గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈరోజే(జులై 31) చివరి తేదీ. నిబంధనలకు అనుగుణంగా ఆదాయపన్ను రిటర్నులను ఇంకా ఎవరైనా దాఖలు చేయకపోతే వెంటనే నమోదు చేయాలని నిపుణులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ఏటా సమకూరే ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు రిటర్నులు ఫైల్ చేస్తే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా దరఖాస్తు కోసం పన్ను రిటర్నులు ఉపయోగపడతాయి. ఏదైనా బకాయిలుంటే వేరే దేశం వెళ్లేందుకు అవాంతరాలు ఏర్పడుతాయి.
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణం మంజూరుకోసం ఆదాయ రుజువు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు రిటర్నులు సాయపడతాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరానికి జత చేయొచ్చు. అంటే పాత నష్టాలను భవిష్యత్తు ఆదాయానికి జతచేసి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా ఇతర వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎంతో ఉపయోగం.
ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
ఐటీ రిటర్నులను కొన్నిసార్లు గుర్తింపు పత్రాలుగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వీటిని ఐడెంటిటీ ప్రూఫ్‌గా వాడుకోవచ్చు.
నిర్దిష్ట సమయంలో ఐటీఆర్‌లను ఫైల్ చేసే వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్ మెరుగవుతుంది. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ అంచనా వేసే సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. దానివల్ల ఎప్పుడైనా రుణాలకోసం దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీకే వాటిని పొందే వీలుంది.
భవిష్యత్తులో వ్యాపారం ప్రారంభించాలన్నా, ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్డింగ్ వేయాలన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం ముఖ్యం.
ఐటీఆర్‌లో పూర్తి ఆర్థిక లావాదేవీలుంటాయి. దానివల్ల భవిష్యత్తులో పెట్టుబడి, ఖర్చులు వంటి వాటిపై మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
నిత్యం మనం చేసే వస్తువులకు ప్రభుత్వం టీడీఎస్ వసూలు చేస్తుంది. వీటిని తిరిగి పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment