ దశలో ఉందో (స్టాటస్) తెలుసుకోవడం అవసరం. దీనివల్ల మీ ఐటీఆర్ ప్రాసెస్ అయిందా? లేక పన్ను చెల్లింపు దారు వైపు నుంచి తదుపరి చర్య ఏదైనా అవసరం ఉందా? అన్నది తెలుస్తుంది. మీ ఐటీఆర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఎంతో సులభం. ఈ ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తర్వాత ‘వ్యూ రిటర్న్స్/ఫామ్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, దాఖలు చేసిన ఐటీఆర్‌ల జాబితా కనిపిస్తుంది. ‘రిటర్న్ అప్‌లోడెడ్, పెండింగ్ ఫర్ ఐటీఆర్‌వీ/ఈ వెరిఫికేషన్’ అని చూపిస్తే.. మీరు వెరిఫై చేసిన తర్వాతే మీ ఐటీఆర్ ప్రాసెస్‌కు వెళుతుందని అర్థం. మీ ఐటీఆర్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేస్తే అక్కడే అదే కనిపిస్తుంది. ఇలా మీ ఐటీఆర్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.