
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్‌లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్‌లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది.
అలా కాకపోతే ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)’కు ఫైల్ చేసిన ఐటీఆర్ పత్రాలను బెంగళూరులోని ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటిఆర్-వి ఫారం ద్వారా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానట్లయితే, ఐటీఆర్‌ను దాఖలు చేయనట్లుగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఇతర కారణాల వల్ల ఇప్పటికే తిరస్కరణకు గురైన ఐటీఆర్‌లను తాజా ఈ-వెరిఫికేషన్‌లో అనుమతించబోమని తెలిపింది. వారికి ఈ గడవు వర్తించదని పేర్కొంది.
(చదవండి: వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్‌పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!)
Comments
Please login to add a commentAdd a comment