
ఐటీఆర్ ఫామ్‌లపై నేడు వ్యాపారవర్గాలతో జైట్లీ భేటీ
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్‌లలో (ఐటీఆర్) చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి వ్యాపారవర్గాలతో...
న్యూఢిల్లీ: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్‌లలో (ఐటీఆర్) చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి వ్యాపారవర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇందులో సీఐఐ, ఫిక్కీ, అసోచాం వంటి పరిశ్రమ సమాఖ్యల ప్రతినిధులు హజరుకానున్నారు. కొత్త ఐటీఆర్ ఫామ్‌లలో విదేశీ ప్రయాణాలు, బ్యాంకు అకౌంట్లు మొదలైన అనేక వివరాలను పన్ను శాఖ సేకరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
దీంతో ఐటీఆర్ ఫామ్‌లను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, కార్మిక చట్టాలకు అనుగుణంగా కంపెనీలు సరళతరంగా ఆన్‌లైన్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు వీలుగా కొత్త సదుపాయాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించనుంది.